lok sabha election 2014
-
సుప్రియపై భార్యను నిలబెట్టి తప్పు చేశా: అజిత్ పవార్
ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు."నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్: సీఈవో వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ అవుతాయన్నారు. తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు.34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో పేర్కొన్నారు. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది.జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్ 1న సాయంత్రం పలు న్యూస్ చానెళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్ 4న ఫలితాలు కోసం యావత్ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే, ఎన్నికల ఫలితాలు లైవ్‌లోనే బిగ్ స్క్రీన్‌పై ప్రసారమైతే..? ఆ అనుభూతి ఎలా ఉంటుంది..? ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ప్లాన్‌నే అమలు చేయబోతున్నాయి. ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్,నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్,పుణెలోని మూవీమ్యాక్స్, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9గంటల నుంచి ఆ థియేటర్లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో చాలా థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. -
Lok Sabha Election 2024: సిట్టింగ్ సీట్లలో గట్టి పోటీ
ఆరో విడతలో భాగంగా జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. ఇవన్నీ ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమంటూ జేఎంఎం ప్రచారంలో హోరెత్తిస్తోంది. బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఆదివాసీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తోంది. ఆరో విడత స్థానాలపై ఫోకస్... ధన్‌బాద్ బొగ్గు గనుల స్థావరం. ఇక్కడి ఓటర్లలో 62 శాతం పట్టణవాసులే. ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 8 శాతముంటారు. యూపీ, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి వలస వచ్చినవారు ఎక్కువ. 2009 నుంచి బీజేపీ కంచుకోటగా ఉంది. హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎంపీ పశుపతినాథ్ పోటీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్యే దుల్లు మహతోకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అనుపమా సింగ్ పోటీ పడుతున్నారు. వీరిపై రెండు పారీ్టల్లోనూ అసంతృప్తే ఉంది. బీఎస్పీ, సమతా, ఆజాద్ సమాజ్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా వంటి పారీ్టలు, స్వతంత్రులు... ఇలా మరో డజను మంది బరిలో ఉన్నారు.జంషెడ్పూర్ దీన్ని టాటా నగర్, స్టీల్ సిటీ అని కూడా పిలుస్తారు. టాటా స్టీల్ అతిపెద్ద ప్లాంట్ ఇక్కడ ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బిద్యుత్ బరణ్ మహతో హాట్రిక్‌పై కన్నేశారు. 2019లో ప్రస్తుత సీఎం చంపయ్ సోరెన్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారాయన. మాజీ ఎమ్మెల్యే కునాల్ సారంగికి టికెటివ్వకపోవడం ఒడిశావాసుల ఓట్లపై ప్రభావం చూపేలా ఉంది. కాకపోతే కురి్మ–మహతో ఓటర్లు 3 లక్షలకు పైగా ఉండటం మహతోకి కలిసొచ్చే అంశం. 27 శాతమున్న ఆదివాసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జేఎంఎం నుంచి సమీర్‌కుమార్ మొహంతీ బరిలో ఉన్నారు.రాంచీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ సేత్‌ను కాదని 2014లో గెలిచిన రామ్ తహాల్ చౌదరికి బీజేపీ ఈసారి టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సు¿ోద్కాంత్ సహాయ్ కుమార్తె, ప్రముఖ న్యాయవాది. యశస్వి పోటీ చేస్తున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే ఎంపీగా సంజయ్ పనితీరుపై ఏకంగా 73 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు గతేడాది ఓ సర్వేలో తెలిసింది. రాష్ట్రంలో బీజేపీకి ఆయన బలమైన గళంగా నిలుస్తున్నారు.గిరిధ్ బీజేపీకి బలమైన స్థానమిది. పొత్తులో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)కు విడిచిపెట్టింది. ఏజేఎస్‌యూ సిట్టింగ్ ఎంపీ చంద్రప్రకాశ్ చౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. జేఎంఎం నుంచి మధుర ప్రసాద్ మహతో బరిలో ఉన్నారు. వీరిద్దరికీ స్వతంత్ర అభ్యర్థి జైరాం కుమార్ మహతో గట్టి సవాల్ విసురుతున్నారు. ముగ్గురు నేతలూ కుర్మి సామాజికవర్గీయులే. టైగర్ జైరాంగా పిలిచే జైరాం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల మంచి స్పందన కూడా వస్తోంది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
లోక్‌సభ ఎన్నికల బరిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా బీజేపీలో చేరకముందే ఆమె టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్యసింగ్ బరిలో నిలిచారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత ఎంత కష్టమో తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారం కోసం తను పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా పేర్కొంది.ఎన్నికల యుద్ధం ప్రారంభం నుంచి వరుసగా ప్రజా సభలతో పాటు పార్టీ కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో చాలా కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసినట్లు కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం వల్ల సరిగ్గా నిద్రకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పారు. కనీసం సమయానికి భోజనం కూడా తీసుకోవడంలేదని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోరాటం ముందు సినిమా నిర్మించడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివేనని కంగన చెప్పడం విశేషం. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. జూన్ 14న విడుదల కావాల్సిన ఈ సినిమా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన సినీ స్టార్స్
లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సీనీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌కు ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశాడు. అనంతరం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Telangana: Actor Jr NTR arrives at a polling booth in Jubilee Hills, Hyderabad to cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/irFIjHVGVq— ANI (@ANI) May 13, 2024 #WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP— ANI (@ANI) May 13, 2024 మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. Actor and former Union Minister K Chiranjeevi along with his wife surekha and daughter stand in the queue to cast their vote at Jubilee hills club in Hyderabad #Chiranjeevi @TOIHyderabad #ElectionDay #Hyderabad pic.twitter.com/V0tSJd4wu3— Sudhakar Udumula (@sudhakarudumula) May 13, 2024 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటేసిన మహేశ్‌బాబు, రామ్‌చరణ్.Flew from Dubai… Rushed to the polling booth directly from the airport, hence the tired looks..🙂Done! YOU? pic.twitter.com/kQUwa1ADG6— rajamouli ss (@ssrajamouli) May 13, 2024 ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఎఫ్ ఎన్ సిసి లో ఓటు వేసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కుటుంబ సభ్యులు.. #KRaghavendraRao #ElectionDay pic.twitter.com/OydpOtOBmj— Vamsi Kaka (@vamsikaka) May 13, 2024 హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సీసీలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వయసు సమస్యల కారణంగా మరో వ్యక్తి సాయంతో పోలింగ్ బూత్ లోకి వచ్చారు.Senior Versatile actor #KotaSrinivasaRao garu to cast his vote at FNCC pic.twitter.com/VOTzqZJg7W— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024టాలీవుడ్ నటులు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు విష్ణు.. తిరుపతి జిల్లాలోని ఏ. రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.Actor @chay_akkineni cast their vote 🗳️ #Elections2024 #NagaChaitanya pic.twitter.com/wS51UCYnGr— Suresh PRO (@SureshPRO_) May 13, 2024#ManchuManoj exercised his right to vote @HeroManoj1#Elections2024 #LokSabhaElections2024 pic.twitter.com/gX0ciNPiB6— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల pic.twitter.com/hgI4v69IhW— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024 -
రాహుల్ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో ఏం జరుగుతోంది?
దేశంలో ఎక్కడకు వెళ్లినా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వీటిలో యూపీలోని రాయ్‌బరేలీ స్థానం పలువురి నోళ్లలో నానుతోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని సోనియా గాంధీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం భవితవ్యంపై చర్చలు మొదలయ్యాయి.కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన దరిమిలా పార్టీ రాహుల్ గాంధీని రాయ్ బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాయ్‌బరేలీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ వ్యూహకర్తల బృందం కాంగ్రెస్‌కు అనుకూలంగా అక్కడి వాతావరణాన్ని సృష్టించే పనిలో బిజీగా ఉంది.గత ఎన్నికల్లో అమేథీ విజయం తర్వాత రాయ్‌బరేలీపై కన్నేసిన బీజేపీ ఈ స్థానంలోనూ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే గాంధీ కుటుంబ వారసత్వానికి కంచుకోటగా నిలిచిన ఈ సీటును దక్కించుకోవడం బీజేపీకి సవాల్‌గా మారింది.గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీని కోల్పోయి, రాయబరేలీకి మాత్రమే పరిమితమైన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఈ స్థానాన్ని కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే రాయ్ బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావించి ఉంటారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ పోటీకి దిగారు.2009 నుంచి సమాజ్‌వాదీ పార్టీ రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంది. పలువురు ఎస్పీ నేతలు తమ పార్టీ జెండాలు చేతపట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 20న ఐదవ దశలో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగున్నాయి. -
పాతాళంలో దాక్కున్నా మిమ్మల్ని వదలం.. అమిత్ షా హెచ్చరిక
పాతాళంలో దాక్కున్నా సందేశ్ ఖాలీ దోషుల్ని వదలి పెట్టేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని రణఘాట్ లోక్‌సభ స్థానంలోని మజ్డియాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.సందేశ్‌ఖాలీ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ అలా కాదు. ఒక్క దోషిని వదిలిపెట్టదు. వారిని తలక్రిందులుగా వేలాడదీస్తోందన్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలపై వస్తున్న ఆరోపణలపై అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ, మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ, దోషులను రక్షించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు.సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు వందలాది మంది అక్కాచెల్లెళ్లను మతం ఆధారంగా చిత్రహింసలకు గురిచేశారు . సందేశ్‌ఖలీ నేరస్థులను అరెస్టు చేసేందుకు మమతా దీదీ సిద్ధంగా లేరు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచారణ జరగకపోవడంతో హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించిందని తెలిపారు. సందేశ్‌ఖాలీలో అఘాయిత్యాలకు పాల్పడిన వారెవరైనా.. పాతాళంలో దాక్కున్నా.. కనిపెట్టి జైల్లో పెడతాం.. ఈ దోషులను బీజేపీ శిక్షిస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు. -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ది నయవంచన: రఘునందన్‌రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
‘అవును.. ఆ రెండు పార్టీలను చీల్చే మేం అధికారంలోకి వచ్చాం’
సాక్షి,ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార స్లోగన్ ‘ఐ విల్ బి బ్యాక్’ గురించి ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ రచయిత ప్రియమ్ గాంధీ-మోదీతో 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. తాను ఐ విల్ బి బ్యాక్ అంటూ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిచ్చాను. రెండోసారి అధికారంలోకి వస్తామని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ కూటమిని చీల్చి అధికారంలోకి వచ్చాం. ఇదంతా చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందని అన్నారు. అదే ఎన్నికల్లో ‘బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంది.శివసేన (2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే మాకు ద్రోహం చేశారు. ఫలితంగా మేం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది’ అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాజకీయ పరిణామాలతో ఆ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ఎంపికయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మహా వికాస్ అఘాడీ కూటమి కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ, శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గాలు ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఆ కూటమిలో మహరాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు కొనసాగుతున్నారు. -
రేపు బీజేపీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కా నుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర పడడంతో మార్చి 3న తొ లి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చే యనుంది. గురువారం రాత్రి 10:50 గంటలకు ప్రారంభమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడి విడిగా భేటీ అయి కూలంకషంగా చర్చించింది. అందులో భాగంగా తె లంగాణకు సంబంధించి ఆరు స్థానాలకు అభ్యర్థులపై సీఈసీ ఏక గ్రీ వంగా ఆమోదముద్ర వేసిందని సమాచారం. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజా మాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్‌లు మరోసారి బరిలో దిగేందుకు గ్రీ న్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్‌ల అభ్యర్థిత్వాలపై కూడా సీఈసీ ఆమోదముద్ర వేసిందని సమాచారం. ఆచితూచి నిర్ణయం బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నందున వివిధ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావ్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారని తెలిసింది. అయితే జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ ఎంపీగా ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్న మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ సహా ఇతర స్థానాలపై మరోసారి చర్చించిన తర్వాతే బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కారు దిగనున్న మరో ఎంపీ! ఖమ్మం నుంచి బరిలో దిగేందుకు మరో బీఆర్ఎస్ ఎంపీ కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. -
కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ చెల్లు.. అసలు కారణాలేంటి?
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకంలో ప్రతిపాదనలన్నింటినీ కాంగ్రెస్ తిరస్కరించిందని పేర్కొన్న దీది.. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ మధ్య స్నేహం బీటలు వారినట్లయింది. పరస్పర ఆరోపణలు.. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదం ఇదే మొదటిసారి కాదు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరస్పర ఆరోపణల తర్వాత మమతా బెనర్జీ నుంచి నేడు ఈ ప్రకటన వచ్చింది. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై విభేదాలు అప్పుడప్పుడు బహిరంగంగానే బయటకొచ్చాయి. మమతా బెనర్జీని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా విమర్శించేవారు. ఆమెపై ఈ మధ్య విమర్శల స్థాయిని పెంచారు. ఒకానొక సందర్భంలో ఆమెను అవకాశవాది, దలాల్ అని దుయ్యబట్టారు. నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్‌తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు. గతంలో చేతులు కలిపారు.. కానీ.. గతంలోనే కాంగ్రెస్, టీఎంసీ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు గతంలో 2001 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా 2011లో టీఎంసీ, కాంగ్రెస్ కూటమి.. బెంగాల్లో 34 సంవత్సరాల తర్వాత సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసింది. అయితే, ఈసారి లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అసమ్మతికి మొదటి సంకేతం.. బెంగాల్‌లోని 42 సీట్లలో రెండింటిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ను తృణమూల్ కాంగ్రెస్ కోరింది. కనీసం 8-10 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడింది. తృణమూల్ అభ్యర్థనను తిరస్కరించడం రెండు పార్టీల మధ్య అసమ్మతికి మొదటి సంకేతం. ఈ రెండు స్థానాల్లో.. అధిర్ రంజన్ కంచుకోట బెర్హంపూర్, 2019లో కాంగ్రెస్ గెలిచిన మాల్దా సౌత్‌లు ఉన్నాయి. టీఎంసీ సీట్ల షేరింగ్ ఫార్ములా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీల పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్ములా ఉండాలని మమతా బెనర్జీ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిందని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని తృణమూల్ పేర్కొంది. కాంగ్రెస్ "పెద్దన్న" అధికారాన్ని విడనాడాలని, ప్రాంతీయ పార్టీలు తమ బలమైన స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది. మోగిన ప్రమాద ఘంటికలు.. అయితే.. గత వారం తృణమూల్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం అధిర్ రంజన్ చౌదరి బెర్హంపూర్తో సహా మొత్తం 42 స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్‌లో ప్రమాద ఘంటికలు మోగించింది. మమతా బెనర్జీ సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీని రాహుల్ గాంధీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొన్ని సార్లు స్థానిక నాయకులు తెలియక ఏదో మాట్లాడుతారు.. అవన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. మమతా బెనర్జీ తనకు మంచి సన్నిహితురాలని చెప్పుకొచ్చారు. మళ్లీ చిగురించలేని స్థాయికి.. అయితే.. ఈ పరిణామాల అనంతరం ఇండియా కూటమికి మమతా బెనర్జీ స్వస్తి పలికారు. దీంతో జనవరి 25న పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో తృణమూల్ కాంగ్రెస్ చేరే అవకాశం లేదు. మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. టీఎంసీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని చెప్పారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్ స్నేహం మళ్లీ చిగురించలేని స్థితికి చేరిందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడే ఉలిక్కి పడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడటం ఇంకా మొదలుపెట్టక ముందే కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఉహించుకోవాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం తెలంగాణ భవన్లో నల్లగొండ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. ‘అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీ లు గుప్పించారు. ఇప్పుడు హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌రెడ్డి అడ్డమైన మాటలు చెప్పా రు. కార్యకర్తలు ఉదాసీన వైఖరిని వీడాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమరచి చెప్పాలి’అని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వివరించారు. ఓటమిపై అనుమానం రాలేదు ‘నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించింది. ఎక్కడా ఓటమిపై అనుమానం రాలేదు. కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయి. కేవలం సూర్యాపేటలో మాత్రమే గెలిచాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారు. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డికే పంపాలి. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించింది. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోంది. కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయి. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా నిర్వహించాలి’అని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని వ్యాఖ్యానించారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాలుస్తానని మోదీ అంటున్నారని, మైనారిటీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం గురించి వివరించాలన్నారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని, నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు. కష్టపడ్డ వారికే గుర్తింపు: హరీశ్‌రావు 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి నిర్వహించిన 16 సమావేశాల్లో 112 గంటల పాటు చర్చ జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రో హం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై సూచనలు వచ్చాయని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగుదామని చెప్పారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎండ్రకాయల పార్టీ అని, ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను మరో 20 రోజుల్లో నెరవేర్చాలని, లేకపోతే ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశమంతా తిరిగితే బలోపేతం అవుతారని మోదీ భయపడి కాంగ్రెస్‌కు సహకరించారని, రాహుల్‌ను ఎదుర్కోవడం కన్నా కేసీఆర్‌ను ఎదుర్కోవడం కష్ట మని భావించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడదామన్నారు. ‘లోక్‌సభ’కు సన్నద్ధం ♦ సన్నాహక సమావేశాల్లో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం ♦ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుపు లక్ష్యంగా... అసెంబ్లీ ఎన్నికల్లో ♦ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ ♦ జరిగిన పొరపాట్లు పునరావృత కానివ్వమని భరోసా సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్ నింపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాశ్యంలో ఉన్నవారిలో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోక ముందే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలు కావడంతో పార్టీ యంత్రాంగంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవరించింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ జనవరి 3న తెలంగాణభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ సెగ్మెంట్‌తో మొదలైన సమావేశాలు సోమవారం నల్లగొండతో ముగిశాయి. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం చొప్పున 16 రోజులు జరిగిన సమావేశాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్ సమావేశాలు ఒకేరోజు జరిగాయి) దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన 500 నుంచి 800 వరకు వివిధ స్థాయిల్లోని నాయకులు ప్రతిరోజు తెలంగాణభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషిం చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు 9 మంది ఎంపీలు ఉండగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ సన్నాహాక సమావేశాలు జరిగాయి. ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకు తొలిరోజే ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటమికి గల కారణాలను నిర్భయంగా పార్టీ అగ్రనేతల సమక్షంలో వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుల పరిస్థితి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు దక్కిన పదవుల గురించి నిక్కచ్చిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వారు బీఆర్ఎస్లోకి వచ్చి చేరడం మొదట్లో బాగున్నా, తర్వాత విభేదాలు పెరిగాయని, ఇవి కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వచ్చాయని పలు నియోజకవర్గాల నాయకులు విశ్లేషిం చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు గట్టిగా ఉన్న చోట బీఆర్ఎస్ గెలిచిన విషయాలను సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్ సమావేశాల్లో పార్టీ నాయకులు విశ్లేషిం చారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు వంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు పోటీ చేసిన చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించడాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తీరుపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, కేశవరావు, మధుసూదనాచారి వంటి సీనియర్లు ఓపిగ్గా వింటూ, అలా మరోసారి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి పార్టీ యంత్రాంగంలో ధైర్యం నింపారు. -
Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్
తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది. సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్ఐసీ వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు. మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్ఐసీ లాగిన్, పాస్వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు. కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ. దుబాయ్ వెళ్తే ఏ హోటల్లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది. మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
ఎన్నికల్లో విజయమే లక్ష్యం
న్యూఢిల్లీ: రానున్న మూడు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు ఎజెండాగా మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. భేటీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, 14 రాష్ట్రాల బీజేపీ సీఎంలు పాల్గొన్నారు. దళితులు, వెనకబడిన వర్గాల మద్దతు, ఎన్ఆర్సీ, జాతీయ భద్రత, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. దళితులు, అణగారిన వర్గాలు సహా సమాజంలోని దాదాపు అన్ని వర్గాలు లబ్ధి పొందిన తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర నిర్ణయాలను వారికి ప్రధాని మోదీ వివరించారు. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. ‘2014 కన్నా ఎక్కువ మెజారిటీని 2019లో సాధించాలని, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నాం’ అని భేటీ వివరాలను వెల్లడిస్తూ చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మీడియాకు తెలిపారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాలను కాలపరిమితితో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ భేటీలో తీర్మానం చేశారు. -
ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు?
