కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా జైలుకు వెళతారంటూ బీజేపీ సీనియర్ నాయకురాలు, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఝాన్సీ(యూపీ): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా జైలుకు వెళతారంటూ బీజేపీ సీనియర్ నాయకురాలు, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారమిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాబర్ట్ వాద్రా అనేక అక్రమాలలో పాలు పంచుకున్నారని, ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తే ఆయన తప్పకుండా జైలుకు వెళతారన్నారు. యూపీలో పోలీసుల సహాయంతో ఎన్నికల్లో గెలుపొందాలని సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఆ పార్టీ కొందరు పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చిందని, వారు ప్రతిఫలంగా పార్టీకి సహకరిస్తున్నారని అన్నారు.