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లను ఎక్కడ రిపేరు చేయిస్తున్నారో తెలుపాలని ప్రతిపక్షపార్టీలు, జాతీయ ఎన్నికల కమిషన్‌ను నిలదీశాయి. సోమవారం ఎన్నికల కమిషన్ నిర్వహించిన సీఈసీ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రశ్నించారు. ప్రతిసారీ ఓట్లన్నీ ఒకే పార్టీకి ఎలా వెళ్తున్నాయని, వాటి రిపేరు చేసే సంస్థ పేరు, అడ్రస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నిరోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ మినహా కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, మాయవతి బహుజన సమజ్వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్‌లతో సుమారు 51 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించడం వల్ల ప్రజల తీర్పు వెలవడటం లేదన్నారు. ‘చాలా సందర్భాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు. ఏ పార్టీకి ఓటేసిన ఒకే పార్టీకి ఓట్లు వెళ్లాయి. ఈవీఎంలను ఎవరు రిపేరు చేస్తారు? ఎన్ని రోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు? అనే విషయం మాకు తెలియాలి. అలాగే ఓటరు రశీదు పరికరాలు (వీవీ ప్యాట్లు) ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం.’అని తెలిపారు. తృణముల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. మాకు ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు ‘వీవీ ప్యాట్’ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రైయిల్) అనుసంధానించి ప్రతి ఓటరు పేపర్ రశీదుతో ఒక శాతం ఓట్లను క్రాస్ చెక్ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు 30 శాతం ఓట్లను క్రాస్‌చెక్ చేయాలని సూచించాయి. దేశంలో జరిగిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి మెజార్టీ రావడాన్ని ప్రతిపక్షపార్టీలు సందేహించాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే బీజేపీ అధికారం దక్కించుకుందని ఆరోపించాయి. అలాంటిదేం జరిగలేదని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినప్పటికి వారు నమ్మలేదు. -
‘లోక్‌సభ, 4 అసెంబ్లీలకు అయితే ఓకే’
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగానే ఉన్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. డిసెంబర్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం తమకుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ బుధవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఈవీఎంలు సెప్టెంబర్ చివరి నాటికి, వీవీప్యాట్లు నవంబర్ చివరి నాటికి సిద్ధంగా ఉంటాయని రావత్ తెలిపారు. మిజోరం అసెంబ్లీ ఈ డిసెంబర్ 15 నాటికి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీలు వరుసగా వచ్చే సంవత్సరం జనవరి 5, జనవరి 7, జనవరి 20 నాటికి ముగుస్తాయి. ఈ నెలలోనే జమిలిపై నివేదిక లోకసభ, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను లా కమిషన్ ఈ నెలలోనే కేంద్రానికి సిఫారసు చేయనుంది. కమిషన్‌లోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేం ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలుపుతామా లేదా అని మమ్మల్ని అడగలేదు. అందుకు సంబంధించిన మార్గా న్ని సూచించే పనిని మాత్రమే మాకు అప్పజెప్పారు’ అని ఆ అధికారి చెప్పారు. ఏకకాలం లో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగానికి, ప్రజా ప్రతినిధుల చట్టానికి చేయాల్సిన సవరణలను కమిషన్ సిఫారసు చేయనుంది. ఆ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా పాటించకపోవచ్చనీ, అయితే రాజకీయ పార్టీ లు, భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతుందని అధికారి అన్నారు. రాజ్యాంగానికి కనీసం రెండు సవరణలైనా చేసి, మెజారిటీ రాష్ట్రాలు కూడా సవరణలను ఆమోదిస్తేనే ఏకకాల ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందని కమిషన్ ఇప్పటికే చెప్పింది. -
స్త్రీలోక సంచారం
►వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ మళ్లీ అమేధీ నుంచే పోటీ చెయ్యొచ్చని తెలుస్తోంది కానీ, ఆయన తల్లి, యు.పి.ఎ. చైర్పర్సన్ సోనియా గాంధీ అసలు ఈసారి ఎన్నికల్లో నిలబడతారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ సోనియా 2019 ఎన్నికలకు దూరంగా ఉంటే కనుక ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి ఆమె కూతురు ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రియాంక ఆసక్తి చూపుతారా అనేది మరో ప్రశ్న. ►వంట చెయ్యడం రాదని, ఇంటి పనులు సరిగా చెయ్యడం లేదని భర్త భార్యను తిట్టడం ఆమెను అవమానించడం అవదని 17 ఏళ్ల నాటి ఒక గృహిణి ఆత్మహత్య కేసులో ముంబై హైకోర్టు తీర్పు చెబుతూ, ఆ భర్తని, అత్తమామల్ని కింది కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సమర్థించింది. 2001 జూన్ 5 నాటి ఆ ఆత్మహత్య అనంతరం భర్త విజయ్ షిండేపై భార్య పుట్టింటి వారు కేసు పెడుతూ.. వంట బాగోలేదనీ, ఇంటిని శుభ్రంగా ఉంచడం లేదని అల్లుడు, అత్తమామలు తమ కూతుర్ని తరచు తిడుతున్న కారణంగానే ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుందని చేసిన ఆరోపణలపై ఇన్నేళ్లపాటు జరిగిన వాదోపవాదాలలో విజయ్‌కి వేరొక స్త్రీతో సంబంధం ఉందన్న కోణం కూడా ఉంది. ►రోగుల సేవలకు మరింతగా బాధ్యులను చేయడానికి, వృత్తిపరమైన అవకతవకల్ని నివారించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే నర్సులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సెప్టెంబరులో ‘నర్సింగ్ యునీక్ ఐ.డి. (ఎన్.యు.ఐ.డి) లను ఇవ్వబోతోంది. నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖలోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో తీసుకున్న ఈ కార్డుల జారీ ప్రయోజనాల గురించి నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు టి. దిలీప్ కుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డికి వివరించిన అనంతరం దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడింది. ►జపాన్ గ్రాఫిక్ డిజైనర్ తనాగో అకీకో డిజైన్ చేసిన ఫ్యాన్ హ్యాండ్‌బ్యాగ్ నమూనా టోక్యో సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శనలో మహిళలను అమితంగా ఆకట్టుకుంటోంది. హ్యాండ్‌బ్యాగ్ వెలుపల అమర్చిన ఫ్యాను.. బయటి వాతావరణంలోని వేడిమిలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి ఆ సమాచారాన్ని అందిస్తుందని అకీకో చెబుతున్న పాయింట్ కన్నా కూడా.. బ్యాగ్ డిజైనే ప్రదర్శనకు వస్తున్న మగువల్ని ఎక్కుగా ఆకర్షిస్తోంది. ►భర్త అడుగుజాడల్లో నడవటం అటుంచి, భర్త అడుగుజాడల్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలనియా మళ్లీ మరొకసారి.. భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ సి.ఎన్.ఎన్. టీవీ ఇంటర్వ్యూలో ‘మనల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్న మనిషి’ అని తనను విమర్శించడంపై ట్రంప్ స్పందిస్తూ, ‘బుద్ధిమాంద్యపు వ్యాఖ్యాత డాన్ లెమన్.. లెబ్రాన్ జేమ్స్‌ని ఇంటర్వ్యూ చేయడం చూశాను. లెబ్రాన్ ఏబ్రాసీ ముఖాన్ని అందంగా చూపించడానికి అతడు చాలా ప్రయత్నించినట్లు ఉన్నాడు’ అని అన్న కొద్ది గంటల్లోనే... ‘భావి తరాలకు ఉపయోగపడేలా జేమ్స్ అనేక మంచి పనులు చేస్తున్నాడు’ అని మెలనియా ఒక ప్రకటన విడుదల చేసినట్లు సి.ఎన్.ఎన్. వెల్లడించింది. ►ముజఫర్రూర్లోని బాలికల ప్రభుత్వ ఆశ్రయ గృహంలో 34 మంది మైనర్ బాలికలపై అమానుషమైన అనేక లైంగిక అకృత్యాలు జరిగినట్లుగా వస్తున్న వార్తలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మలీవాల్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. బాధిత బాలికలు మొదట ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకునేలా వారిపై ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నందున వారికి గట్టి భద్రతను కల్పించాలని ఆ లేఖలో ప్రధానంగా విజ్ఞప్తి చేయడంతో పాటు.. వారిని స్కూళ్లకు, కౌనెల్సింగ్కు పంపే విషయమై శ్రద్ధ వహించాలని స్వాతి కోరారు. ►ఈ ఏడాది డిసెంబరులో జరుగునున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా.. నలభై రోజుల ‘రాజస్థాన్ గౌరవ యాత్ర’ ప్రారంభించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలి రోజు బహిరంగ సభలో.. తన ప్రభుత్వం మహిళలకు, యువతకు, రైతులకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. అలాగే, ‘మేము మీతో ఉన్నాం : బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు’ అనే నినాదంతో రాజే మహిళలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ► ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసిన ‘కాస్టింగ్ కౌచ్’ దారుణాల గురించి విన్నాక హాలీవుడ్ మీద తనకు గౌరవం పోయిందని అంటూ.. హాలీవుడ్ తన పాపాలకు పశ్చాత్తాపం చెంది, పూర్తిగా ప్రక్షాళన చెందాకే అటువైపు చూసేందుకు సాహసిస్తానని బ్రిటిష్ టీవీ ప్రెజెంటర్, నటి, మోడల్ జమీలా అలియా జమీల్ ‘గార్డియన్’కి ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అవసరమైతే నా కెరీర్నైనా నాశనం చేసుకుంటాను కానీ, హాలీవుడ్‌కి వెళ్లి నేను నాశనం కాను’ అని కూడా ఆమె అన్నారు! -
ఈసారి ఓటు ఎలా?
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నందున 2019 ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగించాలని కాంగ్రెస్, తృణమూల్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, పైగా వీవీప్యాట్ (ఓటరు ఏ పార్టీకి ఓటు వేసిందీ తెలియపరుస్తూ రసీదు ఇచ్చే మిషన్)ల అనుసంధానంతో ఈవీఎంలు మరింత భద్రంగా, కచ్చితంగా పనిచేస్తాయని ఎన్నికల సంఘం పదే పదే స్పష్టం చేస్తున్నా విపక్షాలు నమ్మడం లేదు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతే డాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఈవీఎంలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడటాన్ని సాక్ష్యంగా చూపుతోంది. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. ‘ఈవీఎంల స్థానం లో బ్యాలెట్ పేపర్లు పెట్టాలన్నది మా డిమాండ్. పార్టీలన్నీ ఒక్కటై దీన్ని సాధించాలి’అని తృణమూల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం... ఈవీఎంలను తొలగించాలంటూ ఈ ఏడాది మార్చి లో జరిగిన 84వ ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ఈవీఎంలను వాడు తున్నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఇలా జరుగుతోందని ఆ పార్టీ వాదిస్తోంది. వచ్చే సోమవారం అన్ని పార్టీలు సమావేశమై దీనిపై చర్చిం చనున్నాయి. పార్లమెంటులో ఈవీఎంలపై చర్చకు డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి ఈవీఎంలపై వినతిపత్రం సమర్పించనున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు కాదంటే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపట్టే విషయం ఆలోచిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈవీఎంలతో లాభాలివీ... ♦ ఈవీఎంల వల్ల కాగితం ఆదా అవుతుంది. ♦ ఈవీఎంలను భద్రపరచడం, పంపిణీ చేయడంలోనూ సమస్యలను అధిగమించవచ్చు. ♦ ఈవీఎంల వాడకంతో చెల్లని ఓటంటూ ఉండదు. ♦ ఈవీఎంల ద్వారా గంటకు 240 ఓట్లు వేయొచ్చు. కానీ బ్యాలెట్ బాక్స్‌లలో ఇది సాధ్యం కాదు. ♦ కేవలం 6 వోల్ట్ల బ్యాటరీతోనే ఈవీఎంలు పనిచేస్తాయి కనుక మారుమూల గ్రామాల్లోనూ ఈవీఎంలను వాడటం తేలిక. బ్యాలెట్ పేపర్‌తో కష్టాలు... ♦ బ్యాలెట్ విధానంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఎక్కువ. రాజకీయ ప్రాబల్యంగల వారు రిగ్గింగ్‌కి పాల్పడటం, ప్రత్యర్థులకు ఓట్లు పడ్డాయనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయడం లాంటి వాటికి అవకాశం ఉంది. ♦ ఓటరు ఎంచుకున్న అభ్యర్థి గుర్తుపైన ముద్ర పడకున్నా, లేక పడిన ముద్ర పూర్తిగా కనిపించకపోయినా ఆ ఓటు చెల్లకపోవచ్చు. ♦ బ్యాలెట్ బాక్స్‌లను సురక్షిత ప్రదేశానికి తరలించడం కషం. దీనికి పెట్టాల్సిన ఖర్చు అధికం. ♦ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్‌కు ఈవీ ఎంలతో 2 నుంచి 3 గంటలు పడితే, బ్యాలెట్ పేపర్‌తో 30 నుంచి 40 గంటలు పడుతుంది. ♦ 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 9,30,000 పోలిం గ్ స్టేషన్లలో 14 లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. 81.7 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 87.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వినియోగించాలంటే బ్యాలెట్కన్నా ఈవీఎంలే నయమనే వాదనా ఉంది. మన బ్యాలెట్ కథా కమామిషు! ఎన్నికల నిర్వహణకు ఒక రూపు రేఖ తీసుకువచ్చిన ఘనత తొలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్ దే. ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. తొలి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తును పెయింట్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారో, అన్ని బాక్స్‌లు ఉంచారు. ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌ను వారికి నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే సరిపోతుంది. 1957లో కూడా ఇదే ప్రక్రియను అనుసరించారు. 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఎన్నికల గుర్తులన్నీ ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించి, తమకు నచ్చిన అభ్యర్థిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలలపాటు జరిగింది. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం కూడా తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 62 కోట్ల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఇక ప్రతి అభ్యర్థికి ఒక్కో బ్యాలెట్ బాక్స్ తయారీని ప్రఖ్యాత గోద్రేజ్ కంపెనీ చేపట్టింది. ముంబైలోని విఖ్రోలి సబర్బన్ ప్రాంతంలో వాటి తయారీ జరిగింది. రోజుకు 15 వేలకుపైగా బ్యాలెట్ బాక్స్‌ల చొప్పున 2.1 కోట్లకుపైగా స్టీల్ బ్యాలెట్ బాక్స్‌లను తయారు చేసి అనుకున్న సమయానికి అందించడంలో గోద్రేజ్ కంపెనీ సఫలమైంది. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను ప్రశంసించింది. ఇలా అభ్యర్థికొక బ్యాలెట్ బాక్స్‌లతో మొదలైన ప్రయాణం ఈవీఎంల వరకు చేరుకొని, ఇప్పుడు మళ్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చర్చకు దారి తీస్తోంది. ఈవీఎంలపై అనుమానాలివీ.. ♦ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ (ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓటు పడేలా) చేయొచ్చన్న ఆరోపణ ఉంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ, ఆప్ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపించాయి. ♦ ఈవీఎంలతో అవకతవకలకు అవకాశం లేదని కచ్చితంగా చెప్పడానికి లేదు. పూర్తిగా జోక్యానికి వీల్లేని యంత్రమనేది ప్రపంచంలో లేనేలేదనీ, మనం గమనించలేనంత చిన్న పరికరం సాయంతో ఈవీఎంల పనితీరును ప్రభావితం చేయవచ్చని శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త గౌతమ్ రజా పేర్కొన్నారు. ♦ ఈవీఎంల వాడకంలోనూ బూత్‌ల ఆక్రమణ జరిగే అవకాశం లేకపోలేదు. యంత్రాలతో చేసే తప్పుడు పనులకు కండబలం అవసరం లేదు. అది ఎవరి కంట్లో పడదు కాబట్టి మరింత ప్రమాదమనే అభిప్రాయం వినబడుతోంది. ♦ అర్హత లేని సిబ్బంది యంత్రాల నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ ఎన్నికలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ♦ నెదర్లాండ్స్‌లో 2000 సంవత్సరంలో ఈవీఎంల వాడకంలో సమస్యలు ఎదురవడంతో తిరిగి బ్యాలెట్ ఓటింగ్‌నే అనుసరించారు. ♦ ఈవీఎంలతో ట్యాంపరింగ్‌కు అవకాశమున్నందున ప్రపంచ దేశాలు పేపర్ బ్యాలెట్ వైపునకు మళ్లుతున్నాయని, భారత్ కూడా దీన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సూచిస్తున్నారు. బ్యాలెట్‌కు బ్లాక్‌చెయిన్..! ఈవీఎంల వాడకం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజ కీయ పార్టీలు, నిపుణులు చెబుతుండటంతో ఇకపై ఓటింగ్ కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఓటరు వివరాలు, ఓటింగ్ వివ రాలు సంకేతభాషలో నిక్షిప్తమవుతాయి కాబట్టి ఇతరులెవరూ వాటిని చూడటం లేదా మార్పుచేర్పులు చేయడం సాధ్యం కాదు. నెట్‌వర్క్‌లో ఉన్నవారిలో అంటే.. వ్యవహారం నడిపిన వారందరూ అంగీకరిస్తేనే మార్పులు సాధ్యమవుతాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని సురక్షితమైన ఓటింగ్‌కు కొత్త మార్గంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ వివరాలతో ఎన్నికల నిర్వహణ సంస్థ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. తరువాతి దశలో ఈ వివరాలను గోప్యంగా ఉంచుతూనే మీకు ఓ డిజిటల్ గుర్తింపు సంఖ్య, పాస్వర్డ్ లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లతో డిజిటల్ బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయవచ్చు. ఓట్లు లెక్కకట్టేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నా లజీ వాడితే ఎవరికి ఓటు పడిందో తెలుస్తుందిగానీ.. ఓటేసిన వారి వివరాలు ఏమాత్రం తెలియవు. సియర్రా లియోన్ అనే చిన్న దేశం ఈ ఏడాది మార్చిలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా త్వరలో ఈ టెక్నాలజీని వాడతామని ప్రకటించాయి. ఈవీఎంలను తీసేసే ప్రసక్తి లేదు: ఈసీ ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషనర్ రావత్ స్పష్టం చేశారు. వీవీప్యాట్లతో ఈవీఎంల పనితీరు మరింత పారదర్శకంగా, కచ్చితంగా మారిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ బ్యాలెట్ పేపర్ వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈవీఎంలలో లోపాలు లేవని, దానిని ఉపయోగిస్తున్న తీరుపైనే ఓటర్లకు అనుమానాలున్నాయని, ఎన్నికల సంఘం వాటిని నివృత్తి చేయాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి సంస్థల ప్రతినిధులు, నిపుణులు అంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్ల పనితీరుపైనా కొందరు ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేశారని, ఎన్నికల సంఘం వారి అనుమానాలు తీరేలా యంత్రాలను మెరుగుపరచాలని వారు సూచిస్తున్నారు. -
50 ర్యాలీలు..100 స్థానాలు
న్యూఢిల్లీ/లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 100 పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా 50 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడే సమయానికి మోదీ, అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్, గడ్కరీతో కలిపి మొత్తంగా 200 ర్యాలీలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ర్యాలీ రెండు మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో జరిగేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో ఎన్నికల ప్రకటనకు ముందే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం 400 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో జరిగే బహిరంగ సభల్లోనూ మోదీ పాల్గొననున్నారు. నేటి నుంచి యూపీలో ప్రధాని పర్యటన ప్రధాని మోదీ యూపీలోని సొంత నియోజకవర్గం వారణాసితోపాటు ఆజంగఢ్, మిర్జాపూర్లలో శని, ఆదివారాల్లో పర్యటించనున్నారు. శనివారం వారణాసిలోని కచ్నార్లో జరిగే ర్యాలీలో ప్రసంగించి, బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆజంగఢ్‌లో రూ.23వేల కోట్లతో నిర్మించనున్న లక్నో–ఘాజీపూర్ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేసి, అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదివారం మిర్జాపూర్‌లో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. -
దక్షిణ పర్యటనకు అమిత్ షా
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన పర్యటనను ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రణళికలను సమీక్షించేందుకు అమిత్ షా మంగళవారం కేరళలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలతో, రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె. రాజశేఖరన్‌ను అనూహ్యంగా మిజోరం గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కేవలం ఆరు శాతమే ఉన్న బీజేపీ ఓట్లశాతం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రాష్ట్రంలో మరింత బలపడాలని కమళదళం ప్రయత్నిస్తోంది. ప్రధాన మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేనాతో (బీడీజేఎస్) కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనుంది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌గోపాల్ ఒక్కరు మాత్రమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ప్రధానంగా సీపీఎం నేతృత్వంలోని (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని(యూడీఎఫ్) బలంగా ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏవిధమైన వ్యూహం అమలు చేస్తుందో వేచి చూడాలి. -
ఎన్నికల తరువాతే మహాకూటమి?
కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కిందటి నెల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మహాగఠబంధన్ (మహాకూటమి) వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు సాధ్యమయ్యేది కాదని స్పష్టమౌతోంది. ఇటీవల ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీయేతర రాజకీయపార్టీల మధ్య పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో సీట్ల సర్దుబాటు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలపాలన్న ప్రతిపాదన మొదట పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ చేయగా, బెంగళూరులో హెచ్డీ కుమారస్వామి ప్రమాణానికి హాజరైన ప్రతిపక్షాల నేతలు దీనికి మద్దతు పలికారు. అయితే, బీజేపీయేతర పార్టీల మహాకూటమి సాధారణ ఎన్నికల తర్వాత మాత్రమే ఏర్పడుతుందని ఈ పార్టీల నేతల తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి. యూపీ, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమి ళనాడు, కర్ణాటక, ఒడిశా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బడా ప్రాంతీయ పార్టీలే మిగిలిన బీజేపీయేతర పార్టీలకు కొద్దోగొప్పో లోక్‌సభ సీట్లు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ బలానికి అనుగుణంగా తగినన్ని సీట్లు ఇవ్వకపోతే మిగిలిన పక్షాలు ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుకు అంగీకరించవు. అలాగే, గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెసే పెద్ద పార్టీ కావడంతో ఇతర ప్రతిపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అవకాశం లేదు. కేరళలోని రెండు ప్రధాన కూటము(ఎల్డీఎఫ్, యూడీఎఫ్)ల మధ్య పోరు తప్పదు. బీజేపీ ఈ రాష్ట్రంలో మూడో పక్షంగా మిగిలిపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల ఫలితాలు వచ్చాకే చేతులు కలుపుతాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు రాష్ట్రాలవారీగా మాత్రమే బీజేపీయేతర పార్టీల మధ్య ఓ మోస్తరు సీట్ల సర్దుబాటుకు అవకాశముంటుంది. ఇదే విషయం పవార్, సూర్జేవాలా చెప్పారు. మహాకూటమి సాధ్యం కాదన్న పవార్! వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య జాతీయస్థాయిలో పొత్తు ఉండదని, మహాకూటమి ఎన్నికలకు ముందు ఆచరణసాధ్యం కాదని శరద్‌పవార్ ఇటీవల తేల్చిచెప్పారు. అన్ని రాష్ట్రాల్లోనూ నంబర్‌వన్ ప్రతిపక్ష పార్టీయే సీట్లు కేటాయిస్తుందని ఆయన అన్నారు. పొత్తులు రాష్ట్రాలవారీగా పార్టీల మధ్య కుదురుతాయనీ, అన్ని రాష్ట్రాల్లో అనుసరించడానికి వీలైన ఒకే తరహా పొత్తుల నమూనా ఏదీ ఉండదని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభిప్రాయపడ్డారు. బిహార్‌లో ప్రతిపక్షాల మధ్య కుదిరే పొత్తు యూపీలో పనిచేయదని ఆయన అన్నారు. మమతా బెనర్జీ సహా అనేక మంది ప్రాంతీయపక్షాల నేతలు మహాకూటమికి నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న కారణంగా కాంగ్రెస్ వైఖరి మారిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి మమత, మాయావతి, అఖిలేశ్ వంటి నేతలు సిద్ధంగా లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తు కాంగ్రెస్‌కు సాధ్యం కాదనీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఈ జాతీయపార్టీ అభిప్రాయపడుతోంది. కుమారస్వామి ప్రమాణానికి బెంగళూరు వచ్చిన పార్టీల నేతలందరూ ఎన్నికల్లో కలిసి పోటీచేయాల్సిన అవసరం లేదని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ చెప్పారు. ఈ పార్టీలన్నీ అన్ని రాష్ట్రాల్లో చేతులు కలుపుతాయని ఆశించవద్దని ఆయన అన్నారు. ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటుపై కీచులాడుకోకుండా ఫలితాలు వెలవడ్డాకే ఎన్డీఏ మెజారిటీ కోల్పోయేపక్షంలో ప్రతిపక్షాలు చేతులు కలపడం మేలనే అభిప్రాయం అనేక మంది ప్రతిపక్షనేతల్లో బలపడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ మధ్యే పొత్తు? ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన ప్రాంతీయపార్టీలైన ఎస్పీ, బీఎస్పీ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చాయని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకుగాను బీఎస్పీ ఎక్కువ సీట్లకు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అత్యధిక స్థానాలకు పోటీచేసేలా రెండు పార్టీల నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో పెద్దగా బలంలేని, తన ఓట్లు మిత్రపక్షాలకు బదిలీ చేయలేని కాంగ్రెస్‌కు రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని అఖిలేశ్ అన్నారని కూడా వార్తలొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రంగా చెప్పే యూపీలో కనీసం 20 సీట్లకైనా పోటీచేయకపోతే పరువు పోతుందనే భావన కాంగ్రెస్‌లో ఉంది. ఈ లెక్కన ఎస్పీ, బీఎస్పీ మధ్య మాత్రమే సీట్ల సర్దుబాటు కుదురుతుంది. బిహార్‌లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీయే కాంగ్రెస్ వంటి చిన్న పార్టీలకు సీట్లు ఇచ్చే స్థితిలో ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు అవకాశమున్న మరో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ దాదాపు సమాన బలం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూడా కలిసి పోటీచేసే అవకాశాలున్నాయి. కర్ణాటకలో కూడా సంకీర్ణ భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ 28 లోక్‌సభ సీట్లను పంచుకుంటాయనడంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులో పాలక ప్రాంతీయపక్షాలైన తృణమూల్, బీజేడీ, ఏఐఏడీఎంకే మిగిలిన మిత్రపక్షాలకు ఎవరికి ఎన్ని సీట్లో నిర్ణయిస్తాయి. తమిళనాట ప్రధానప్రతిపక్షమైన డీఎంకే నాయకత్వాన కాంగ్రెస్ వంటి పార్టీలు కలిసి పోటీచేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాలక ప్రాంతీయపక్షాలు బీజేపీకి వ్యతిరేకమని ప్రకటించినా లోక్‌సభ సీట్లు ఇతర చిన్న పార్టీలకు ఎంత వరకు కేటాయిస్తాయో అప్పుడే చెప్పడం కష్టం. -
ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు: ఖర్గే
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దీనిపై బీజేపీ వైఖరిపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాకే స్పష్టత వస్తుందన్నారు. ‘కొన్ని రాష్ట్రాల్లో నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీని ప్రకారం నవంబర్, డిసెంబర్లలో లోక్‌సభ ఎన్నికలు జరిపేందుకు బీజేపీ యోచన చేస్తుండవచ్చు. పూర్తికాలం పని చేసిన మహారాష్ట్ర వంటి అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు జరిపితే వచ్చే లాభ, నష్టాలపైనా బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి, ఆ పార్టీ ముందుగానే ఎన్నికలకు మొగ్గు చూపకపోవచ్చు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అయితే, ఆ పార్టీ తమ శ్రేణులకు ఇస్తున్న సంకేతాలను బట్టి ఈ వర్షాకాల సమావేశాలే పార్లమెంట్ ఆఖరి సమావేశాలు అనిపిస్తోంది’ అని అన్నారు. -
ఐపీఎల్-12వ సీజన్ మార్చిలోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 (ఐపీఎల్ ) సంబరం అయిపోయింది. కానీ, ప్రేక్షకులు మాత్రం అప్పుడే వచ్చే ఐపీఎల్ గురించి చర్చలు మొదలుపెట్టారు. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ మే 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్ని అయిపోయినత తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్‌కు వరల్డ్ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కైవసం చేసుకున్న విషయం విదితమే. -
సంచలనం: జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ
కోల్‌కత: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరో సంచలనానికి తెరలేపారు. 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ‘ఆంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ (ఏసీడీపీ) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించబోతున్నట్లు కర్ణన్ సహాయకుడు ఆంథోని డబ్ల్యూ లిజారో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కర్ణన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని ఆయన తెలిపారు. దేశం నుంచి అవినీతిని సమూలంగా తరిమికొట్టడమే తమ పార్టీ సిద్ధాంతమని కర్ణన్ ఉద్ఘాటించారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్ ప్రకటించారు. తమ పార్టీ తరపున ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు కర్ణన్ అందిస్తారని లిజారో తెలిపారు. కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను జూన్ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం గత డిసెంబరు 20న కర్ణన్ విడుదలయ్యారు. కాగా, పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా ఆయన రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ ఆయన పనిచేశారు. -
2019 సమరానికి ఉత్సాహంగా...
ఉత్తరాది పార్టీగా బీజేపీపై ఉన్న ముద్రను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ప్రధాని మోదీ– బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు చెరిపివేయగలిగారు. వారిద్దరి ఎత్తుగడలు, వ్యూహాలు కర్ణాటకలో ఫలించిన నేపథ్యంలో.. డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోరాటానికి కమలం పార్టీ ఉత్సాహంగా సిద్ధమవుతోంది. అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీకి కన్నడ శాసనసభ ఫలితాలు ఉత్తేజాన్నిచ్చాయి. నిజానికి నాలుగేళ్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని నిజం చేస్తూ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధించడంతో కాంగ్రెస్ బక్కచిక్కిపోయింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సామర్థ్యం ఆ పార్టీకి లేదని ఇప్పటికే స్పష్టమైంది. ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించేనా... మరోవైపు, ప్రధాన ప్రాంతీయ పార్టీలన్ని బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఏడాదిలో ఫలించకపోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట మూడో జాతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు తగిన సమయం, అవకాశాలు కనిపించడం లేదు. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోకడల వల్ల అక్కడ బీజేపీయేతర పార్టీలతో తృణమూల్‌కు పొత్తు కుదిరే అవకాశం లేదని బెంగాల్ పంచాయతీ ఎన్నికలు నిరూపించాయి. వామపక్షాలు బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తులకు అవకాశం లేకపోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, అందరికీ వికాసం వంటి హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఎన్నికల నినాదాలతో ముందుకు సాగాలో బీజేపీ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థికంగా అద్భుత విజయాలు లేకపోవడంతో.. మతపరమైన ఎజెండాతోనే బీజేపీ ముందుకెళ్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయోధ్య వంటి అంశాలపై పోరాడుతుందని అంచనా వేస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేసీఆర్ ఫ్రంట్ సక్సెస్ కాదు: కారత్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాలని, బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో ఆయన సంపాదకీయం రాస్తూ.. ‘ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విఫలమవుతాయి. డీఎంకే, ఆర్జేడీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్నాయి. విధానాలు, స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీల మధ్య అనేక వైరుధ్యాలు ఉండడం ఫ్రంట్ ఏర్పాటుకు అడ్డంకిగా మారనున్నాయి. అందువల్ల యూపీలో అనుసరించినట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేస్తేనే ఆ పార్టీని ఓడించగలం’ అని పేర్కొన్నారు. -
బీజేపీని హెచ్చరించిన శివసేన!
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు వందకు పైగా తగ్గిపోతాయని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల యూపీ, బిహార్ ఉప ఎన్నికల ఫలితాలతో పోల్చి వచ్చే లోక్‌సభ ఎన్నికల పరిణామాలపై శివసేన పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ నేతలకు ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 110 స్థానాలు కోల్పోనుందన్నది శివసేన అభిప్రాయం. త్రిపురలో కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలుకొట్టిన తర్వాత బీజేపీ ప్రాబల్యం దేశంలో మరింత పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ యూపీలో సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామాలతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్, ఫూల్పుర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి షాకివ్వడం శివసేనకు హాట్ టాపిక్‌గా. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 23 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే బీజేపీ నెగ్గి, 19 స్థానాల్లో ఓటమి చవిచూసింది. త్రిపురలో విజయం అనంతరం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని, ప్రజలు ఎన్డీఏ పాలనకు పట్టం కట్టారని చెప్పి ఆ పార్టీ నేతలు.. కీలకమైన యూపీ రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఓట్ల శాతం తగ్గడం, ఎస్పీ-బీఎస్పీలు కలిసి బరిలోకి దిగడం కొంప ముంచిందంటూ వేరే సాకులు చెబుతున్నారని సంపాదకీయం ద్వారా శివసేన తమ అభిప్రాయాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికలపై జోస్యం చెప్పింది. అత్యధిక లోక్‌సభ స్థానాలుండే యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు తగ్గితే బీజేపీ సీట్లు కూడా తగ్గుతాయని హెచ్చరించింది. బిహార్‌లో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ జైలుకు వెళ్లిన నేపథ్యాన్ని ఉపయోగించుకుని నితీశ్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించుకోలేక పోడం ఎన్డీఏ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చునని శివసేన నేతలు చెబుతున్నారు. -
ఎంపీలు.. మీ ప్రోగ్రెస్ చెప్పండి?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడే 2019 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో సాధించిన ప్రగతిని వివరించాలంటూ ప్రధాని మోదీ పార్టీలకు సూచించారు. ప్రజలకు అందించిన మౌలిక సదుపాయాల కల్పన, కీలకమైన విజయాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేసిన కృషిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఎంపీలకు తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులపై ప్రజలనుంచి అభిప్రాయాలను సేకరించాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. ఇదిలావుండగా.. ఇప్పటికే 250 మంది బీజేపీ ఎంపీల నమో యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నట్లు తెలిసింది. -
2024 నుంచి జమిలి ఎన్నికలు
నీతి ఆయోగ్ సూచన న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2024 నుంచి ఒకేసారి ఎన్నికలు జరపాలని నీతి ఆయోగ్ సూచించింది. పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా(2017–2020) ముసాయిదాలో పేర్కొంది. ‘దేశ ప్రయోజనాల కోసం 2024 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించాలి. ఈ ప్రతిపాదన అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును గరిష్టంగా ఒకసారి తగ్గించడం చేయడంగానీ, పొడిగించడం గానీ అవసరమవుతుంది. ఈ సూచనను పరిశీలించడానికి ఎన్నికల సంఘం నోడల్ సంస్థగా ఉండాలి. రోడ్ మ్యాప్ కోసం రాజ్యంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, పార్టీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా ఒక నివేదికను ఖరారు చేయాలి. రాజ్యాంగ, చట్ట సవరణలు, జమిలి ఎన్నికలకు మారడానికి ఆచరణసాధ్యమైన విధానం వంటి వాటిని పరిశీలించి, వచ్చే ఏడాది మార్చినాటికి బ్లూ–ప్రింట్‌ను సిద్ధం చేయాలి’ అని సూచించింది. ‘నీతి’ మూడేళ్ల ముసాయిదా ప్రణాళికను గత నెల 23న నీతి ఆయోగ్ పాలకమండలి సభ్యులకు అందజేయడం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు చెబుతున్న నేపథ్యంలో ‘నీతి’ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ సేవలు ఔట్‌సోర్సింగ్‌కు న్యూఢిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ఔట్ సోర్సింగ్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తద్వారా ‘ప్రైవేట్’ మేధస్సును పాలనకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడింది. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం పైనే ఆధారపడడాన్ని తగ్గించాల్సి ఉందని పేర్కొంది. బ్యూరోక్రసీలోనూ పోటీతత్వాన్ని నెలకొల్పాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా ముసాయిదాలో సూచించింది. 2018–19లో పాలనలో ఎక్కువ శాతం డిజిటలైజ్ చేయాలని చెప్పింది. సివిల్ సర్వీస్ అధికారులనూ ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని.. బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇవ్వాలని, అలాగే పనిలో సత్తా చూపించని వారిని మందలించాల్సిన అవసరం ఉందని చెప్పింది. నీతి ఆయోగ్ ఈ నివేదికను ఏప్రిల్ 23నే సభ్యులకు పంపింది. ‘న్యాయ పనితీరు సూచీ’ కావాలి న్యూఢిల్లీ: విచారణలో జాప్యం, పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం ‘న్యాయవ్యవస్థ పనితీరు సూచీ’(జ్యుడీషియన్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్)ని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ సూచించింది. కింది కోర్టుల్లో జాప్యం తగ్గించి, వాటి పనితీరును తెలుసుకోవడానికి ఈ సూచీ హైకోర్టులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు దోహదపడుతుందని పేర్కొంది. ‘దీని కోసం వివిధ కేసుల పరిష్కారానికి వివిధ కాలపరిమితులు కావాలి. వార్షిక పనితీరు మదింపు వల్ల తాము ఎక్కడ విఫలమయ్యామో, సమస్య పరిష్కారానికి ఏం చేయాలో హైకోర్టు, జిల్లాల కోర్టుల జడ్జీలకు తెలుస్తుంది’ అని తెలిపింది. అవినీతి కేసులు పేరుకుపోయాయని, వాటిని కోర్టులు నిర్దిష్ట కాలవ్యవధితో పరిష్కరించాలని సూచించింది. -
జమిలి ఎన్నికల చర్చ
దాదాపు ఏణ్ణర్ధం నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న జమిలి ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్ని కలపై ప్రారంభమైన నిర్మాణాత్మక చర్చను కొనసాగించాలని ముఖ్యమంత్రులను కోరారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ మనకు కొత్తేమీ కాదు. దేశంలో 1967 వరకూ ఆ పద్ధతే అమల్లో ఉంది. అంటే 1952, 1957, 1962, 1967ల్లో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అంతవరకూ ఏ ఎన్నిక జరిగినా తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చిన కాంగ్రెస్ తొలిసారి 1967 లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో బాగా దెబ్బతింది. అలాంటి చోట చిన్న పార్టీలు విజయం సాధించి కూటములుగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు నెలకొల్పాయి. ఆ ప్రభుత్వాలు ఎన్నాళ్లో మనుగడ సాధించలేకపోయాయి. మరో పక్క ఇందిరాగాంధీ 1971లో లోక్‌సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఫలితంగా జమిలి ఎన్నికల సంప్రదాయానికి గండిపడింది. అప్పటినుంచీ దేశంలో ఇంచుమించు ఏడాదికో, రెండేళ్లకో ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. జమిలి ఎన్నికలు పోయి ఇలా వేరు ఎన్నికలు రావడంలో నిజంగా సమస్య లున్నాయా? ఉంటే ఎవరికున్నట్టు? వాజపేయి నేతృత్వంలో 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా లా కమిషన్ సమ ర్పించిన 170వ నివేదిక ఎన్నికల సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిం చింది. అందులో జమిలి ఎన్నికల అవసరాన్ని చర్చించింది. 2012లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఈ అంశంపై లేఖ రాశారు. నిరుడు సెప్టెంబర్‌లో ప్రణబ్ ముఖర్జీయే ఏకకాలంలో ఎన్నికలపై అన్ని పార్టీలూ ఏకాభిప్రా యానికి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం సరేసరి. అది సందర్భం వచ్చిన ప్పుడల్లా ఈ ప్రతిపాదన గురించి చెబుతూనే వస్తోంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికలకే ఓటేసింది. చాలా పార్టీలు కూడా ఈ ప్రతిపాదన సహేతుకమై నదని అంటున్నాయి. కాకపోతే ఆచరణ సాధ్యంకాదని పెదవి విరుస్తున్నాయి. ఎందుకంటే అందుకోసం కొన్ని అసెంబ్లీల గడువు కాలాన్ని పెంచాల్సి ఉంటుంది. మరికొన్నిటికి కోత వేయాల్సివస్తుంది. ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారు... కోరుకుంటున్నారు గనుక అది మంచిదే కావొచ్చునని భావించనవసరం లేదు. నిజమే–జమిలి విధానం వల్ల ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే మన దేశంలో ఈ ఇది చెప్పుకోదగ్గ ఆదాయే. కొంత మేర నల్ల డబ్బు ప్రభావమూ తగ్గొచ్చు. దీన్ని సమర్ధించేవారు చెబుతున్న బలమైన కారణం మరొకటుంది. అది ప్రభుత్వ విధానాలకు సంబంధించింది. తరచు ఎన్నిక లుండటం వల్ల ప్రభుత్వ విధానాలకూ, కార్యక్రమాలకూ గండిపడుతున్నదని జమిలి ఎన్నికల సమర్ధకులు చెప్పే మాట. ఏ ఏ సందర్భాల్లో గండి పడిందో ఇలాంటివారు నిర్దిష్టమైన ఉదాహరణలిస్తే అందులోని లాభనష్టాలపై చర్చించవచ్చు. చిల్లర వర్త కంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించడానికి సంబంధించిన బిల్లుపై 2012లో దేశవ్యాప్తంగా నిరసనలొచ్చినా, రాజ్యసభలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా ఆ బిల్లు సునాయాసంగా నెగ్గింది. ఆ బిల్లును వ్యతి రేకిస్తున్నానని చెప్పిన టీడీపీ ఆఖరి నిమిషంలో తన ఎంపీలను సభకు గైర్హాజరయ్యేలా చేసి కాంగ్రెస్‌కు తోడ్పడింది. బీఎస్పీ, ఎస్పీలు సైతం ఆ పనే చేశాయి. కనుక ప్రభు త్వాలకు జీవన్మరణ సమస్యగా మారిన కీలక సంస్కరణలేవీ ఎన్నికల కారణంగా ఎప్పుడూ ఆగలేదు. ఎన్నో వైవిధ్యతలున్న దేశంలో జమిలి ఎన్నికలతో ఏకరూపత సాధించాలను కోవడంలోని తర్కమేమిటో బోధపడదు. వేర్వేరు ఎన్నికలుండటంవల్ల ప్రజా స్వామ్యం, ఫెడరలిజంలు పరిఢవిల్లుతాయి... పరిపుష్టమవుతాయే తప్ప బలహీనప డవు. రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు ఎజెండాలోకి వస్తాయి. అభివృద్ధికి సంబంధించి వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వేర్వేరు మార్గాలు ఎంచుకుంటారు. ఒక రాష్ట్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన పార్టీ మరోచోట ఎవరికీ తెలియక పోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 వంటివి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవు. మరోపక్క విపక్షాల ఏలుబడిలోని చాలా రాష్ట్రాలు ఆ పథకాలను అమలు చేసి అనంతర కాలంలో ప్రజాదరణ పొందాయి. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు మరుగునపడతాయి. సృజనాత్మకత, ప్రజా సంక్షేమ పథకాల అమలులో పోటీ తగ్గుతాయి. జాతీయ అంశాలే ప్రధానమవుతాయి. ఇది ఫెడరలిజం స్ఫూర్తికి హాని కలిగిస్తుంది. 1999 మొదలుకొని జరిగిన జమిలి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన డేటాను గమనిస్తే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం ఉంటాయని తేలిందని ఒక పరిశోధన తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలన్న విధానం అటు పౌరులకు, ఇటు ప్రభు త్వాలకు కూడా గుదిబండగా మారుతుంది. ఒక అంశంపై అధికార పక్షం స్వేచ్ఛగా ప్రజల తీర్పు కోరడానికి సిద్ధపడటం అసాధ్యమవుతుంది. అటు ప్రజలు సైతం అలా డిమాండ్ చేసే హక్కు కోల్పోతారు. నిజానికి అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ తది తర దేశాల్లో కూడా జమిలి ఎన్నికల విధానం అమల్లో లేదు. పైగా అధికార పక్షం మైనా రిటీలో పడితే ఏం చేయాలో జమిలి ఎన్నికలు కోరేవారు చెప్పడంలేదు. ప్రస్తుత ఎన్నికల విధానంలో సమస్యలున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఎన్ని కల వ్యయం, నల్ల డబ్బు చలామణి అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఏం చేయాలో, ఎన్నికలు జరిగే తీరును ప్రక్షాళన చేసేందుకు ఇంకేమి చర్యలు అవసరమో ఎన్నికల సంఘం చర్చించాలి. పార్టీలకు ఎన్నికల నిధుల్ని ప్రభుత్వం సమకూర్చడంతో సహా అనేక ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. పార్టీలన్నీ చిత్త శుద్ధితో వ్యవహరిస్తే ఈ అంశాల్లో ఏకాభిప్రాయం కష్టం కాదు. ప్రభుత్వాలు ప్రజాకంటకంగా మారిన ప్పుడు పౌరులకు ‘రీకాల్’ చేసే హక్కుండాలని వాదనలు వినిపిస్తున్నవేళ... అందుకు అసలే అవకాశమీయని జమిలి ఎన్నికలు ప్రధాన చర్చగా మారడం వింత కలిగిస్తుంది. -
దేశమంతా ఒకసారే...
-
దేశమంతా ఒకసారే ఓట్ల పండగ
-
దేశమంతా ఒకసారే ఓట్ల పండగ
లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చ కొనసాగాలి ♦ నవ భారత నిర్మాణం కోసం టీమిండియాగా ముందుకెళ్దాం ♦ జీఎస్టీపై ఏకాభిప్రాయం సహకార సమాఖ్య స్ఫూర్తికి తార్కాణం ♦ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మోదీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్మాణాత్మకచర్చ ప్రారంభమైందని.. ఈ చర్చను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆర్థిక సంవత్సరాన్ని ప్రస్తుతమున్న ఏప్రిల్–మార్చ్ నుంచి జనవరి–డిసెంబర్‌కు మార్చే అంశంపైనా చర్చ జరగాలన్నారు. రాష్ట్రాలు ఈ దిశగా చొరవతీసుకోవాలని ప్రధాని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మూడో సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఆర్థిక, రాజకీయ వ్యవహారాలను సరిగా నిర్వహించకపోవటం వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ‘సరైన సమయపాలన లేని కారణంగా ఎన్నో గొప్ప పథకాలు, నిర్ణయాలు.. అనుకున్న ఫలితాలనివ్వకుండా వ్యర్థమయ్యాయి. మంచి ఫలితాలు రావాలంటే దృఢచిత్తంతో నిర్ణయాలు తీసుకోవటాన్ని అలవర్చుకోవాలి’ అని తెలిపారు. నవభారత నిర్మాణంలో కేంద్ర, రాష్ట్రాలు కలసి టీమిండియా స్ఫూర్తితో ముందుకెళదామని పిలుపునిచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని పరివర్తనం చేసేందుకు జరుగుతున్న చర్చలో టీమిండియా ఇక్కడ సమావేశమైంది. మనం కోరుకుంటున్న నవభారత (2022–దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతాయి) నిర్మాణం లక్ష్యాలను చేరుకోవటం మనందరి సంయుక్త బాధ్యత. లక్ష్యాల సాధనలో క్రియాశీలMంగా పనిచేద్దాం’ అని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ చర్చిస్తున్న దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక కార్యాచరణ వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయాధారంగా ‘బడ్జెట్’ మార్పు బడ్జెట్ తేదీల మార్పు గురించి స్పందిస్తూ.. దేశంలో వ్యవసాయ ఆదాయం కీలకమైన మన దేశంలో.. దీనికి అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ప్రధాని తెలిపారు. ‘రైతులను, వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకునే జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరంపైనా ఆలోచన చేయాలి’ అని మోదీ సీఎంలను కోరారు. 15 ఏళ్ల దీర్ఘకాళిక ప్రణాళిక, ఏడేళ్ల మధ్యకాలిక వ్యూహం, మూడేళ్ల స్వల్పకాలిక కార్యాచరణ అజెండాగా నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తుందన్నారు.ఈ సమావేశంలో మూడేళ్ల ప్రణాళిక ముసాయిదా కాపీలను సీఎంలకు అందించారు. వీటిపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక తుది ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. బడ్జెట్, ప్రణాళికల ఆమోదానికి రాష్ట్రాలు నీతి ఆయోగ్‌కు రావాల్సిన పనిలేదని ఈ సంస్థ ప్రభుత్వ సమాచారంపై ఆధారపడకుండా నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. పలువురు సీఎంలు లేవనెత్తిన ప్రాంతీయ అసమానతలపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. మౌలికవసతుల లేమి కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని.. రోడ్లు, పోర్టులు, విద్యుత్, రైళ్లు వంటి వాటిపై మూలధన వ్యయాన్ని వేగవంతం చేయటం ద్వారా పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ భేటీలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్, మేఘాలయా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు మమత బెనర్జీ, ముకుల్ సంగ్మా, కేజ్రీవాల్ ఈ సమావేశానికి రాలేకపోయినా.. ప్రతినిధులను పంపించారు. విభేదాలు పక్కనపెట్టి ఏకమైన సీఎంలు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతోనే కొత్త పరోక్ష పన్నుల విధానం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై ముందడుగు పడిందన్న మోదీ.. సహకార సమాఖ్య వ్యవస్థకు ఇదో గొప్ప ఉదాహరణ అని ప్రశంసించారు. ‘జీఎస్టీ ఒకే దేశం, ఒకే ఆశ, ఒకే సంకల్పం అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాలకు మేలు చేస్తుంది. దీనిపై ఏకాభిప్రాయం రావటం చరిత్రాత్మకం. రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలను పక్కనపెట్టి దేశం కోసం అందరు సీఎంలు ఏకతాటిపైకి రావటం గొప్ప పరిణామం’ అని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌ను వినియోగించటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చని, ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. భీమ్, ఆధార్ సాంకేతికతల ద్వారా రాష్ట్రాలకు భారీగా లాభం చేకూరుతుందని మోదీ తెలిపారు. జీఎస్టీని జూలై 1నుంచి అమలుచేయాల్సి ఉన్నందున.. రాష్ట్రాలు వేగంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 300 పాయింట్లతో ప్రణాళిక దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి 300 ప్రత్యేకమైన పాయింట్లపై నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఈ పాయింట్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో వచ్చే 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికపై చర్చ జరిగినట్లు నీతి ఆయోగ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. విద్య, వైద్యం, మౌలికవసతుల రంగాల్లో మార్పులపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.రాష్ట్రాలు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా రూపొందించిన ఈ ప్రణాళికలకు సంబంధించి ముసాయిదా రూపొందించారు. కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అంచనాలకు స్థిరత్వం ఇచ్చేలా వీటిని రూపొందించారు. ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్లటంలో రాష్ట్రాలు సూచనలు చేయాలని పనగారియా కోరారు. వచ్చే 15 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ మూడురెట్లు అభివృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు.2030 కల్లా మన జీడీపీ 7.25 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. వ్యవసాయం, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, డిజిటల్ చెల్లింపులు, కోస్తా–ద్వీపాల అభివృద్ధి, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపైనా ప్రణాళికల్లో పేర్కొన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛ్ భారత్, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ చెల్లింపుల అంశాలపై ముఖ్యమంత్రుల సబ్‌కమిటీలు చేసిన పనిని ఆయన ప్రశంసించారు. వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల జీఎస్టీ చట్టాన్ని త్వరగా ఆమోదించి పంపించాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా.. సీఎంలను కోరారు. నీటిపారుదల, సాంకేతికత విస్తరణ, మార్కెట్ సంస్కరణలు, ఈ–నామ్, పశువుల ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపుచేయటంలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేశ్ చంద్ వివరించారు. అందరూ సుముఖంగానే! సాక్షి, న్యూఢిల్లీ: ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరపటంపై ఆసక్తితో ఉన్న ప్రధా ని.. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. భోజన విరామంలో నూ పలువురు సీఎంల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి వారి స్పందన తెలుసుకున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఎవరి నుంచి వ్యతిరేకత రాలేదని, అందరూ సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే కొన్ని రాష్ట్రాలకు ఇటీవలే ఎన్నికలు జరగడం, మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ అంశంపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడంతో దీనిపై సానుకూలత రావొచ్చని భావిస్తున్నారు. -
కేంద్రంలో మళ్లీ మేమే!
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ♦ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే ♦ ముగిసిన పార్టీ శిక్షణా తరగతులు సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు పలుకు తున్నారని, 2019లో జరిగే పార్లమెంటు ఎన్నిక ల్లోనూ బీజేపీ అధికారం దక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆకాం క్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యమంలో పనిచేసిన నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజ లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నిక ల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. సబ్బం డ వర్గాలు ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలం గాణలో విపక్షాల గొంతు నొక్కడమే కాకుండా ప్రజాసంఘాలను వేధిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్య వహరిస్తోంద న్నారు. ధర్నా చౌక్‌ను సైతం ఎత్తివేస్తూ సామాన్యుల హక్కులను కాలరా స్తోందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక మర్చిపో యిందని, అప్రజా స్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబ ట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుంచించు కుపోయిందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నా రు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిజానికి కాలం చెల్లింది.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. కమ్యూనిజానికి కాలం చెల్లిందని, కులాల పంచాయతీని యూనివర్సి టీల్లోకి తేవడం దారుణమని అన్నారు. కామ్రే డ్లు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కాదని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సుపరిపాలన, అవినీతిరహిత పాలన మోదీ ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్, పేరాల శేఖర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, గుండ్ల బాలరాజు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 300 మంది నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ దళిత వాడలకు అమిత్‌షా కేంద్రం దళితుల అభివృద్ధి, వారి అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్ర మాలను వివరించేందుకు ఈ నెల 6–14 తేదీల మధ్య సామాజిక సమరసత కార్యక్ర మాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టనుంది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల 6 నుంచి అంబేడ్కర్ జయంతి రోజైన 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 7వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ రాను న్నారు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని దళితవాడల్లో ఆయన ఆ రోజంతా గడపను న్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. బూత్ కమిటీలను వెంటనే నియమించండి రాష్ట్రంలో వీలైనంత త్వరగా మండల, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించింది. బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలోపేతం కాగలదని సూచించింది. ఆదేశించారు. రాష్ట్రస్థాయి పార్టీ శిక్షణ శిబిరంలో అధిష్టానం దూత, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సావధాన్‌సింగ్ ఈ మేరకు నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
ఒకేసారి ఎన్నికలపై చర్చ మంచిదే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరపాలని, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కేంద్రం ప్రతీ కార్యక్రమం పేదల కోసమే చేపడుతోందని, పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కోరుకున్న అంత్యోదయ పథకం కింద నిరుపేదలకు మేలు జరగాలన్న ఆలోచనతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ, కార్మిక విధానాలపై కార్మిక సంఘాల నాయకులకు ఈనెల 30 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు నోయిడాలోని వీవీ గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న 40 మంది రాష్ట్ర నాయకుల బృందంతో పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ సమావేశమయ్యారు. యువతకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాల అన్వేషణ కోసం కాకుండా సొంతంగా పరిశ్రమలు స్థాపించి, మరికొందరికి ఉద్యోగ కల్పన చేసే స్థాయికి ఎదగాలని స్టార్టప్ అండ్ స్టాండప్ ఇండియా పథకాలను తీసుకువచ్చిందని వివరించారు. యువత వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ ఇండియాను తీసుకొచ్చినట్లు తెలిపారు. అవినీతిరహిత సమాజ నిర్మాణానికి యువత కదలాలని, ఇందుకు విద్యావిధానంలో మార్పు రావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, నాయకులు టి.కాంతారావు, టి.రాజశేఖరరెడ్డి, వి.ఆర్.యాదవ్, వీవీ గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ సభ్యుడు టి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై హర్షం రైతులకు పంట రుణాలపై వడ్డీ రద్దు నిర్ణయంతోపాటు, సీనియర్ సిటిజన్ల కోసం వరిష్ట బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి హర్షం ప్రకటించారు. ప్రధాని మోదీ రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడటం భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తామని చెప్పడంగొప్ప పరిణామమని తెలిపారు. -
బీజేపీకే ఓటు వేస్తాం
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని 74 శాతం మంది చెప్పినట్లు మైఓట్.టుడే సంస్థ ప్రకటించింది. తాము నిర్వహించిన సోషల్ మీడియా పోల్‌లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. 10 శాతం మంది ఆప్‌కు, 9 శాతం కాంగ్రెస్, 6 శాతం ఇతరుల వైపు మొగ్గుచూపారని తెలిపింది. మొత్తం 55,940 మంది ట్వీటర్, ఎంవీటీ(మైఓట్.టుడే) యాప్‌లో తమ అభిప్రాయాల్ని తెలిపారని, 2,40,000 మంది ఈ పోల్‌ను చూశారని ఆ సంస్థ ప్రకటించుకుంది. 23 శాతం మంది ఓటేయగా, వారిలో 80 శాతం దేశంలోని టాప్ 50 నగరాలకు చెందినవారిని పేర్కొంది. -
రాజకీయ నిష్ర్కమణ ఉండబోదు
మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అదే సందర్భంలో రాజకీయాల నుంచి నిష్ర్కమణ ఉండబోదని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేది అధికారం కోసమని, అయితే రాజకీయాల్లో తాను కొనసాగాలనుకుంటున్నది మాత్రం పార్టీని పటిష్టం చేసుకొనేందుకు అని దేవెగౌడ తెలిపారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ సమయంలో రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు చెబుతారన్న ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి సైతం 2018లో పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవేగౌడ గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్.డి.కుమారస్వామి సారధ్యంలో జేడీఎస్ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండానే 40స్థానాలు సాధించిందని, ఇదే సందర్భంలో ఓ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలిగిందే మీకు తెలిసిందే కదా! అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మహదాయి నదీజలాల పోరాటం, ఎత్తినహొళె అమలుకోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఓ ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్న విషయం అర్థమవుతోందని అన్నారు. కళసా బండూరి పథకం అమలు కోసం ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కోరినా ఆయన స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రానున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో సైతం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే ఎన్నికల బరిలో దిగనున్నాయని హెచ్.డి.దేవేగౌడ తెలిపారు. -
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
-
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఏడో వ్యక్తిగా ఘనతకెక్కారు. దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన విజేతలు ప్రీతమ్ ముండే (బీజేపీ) మహారాష్ట్రలోని బీద్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే 6.92 లక్షల ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అనిల్ బసు (సీపీఎం) 2004లో పశ్చిమబెంగాల్లోని అరమ్గఢ్ నియోజకవర్గం నుంచి అనిల్ బసు 5.92 లక్షల మెజార్టీతో గెలుపొందారు. పీవీ నరసింహారావు (కాంగ్రెస్) 1991లో నంద్యాల నుంచి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 5.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నరేంద్ర మోదీ (బీజేపీ) 2014 ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాంవిలాస్ పాశ్వాన్ 1989లో ఉత్తరప్రదేశ్‌లోని హజీపూర్ నుంచి రాం విలాస్ పాశ్వాన్ (జనతా దళ్) 5.04 లక్షల మెజార్టీతో నెగ్గారు. పసునూరి దయాకర్ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
‘వరంగల్’ అభ్యర్థిపై కాంగ్రెస్ సర్వే
- రేసులో దామోదర, మల్లు, సర్వే, రాజయ్య - ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపైనా చర్చ సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానవర్గం రహస్యంగా సర్వే నిర్వహిస్తోంది. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, అధిష్టానవర్గ మెప్పును పొందాలని టీపీసీసీ ముఖ్యనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో బరిలోకి దింపే అభ్యర్థి ఎంపికను అటు పార్టీ అధిష్టానం, ఇటు టీపీసీసీ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఇక్కడ పార్టీ సీనియర్లలో ఒకరిని రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే రహస్యంగా ఒక సర్వేను చేసినట్టుగా పార్టీ సీనియర్లు వెల్లడించారు. పార్టీ బలాబలాలు, పార్టీ నేతల మధ్య సమన్వయం, అభ్యర్థులపైనా సర్వే జరుగుతోంది. సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, మల్లు భట్టివిక్రమార్క, సర్వే సత్యనారాయణ, వివేక్‌తో పాటు సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్, మరికొందరు స్థానిక నేతల పేర్లనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజనర్సింహ లేదా భట్టివిక్రమార్క పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు జేఏసీలో కీలకంగా వ్యవహరించిన తటస్థుల పేర్లు కూడా పార్టీలో అంతర్గతంగా చర్చకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జేఏసీ నేతలు ఎవరెవరు అనేది నిర్దిష్టంగా వెల్లడికాలేదు. మరోవైపు ఈ వరంగల్ లోక్‌సభ స్థానంలో ప్రతిపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే చర్చ కూడా టీపీసీసీలో జరుగుతోంది. ఇప్పటికే వామపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే అభ్యర్థి ఎంపికపై చర్చించాలని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదన తదితర అంశాలను అధిష్టానవర్గానికి నివేదించనున్నట్టుగా తెలుస్తోంది. -
ఇందిర జాడలో మోదీ నీడ
ప్రధాని ఇందిర లోక్‌సభ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోసారి ఎమర్జెన్సీ విధించే భయాలకు సంబంధించి ఇప్పుడు సరిగ్గా అలాంటి కోర్టు తీర్పు, ఎన్నిక రద్దు కారణం కాకపోవచ్చు. కానీ గుజరాత్ మారణకాండ (2002)కు కారకులైన వారి మీద నమోదైన కేసులలో కొన్ని ఈనాటికీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్న (ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ప్రకటించిన ట్టుగా) సంగతి వాస్తవం. అందుకే ఆ కోణం నుంచి అద్వానీ ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ఊహించారా? దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే శక్తులు బలంగా ఉన్నాయి. మళ్లీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించే అవకాశం ఉంది. పార్లమెంటు, ఇతర రాజ్యాంగ వ్యవస్థల హక్కులను హరించే ప్రమాదం ఉంది. రాజ్యాంగ పరమైన, న్యాయపరమైన రక్షణ వ్యవస్థలను కూడా లెక్క చేయకుండా ప్రజా స్వామ్యాన్ని అణగదొక్కే శక్తులు ఇప్పుడూ ఉన్నాయి. గత ఎమర్జెన్సీ కాలం (1975-77) తరువాత పౌర హక్కులకు మళ్లీ గ్రహణం పట్టించడానికో లేదా నాశనం చేయడానికో ప్రయత్నించబోమన్న భరోసా ఇచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలూ జరిగినట్టు దాఖలా లేదు. ప్రజల ప్రాథమిక సత్వాలను అణచ డం అంత తేలిక కాదు, కానీ మళ్లీ అలాంటి రోజులు రావని మాత్రం నేను చెప్పలేను. ఎల్.కె. అద్వానీ (బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని, 19-6-2015) జూన్ 25, 1975-పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన సప్త స్వాతంత్య్రాలనూ, పౌర హక్కులనూ కాలరాసి, నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశాన్ని అంధ కారంలోకి నెట్టిన దుర్దినం. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి అర్ధంత రంగా ఆమె ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన రోజు. ప్రజాస్వామ్య వాదులనూ, పౌర హక్కుల నేతలనూ, విపక్ష నాయకులనూ వేల సంఖ్యలో అరెస్ట్ చేసి జైళ్లకు పంపిన రోజు అదే. దాదాపు 22 మాసాలు సాగిన ఈ ‘పంబల దొరతనం’లో బీట్ కానిస్టేబుళ్లే పత్రికా స్వేచ్ఛను శాసించే సెన్సార్ అధికారులయ్యారు. అలాంటి దుర్దినాలను అద్వానీ, ఆయనతో పాటు ఆయన పార్టీ (అప్పుడు భారతీయ జనసంఘ్) ఇతర నేతలూ చవిచూశారు. ఆ రోజులను తలుచుకుంటూ, ప్రస్తుత ప్రధానీ తన పార్టీకే చెందిన నరేంద్ర మోదీ పాలనకు కూడా వర్తించే విధంగా అద్వానీ ఎమర్జెన్సీ నలభై ఏళ్ల సందర్భంగా ఎందుకు అలా వ్యాఖ్యానించవలసి వచ్చింది? అద్వానీ వ్యాఖ్యల వెనుక మతలబు? ప్రధాని పదవికి అర్హత ఉన్నప్పటికీ బీజేపీలోని మోదీ-అమిత్‌షా వర్గం; భారత ఐక్యతను చెదరగొట్టడానికి ‘హిందుత్వ’ చాటున శాసిస్తున్న ఆరెస్సెస్ పరివార్లు తనను తప్పించినందుకే అద్వానీ ఇలా ఎదురుదాడికి దిగారా? గుజరాత్లో మైనారిటీల మీద జరిగిన మారణకాండకు కారకులైన శక్తుల మీద సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించవలసి ఉంది. కానీ అందుకు కారకులైన కొన్ని శక్తులు ఇప్పుడు దేశ పాలనాధికారాన్ని చేపట్టాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జెన్సీ రాగల ప్రమాదాన్ని గుర్తించి అద్వానీ ముం దస్తు హెచ్చరికలు చేయవలసి వచ్చిందా? ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనడానికి అద్వానీ ఊహిస్తున్న, దర్శిస్తున్న కారణాలను ప్రజలు తెలుసుకోవలసి ఉంటుంది. కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ అధికారం చేపట్టినది మొదలు ఈ ఏడాది కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఎన్నికల ప్రణాళికలో వారు చేసిన వాగ్దానాలకు గానీ, ఇచ్చిన భరోసాలకు గానీ పూర్తి విరుద్ధంగానే ఉన్నాయి. ప్రభుత్వ చర్యలన్నీ విరుద్ధ పంథాలోనే సాగుతున్నాయి. దీనికితోడు భార తీయ సమాజాన్ని చీలికల బాట పట్టించే మార్గాలను ప్రభుత్వం అన్వే షిస్తున్నది. ఆర్థిక విధానాల విషయంలో ప్రజాస్వామ్య, సైద్ధాంతిక దృక్పధం, విలువలూ లేకపోవడంతో కేంద్రం పెడమార్గాలు తొక్కుతోంది. మళ్లీ వాటిని సమర్థించుకోవడానికి నిరంకుశ ధోరణులను ఆశ్రయిస్తూ, అలాంటి ధోరణు లకే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆసరా ఇస్తున్నారు. అందువల్లనే రానున్న పరిణామాలను ఊహించి పార్టీ కార్యకర్తలనూ, దేశ ప్రజలనూ అద్వానీ అప్ర మత్తం చేయదలిచారా? దేశ ఆర్థికవ్యవస్థ దిశనూ, విదేశాంగ విధానం దిశనూ సర్వతంత్ర, స్వతంత్రంగా తీర్చిదిద్దడంలో, కాంగ్రెస్-యూపీఏ పాలనకు భిన్నంగా నిర్వహించడంలో బీజేపీ విఫలమైంది. అవే విదేశీ బడా గుత్త వర్గాలకూ, దేశీయ సంపన్న వర్గాలకూ జోహుకుం అంటున్న తీరులో కేంద్రం నడుస్తున్నందుకే అద్వానీ అలాంటి హెచ్చరిక చేశారా? ఒక రంగమని కాదు; న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో, పౌర హక్కులను గౌరవిం చడంలో, పారిశ్రామిక కార్మిక చట్టాలను, వ్యవసాయ కార్మికుల ప్రయోజనా లను కాపాడే చట్టాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరికి పాల్పడుతున్నది. దీనితో ఉత్పన్నమయ్యే అశాంతిని పరిష్కరించే దారి లేక, ప్రభుత్వం నిర్బంధాలకు పచ్చజెండా ఊపక తప్పదని అద్వానీ భావించి, ఎమర్జెన్సీ ప్రమాదం గురించిన ప్రకటన చేశారా? న్యాయ వ్యవస్థతో పేచీతోనే... గత ఎమర్జెన్సీకి కారణం- అలహాబాద్ హైకోర్టు తీర్పు. ప్రధాని ఇందిర లోక్ సభ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి తీర్పు ఇవ్వడంతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోసారి ఎమర్జెన్సీ విధించే భయాలకు సంబంధించి ఇప్పుడు సరిగ్గా అలాంటి కోర్టు తీర్పు, ఎన్నిక రద్దు కారణం కాకపోవచ్చు. కానీ గుజరాత్ మారణకాండ (2002)కు కారకులైన వారి మీద నమోదైన కేసులలో కొన్ని ఈనాటికీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్న (ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ప్రకటిం చినట్టుగా) సంగతి వాస్తవం. అందుకే ఆ కోణం నుంచి అద్వానీ ఎమర్జెన్సీ ప్రమాదాన్ని ఊహించారా? ఇదికాకపోతే, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కారీ ప్రభృతుల మీద సమర్థించుకోలేని ఆరోపణలు ముమ్మరించడంతో బీజేపీ అగ్రనేత నోటి నుంచి ఈ ప్రమాద హెచ్చరిక వెలు వడిందా? లలిత్ మోదీ వ్యవహారంలో ప్రధాని సహా కీలక వ్యక్తులు ఆరోప ణలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, గత ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను క్రమంగా ఎలా భ్రష్టు పట్టించిందో గుర్తు చేయడానికే. తనకు లొంగిరాని న్యాయమూర్తుల స్వేచ్ఛకు ఎలా సంకెళ్లు వేసిందో, అనుకూలురు-ప్రతి కూలురు అన్న అధర్మ త్రాసులో ఉంచి న్యాయమూర్తుల పదోన్నతులను శాసించి న్యాయ వ్యవస్థను అదుపులో ఉంచుకోవడానికి నాటి ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నించిందో అందరికీ తెలుసు. మెజారిటీ జ్యూడీషియరీని తనకు అనుకూల వ్యవస్థగా మార్చుకోవడానికి నాటి ప్రభుత్వం అనుసరిం చని మార్గమంటూలేదు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులను అణగదొక్కి, కిందిస్థాయిలో ఉన్న న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించిన దుర్ముహూ ర్తాలు అప్పుడే కనిపిస్తాయి. అప్పుడు హెబియస్ కార్పస్ రిట్‌ను సైతం పాల కులు నిర్వీర్యం చేశారు. అయితే సుప్రీంకోర్టులో తన పదోన్నతిని కూడా గడ్డి పోచలా భావించి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా వేయి మంది డిటెన్యూలకు ఒక్క కలం పోటుతో స్వేచ్ఛ కల్పించారు. బెయిల్ సౌకర్యం కల్పించారు. కానీ ఖన్నాకు అమెరికాలో స్తూపం నిర్మించారు గానీ, ఇక్కడ అలాంటి సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా మంచీచెడులతో నిమిత్తం లేకుండా పాత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మార్చడానికి మోదీ ప్రభుత్వం తన వంతు పని మొదలు పెట్టింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) వంటి సంస్థలకు, కేంద్ర సర్వీసులకు నియమించే అధిపతుల విషయంలో యోగ్యతలకన్నా, ఇతరత్రా కారణాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. యూపీఏ బాటలోనే కేంద్ర గూఢ చారి, నిఘా సంస్థలను రాజకీయ కక్షలు సాధించుకోవడానికీ, స్వప్రయోజ నాలకు దుర్వినియోగం చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన తరువాతనే పార్టీలో సీనియర్ నేతగా, మాజీ పాలకునిగా అద్వానీ దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధించే అవకాశాల గురించి హెచ్చరించి ఉండాలి! దేశంలో తాజాగా ముంచుకొస్తున్న, ముదురుతున్న సమస్య ఒకటి ఉంది. ఇంతకు ముందు న్యాయమూర్తుల నియామకం కోసం స్వతంత్రంగా వ్యవహరించే సంఘాన్ని (కొలీజియం) తొలగించి కేంద్రమే ఆ బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. రాజకీయ పాలనా వ్యవస్థ ఏలుబడిలో ఉండే విధంగా జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామక సంఘం ఏర్పాటు చేయడానికి వీలుగా మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ విషయంలో ఇరు వైపులా కూడా తప్పొప్పులకు అవకాశాలు లేకపోలేదు. కానీ ఈ పద్ధతి వల్ల న్యాయమూర్తులు స్వతంత్రంగా తీర్పులు వెలువరించలేని దుర్దశకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి. జస్టిస్ ఖన్నా, ప్రొఫెసర్ జైన్లు ఒక సం దర్భంగా పేర్కొన్నట్టు, ‘దేశాన్ని పాలించవలసింది చట్టానికి బద్ధమై ఉండే ప్రభుత్వమే కానీ, అధికారంలో కూర్చునే వ్యక్తులు కాదని గుర్తుంచుకోవాలి. సవరణల ముసుగులో వ్యవహారాలు నడిపే పార్లమెంట్ కూడా ఇందుకు సమర్థురాలు కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను నిరంకుశ వ్యవస్థలుగా మార్చడానికీ, లోక్‌సభ, రాజ్యసభలను వంశపారంపర్య సభ్యసంస్థలుగా మార్చగల లేదా, వాటిని రద్దు చేయగల శక్తి కూడా పార్లమెంట్‌కు లేదు.’ (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
సోనియా! సోనియా...రాహుల్ ఎక్కడ?
న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో నాయకత్వ కాడిని కిందపడేసి రాహుల్ పై భారంవేసి స్వీయ ప్రవాస జీవితంలోకి సోనియా గాంధీ వెళ్లిపోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి పార్టీకి పునర్జీవం పోయాల్సిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవుల పేరిట అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. పార్లమెంట్‌లోనూ, వెలుపల పార్టీకి సారథ్యం వహించేందుకు సరైన నాయకుడెవరంటూ పార్టీ తల్లడిల్లుతున్న సమయంలో హఠాత్తుగా సోనియా గాంధీ మళ్లీ కార్యరంగంలోకి దూకారు. కిందపడేసిన కాడిని భుజానేసుకొని పద..పదండంటూ పార్టీ నేతలను వెంబడేసుకొని పాదయాత్రలు ప్రారంభించారు. బొగ్గు కేటాయింపుల కేసులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో సోనియాలో మళ్లీ కదలిక వచ్చింది. ఇంతకాలం తమ తరఫున ప్రధాని పాత్రను పోషించిన మన్మోహన్‌కు అండగా నిలవాలని తలచిన తక్షణమే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీని నిర్వహించి మన్మోహన్‌కు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంట్లో భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సోనియా గాంధీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మళ్లీ వీధుల్లోకి వచ్చారు. ఏకంగా సారూప్యతగల లౌకిక పార్టీలను కలుపుకొని రాష్ర్టపతి భవన్‌కు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. పతానవస్థలోవున్న పార్టీని ముందుకు నడిపించడం సోనియాకు కొత్తేమి కాదు. 2003లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీని అనతికాలంలోనే మేల్కొలిపారు. లౌకిక పార్టీలతో జతకట్టి 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. పార్లమెంట్ సమావేశాల కీలక ఘట్టంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన రాహుల్ గాంధీ కనిపించక కలవరపడుతున్న పార్టీకి మళ్లీ సోనియా గాంధీ పెద్ద దిక్కవడం పట్ల పార్టీ సీనియర్ నేతలతోపాటు జూనియర్ నేతలు సంతోషిస్తున్నారు. సోనియా....సోనియా... మీరే దిక్కు మొక్కు...అంటూ పలవరిస్తున్నారు. ఈ విషయం తెలిస్తే రాహుల్ గాంధీ పార్టీ జన జీవన స్రవంతిలోకి వస్తారా లేక ప్రస్తుతం ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారా ? అన్నది సగటు కాంగ్రెస్‌వాది ప్రశ్న. -
ఎంపీసీసీ అధ్యక్షుడిగా అశోక్ చవాన్
- లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర - కార్పొరేషన్ విజయంలోనూ ముఖ్య భూమిక - సరైన వ్యక్తిగా భావించిన అధిష్టానం - ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజయ్ నిరుపం సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎంపికయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఏఐసీసీ మహారాష్ట్రలో పార్టీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న అధిష్టానం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీసీసీ అధ్యక్షునిగా అనేక మంది పేర్లు ముందుకు వచ్చినప్పటికీ ఇటీవలి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు కాపాడిన అశోక్ చవాన్‌కు పట్టం కట్టాలని భావించింది. మరోవైపు ఉత్తర భారతీయ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరూపంను ఎంపిక చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో చవాన్ కీలక పాత్ర అనేక సంవత్సరాలుగా పెట్టని కోటగా ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌కు ఇటీవలి ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా కొనసాగడంతో లోకసభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మరాఠ్వాడా, నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు ఉన్న గుర్తింపు, చేసిన అభివృద్ధి పనుల ద్వారా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. లోకసభ ఎన్నికలకు ముందు 2012 అక్టోబరులో జరిగిన నాందేడ్ - వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సత్తా చాటారు. కార్పొరేషన్ అవతరించిన తర్వాత మొదటి ఎన్నికలు మినహా వరుసగా మూడు సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చవాన్ మోదీ హవాను తట్టుకొని విజయం సాధించారు. మరో పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. చవాన్‌ను సమర్థుడిగాభావించిన అధిష్టానం కాగా కొంత కాలంగా ఎంపీసీసీ, ముంబై రీజినల్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) ప్రక్షాళన చేయాలని చూస్తున్న అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆదర్శ్ కుంభకోణం, పెయిడ్ న్యూస్ ఆరోపణలతో వివాదాల్లోకెక్కిన చవాన్‌కు ఎంపీసీసీ పగ్గాలు ఇవ్వడానికి తర్జనభర్జన పడిన అధిష్టానం ఎట్టకేలకు చవాన్‌కు అధికారం అప్పగించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్రావ్చవాన్ నుంచి రాజకీయ వారసత్వం పొందిన ఆయన కుమారుడు అశోక్ చవాన్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్సీపీ, బీజేపీ, శివసేనను ఎదుర్కొనేందుకు చవాన్ సమర్థుడని అధిష్టానం భావించింది. కాగా, ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా సంజయ్ నిరుపంకు పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరాఠీ ఓటర్లు, శివసేన, ఎమ్మెన్నెస్‌ల మద్య చీలిపోయే అవకాశముండటంతో ఉత్తరభారతీయుల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉత్తర భారతీయుడైన సంజయ్ నిరూపం సరైన వాడని భావించింది. -
మోదీ త్రీడీ ప్రచారానికి రూ. 61 కోట్లు
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ త్రీడీ ఎన్నికల ప్రచారానికి రూ. 61 కోట్లకు పైగా ఖర్చయిందని బీజేపీ తెలిపింది. దృశ్య, శ్రవణ మీడియా ప్రచారం కోసం మరో రూ. 304 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇటీవల ఎన్నికల సంఘానికి అందించిన వ్యయాల నివేదికలో వెల్లడించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం రూ. 714 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపింది. మోదీ ఎన్నికల్లో ఒక ప్రాంతం నుంచి చేసిన ప్రసంగాలను త్రీడీ తెరల ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం తెలిసిందే. బీజేపీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మోడీ వినూత్నంగా చేపట్టిన త్రీడీ సభల కోసం రూ. 51.36 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ. 10 కోట్లను లెసైన్స్ ఫీజు కింద చెల్లించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనలు, ఎస్సెమ్మెస్‌లు తదితరాల కోసం రూ. 304 కోట్లు వెచ్చించారు. మోదీ, రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు, అమిత్ షా తదితర పార్టీ మఖ్య ప్రచారకర్తల ప్రయాణాల కోసం రూ. 77.83 కోట్లు ఖర్చు చేశారు. -
‘ఢిల్లీకి పూర్తి హోదా’ ప్రకటన చేస్తారా..
సాక్షి, న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ నిలబెట్టుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేడో,రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై కేజ్రీవాల్ శుక్రవారం ట్విటర్లో స్పందించారు. ఈ ర్యాలీలో నరేంద్రమోదీ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తానని ప్రకటన చేస్తారా అని ప్రశ్నించారు. ‘ రేపు మోదీజీ ఢిల్లీవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన రేపు దానిని ప్రకటిస్తారా? లేక ఈ విషయంలో కూడా ఆ పార్టీ యూటర్న్ తీసుకుంటుందా? అని కేజ్రీవాల్ ట్విటర్‌పై ప్రశ్నించారు. విద్యుత్తు చార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించింది. ప్రధాని మోదీ దానిపై కూడా ఒక ప్రకటన చేస్తారని ఢిల్లీవాసులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని కేజ్రీవాల్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మొట్ట మొదటిసారి శనివారం ఢిల్లీవాసులను ఉద్ధేశించి ప్రసంగించనున్నారని, ఆయననుంచి ఏం ఆశిస్తున్నారో ఢిల్లీవాసులు తమకు ట్వీట్ ద్వారా తెలియచేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ట్వీట్ చేసింది. ప్రతిదానిపై ఆర్డినెన్స్ తెచ్చే మోడీ సర్కారు ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆప్ నేత మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసినప్పటికీ, కేంద్రం పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని వస్తోన్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ సవాలు విసిరారని భావిస్తున్నారు. ఢిల్లీకి పూర్తిరాష్ట్ర హోదా కల్పిస్తే ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసుపై అధికారాన్ని, ఢిల్లీలో భూమిపై అధికారాన్ని బదిలీచేయాల్సి ఉంటుందని, దానికి కేంద్రం ససేమిరా సుముఖంగా లేదని ఒక ఆంగ్ల దినపత్రిక గురువారం ప్రచురించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోద ా కల్పించడంపై రామ్‌లీలామైదాన్ ర్యాలీలో మోదీ ప్రకటన చేయాలని ఢిల్లీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలు కోరుతున్నారని తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కూడా కూడా ప్రతిస్పందించింది. ఢిల్లీలో మోదీ ర్యాలీ గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లుగా ఉందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. -
ఉద్యోగాలిస్తానని.. చీపుర్లు చేతికిచ్చాడు!
మోదీపై రాహుల్ విసుర్లు చాయిబసా(జార్ఖండ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛభారత్ లక్ష్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ‘లోక్‌సభ ఎన్నికల సమయంలో అందరికీ ఉద్యోగాలిస్తానంటూ హామీలిచ్చి.. ఇప్పుడు వీధులూడ్చండి అంటూ చీపురుకట్టలు చేతికిస్తున్నాడ’ని మోదీని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల సమయంలో మీ కోసం నేను ఉద్యోగాలు కల్పిస్తా.. ఫ్యాక్టరీలు, రోడ్లు, విమానాశ్రయాలు నిర్మిస్తా అని చెప్పి.. అధికారంలోకి రాగానే మీరు వీధులూడ్చండి, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయారు’ అని పశ్చిమ సింగ్బూమ్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలనేది కాంగ్రెస్ వైఖరి కాగా.. అధికారమే పరమావధిగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీని 10 మంది పారిశ్రామిక వేత్తల ప్రధానిగా రాహుల్ అభివర్ణించారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, భూసేకరణ చట్టాలను రూపొందించి కాంగ్రెస్ ప్రజల సాధికారత కోసం కృషి చేసిందన్నారు. పారిశ్రామికవేత్తల కోసం ఇప్పుడు భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘మనకు కావాల్సింది అభివృద్ధి సాధించే ప్రభుత్వమే కానీ వీధులు శుభ్రపరిచేవారి ప్రభుత్వం కాద’ని వ్యాఖ్యానించారు. -
తాజా ఎన్నికలపై కమలం దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా, మరోవైపు ఢిల్లీ విధానసభకు తాజా ఎన్నికలపై బీజేపీ రాష్ర్ట శాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరిలో విధానసభ ఎన్నికలు జరిగే అవకాశముంది. మొన్నటికి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం, ఆ తర్వాత మహారాష్ర్ట, హర్యానా శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ నాయకులకు ఎనలేని ధీమానిచ్చాయి. ఒకవేళ ఢిల్లీ విధానసభకు ఎన్నికలు జరిగితే తగినంత మెజారిటీ దక్కుతుందనే ధీమాతో తమ పార్టీ అధిష్టానం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటూ రాష్ర్ట శాఖ నాయకులకు అధిష్టానం పెద్దలు సూచించారు. ‘పెట్రోల్ ధరలను ఇటీవల తగ్గించడం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశమైన పాకిస్థాన్ విషయంలో వ్యవహరించిన తీరు దేశవాసులపై ఎనలేని ప్రభావం చూపాయి. ఓట్ల కోసం మేము ప్రజల్లోకి వెళ్లినపుడు ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని నాయకుడొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో తామే అధికారంలోనే ఉన్నామని, శాసనసభ ఎన్నికల్లో చక్కని ఫలితాలొచ్చాయని అన్నారు. జాతిజనుల మనోగమనానికి ఇది సూచిక అని, దీని ప్రభావం ఢిల్లీ విధానసభ ఎన్నికలపైనా తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాతీయ రాజధానిలో ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
ఎమ్మెన్నెస్ గుర్తింపు రద్దయ్యేనా?
సాక్షి, ముంబై: అటు లోక్‌సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా ఆ పార్టీ గెలిపించుకోలేక పోయింది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్క అభ్యర్థే విజయం సాధించాడు. దీంతో ఆ పార్టీని ఓటర్లు పూర్తిగా తిరస్కరించారనే విషయం స్పష్టమైంది. ఇప్పటికే పరాజయంతో కుమిలిపోతున్న ఆ పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ జారీచేసిన పార్టీ గుర్తింపు (ఇంజన్) రద్దయ్యే ప్రమాదంకూడా ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతిఫలంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే భారీ మూల్యం చెల్లించుకోకతప్పేలా లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కొత్త పార్టీకి నిర్దేశించినరీతిలో ఓట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరు శాతం ఓట్లు కచ్చితంగా రావాలి. అయితే మొన్న జరిగిన లోక్‌సభ, తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తును రద్దు చేసే అవకాశముంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రాంతీయ పార్టీగా ఎమ్మెన్నెస్‌కు గుర్తింపు లభించింది. రైల్వే ఇంజన్ గుర్తు అధికారికంగా లభించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడంతో ఆ ఇంజన్ గుర్తును తిరిగి తీసుకునే అవకాశాలున్నాయి. -
జర జాగ్రత్త..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాల్లో ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపించాలనే అభిప్రాయంతో పార్టీల కార్యకర్తలు కూడా ప్రచార జోరును పెంచారు. అయితే అభ్యర్థిగానీ, ఆయన మద్దతుదారులుగానీ పోలింగ్ రోజున అప్రమత్తంగా లేకపోతే ఇన్నిరోజుల శ్రమ అంతా వృథా అవుతుంది. ఒకవేళ గెలిచే అకాశమున్నా కార్యకర్తలు చేసే చిన్న చిన్న పోరపాట్లు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే ఆస్కారముంది. అందుకే పోలింగ్ రోజున అభ్యర్థులు, కార్యకర్తలు ఎలా మెలగాలి? ఏం చేస్తే తప్పుల్లో చిక్కుకుంటారనే విషయంలో అవగాహనను కలిగి ఉండాలి. ఆయా విషయాలపై కథనం... పోలింగ్ స్టేషన్లో.. పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ పీవోలు, సిబ్బంది అయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని లోపలికి రానివ్వరు. ఓటు వేయడానికి వచ్చిన వారికి అనుమతి ఉంటుంది. ఐదుగురు చొప్పున పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. పోలింగ్ సమయం ముగిసే సరికి పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉంటే వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. గొడవ పడ్డారో అంతే సంగతులు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎంతో సహనం అవసరం. ప్రత్యర్థులు రెచ్చగొట్టారని వివాదాలకు దిగితే ఇబ్బందే. గొలుపోటములు ఎలా ఉన్నా ప్రశాంతంగా లేకుంటే చిక్కులు తప్పవు. ప్రత్యర్థులు ఏదైనా రెచ్చగొడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలి. గుర్తింపు కార్డు తప్పనిసరి ఓటు హక్కు ఉన్న వారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాస్కార్డు, నివాస ధృవీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, విద్యార్హతల మెమో కార్డు తీసుకుని వెళ్లే గుర్తింపుతో వెంటనే ఓటు వేయడానికి వీలు ఉంటుంది. ఓటర్లను తరలించడం నేరం పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలించడం కూడా ఎన్నికల నియమావళి ప్రకారం నేరమే. పోలింగ్ రోజున దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలపై తరలించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేయడం నేరం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారు స్వచ్ఛందంగానే రావాల్సి ఉంటుంది. వారిని ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. వాటిపై కేసులు కూడా నమోదు చేస్తారు. మహిళలు, పురుషులకు వేర్వేరు లైన్లు మహిళలు, పురుష ఓటర్లుకు వేర్వేరుగా ఓటు వేయడానికి లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నిఘా నేత్రాలుంటాయ్.. ఎన్నికల సమయంలో అభ్యర్థులపై నిఘా ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది నిఘాను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ రోజున ఓటర్లను తరలిం చడం, మద్యం, డబ్బులు పంపిణీ చేయడం తదితర ప్రలోభాలపై నాఘా ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఆధారాలు ఉంటే కేసలు కూడా నమోదు చేస్తారు. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులతో అప్రమత్తం.. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులతో అభ్యర్థులు, వారి అనుచరులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో దురుసుగా వ్యవహరించకూడదు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకోవడం వంటి చర్యలు చేయకూడదు. ఇటువంటివి చేస్తే కేసుల్లో చిక్కుకుం టారు. అటువంటి వారిని పోలీసులు బైండోవర్ చేస్తారు. అంతే కాకుండా కేసులు నమోదయ్యి, విచారణలో నేర నిర్థారణ జరిగితే జైలు, జరిమానా తప్పదు. పార్టీ కండువాలకు అనుమతిలేదు అభ్యర్థులు పార్టీ, ఎన్నికల గుర్తుల బ్యాడ్జీలు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. కండువాలు, బ్యాడ్జీలతో లోనికి వస్తే ఎన్నికల నియామవళిని అతిక్రమించినట్లు భావించి, అధికారులు చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు పాస్‌లు జారీ చేస్తారు. ఆ పాస్‌ల ఆధారంగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. 200 మీటర్ల దూరంలోనే ప్రచారం పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేయడానికి వీలులేదు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థి ప్రచారానికి అనుమతి ఉంటుంది. వంద మీటర్ల వరకు ఉండే లక్ష్మణ రేఖ దాటి లోపలికి వస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. రూ.250 జరిమానా కూడా విధించవచ్చు. -
కరియప్ప చేరికతో కాంగ్రెస్‌లో లుకలుకలు
సింధనూరు టౌన్ : గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసిన ప్రముఖ నాయకుడు కే.కరియప్ప ఇటీవల బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. మాజీ కాంగ్రెస్ ఎంపీ కే.విరుపాక్షప్ప బంధువైన కరియప్ప గత అసెంబ్లీ ఎన్నికల వరకు విరుపాక్షప్ప వెంటే ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం సంభవించిన పరిణామాలు, స్థానికంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప బీజేపీలో చేరారు. అప్పుడు కరియప్ప మాత్రం తటస్తంగా ఉన్నాడు. అయితే తెర వెనుక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేపట్టారు. క్రమంగా విరుపాక్షప్పకు దూరమైన కరియప్ప ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరియప్పను భవిష్యత్తులో కురుబ సమాజ నాయకుడిగా పార్టీ గుర్తిస్తే విరుపాక్షప్పకే నష్టమనే వదంతులు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన కే.విరుపాక్షప్ప గత లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా అప్పట్లో విరుపాక్షప్ప చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే హంపనగౌడ వర్గం సీఎం, కేపీసీసీ అధ్యక్షులకు మొర పెట్టుకున్నారు. దీంతో నిరాశ చెందిన విరుపాక్షప్ప చివరకు బీజేపీలో చేరిపోయాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బంధువు కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజ్ హిట్నాళ్ తరఫున ప్రచారం చేయకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కరడి సంగణ్ణకే మద్దతు తెలిపి గెలిపించారు. అదే సమయంలో కరియప్ప కాంగ్రెస్ అభ్యర్థి తరఫున తెర వెనుక ప్రచారం చేసి పార్టీ అగ్రనాయకత్వంతో సంబంధాలు పెంచుకున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అయితే ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వర్గంలోని కొందరు నగరసభ సభ్యులు రాజీనామా చేస్తామని తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు నోరు మెదపడం లేదు. అగ్ర నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరినా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులతో పొసుగుతారో లేక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూడాలి. -
రాహుల్‌తో ప్రచారంపై విముఖత
సాక్షి, ముంబై: గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని ప్రచారం చేయడానికి ఆహ్వానించకపోవడమే మంచిదని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఆయన ప్రచారంచేసిన నియోజకవర్గాలలో ఓటమ తథ్యమని అనేక మంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా ఆయనతో దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌తో ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పవార్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనేక ఎన్నికల్లో ఫ్లాప్ అయిన రాహుల్ గాంధీ నేతృత్వంపై సీనియర్ నాయకులకు నమ్మకం పోయింది. ఎప్పుడు ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాహుల్ వద్దు బాబోయ్ అనే మాటలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ కూడా రాహుల్ గాంధీకి నాలుగు అడుగులు దూరంగానే ఉండాలని భావిస్తోంది. రాహుల్ సామర్థ్యంపై పవార్‌కు ముందునుంచి అనుమానాలున్నాయి. గత నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో జీర్ణించుకుపోయిన పవార్‌కు రాహుల్ పని విధానం ఏమాత్రం రుచించడం లేదు. ఈ విషయాన్ని పవార్ అనేసార్లు బహిరంగంగానే వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌తో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు నిరాకరించారు. కేవలం ముంబైలో సోనియా గాంధీ నిర్వహించే బహిరంగ సభలో మాత్రమే పవార్ పాల్గొంటారని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా సోనియా సభలోనే పవార్ పాల్గొన్నారు. రాజకీయాల్లో పవార్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్టతో పోలిస్తే రాహుల్ ఎందులోనూ సరితూగరని, దీంతో రాహుల్ సభలో పాల్గొనడం పవార్ ప్రతిష్టకు సరికాదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచార వేదికను రాహుల్‌తో షేర్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ నాయకుడొకరు చెప్పారు. కేవలం సమావేశాల్లో మాత్రమే రాహుల్‌తో కలిసి చర్చిస్తారని స్పష్టం చేశారు. -
బైపోల్లో బీజేపీ బోల్తా
-
కమిలిన కమలం
ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ 24 సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకుగాను 10 సీట్లలోనే గెలుపు యూపీలో సమాజ్‌వాదీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా గుజరాత్లో కమలనాథులకు ఊరట మోదీ స్థానం వడోదరలో బీజేపీకి భారీగా తగ్గిన మెజారిటీ 3 లోక్‌సభ స్థానాల్లో ఒక్కోటి చొప్పున దక్కించుకున్న బీజేపీ, సమాజ్‌వాదీ, టీఆర్ఎస్ ఫలితాలు వెలువడిన 32 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి 12, ఎస్పీకి 8, కాంగ్రెస్‌కు 7 ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున దక్కించుకున్న టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు 20న వెలువడనున్న ఆంటాగఢ్ అసెంబ్లీ స్థానం ఫలితాలు సీనియర్లను పక్కనపెట్టిన ఫలితమే: బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టించిన కమలనాథులకు ఊహించని షాక్ ఇది. అధికారం చేపట్టిన తర్వాత అతికొద్ది కాలంలోనే జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కూడా కనిపించలేదని స్పష్టమవుతోంది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో మొన్నటివరకు తమ చేతిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో(1 మిత్రపక్షం) 14 సీట్లను బీజేపీ ఇప్పుడు కోల్పోయింది. 20న ఆంటాగఢ్ ఫలితాలు.. సోమవారం ఫలితాలు వెలువడిన 9 రాష్ట్రాల్లోని 32 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకోగా.. కాంగ్రెస్ ఏడు, సమాజ్‌వాదీ పార్టీ 8, టీడీపీ, ఏఐయూడీఎఫ్, టీఎంసీ, సీపీఎంలు ఒక్కో స్థానం చొప్పున దక్కించుకున్నాయి. సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎస్పీలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి. ఆ పార్టీల స్థానాలు ఆ పార్టీలకే దక్కాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఆంటాగఢ్ స్థానం ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయి. ఎన్నికల ఫలితాలు మోదీకి పరీక్ష కాదని బీజేపీ పేర్కొంటున్నప్పటికీ, ప్రతికూల ఫలితాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి. యూపీ, రాజస్థాన్‌లో ఫలితాలు బీజేపీని నిరుత్సాహానికి గురిచేయగా, గుజరాత్లో ఆరు స్థానాల్లో గెలవడం, బెంగాల్లో ఖాతా తెరుచుకోవడం కొంత ఊరటనిచ్చింది. యూపీలో దూసుకెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ... యూపీలో సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్లింది. సార్వత్రిక ఎన్నికల్లో 73 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా రావడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ఎన్నిక జరిగిన 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ అభ్యర్థులు, 1 బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఖాళీ చేసినవే. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు ఎస్పీ ఖాతాలోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్ సత్తాచాటుకున్నారు. నోయిడా, సహరన్‌పుర్, తూర్పు లక్నో అసెంబ్లీ స్థానాల్లో కమలం వికసించగా, బిజ్నోర్, ఠాకుర్ద్వారా, నిఘాసన్, హమీర్పుర్, చర్ఖారి, సిరాథు,బల్హా, రొహానియా అసెంబ్లీల్లో ఎస్పీ అభ్యర్థులు గెలిచారు. గుజరాత్లో బీజేపీకి ఊరట..గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చింది. అక్కడ క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. 9 అసెంబ్లీను గెలిపించి ప్రధాని మోదీకి జన్మదిన కానుక ఇవ్వడానికి ఆ రాష్ట్ర సీఎం ఆనంది చేసిన హామీ చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా మారింది. ఫలితాలు మాత్రం బీజేపీకి కొంత ఊరటనిచ్చాయి. వడోదర లోక్‌సభతో పాటు, మనినగర్, టంకారా, తేలాజా, ఆనంద్, మటర్, లిమ్ఖేడా అసెంబ్లీను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, దీసా, ఖంభాలియా, మంగ్రోల్లలో కాంగ్రెస్ గెలిచింది.. మోదీ ఖాళీ చేసిన వ డోదరలో బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్.. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 3.29 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో ఈ స్థానాన్ని మోదీ 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా..రాజస్థాన్‌లోని అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం (దక్షిణ కోటా నియోజకవర్గం)లో గెలుపొందగా, మిగిలిన మూడు స్థానాలు.. సూరజ్గర్హ, వుయీర్, నసీరాబాద్ అసెంబ్లీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈశాన్యంలోనూ కమలానికి ప్రతికూల ఫలితాలొచ్చాయి. త్రిపురలోని మను అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకోగా, సిక్కింలోని రామ్గంగ్-యాన్గంగ్ అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అస్సాంలో సిలిచర్‌లో బీజేపీ, లఖీపుర్లో కాంగ్రెస్, జమునాముఖ్లో ఏఐయూడీఎఫ్ గెలిచాయి. పశ్చిమబెంగాల్లో ఖాతా తెరిచిన బీజేపీ బెంగాల్‌లోని చౌరంగి నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా, దక్షిణ బషీర్హాట్ స్థానం టీఎంసీకి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య గెలుపొందారు. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. -
సిబ్బంది లేక ఇబ్బందులు
సాక్షి, ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనులకు హాజరైన మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బంది ఇప్పట్లో విధుల్లోకి చేరే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల తరువాతే వీరంతా తమతమ కుర్చీల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం బీఎంసీ కార్యాలయాలకు వచ్చే సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పనులు జరకపోవడంతో పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల పనులకు వెళ్లిన అనేక మంది సిబ్బందిని ఇంతవరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరిగి బీఎంసీకి పంపించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులంతా ఇప్పటికీ కమిషన్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి వేలాది మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుంది. బీఎంసీ నుంచి అధికారులు, గుమాస్తాలు, అకౌంటెంట్ల వంటి అనేక మంది ఉద్యోగులు ఎన్నికల పనులకు వెళ్లారు. ఇందులో కొందరిని తిరిగి పంపించిన్పటికీ గణేశ్ ఉత్సవాల సమయం కావడంతో అనేక మంది స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో బీఎంసీ కార్యాలయాలన్నీ ఉద్యోగులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వీరంతా తిరిగి వచ్చే సరికి అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులంతా తిరిగి ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సిందే. బీఎంసీ కార్యాలయాల్లో పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి కావడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళితే వారిని సాధారణ రోజుల్లోనే చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని ముంబైకర్లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగులు పూర్తి సంఖ్యలో లేకపోవడంతో పనులను మరింత ఆలస్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఈ తిప్పలు అసెంబ్లీ ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకు తప్పకపోవచ్చని ముంబై సెంట్రల్వాసి ఒకరు అన్నారు. బీఎంసీ వర్సెస్ ఉత్సవ మండళ్లు ముదురుతున్న గుంతల వివాదం గత ఏడాది తవ్విన గుంతలను పూడ్చివేయాలంటూ మహానగర పాలక సంస్థ (బీఎంసీ) జారీ చేసిన నోటీసులను అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతోంది. తొలుత రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని, ఆ తరువాతే మండళ్ల నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్వాహకులు బీఎంసీని డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన గణేశ్ ఉత్సవాల్లో మండపాలు ఏర్పాటు చేసేందుకు సార్వజనిక మండళ్ల ప్రతినిధులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంతలు తవ్వించారు. చవితి వేడుకలు ముగిసిన తరువాత కూడా వాటిని అలాగే వదిలేశారు. గుంతలను ఇంతవరకు పూడ్చలేదు కాబట్టి నిమజ్జనం పూర్తయ్యేంతలోపు జరిమానా చెల్లించాలని మండళ్లకు బీఎంసీ నోటీసులు జారీచేసింది. ఇలా జరిమానా వసూలు చేయడం సరైన పద్ధతి కాదని, తాము ఒక్క పైసా కూడా చెల్లించబోమని మండళ్లు తెగేసి చెప్పాయి. మండళ్లు గుంతలు తవ్వినందుకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జరిమానా చెల్లించాలని బీఎంసీ ఆదేశించింది. రోడ్లపై ఏర్పడిన గుంతలతో పోలిస్తే తాము తవ్విన గుంతలు చాలా చిన్నవని, ఉత్సవాలు పూర్తికాగానే సిమెంట్‌తో పూడ్చివేశామని మండళ్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. బీఎంసీ మాత్రం గుంతలకు జరిమానా చెల్లించాల్సిందేనని పట్టుబడుతోంది. లేకుంటే ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని మొదట హెచ్చరించింది. తదనంతరం ఈ నిబంధనను ఉపసంహరించుకుని నిమజ్జనం ముగిసేలోపు జరిమానా చెల్లించాలని సూచించింది. జరిమానా చెల్లించేందుకు మండళ్లు నిరాకరిస్తున్నాయి. చిన్న గుంతలకే వేలల్లో జరిమానా విధిస్తామంటే.. నగర రహదారులపై ఉన్న పెద్ద పెద్ద గుంతల సంగతేమిటని ప్రశ్నిస్తున్నాయి. జరిమానా వివాదంపై బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి సభ్యులపై చర్చిస్తామని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితో ఈ విషయం చర్చించామని, జరిమానా చెల్లించనవసరం లేదని ఆయన తమకు హామీ ఇచ్చారని సమితి సభ్యుడు గిరీశ్ బాలావల్కర్ అన్నారు. నిమజ్జనాలకు ముందే జరిమానా చెల్లించాల్సిందేనని బీఎంసీ పట్టుబట్టడంతో ఈ వివాదం ముదురుతోంది. -
ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి దక్కింది ఏడే.. బీహార్‌లో లౌకికవాద కూటమి ప్రయోగం సక్సెస్ బెంగళూరు: మూడు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీకి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. ఈ నెల 21న బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగగా.. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ కూటమి 8 సీట్లలో విజయం సాధించింది. బీహార్‌లో దూసుకెళ్తామని భావించిన ఆ పార్టీకి ఆర్జేడీ, జేడీ (యు), కాంగ్రెస్ పార్టీలతో కూడిన లౌకికవాద కూటమి గట్టి షాకిచ్చింది. ఆ రాష్ట్రంలో పది స్థానాలకు ఎన్నికలు జరగగా రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. లౌకికవాద కూటమికి 6 (ఆర్జేడీ 3, జేడీ (యు) 2, కాంగ్రెస్ 1) స్థానాలు దక్కాయి. కంచుకోట మధ్యప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తామని భావించిన బీజేపీకి నిరాశే మిగిలింది. ఇక్కడ మూడు స్థానాల్లో ఎన్నిక జరగ్గా.. ఊహించని రీతిలో కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. ఇక పంజాబ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఒక సీటు గెలుచుకోగా.. కాంగ్రెస్ మరో సీటులో విజయం సాధించింది. కర్ణాటకలోని మూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి దక్కింది ఒక్కటే. మోడీ పాలనపై అసంతృప్తికి సూచిక.. అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తికి సూచన అని జేడీ (యు) నేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ మతవాద ఎజెండాను నిలువరించడానికి లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకొనిపోయే దిశగా యోచిస్తున్నామని ఆయన తెలిపారు. కర్ణాటక ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ద్వారా నరేంద్ర మోడీ విజయం తాత్కాలికమని వెల్లడైందన్నారు. కాగా, ఈ ఫలితాలు మోడీ పాలనకు ప్రతీక అనడాన్ని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఖండించారు. -
ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం
నాగపూర్: అన్ని విధాలా వెనుకబడ్డ విదర్భ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ఉపాధి హామీ పథకం, నీటి సంరక్షణ శాఖ మంత్రి నితిన్ రావుత్ మంగళవారం స్పష్టీకరించారు. విదర్భ డిమాండ్‌కు రావుత్ బహిరంగంగా మద్దతు తెలపడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు విదర్భకు మద్దతు తెలపడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాగపూర్‌లో మెట్రోరైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగానే విదర్భ అంశాన్ని పక్కన బెట్టడం నిరాశకు గురిచేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన ప్రకటన చేస్తారని నేను భావించాను’ అని నాగపూర్ ఇన్చార్జి మంత్రి కూడా అయిన రావుత్ అన్నారు. ప్రత్యేక విదర్భకు అనుకూలమని పేర్కొంటూ భువనేశ్వర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రం గురించి హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంతోపాటు ఎనిమిది కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పుసాద్, అచల్పూర్, చిమూర్, అష్టి, బ్రహ్మపురి, అమేరీ, ఖామ్గావ్, కటోల్ ప్రాంతాలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే నాగపూర్‌లో భారీ ఎత్తున గొలుసు దొంగతనాలు జరుగుతుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్నిచర్యలూ తీసుకుంటామని నితిన్ రావుత్ హామీ ఇచ్చారు. -
ఇప్పుడు ఎన్నికలు జరిగినా కమల వికాసమే
న్యూఢిల్లీ: లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ 314 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఇవి 32 స్థానాలు ఎక్కువ కావడం గమనార్హం. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో ఇండియా టుడే గ్రూపు-హన్సా రిసెర్చ్ సంస్థలు సంయుక్తంగా ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరుతో అభిప్రాయ సేకరణ చేశాయి. 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 108 లోక్‌సభ స్థానాల్లో 12,430 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాయి. ఈ నెల 3 నుంచి 14వ తేదీ మధ్యలో జరిగిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 48 శాతం మంది మళ్లీ బీజేపీకి ఓటు వేస్తామని చెప్పగా... 57 శాతం మంది ప్రధాని పదవికి మోడీ తగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ప్రజాదరణ విషయంలో మోడీ కంటే బీజేపీ ఇప్పటికీ వెనుకబడే ఉండటం గమనార్హం. మరోసారి ఓటు వేసే అవకాశం వస్తే 29 శాతం మంది ముస్లింలు బీజేపీకి ఓటేస్తామని చెప్పగా.. కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పినవారు 24 శాతం మందే. -
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి రాహుల్‌గాంధీ బాధ్యుడు కాదంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ బాసటగా నిలిచారు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జెండావందనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమి కారణాల పరిశోధనపై తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదికను ఆంటోనీ...గురువారం సోనియాకు సమర్పించారు. ఈ కమిటీ రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిందని వచ్చిన వార్తలను ఆంటోనీ ఖండించారు. పార్టీని బలహీనం చేయడానికి ఎవరో దుర్మార్గులు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు వేరే ఉన్నాయని చెప్పిన ఆయన.. ఆ కారణాలు ఏంటో బహిర్గత పరచలేదు. అయితే ప్రస్తుత నాయకత్వంలోనే కష్టకాలాన్ని అధిగమించి, పార్టీని పటిష్టపరిచి, పునర్వైభవం అందిపుచ్చుకుంటామని ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్రధాన పాత్రపై మాట్లాడుతూ, ఆ విషయంలో ఇప్పటికే ప్రియాంక స్పష్టతనిచ్చారని, దానిపై తానింక చెప్పేది ఏమీ లేదన్నారు. పార్టీ సంస్థాగత మార్పులపై తుది నిర్ణయం సోనియాదేనని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కమిటీలో మరో సభ్యుడు ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 500 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, వారిలో ఏ ఒక్కరు కూడా సోనియా, రాహుల్ నేతృత్వంపై ప్రశ్నలు లేవనెత్తలేదని తెలిపారు. ఆంటోనీ నేతృత్వంలోని ఆ కమిటీలో ముకుల్ వాస్నిక్, ఆర్సీ కుంతియా, అవినాశ్ పాండే సభ్యులన్న విషయం తెలిసిందే. ఓటమిలో మీడియాకు పాత్ర ఉంది తమ పార్టీ పరాజయంలో మీడియాకు కూడా పాత్ర ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. ఆంటోనీ కమిటీ సమర్పించిన నివేదికలో.. మీడియా బీజేపీకి వత్తాసుపలికి, కాంగ్రెస్‌కు తక్కువగా కవరేజి ఇచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం. మీడియాపై నిందలెలా వేస్తారని ఆజాద్‌ను ప్రశ్నించగా తమ ఓటమిలో మీడియా కూడా భాగస్వామి అన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు గంటసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క నిమిషం కూడా చానళ్లు ప్రసారం చేయలేదన్నారు. -
పోల్ కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్చిట్
అహ్మదాబాద్: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోడీకి శుక్రవారం గుజరాత్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. గాంధీనగర్‌లో ఓటేశాక విలేకరుల సమావేశంలో పార్టీ గుర్తు అయిన కమలాన్ని కనిపించేలా మోడీ ప్రదర్శించారు. దీంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(1)(ఏ), 126(1)(బీ)ల ప్రకారం నమోదైన ఆ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. అయితే, ఈ కేసును మూసేస్తున్నట్లు, సంబంధిత క్లోజర్ రిపోర్ట్‌ను కేసును విచారిస్తున్న మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించినట్లు గుజరాత్ క్రైం బ్రాంచ్‌కు చెం దిన ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం స్పష్టం చేశారు. -
'కాంగ్రెస్ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు'
న్యూఢిల్లీ: సభలో లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన తీరు బాధ కలిగిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదని వెంకయ్య విమర్శించారు. సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోందని వెంకయ్య ఆరోపించారు. స్పీకర్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఒత్తిడికి గురిచేయాలని ఉద్దేశం చేసే చీప్ ట్రిక్కులు సరికావని ఆయన అన్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన సభలో మత హింస బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు అడ్డుతగలడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. పరిస్థితులు అదుపుతప్పడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. -
కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు
మహారాష్ట్రలో నారాయణ్ రాణే, అస్సాంలో హిమంత శర్మ రాజీనామా ముంబై/గువాహటి: లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా రెండు రాష్ట్రాల్లో స్వపక్ష నేతలు పెద్ద షాకిచ్చారు. ఆ పార్టీ పాలనలోని మహారాష్ట్ర, అస్సాంలలో ఇద్దరు అసమ్మతి సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేశారు. మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, అస్సాం ఆరోగ్య, విద్యా మంత్రి హిమంత బిశ్వాస్ శర్మలు తమ సీఎంల పనితీరుపై అసంతృప్తితో సోమవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. కొన్ని నెలల కింద కూడా రాజీనామా చేసిన వీరు.. అప్పుడు అధిష్టానంఒత్తిడితో ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి ఉపసంహరించుకోనని, శర్మ స్పష్టం చేశారు. నారాయణ్ రాణే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కలుసుకుని రాజీనామా అందజేశారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. ‘2005లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనను ఆరు నెలల్లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం తొమ్మిదేళ్లవుతున్నా దాన్ని నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. మరోపక్క తనకు మద్దతిస్తున్న 38 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్దకు వెళ్లానని, సీఎం గొగోయ్ నాయకత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేశానని హిమంత శర్మ తెలిపారు. తాము పార్టీ కోసం పోరాడుతున్నామని, గొగోయ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఘోరంగా దెబ్బతింటుందన్నారు. -
సోషల్ మీడియాపై సీపీఐ దృష్టి
ముంబై : సోషల్ మీడియాపై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సీపీఐ కసరత్తు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియా చూపిన ప్రభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర కాంగో బుధవారం ఇక్కడ తెలిపారు. ఇందులో భాగంగా ముంబైలో ఈ నెల 25న సోషల్‌మీడియా కార్యకర్తల కోసం రాష్ట్రస్థాయి వర్క్‌షాపును నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాతో యువత ప్రభావితమవుతోందని, అందుకే ఆధునిక ఆలోచనలతో కూడిన పార్టీ కార్యక్రమాలను ఈ మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా సామాజిక మార్పులో సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముందుకుసాగుతున్నారని తెలిపారు. పార్టీ పనివిధానం, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడంలో సరైన కార్యాచరణ లేక తమ నాయకత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ తదితర సోషల్ మీడియా సైట్లను ప్రారంభించిందని చెప్పారు. యూ ట్యూబ్‌లో చానెల్ కూడా ప్రారంభించామని చెప్పారు. 25న నిర్వహించనున్న వర్క్‌షాపులో సోషల్ మీడియాను పార్టీ కార్యక్రమాలకు వేదికగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఓటమి సాధారణమే
లోక్‌సభ ఎన్నికలపై సీఎం సిద్ధు పరమేశ్వరతో కలిసి ఢిల్లీలో ఆంటోనితో భేటీ పార్టీ బలోపేతమే లక్ష్యం : పరమేశ్వర సీఎం రేసులో లేను : దేశ్‌పాండే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు గెలుపోటములు సర్వ సాధారణమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానానికి వివరణ ఇవ్వడానికి బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, కేపీసీసీ చీఫ్ పరమేశ్వరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ నాయకత్వంలో ఏర్పడిన కమిటీతో సమావేశమవడానికి పరమేశ్వరతో కలసి ఆయన వెళ్లారు. ఆంటోనీతో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించినట్లు విలేకరులకు పరమేశ్వర తెలిపారు. కాగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి సీఎం వైఖరే కారణమని గత వారాంతంలో ఇక్కడ జరిగిన ఆత్మావలోకన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పరోక్షంగా ఆరోపించడంతో వారిద్దరి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పదవి ఉంటుందో, ఊడుతుందో అని అదే సమావేశంలో సీఎం వేదాంత ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా అనే సందేహాలూ తలెత్తాయి. సీఎంకు దేశ్‌పాండే బాసట శాసన సభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారు. శాసన సభ వెలుపల ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీఎంను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమంటూ పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చక్కగా పని చేస్తున్నారని కితాబునిస్తూ, ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అల్ప సంఖ్యాకులు, వెనుకబడిన తరగుతులు, దళితులతో కూడిన ‘అహింద’ ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడుపుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివని కొట్టి పారేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇటీవల శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేసిన విషయంలో సీఎం ‘కోటరీ’ పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఎంపికలు జరిగాయని వివరించారు. రాష్ర్ట మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతే పేర్లను ఖరారు చేశారని తెలిపారు. కాగా తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ప్రజలను తప్పుదారి పట్టించిన మోడీ: కాంగ్రెస్
చండీగఢ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరించేస్తామన్నట్టుగా మోడీ ప్రచారం చేశారని చెప్పారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా గడవకముందే పెట్రోల్, డీజిల్ ధరలు, రైల్వే చార్జీలు పెంచేశారని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా దిగిరాలేదని వెల్లడించారు. దీని గురించి మోడీ ఎక్కడా మాట్లాడడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చైనా తోక కత్తిరిస్తామని చెప్పిన ఎన్డీఏ ఇప్పుడు... అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన అధికార పటంలో చూపించినా నోరు మెదపడం లేదని షకీల్ అహ్మద్ ఎద్దేవా చేశారు. -
నిరాశొద్దు..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసినంత మాత్రాన నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఓటమిపై ఇక్కడి ప్యాలెస్ గ్రౌండ్లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల ఆత్మావలోకనం సభలో ప్రసంగించిన నాయకులంతా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, ఈ ఓటమి తాత్కాలికమేనని అన్నారు. సభను ప్రారంభించిన అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రల్లో మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఆ కుట్రలను భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ వారు సోషల్ సైట్లను విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా మన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే, ప్రజాందోళనలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సవాలుగా స్వీకరించాలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని సవాలుగా స్వీకరించాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుకుగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని, పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు సరైన పదవులు ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఎన్నో ఆశలు రేపి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గత నెలగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. ఆయన నుంచి ఉత్తమ పాలనను ఆశించలేమని అన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, కేహెచ్. మునియప్ప, జనార్దన పూజారి సహా రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పరమేశ్వరకు మద్దతుగా ధర్నా పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుమకూరు జిల్లా కొరటగెరె నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడి క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఆయనే కారణమంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొరటగెరె నియోజక వర్గంలో ఒక్క పనీ జరగడం లేదని వారు ఆరోపించారు. కాగా గత శాసన సభ ఎన్నికల్లో పరమేశ్వర ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
భూసేకరణ చట్టాన్ని మార్చాలి
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం సరిగా లేదని పలు రాష్ట్రాలు విమర్శించాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని హడావుడిగా తీసుకువచ్చారని ధ్వజమెత్తాయి. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల రెవెన్యూ మంత్రులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూసేకరణ చట్టంలోని నిబంధనలు చిన్న ప్రాజెక్టులకు కూడా అవాంతరాలు కల్పించేలా ఉన్నాయని బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు దుయ్యబట్టారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని హర్యానా, కర్ణాటక, కేరళ మంత్రులతోపాటు, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీజేడీ మంత్రులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను కేంద్రం సవరించే అవకాశముందని తెలుస్తోంది. భూసేకరణ విషయంలో తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. రైతులకు నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో రాజీపడబోమని పేర్కొన్నారు. -
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ ఇంకెన్నాళ్లో?
లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటిదాకా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ హర్షవర్ధన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవి వరించింది. దీంతో బాధ్యతల నిర్వహణలో ఆయన తలమునకలైపోయారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సారథి కోసం ఎదురుచూస్తున్నారు. న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు నూతన సారథి ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసనసభ ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో కచ్చితంగా వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికలకు సన్నద్ధమవడం సులభమవుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల పరాజయం తర్వాత పూర్వవైభవం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు నగరంలో తమ పట్టును పెంచుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రమిస్తోంది. బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతల్లో డాక్టర్ హర ్షవర్ధన్ తలమునకలయ్యారని, అందువల్ల రాష్ట్ర శాఖ వ్యవహారాలపై ఆయన అంతగా దృష్టి సారించలేరని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ హర ్షవర్ధన్ తన పనిలో తాను నిమగ్నమయ్యారన్నారు. అందువల్ల పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించడానికి అంత సమయం ఆయనకు ఉండదన్నారు. దీంతో ఎటువంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు. కనీసం సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నామన్నారు. బీజేపీ సాధారణంగా ఆరు సంవత్సరాలకొకసారి సభ్యత్వ కార్యక్రమం చేపడుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఈసారి ఐదు సంవత్సరాలకే నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెలాఖరుదాకా కొనసాగనుంది. అయితే తొలి నాలుగు రోజుల్లో ఆశించిన మేర స్పందన రాలేదు. ఇది ఆ పార్టీని కొంత నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్ర శాఖకు సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకుడొకరు వాపోయారు. మరోవైపు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజూ మొహల్లా సభలను నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ సంక్షోభం అనుకోని అవకాశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిరోజూ ఆందోళనలకు దిగడం ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తోంది. తద్వారా శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాతంటాలు పడుతోంది. మరోవైపు ఈ సంక్షోభం బీజేపీకి శాపంగా పరిణమించింది. సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ సమస్యపై తమ వైఖరేమిటనే విషయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించలేని పరిస్థితి కొనసాగుతోంది. చివరికి ఈ-రిక్షాల విషయంలో కూడా వారు పెదవి విప్పలేకపోతున్నారు. ఇందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు నితిన్ గడ్కరీ వీటి క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే. ఒకవేళ ఎన్నికలు ముంచుకొస్తే ఆప్‌కు గట్టి పట్టు కలిగిన ప్రాంతాల్లో బీజేపీ తన ప్రచార పర్వాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ-రిక్షాలకు క్రమబద్ధీకరణకు సంబంధించి స్పష్టమైన హామీ లభించినట్టయితే దానిద్వారా బీజేపీ ఆ వర్గాల మద్దతు పొందే అవకాశం లభిస్తుంది. అందుకోసం కూడా విస్తృత మైన ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు మేం సిద్ధంగానే ఉన్నాం: బీజేపీ నేత రమేశ్ న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగానే ఉందని బీజేపీ నాయకుడు రమేశ్ బిధూరీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలొక్కటే తమకు మిగిలి ఉన్న అవకాశమన్నారు. ‘ఎన్నికలకు మా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈసారి మాకు తిరుగులేని మెజారిటీ వస్తుందనే ధీమా ఉంది’ అని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈ దక్షిణ ఢిల్లీ ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికలకు మీ పార్టీ సిద్ధమేనా అని ప్రశ్నించగా ఈ విషయమై అధిష్టానం త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. భారీ పగటికలలు కంటూ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ 49 రోజుల పాలనాకాలంలో దాని లోపాలన్నీ బయటపడ్డాయన్నారు. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఇబ్బందికరమైన ఫలితాలను చవిచూడక తప్పలేదన్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలోని మొత్తం 70 సెగ్మెంట్లకు గాను 60 స్థానాల్లో బీజేపీ ముందున్న సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాని సంగతి విదితమే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 33.07 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 46.10 శాతానికి పెరిగింది. ఇక ఆప్ ఓటు శాతం 32.90 నుంచి 29.49 శాతానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 24.50 శాతం వాటా దక్కింది. ఇది లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి 15.10 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగడం ఏ పార్టీకీ ఇష్టం లేకపోయినప్పటికీ అంతకుమించి మరో మార్గం కనిపించని పరిస్థితి కొనసాగుతోంది. -
తలకాయలు మార్చినా తలరాతలు మారేనా?
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీల్లో అంతర్మథనం మొదలైంది. అనేకరకాల సమీక్షల తర్వాత ఇరుపార్టీల అధిష్టానాలు.. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్న నాయకులను మార్చాలని నిర్ణయించాయి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చాలని కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక ఎన్సీపీలో కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్‌ను మార్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రకమైన మార్పులు ప్రజాస్వామ్య కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తలకాయలు మార్చినంత మాత్రనా ఇరుపార్టీల తలరాతలు మారే అవకాశం లేదని కొందరు చెబుతుండగా నాయకత్వ మార్పు కొంతమేరకైనా ప్రజలపై ప్రభావం చూపుతుందని మరికొందరంటున్నారు. సోనియాను కలిసిన నారాయణ్ రాణే... లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ నేత నారాయణ్ రాణే, అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. దీంతో రాణేను పార్టీ అధినాయకత్వమే పిలిపించిందా? లేక రాణే స్వయంగా వెళ్లి అధిష్టానాన్ని కలిశారా? అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేకున్నా మొత్తానికి పార్టీ పదవులతోపాటు ముఖ్యమంత్రి పదవిలో కొత్తవారిని కూర్చోబెట్టాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందనే సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని షోలాపూర్ నేత, మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఇవ్వనున్నట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఇక ఎంసీసీసీ అధ్యక్ష పదవిని మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్ దాని నుంచి బయటపడితేగానీ ఏ నిర్ణయం తీసుకోలేమనే నిర్ణయంలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఫలిస్తే సరే.. మరి వికటిస్తే.. పార్టీ అధిష్టానం చేస్తున్న కసరత్తు ఫలిస్తే సరే... మరి వికటిస్తే పరిస్థితి ఏంటని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎంపికచేసేవారి విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంపిక చేసే ముందు కూడా పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయమై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. కీలక పదవుల బాధ్యతలను కొత్తవారికి అప్పగించినప్పుడు వారి మద్దతుదారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకపోయినా వారి ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. వ్యక్తులకే కాకుండా ప్రాంతాలవారీగా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో సమతూకం పాటించినప్పుడే మార్పులు సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు. జాదవ్ స్థానంలో ఎవరో? కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీలో కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాధవ్‌ను మార్చనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల పదాధికారులతో శరద్‌పవార్ నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై అభిప్రాయాలు కూడా సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. భాస్కర్ జాదవ్‌కు మంత్రి మండలిలో చోటిచ్చి పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునీల్ తట్కరే కు అప్పగించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆ దిశగానే యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో మార్పుల జరిగిన తర్వాత వాటికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఠాక్రేలకు భుజ్‌బల్ చురకలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్సీపీ నేత, ప్రజాపనుల శాఖమంత్రి ఛగన్ భుజ్‌బల్ చురకలించారు. ‘ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నవారందరికీ శుభాకాంక్షలు’ అంటూ పరోక్షంగా ఠాక్రేలిద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ఠాక్రేలు ముఖ్యమంత్రులు కావాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఇటీవల వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన భుజ్‌బల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. -
7 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ప్రారంభమై ఒక నెల పాటు జరిగే అవకాశముంది. ఇవి ఆగస్ట్ 6 వరకు కొనసాగొచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బుధవారం జరిగే కేబినెట్ భేటీలో షెడ్యూలు ఖరారు అంశం పరిశీలనకు రావొచ్చన్నాయి. తొలి వారం సమావేశాల్లో ప్రీ-బడ్జెట్ ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లను ప్రవేశపెట్టే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెచ్చిన ఓట్సాన్ అకౌంట్ గడువు జూలై నెలాఖరుతో ముగియనుండడంతో ఆలోపు ఈ బడ్జెట్లను ఆమోదించాల్సి ఉంది. -
వడోదరాలో మోడీ ఎన్నికల వ్యయం రూ. 50 లక్షలు
వడోదరా: గుజరాత్‌లోని వడోదరా స్థానం నుంచి కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. వడోదరాలో మోడీ మొత్తం ఎన్నికల వ్యయం రూ. 50,03,598గా లెక్కగట్టారు. ఇందుకు సంబంధించిన లెక్కలను మోడీ ప్రచార వ్యయం ఇన్చార్జి, వడోదరా మేయర్ భరత్ షా శుక్రవారం స్థానిక ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించారు. దీని ప్రకారం మోడీ ఏప్రిల్ 9న నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన సభతోపాటు మే 16న విజయోత్సవ సభ (వడోదరాలో 5.70 లక్షల ఓట్ల మెజారిటీతో మోడీ గెలిచారు) నిర్వహణకు రూ. 25.80 లక్షలు ఖర్చు అయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ. 22 లక్షల నుంచి రూ. 54 లక్షలకు పెంచడం తెలిసిందే. -
అంతా రహస్యమే
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మంగళవారం మలేషియా వెళ్లారు. ఆయన పర్యటన అత్యంత రహస్యంగా సాగడం చర్చనీయూంశమైంది. దీని వెనుక ఆంతర్యమేమిటోనని పలువురు చెవులు కొరుక్కున్నారు. అయితే తనయుడు షణ్ముగ పాండియన్ శతాబ్దం చిత్రం షూటింగ్ కోసమే ఆయన వెళ్లినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల మంతనాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గతంలో మలేషియాకు చెక్కేశారు. బీజేపీతో కలసి పనిచేయడం లక్ష్యంగా అక్కడున్న తన సన్నిహితులతో మంతనాల నిమిత్తం ఆయన వెళ్లినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే మలేషియా వేదికగా రాజకీయ పందేరాలు సాగినట్టు తమిళ మీడియా కోడై కూసింది. మలేషియా నుంచి వచ్చీరాగానే బీజేపీతో పొత్తుకు ఆయన జై.. కొట్టడం మీడియా కథనాలకు బలం చేకూరినట్టయింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో తన మలేషియా పర్యటనపై సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ విజయకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి చిత్ర షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లినట్టు వివరణ ఇచ్చుకున్నారు. తాను ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే సమయంలో ఎన్నికల బిజీలో షూటింగ్‌లు ఏమిటో... అన్న అంశంపై చర్చకూడా సాగింది. ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా చివరకు లోక్‌సభ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేంద్రంలో తమ పార్టీకి మంత్రి పదవి దక్కుతుందని ఎదురు చూసినా ఫలితం శూన్యం. చివరకు పార్టీ వర్గాలతో ఓటమిపై సమీక్షలు ముగించడంతోపాటు వలసలు బయలు దేరకుండా ముందు జాగ్రత్త చర్యగా నేతలకు ఉపదేశాలు ఇచ్చిన విజయకాంత్ హఠత్తుగా మంగళవారం మలేషియాకు చెక్కేశారు. మలేషియా పయనం : తన మలేషియా పర్యటన వివరాల్ని అత్యంత గోప్యంగా విజయకాంత్ ఉంచడం చర్చనీయాంశంగా మారింది. వీఐపీలు వస్తున్న సమయంలో మీనంబాక్కం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సహజం. అయితే ఈ సారి అలాంటి ఏర్పాట్లు కూడా లేదు. అలాగే విదేశాలకు వెళ్లే ప్రయాణికులు మూడు గంటలు ముందుగానే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం అర గంట ముందుగా విమానంలోకి పంపుతారు. ఇందుకు భిన్నంగా విజయకాంత్ అత్యంత రహస్యంగా విమానాశ్రయానికి రావడం గమనార్హం. 11.30 గంటలకు విమానం బయలు దేరాల్సి ఉండగా, సరిగ్గా 11.05కు ఆయన విమానాశ్రయూనికి చేరుకున్నారు. అప్పటికే అక్కడి అధికారులు ఆయనకు బోర్డింగ్ పాస్ సిద్ధం చేయడంతో మీడియా కంట పడకుండా మలేషియాకు చెక్కేశారు. ఆయన వెంట సతీమని ప్రేమలత కూడా వెళ్లారు. షూటింగ్ నిమిత్తమే: విజయకాంత్ రహస్య పయనం మీడియాల్లో హల్చల్ చేయడంతో డీఎండీకే వర్గాలు మేల్కొన్నాయి. తమ అధినేత విజయకాంత్ కేవలం షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్లారని వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. తమ నేత వారసుడు షణ్ముగ పాండియన్ హీరోగా శతాబ్దం పేరుతో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ చిత్రంలో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారని, ఆ చిత్ర షూటింగ్ మలేషియా, కౌలాలంపూర్ల్లో జరగనున్నదని, అందు వల్లే ఆయన విదేశీ పయనాన్ని రహస్యంగా ఉంచుకున్నట్టు చెబుతున్నారు. పది, పదిహేను రోజులు ఈ షూటింగ్ ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఇక్కడికి రావొచ్చని వెల్లడించారు. -
ఓటమికి హైకమాండే కారణం: అంతులే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి హైకమాండే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతులే విమర్శించారు. పార్టీ పరిస్థితి ఇలా ఉందంటే దానికి అధిష్టాన పెద్దలే కారకులని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారకులెవరని ప్రశ్నించగా ఆయనీవిధంగా స్పందించారు. 206 ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ 44 స్థానాలకు పడిపోయింది. మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలుండగా 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. సొంత రాష్ట్రంలో పార్టీ ఓటమిపై మాట్లాడేందుకు అంతులే నిరాకరించారు. -
తమిళనాడు గవర్నర్‌గా జశ్వంత్‌సింగ్!
జైపూర్: సీనియర్ నేత జశ్వంత్సింగ్కు గవర్నర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరనున్నారనే ఊహాగానాలు మరోమారు పతాక శీర్షికలకెక్కా యి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొణిజేటి రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు సింగ్ అందుబాటులో లేనప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం తమ నేత బీజేపీలోకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు బర్మేర్ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. దీంతో అక్క డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. -
త్వరలో బోర్డులు, కార్పొరేషన్లకు నియామకాలు
5న కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలోని బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మైసూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పూర్తై నేపథ్యంలో ఇక కార్పొరేషన్ బోర్డుల నియామకాలను ఆలస్యం చేయబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు ప్రా రంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 5న బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో వారి వారి నియోజకవర్గాల్లోని సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఇక కన్నడ మాధ్యమ పాఠశాలల్లో ఒకే ఒక విద్యార్థి ఉన్నా కూడా అలాంటి పాఠశాలల ను మూయబోమని తెలిపారు. ఒక విద్యార్థి ఉన్నా కూడా పాఠశాలలను న డపాల్సిందేనని తమ ప్రభుత్వం భావి స్తోందని, అయితే ఈ విషయంపై మంత్రి వర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కన్నడ క్రియా సమితి కార్యకర్త మల్లేష్ రాష్ట్రంలో కన్నడ మాధ్యమ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ విషయంపై స్పందిస్తూ సిద్ధరామయ్యపై వ్యాఖ్యలు చేశారు. -
ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది. దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడే విస్తరణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ముందుగా రాష్ట్ర మంత్రి మండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రిమండలిని విస్తరించి, గురువారం ఉదయం కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యవిద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన స్థానం, ఎన్సీపీ కోటాలోని ఓ కేబినెట్ పదవి ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీకాలం కూడా ముగిసింది. దీంతో వీటిని భర్తీ చేయడం కోసం మంత్రిమండలిని విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మరోసారి మంత్రిపదవి దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. గావిత్ స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవాడ్‌కు వైద్యవిద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం రేసులో శరద్గావిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఫౌజియాఖాన్ స్థానం కోసం జితేంద్ర అవాడ్తోపాటు ప్రకాష్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్బల్లతోపాటు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోటాలోని మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో కూడా మంత్రి పదవులపై ఆసక్తికనబరుస్తున్న నాయకులలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే... అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సుశీల్‌కుమార్ షిండే, మిలింద్ దేవరా, ప్రియాదత్ ఇలా అనేక మంది దిగ్గజ నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు మరాఠ్వాడాలోని కేవలం రెండు స్థానాలు లభించగా ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ మంత్రి మండలి విస్తరణ జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పాత ముఖాలే.. మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి కేబినెట్ పదవిని కొత్త వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుండగా కాంగ్రెస్ మాత్రం పాతవారితోనే విస్తరణ తంతు ముగించాలనుకుంటున్నట్లు సమాచారం. -
సుష్మాస్వరాజ్: అద్భుతమైన వక్త
న్యూఢిల్లీ: సుష్మాస్వరాజ్(62).. అద్భుతమైన వక్త. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల వాగ్ధాటి ఆమె సొంతం. లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా, ఆ తరువాత ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ఒకరు. అద్వానీకి అనుంగు శిష్యురాలు. అయితే, పార్టీలో ఆమెకున్న పట్టు, పరిపాలనలోని శక్తి సామర్ధ్యాలు సుషాస్వరాజ్కు మంత్రివర్గంలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి కల్పించాయి. ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంలోనూ ఆమెపై మంచి అభిప్రాయమే ఉంది. ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ ఈ దేశ ప్రధాని అయితే, గుండు కొట్టించుకుంటానంటూ 2004లో ఆమె చేసిన ప్రతిజ్ఞ అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు, జాతీయ వాదుల్లో ఆమెపై అభిమానం పెంపొందింపజేసింది. 1999 ఎన్నికల్లో బళ్లారి స్థానంలో సోనియాగాంధీపై పోటీ చేసిన సమయంలో కన్నడ భాష కూడా నేర్చుకున్నారు. సుష్మాస్వరాజ్ 7 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఆమె విదిశ నుంచి విజయం సాధించారు. సుష్మా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూతురు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పనిచేశారు. 1977లో హ ర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 25 ఏళ్ల వయసులోనే దేవీలాల్ మంత్రివర్గంలో చేరి అత్యంత చిన్నవయసులో మంత్రి అయిన ఘనత సాధించారు. 27 ఏళ్ల వయసులోనే జనతాపార్టీ హర్యానా అధ్యక్షురాలయ్యారు. 1998లో ఢిల్లీకి మొదటి మహిళా సీఎం అయ్యారు. -
మనకు 6 బెర్తులు
సాక్షి ముంబైః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి చోటుదక్కింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి కొనసాగిన ఉత్కంఠతకు సోమవారం తెరదింపుతూ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో శివసేనకు చెందిన ఒకే ఎంపీ ఉండగా బీజేపీ సభ్యులు ఐదుగురు ఉన్నారు. కేబినేట్ హోదా దక్కించుకున్నవారిలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే ఉన్నారు. మరోవైపు స్వతంత్రహోదాలో మంత్రి పదవి దక్కించుకున్న వారిలో బీజేపీ ఎంపీలు ప్రకాష్ జావ్డేకర్, పీయుష్ గోయల్ ఉన్నారు. శివసేన సీనియర్ నాయకుడు అనంత్ గీతేకు కేబినేట్ హాదా కల్పించారు. జాల్నా బీజేపీ ఎంపీ రావుసాహెచ్ దాన్వే కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు ముంబైలో సోమవారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఎవరికి ఏ శాఖలు...? రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలకు మంత్రులుగా అవకాశం వచ్చినా, ఎవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారనే విషయంపై సస్పెన్స్ వీడలేదు. సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేదంటే గ్రామీణాభివృద్ధిశాఖ ఇచ్చేఅవకాశం ఉంది. ముండేకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలే అధికమని బీజేపీ నాయకులు అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించేందుకుగా ముండేకు వ్యవసాయశాఖ మంత్రి పదవిని కట్టబెడతామన్నారు. ఈ విషయంపై ముండే మాత్రం ఏమీ చెప్పడంలేదు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అంటున్నారు. ఇది ఉండగా మరోవైపు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేదా రైల్వేశాఖ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌలిక సదుపాయాల రంగంపై ఆయనకు ఆసక్తి అధికమని చెబుతారు. గతంలోనూ ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పీయుష్ గోయల్, ప్రకాష్ జావ్డేకర్కు ఏయే శాఖలు దక్కుతానేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు శివసేన నాయకుడు ఆనంత్ గీతేకు కూడా ఏ శాఖను కేటాయించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల్లో అసంతృప్తి...? పదవుల కేటాయింపుపై బీజేపీ మిత్రపక్షాలు శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కొంత అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. శివసేన కనీసం ఒక కేబినేట్, రెండు సహాయమంత్రి పదవులు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. ఈ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి లోక్‌సభ స్పీకర్ పదవి దక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే చివరికి రాయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఎంపీ ఆనంత్ గీతేకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఆయనకు కేబినేట్ హోదా ఇవ్వడంతో పార్టీకి కొంత ఊరట దక్కింది. మరోవైపు రామ్‌దాస్ ఆఠవలే, రాజు శెట్టి కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో రామ్‌దాస్ ఆఠవలే ప్రమాణ స్వీకార వేడుకలకు కూడా వెళ్లలేదని తెలిసింది. మలివిడత మంత్రి మండలి విస్తరణలో తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కనిపిస్తోంది. -
ఆరుగురు ఔట్...ఒకరు ఇన్
వయోభారం, అనారోగ్యం కారణంగా కొందరిపై వేటు ! సహాయ నిరాకరణ చేశారని మరికొందరు పదవులు కోల్పోయే అవకాశం డీసీఎంగా పరమేశ్వర్ ? 28న ఢిల్లీకి సీఎం, కేపీసీసీ చీఫ్ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలిలో కూడికలు, తీసివేతలు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్నట్లు అన్నీ జరిగితే ఈ ప్రక్రియ నెలాఖరుకు ఒక కొలిక్కి తీసుకు రావాలని అటు అధిష్టానంతో పాటు ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అయినా మంత్రి మండలిలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా ప్రకాశ్ బాబయ్య హుక్కేరి ఎన్నిక కావడంతో ఆ స్థానం కూడా ఖాళీ అవ బోతుంది. మరోవైపు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏడాది కాలంలో ప్రస్తుత మంత్రుల పనితీరుపై పార్టీ అధిష్టానంకు నివేదిక పంపించింది. ఈ నివేదికను పరిశీలించిన పార్టీ పెద్దలు ఆరుగు రు మంత్రులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే గనుక జరిగిన రాష్ట్ర మంత్రి మండలిలో ఖాళీ బెర్తుల సంఖ్య పదికి చేరనుంది. ఇన్ని ఖాళీలతో ప్రభుత్వాన్ని నడపడం చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. మరోవైపు మంత్రి పదవులపై చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కన్నేసి ఉంచారు. ఒక వేళ ఈ మంత్రి పదవులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయకపోతే పాలన కుంటుబడటంతో పాటు పార్టీలో అసంతృప్తి పెరిగిపోయే అవకాశం ఉన్నట్లు హైకమాండ్ భావిస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా మంత్రి పదవులను భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఈసారి మంత్రి పదవుల కేటాయింపులో సీనియార్టీకి కాకుండా సమర్థతతకు, యువకులకు పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సిద్ధుకు చెక్ పెట్టడానికి... షెడ్యూల్ కులానికి చెందిన పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మరోవైపు పార్టీ సీనియర్ నాయకులకు సీఎం సిద్ధరామయ్య విలువ ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను గాడిలో పెట్టడానికి పరమేశ్వర్‌కు డీసీఎం పదవి ఇవ్వాలని బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్ పరమేశ్వర్‌కు డీసీఎం పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. రాజ్యసభ, పరిషత్ సభ్యుల ఎంపికపై చర్చించేందుకు ఈనెల 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమయంలోనే ఈ కూడికలు తీసివేతల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. ఉద్వాసన ఎవరికి? ఎందుకు? ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల మంత్రి పదవిని తప్పించాలని నిర్ణయించారు. ముఖ్యమైన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ ఆనారోగ్య కారణంతో విధులను సరిగా నిర్వహించలేకపోతున్నట్లు హైకమాండ్ నిర్ధారణకు వచ్చింది. మంత్రులు ఖమరుల్లా ఇస్లాం, అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చారు. కిమ్మెన రత్నాకర్‌కు క్లీన్ ఇమేజ్ ఉన్నా తనపై వస్తున్న ఆరోపణలు సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నట్లు ఢిల్లీ పెద్దలకు నివేదిక అందింది. ఇక పార్లమెంటుకు వెలుతుండటం వల్ల ప్రకాశ్ బాబయ్య హుక్కేరిని మంత్రి పదవి నుంచి తొలగించి వేరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన ట్లు సమాచారం. -
ఎవరబ్బ సొత్తూ కాదు
సాక్షి, బెంగళూరు : ‘నేనెప్పుడు మంత్రి పదవిలోనే ఉంటానని అనడానికి ఆ పదవి ఎవరబ్బ సొత్తూ కాదు. మంత్రి పదవి నుంచి నన్ను తొలగిస్తే నేరుగా హెలికాఫ్టర్ ఎక్కి దావణగెరె వెళ్లిపోతాను. అక్కడ నా సొంత ఇంటిలో మిగతా జీవితాన్ని గడిపేస్తాను’ అని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప వ్యాఖ్యానించారు. లాల్‌బాగ్‌లో ఏర్పాటైన మామిడి, పనస మేళాను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు శామనూరు ఇలా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి మోడీ హవానే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే దావణగెరె పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నికల ఓటమికి బాధ్యులను చేస్తూ మంత్రులను తొలగించాల్సి వస్తే చాలా మందిని తొలగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి వర్గంలో మార్పులపై తనకెలాంటి సమాచారం లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న విజయాలను సాధించడంలో వెనకబడింది. దీంతో ఆయా పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులపై వేటు వేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శామనూరు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
కాంగ్రెస్‌లో కోల్డ్ వార్
డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్న పరమేశ్వర సీఎంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి ఆ పదవి ఏర్పాటును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న సిద్ధు తన పరిధిలో లేదంటూ సెలైంట్ పట్టువీడని పరమేశ్వర మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్‌లో శీతల సమరం ఉధృతమవుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలోనే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనుకుంటున్న తరుణంలో, పరమేశ్వర ఇప్పటి నుంచే తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఆయన అనుకున్నట్లుగా సీఎం స్పందించడం లేదు. అన్నిటికీ ఆయన అధిష్టానం వైపు చూపిస్తున్నారు. ‘నాదేముంది. ఏదైనా అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి’ అని పదే పదే ఆయన చెబుతుండడం పరమేశ్వరకు కంపరం పుట్టిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం తొమ్మిది మందే గెలవడంతో అధిష్టానం వద్ద సీఎం పలుకుబడి తగ్గుతుందని పరమేశ్వర అంచనా వేశారు. అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఇన్ని స్థానాలు గెలవలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కనుక సిద్ధరామయ్యే కొంత నయమని అధిష్టానం అంచనాకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవిని సీఎం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల రెండు అధికార కేంద్రాలు ఏర్పడుతాయని, తద్వారా ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోతారని భావిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లోని పాత తరం వారంతా సిద్ధరామయ్యను అంత సులభంగా కలుసుకోలేక పోతున్నారు. సీఎం పూర్వాశ్రమంలో జనతా పరివార్‌కు చెందిన వారు. ఆ పరివార్‌లో ఉన్న మంత్రులకే ఆయన విలువ ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనికి విరుగుడుగాా ఆది నుంచీ కాంగ్రెస్‌లో ఉంటున్న వారు పరమేశ్వరకు మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బహుశా వచ్చే నెలలో జరుగనున్న శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల వరకు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునేలా లేదు. పునర్వ్యవస్థీకరణ వాయిదా పడే కొద్దీ మంచిదనే అభిప్రాయం సీఎంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడినందున, సీఎంను ఆదేశించే స్థితిలో లేదు. -
రాష్ట్ర రాజకీయాల్లోనే
కేంద్ర మంత్రి వర్గంలో చేరను : మోడీకి లేఖ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి మీ సలహా మేరకే ఈ నిర్ణయం రాష్ర్టంలో పార్టీని అధికారంలోకితేవడమే ఇక లక్ష్యం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శివమొగ్గ నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రి వర్గంలో చేరకూడదని నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తన సేవలను అందించడానికి సిద్ధమని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లిన యడ్యూరప్ప మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కర్ణాటక భవన్ పక్కనే ఉన్న గుజరాత్ భవన్లో బస చేసిన మోడీ వద్దకు వెళ్లి, తన మనోగతాన్ని వెల్లడించారు. అయితే మోడీ మంత్రి పదవి కన్నా కర్ణాటకలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. మంత్రి పదవిలో ఏముంటుందని తేలికగా తీసి పారేశారు. పైగా దక్షిణాదిలో సైతం బీజేపీకి అనూహ్య స్పందన లభించడంతో పార్టీని పటిష్టం చేయడానికి ఇదే సరైన తరుణమని సూచించారు. ఈ దిశగా ఆలోచించాలని హితవు పలికారు. అనంతరం బెంగళూరుకు తిరిగి వచ్చిన యడ్యూరప్ప ఢిల్లీ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాల్లోనే రాణించగలమనే నిర్ధారణకు వచ్చారు. అవసరమైతే తన సన్నిహితురాలు శోభా కరంద్లాజెకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీని కోరారు. దీనిపై శోభా ఉడిపిలో స్పందిస్తూ, తనకు కేంద్ర మంత్రి కావాలనే అత్యాశ లేదని అన్నారు. పార్టీలో తన కన్నా ఎందరో సీనియర్లు ఉన్నారని, కనుక ఆ పదవులు వారికే దక్కాలని అభిప్రాయపడ్డారు. మోడీకి అప్ప లేఖ రాష్ర్టంలో మరో సారి బీజేపీ అధికారంలోకి తీసు కు రావడంలో భాగంగా పార్టీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమేనని యడ్యూరప్ప మోడీకి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. ‘మీ సలహా మేరకు బీజేపీని రాష్ర్టంలో బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ రహిత కర్ణాటకగా మార్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మొన్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మీ ప్రసంగంతో ప్రభావితుడినయ్యాను. కనుక కేంద్ర మంత్రి పదవిపై ఆశ వదులుకుని రాష్ట్రంలో పార్టీని సంఘటిత పరుస్తాను. ఎవరి సహాయం, అవసరం లేకుండానే పార్టీని సొంతం గా అధికారంలోకి తీసుకు రావడానికి నా అనుభవాన్నంతా ధారపోస్తాను. పదవుల కంటే కర్తవ్యం ముఖ్యమని గ్రహించాను. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తాను. పరస్పర సహకారం ఇలాగే కొనసాగనీయండి’ అని లేఖలో పేర్కొన్నారు. -
'ఓటమికి సోనియా, రాహుల్ బాధ్యులు కారు'
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యులు కారని తిరువనంతపురం ఎంపీ, మాజీ కేంద్రమంత్రి శశీథరూర్ గురువారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ప్రతిపక్ష బాధ్యత తీసుకోవాలని ఆయన సోనియా, రాహుల్ గాంధీలను కోరారు. అప్పుడే పార్టీలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. పార్టీలో, జాతీయ స్థాయిలో రెండు అధికార కేంద్రాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదనడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు అవినీతి ఆరోపణలే దెబ్బతీశాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక పరిణామాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆమూలాగ్రం సంస్కరించాల్సిన ఆవశ్యకతను శశీథరూర్ ఈ సందర్భంగా విశదీకరించారు. వచ్చే ఐదేళ్లూ సోనియా గాంధీ నాయకత్వమే కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. -
'అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహించండి'
న్యూఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని కేజ్రీవాల్ తన నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమైయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఎన్నికలకు వెళ్లకుండా హస్తినలో మరో సారి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. న్యూఢిల్లీ శాసనసభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎంగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల మధ్యకు వెళ్లనున్నట్లు తెలిపారు. శాసనసభకు ఎన్నికై...సీఎం పదవి చేపట్టి కేవలం 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగి ఏడాది కూడా గడవక ముందే మరోసారి ఎన్నికలకు వెళ్తున్నందుకు కేజ్రీవాల్ ఈ సందర్బంగా హస్తిన వాసులకు క్షమాపణలు చెప్పారు. ఆ క్రమంలో వారం పది రోజుల్లో హస్తిన ప్రజల మధ్య పలు బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు కైవసం చేసుకుని ఐదేళ్ల పాటు కొనసాగించ లేకపోయామని ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క పార్లమెంట్ సీటు గెలుచుకోలేపోయినా, పంజాబ్‌లో నాలుగు ఎంపీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకున్న సంగతిని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఇక రొటీన్ !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం ముగిసింది... ఎన్నికలు అయిపోయాయి... వాటి ఫలితాలూ వచ్చేశాయి. దీంతో జిల్లా ప్రజలు మళ్లీ యథాతథ జీవనంపై దృష్టి సారించారు. ఒకేసారి దూసుకొచ్చిన మూడు ఎన్నికలలో వివిధ పార్టీల తరఫున పనిచేసిన కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ బిజీతో పెండింగ్‌లో పెట్టిన పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా రాజకీయ చర్చలతో కాలం గడిపిన వారంతా ఇక సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పాత వృత్తుల్లో నిమగ్నమైపోయారు. అధికార యంత్రాంగం విషయానికి వస్తే... ఎన్నికల కారణంగా పెండింగ్‌లో పెట్టిన పనులపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన గ్రీవెన్స్‌డే సోమవారం తిరిగి ప్రారంభమయింది. సాధారణ పనులు మొదలు పెట్టినప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడానికి మాత్రం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు నూతన అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెపుతున్నారు. ప్రస్తుతానికి విభజన లెక్కలు... ఇన్నాళ్లూ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర విభజన లెక్కలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మూడు రకాల ఎన్నికల నిర్వహణ, వాటి ఫలితాల వెల్లడి ఘట్టాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల పంపిణీతో పాటు నూతన రాష్ట్రంలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమయ్యే నిధులు, వార్షిక బడ్జెట్ ప్రణాళికలకు అనుగుణంగా నిధులు వ్యయం చేయాల్సిన తీరుపై ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ఏ శాఖలో ఎవరు తెలంగాణలో ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు ఈ విభజన లెక్కల్లోనే ఉంటామని అధికారులు చెపుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన నేపథ్యంలో సరిహద్దుల ఏర్పాటు, నిర్వాసితుల పరిహారం ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాలి... విభజన లెక్కల పరిస్థితి అలా ఉంటే... జిల్లాలో మళ్లీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభం కావని వారు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఏర్పాటు, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికలాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే ప్రజాప్రతినిధులు కొత్త పనుల ప్రారంభంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొత్తగా ప్రారంభించాల్సిన వాటికి మాత్రం కొంత సమయం పట్టనుంది. అలా వెళ్లొద్దామా..! దాదాపు మూడు నెలలుగా రాజకీయాలతో బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే చాలా మంది ఊర్లకు వెళ్లిపోగా, పాఠశాల సెలవులు కూడా ముగిసే సమయం వస్తుండడంతో వీలున్నంత త్వరగా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా మోటా నాయకులు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. గెలిచిన వారు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరగా, ఓడిన పార్టీ వారు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పోలీసులు కూడా వరుస సెలవులు పెట్టి విహారయాత్రలకు పయనమవుతున్నారు. -
టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్‌లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు. అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు... రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. హాస్యాస్పదంగా రాంబాబు మాటలు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈవీఎంలపై రగడ
చీరాల, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్‌గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు. స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్‌రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీడిన అనుమానం.. ఈవీఎంల వ్యవహారంపై స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు. ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్‌లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది. -
ఏం చేద్దాం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహిం చని ఫలితాల దిగ్భ్రమ నుంచి ఆ పార్టీ దిగ్గజా లు ఇంకా తేరుకోవడం లేదు. ‘తెలంగాణ’ ఏ ర్పాటును సా నుకూలంగా మార్చుకోలేకపోయామన్న బాధతోపాటు, రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ ఆ పార్టీ నేతలలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుండగా, తమ వ్యూ హం ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, ఫలితాల నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో వారు పడిపోయారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం సాగుతుండగా, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు డీసీసీ సన్నాహాలు చేస్తోంది. ఇంతటి ఘోర పరాజయమా! సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలి తాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇంకా తేరుకోలేదు. అన్ని స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై ఇంకా ‘పోస్టుమార్టం’ సాగుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, సురేశ్ షెట్కార్ ఓటమి కూడా వారిని ఆలోచనలో పడవేసింది. కొద్దిగా ప్రశాంతత కోసం కేడర్‌కు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మహ్మద్ షబ్బీర్‌అలీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ‘అసలేం జరిగిందో’నని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఈ ముగ్గురు నేతలకు ఓటమితో ఊహించని షాక్ తగిలింది. బాల్కొండ నుంచి ఆర్మూరుకు మారడంతో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి కలిసి రావడం లేదు. ఆయన కూడా వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈరవత్రి అనిల్ సైతం ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గ్రూపుల పోరూ కొంప ముంచింది. జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితా లు రావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, సరైన మార్గదర్శనం, ప్లానింగ్ లేకపోవడంతోనే ఫలితాలు దారుణం గా వచ్చాయంటున్నారు. టీపీసీసీ తీరుపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలంగాణ’కు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వ్యవహరిం చిన అంశాన్ని ప్రచారంలో సానుకూలం గా మార్చుకోవడంలో టీపీసీసీ వైఫల్యం చెందిందన్న ఆరోపణలున్నాయి. ఇది లా ఉంటే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు ల పోరు, ప్రత్యర్థులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాల్లో నేతలం తా కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహించగా.. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాం శం అయ్యింది. డీఎస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్ వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తుందని ప్రచారం కూడ జరిగింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపగా.. ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. -
ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు. దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నీతి, నిజాయతీతో వ్యవహరిస్తాం
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నీతి, నిజాయతీతో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజా వ్యతిరేక పాలనకు విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు. రహదారులు, వాగులపై వంతెనలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు తోడ్పడతానన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇద్దరు పేద బిడ్డలను గెలిపించి గుండెలకు హద్దుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది విద్యార్థి యువజనుల త్యాగఫలితంగానే తాము ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, జెడ్పీటీసీ సభ్యులు ఎం.సురేశ్‌బాబు, కొడిపె భారతి, అల్లి మోహన్, ఆర్.సత్తయ్య, బెల్లంపల్లి పట్టణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.సురేశ్, బి.అర్జయ్య పాల్గొన్నారు. -
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కార్తీక్‌రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్‌రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్‌రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్‌రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్‌రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్‌సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
శివసేనలోకి ఎన్సీపీ ఎమ్మెల్యే!
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రత్నగిరి సింధుదుర్గా లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్సీపీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శివసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత శివసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా దీపక్ కేసర్కర్ శివసేనలో చేరనున్నారనే వార్తలను బలపరిచేలా కనిపిస్తున్నాయి. రత్నగిరి-సింధుదుర్గాలో నారాయణ రాణే కుమారుడైన సిట్టింగ్ ఎంపీ నీలేష్ రాణేను వినాయక్ రావుత్ ఓడించారు. ఎన్నికలకు ముందు ఉద్ధవ్‌ఠాక్రే ప్రచారంలో కూడా కేసర్కర్పై పెద్దగా ఎన్నడూ విమర్శలు చేయలేదు. వినాయక్ రావుత్ విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసర్కర్ మహాకూటమి టికెట్‌పై పోటీ చేస్తే మంత్రి పదవి కూడా లభిస్తుందని చెప్పారు. దీన్నిబట్టి ఆయనను చేర్చుకునేందుకు శివసేన కూడా ఆసక్తిగా ఉందని, వినాయక్ రావుత్ విజయానికి ఆయన కూడా పరోక్షంగా లాభం చేకూర్చినట్టు తెలుస్తోంది. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్‌ల హాయాంలో లోక్‌సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్‌ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్‌ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్‌ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్‌ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్‌ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్‌పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్‌సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది. గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్‌కు 16,837 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్‌కు 0.76 శాతం ఓట్లు లభించాయి. లోక్‌సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది. జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్‌రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్‌లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. -
మాగుంట నిర్వేదం
సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది. మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది. రాజ్యసభ పదవికి ప్రయత్నాలు.. పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు. నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్‌కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. -
చీరాలలో ఈవీఎంల కలకలం
చీరాల, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు అధికారులు ఓ అభ్యర్థికి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ఈవీఎంల తరలింపు ప్రయత్నం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా అధికారులు ఓ స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతని గెలుపునకు కారణమయ్యారంటూ ఫలితాల అనంతరం నుంచి చీరాలలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వివరాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల కోసం తెచ్చిన ఈవీఎంలను ఇప్పటి వరకు చీరాలలో ఉంచడంతో పాటు వాటిని అందరికీ అనుమానం వచ్చే రీతిలో రాత్రి వేళలో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వకుండా రహస్యంగా తరలించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈవీఎంల తరలింపు వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సోమవారం రాత్రి రెవెన్యూ శాఖకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, పోలింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, మున్సిపల్ సిబ్బంది కలిసి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. గది సీల్ తీసే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కళాశాల వాచ్మెన్ తమ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఈ సమయంలో తీసుకెళ్తే తనకు ఇబ్బంది అవుతుందని, ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలన్నాడు. ఎన్నికల డీటీ ఝాన్సీరాణి కూడా వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించనట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ విషయం టీడీపీ, వైఎస్సార్ కార్యకర్తలకు తెలిసింది. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, నాయకులను చూసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రెండు కార్లలో అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ వాహనాల్లో వెంబడించినా వారు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
జనగామ, న్యూస్‌లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుతో నష్టపోయాం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్‌రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు. -
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు. 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు. ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్‌బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
టీడీపీకి ఓటేయలేదని పొట్ట కొడుతున్నారు!
సాక్షి, అనంతపురం : ఎన్నికల హడావుడి ముగిసిందో, లేదో అప్పుడే గ్రామాల్లో ‘రాజకీయాలు’ మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న నెపంతో పలుచోట్ల టీడీపీకి చెందిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొడుతున్నారు. పనులకు అనుమతి నిరాకరిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూలీలు ఉన్నతాధికారులకు వివరిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆనవాయితీ. అయితే.. స్థానికంగానే పనులు కల్పించి వ లసలు ఆపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామాల్లో పనులు మంజూరు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీకి చెందిన సర్పంచులు కక్ష సాధిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకిమద్దతు తెలిపారనే నెపంతో పనులకు ఆమోదం తెలపకుండా వాయిదా వేస్తున్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాప్తాడు మండలం గాండ్లపర్తిలో ఉపాధి పనులు కావాలని కూలీలు రెండు నెలలుగా అడుగుతున్నా గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అనుమతి ఇవ్వడం లేదు. స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో తాము చెప్పిన పార్టీకి కాదని.. మరో పార్టీకి మద్దతు తెలిపారనే కారణంతో కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేది లేక పలువురు కూలీలు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో 3,173 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే రెట్టింపు పనులు కావాలని కూలీలు అడుగుతున్నా గ్రామాల్లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఎన్ని పనులు అడిగితే అన్ని మంజూరు చేసేవారని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించి.. వారి స్థానంలో టీడీపీ సర్పంచులకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్రామాల్లో పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. అప్పుడు వారంతట వారే వెళ్లిపోయేలా వ్యూహాలు రచిస్తున్నారు. మా దృష్టికి వచ్చింది కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉపాధి పనులకు ఆమోదం తెలపడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే.. రాజకీయాలు వేరు, పనులు వేరని ఇప్పటికే ఎంపీడీఓల ద్వారా సర్పంచులకు తెలియజేశాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం. - సంజయ్ ప్రభాకర్, పీడీ, డీడబ్ల్యూఎంఏ -
గజ్వేల్ లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
గజ్వేల్, న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్‌లోనితెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్ఎస్లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే.. కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్‌రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్‌నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. -
జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తా
జహీరాబాద్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ తరఫున జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన భీంరావు బస్వంత్‌రావు పాటిల్ సోమవారం జహీరాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు రాజేష్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జాతీయ రహదారిపై ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కుమార్ హోటల్ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ టాపులేని జీపులో పార్టీ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ఆయన ప్రజలకు అభివాదం చేశారు. ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు డప్పు, వాయిద్య కళాకారులు నృత్యం చేశారు. పలువురు కళాకారులు కూడా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. ర్యాలీలో పార్టీ ముఖ్య నాయకులు కె.మాణిక్‌రావు, ఎం.శివకుమార్, సి.బాగన్న, డి.లక్ష్మారెడ్డి, గౌని శివకుమార్, పి.నర్సింహారెడ్డి, జి.విజయకుమార్, మాణిక్యమ్మ, ఎం.పాండురంగారెడ్డి, ఎండీ యాకూబ్, అలీ అక్బర్, నామ రవికిరణ్, మురళీకృష్ణాగౌడ్, గౌసొద్దిన్, రాములు నేత, మంజులా కౌలాస్, రమాదేవి, రాములునేత, బండి మోహన్, లక్ష్మణ్ నాయక్, శంకర్‌నాయక్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అన్నివిధాల అభివృద్ధి చేస్తా విజయోత్సవ ర్యాలీకి ముందు బీబీ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం తనకు ఆధిక్యతను ఇచ్చిందన్నారు. ప్రజల మద్దతను ఎన్నటికీ మర్చిపోనన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పారిశ్రామికంగానే కాకుండా వ్యవసాయ , ఉపాధి రంగాలపై కూడా దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు మూలంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఆయన హయాంలోనే తెలంగాణ పునర్నినిర్మాణం సాధ్యపడుతుందన్నారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సిద్దిపేట జిల్లా ఏర్పాటు తథ్యం!
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: సిద్దిపేట ప్రాంత వాసుల దశాబ్దాల ఆకాంక్ష త్వరలో నెరవేరనుంది. ప్రత్యేక జిల్లా ఆవిర్భావానికి మార్గం సుగమం కానుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టనుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి. మెదక్ జిల్లాలో సిద్దిపేట అతి పెద్ద పట్టణం. ఇది జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి145 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాం తంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తోంది. జిల్లాస్థాయి అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలోనే ఉండడంతో వివిధ పనులపై అక్కడికి వెళ్లడ ం అనివార్యం. కష్టనష్టాలను భరించి అక్కడికి వెళ్తే సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే మరింత వ్యధ. ఈ పరిస్థితిని దూరం చేసుకోవాలని నాలుగు దశాబ్దాలుగా పాదయాత్రలు, ఆందోళనలు, ప్రముఖులకు విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు ఈ నినాదం మార్మోగి ఆశలను రేపిం ది. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కాగా ఆయన మరణంతో అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ.. 2001 సంవత్సరం నుంచి ప్రతి ప్రధాన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ హమీలిస్తున్నారు. తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించడంతో చిరకాల స్వప్నం సాకారమయ్యే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉండడం.. తెలంగాణలో రెండో స్థానంలో సిద్దిపేట ఉండడం, సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్‌రావు రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారడంతో సిద్దిపేట జిల్లా తథ్యమని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లా.. సిద్దిపేటతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు సైతం జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, రామాయంపేట, తుప్రాన్, గజ్వేల్, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, సిరిసిల్లా, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట, నల్గొండ జిల్లా రాజాపేట, వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతాలను కలిపి సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ప్రతిపాదనలను ఇప్పటికే రూపొందించారు. కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనలు పరిశీలించి యథాతథంగా లేదా స్వల్ప మార్పులతో ఆమోదిస్తే దశాబ్దాల కల కొన్ని నెలల్లోనే నిజం కానుంది. -
జగ్గారెడ్డి దారేది..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా..? అవుననే అంటున్నాయి మారుతున్న రాజకీయ సమీకరణాలు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను సోమవారం అతని నివాసంలో జగ్గారెడ్డి కలుసుకోవడం వెనుక ఆంతర్యమిదేనని చర్చ జరుగుతోంది. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన లోక్‌సభ స్థానానికి ఎన్నికైన నాటి నుంచి 15 రోజుల్లో రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లో మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యం కానుంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ చేతిలో 29 వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన జగ్గారెడ్డి ఇప్పుడు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కేసీఆర్‌నే ఓడిస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు జగ్గారెడ్డి పలుమార్లు సవాలు విసిరడం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోం ది. ఈ క్రమంలోనే ఆయన పవన్ కల్యాణ్ మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక వేళ జగ్గారెడ్డి పోటీకి సిద్ధమైతే, ఏ పార్టీ తరఫున బరిలో దిగుతారన్న అంశంపై ఊహగానాలు రేగుతున్నాయి. ఇంకా జనసేన పార్టీ నిర్మాణం పూర్తి కానందున, పవన్ కల్యాణ్ సహాయంతో బీజేపీ టికెట్ సంపాదించేందుకు జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జగ్గారెడ్డి తెలంగాణకు అవసరమని.. ఆయన సేవలను వినియోగించుకుంటామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. పవన్ అండ లభించేనా..? బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగ్గారెడ్డికి తొలినాళ్లలో ఆ పార్టీ దివంగత నేత ఆలె నరేంద్ర గాడ్ ఫాదర్‌గా ఉండేవారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరాక కూడా నరేంద్ర అండదండలు మెండుగానే ఉండేవి. ఆ తర్వాత కాలంలో కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన జగ్గారెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రులందరితో సన్నిహితంగా మెలిగారు. విలక్షణ వ్యవహార శైలి, వివాదస్పద వ్యాఖ్యలు, దుందుడుకు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. అంతేకాకుండా సీఎంగా ఎవరుంటే వారికి మద్దతుగా ప్రతిపక్షపార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించేవారు. అవసరమైతే సొంత పార్టీ వారినిసైతం వదిలేవారు కాదు. దీంతో టీ-కాంగ్రెస్‌లో ఆయన ఒంటరిగా మిగిలారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత జగ్గారెడ్డి తన దూకుడును తగ్గించుకున్నప్పటికీ సొంతపార్టీ నేతల మద్దకు దక్కలేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అండతో మళ్లీ కొత్తగా జనం ముందుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. -
రాజకీయాల్లోనే ఉంటా
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున చండీగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి పరాజయం పాలైనప్పటికీ బాలీవుడ్ నటి గుల్‌పనాగ్ ఎంతమాత్రం డీలాపడిపోలేదు. ఆప్ నేత అర్వింద్‌తో మున్ముందు కూడా కలసి పనిచేస్తానంది. దాదాపుగా రాజకీయాల్లోనే కొనసాగుతానంటూ అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ఖేర్తో తలపడి పరాజయం పాలైన గుల్‌పనాగ్ తన మదిలో మాట బయటపెట్టింది. కేవలం ఈ ఎన్నికల కోసమే ఇక్కడికి రాలేదని, సుదీర్ఘ కాలం కొనసాగుతానని అంది. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానంది. ‘చండీగఢ్వాసులు తమ ఓటుహక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఈ తీర్పుతో నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నా. నా పట్ల చూపిన అభిమానానికి, నాకు మద్దతుగా నిలిచినందుకు చండీగఢ్వాసులందరికీ ధన్యవాదాలు’ అని అంది. తొలిసారిగా బరిలోకి దిగిన తనకు ఎంతో బాగా సహకరించిందంటూ ఈ మాజీ బ్యూటీ ఆప్‌ను అభినందించింది. ‘కేంద్ర పాలిత ప్రాంతంలో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. నాలుగో వంతు ఓట్లు మాకు వచ్చాయి. అందువల్ల తమ గొంతుకను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని చెప్పింది. ‘భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఉన్నా. ప్రజలు ఎంతో నమ్మకంతో తీర్పు ఇచ్చినందువల్ల ఎన్డీయే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా’ అని అంది. జాతి నిర్మాణంలో మీతోపాటు మీ పార్టీ పాత్ర ఏమిటని ప్రశ్నించగా ‘చండీగఢ్వాసులకు నిరంతరం సేవలందిస్తా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కట్టుబడి ఉంటాను’ అని వివరించింది. -
అటు కారు.. ఇటు ఆటో...
సాక్షి, హన్మకొండ: అనుకున్నట్లే అయింది... ఊహిం చిందే జరిగింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర మాజీ మంత్రి బలరాం విజ యావకాశాలకు దెబ్బకొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన కారు జోరుకు ఆటో వేగం సైతం తోడయ్యింది. ఫలి తంగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యూరు. గత ఎన్నికల సమయానికి జిల్లాలో పెద్దగా ఎవరికి పరిచయం లేకుం డా చివరి నిమిషంలో మహబూబాబాద్ పార్లమెం ట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చున్న బలరాం నాయక్... ఏకంగా కేంద్ర మం త్రి పదవిని దక్కించుకున్నారు. 2014 మార్చిలో ఎన్నికల సీజన్ మొదలయ్యే నాటికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో కాంగ్రెస్ నుంచే కాకుండా ప్రత్యర్థి పార్టీ ల్లో సైతం ఆయనకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కనుచూపుమేరలో ఎవరూ లేరు. మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో బలరాంనాయక్ గెలుపు నల్లేరుపై న డకే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తీరా... ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే సరికి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చేతిలో 30,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దొంతి దెబ్బ ఎన్నికలు సమీపించే నాటికి కేంద్రమంత్రి బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతిమాధవరెడ్డి మధ్య సత్సంబంధా లు ఉండేవి. కాంగ్రెస్ చివరి నిమిషంలో దొంతిని కాదని నర్సంపేటలో కత్తి వెంకటస్వామిని బరిలో నిలిపింది. దీంతో దొంతి మాధవరెడ్డి రెబల్‌గా బరిలో నిలి చి ఆటో గుర్తుపై పోటీ చేశారు. ఆటో, కా రు రెండు గుర్తులు పోలి ఉన్న నేపథ్యం లో ఓటర్లు పొరబడే అవకాశముండడం తో దొంతి మాధవరెడ్డి తన ప్రచారంలో రెండు ఓట్లూ ఆటోకే వేయాలని ముమ్మర ప్రచారం చేశారు. దీర్ఘకాలంపాటు నర్సం పేట కేంద్రంగా రాజకీయాలు నెరిపిన దొంతి తనకంటూ సొంత వర్గాన్ని తయా రు చేసుకున్నారు. పైగా చివరి నిమిషం లో టికెట్ నిరాకరించడంతో ఆయనకు సానుభూతి కూడా తోడయింది. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సైతం దొంతి వెంట న డిచాయి. ఫలితంగా నర్సంపేటలో దొం తి ప్రచారం చేసిన ఆటో గుర్తుకు భారీగా ఓట్లు వచ్చి పడ్డాయి. అసెంబ్లీకి పోటీ చేసిన దొంతి మాధవరెడ్డికి 76,144 ఓట్లు రాగా... కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి కేవలం 6,638 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పార్లమెంట్‌కు సంబంధించి బలరాంనాయక్‌కు కేవలం 13,404 ఓట్లే వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 66,777 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి 75,400 ఓట్లు వచ్చాయి. కానీ... పార్లమెంటుకు వచ్చే సరికి క్రాస్‌ఓటింగ్ జరిగి బలరాంనాయక్‌కు 5,633 ఓట్ల ఆ ధిక్యం వచ్చింది. ఈసారి పరిస్థితి తారుమారై కాంగ్రెస్ ఓట్లు పార్లమెంటు పరిధి లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పా యం చందర్రావుకు పడ్డాయి. ఇక్కడ ఆ యనకు కేటాయించిన ఆటో గుర్తుకు మొ త్తం 60,583 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో తొంభై శాతం దొంతి సానుభూతి పరులవే. ఈ ఓట్లన్నీ బలరాంనాయక్‌కు వచ్చి ఉంటే విజయం ఆయన పక్షానే నిలిచేది. చీలిన లంబాడ ఓట్లు గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్‌కు టికెట్ ఇవ్వగా... మహా కూటమి తరఫున కోయ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అ ప్పుడు చాలా నియోజకవర్గాల్లో లంబాడ ఓట్లు చీలి బలరాంనాయక్‌కు పడ్డాయి. ఇల్లందు, ములుగులో అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి చెందిన కోయ ఎమ్మెల్యే గెలుపొందగా... ఈ రెండు చోట్ల పార్లమెంట్ మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది. కానీ... ఈసారి కాంగ్రెస్తోపా టు టీఆర్ఎస్ లంబాడ వర్గానికి సీట్లు కేటాయించడం బలరాంకు కలిసిరాలేదు. -
ఒకే ఒక్కడు: సీతారాం
వరంగల్, న్యూస్‌లైన్: జిల్లాలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మినహా... తొలి ఎన్నికల అనుభవం పలువురికి చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాత్మక తీర్పునిచ్చిన జిల్లా ఓటర్లు... కొత్త నేతలకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన నేతలకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలున్నారుు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఒక ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 13 మంది ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారే. గత ఎన్నికల్లో పోటీచేసిన అనుభవంతోనే తొలిసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం వారికి సులువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ గాలి వీయడంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు ఆ పార్టీకి దక్కారుు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టి షాకిచ్చి మార్పును కోరుకున్నారు. తొలిసారి పోటీచేసిన వారికి అవకాశం కల్పించకుండా అనుభవానికి, పాతనేతలకే పట్టం కట్టారు. తొలి పోటీ చేదు జ్ఞాపకం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నేతలందరికీ చేదు అనుభవమే మిగిలింది. ఒకే ఒక్కరికి మాత్రం పదవీయోగం దక్కింది. మహబూబాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్‌ను విజయం వరించింది. ఈయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇక జిల్లాలో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ తరఫున ముద్దసాని సహోదర్‌రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమిపాలయ్యారు.గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించినప్పటికీ వరంగల్ పశ్చిమ నుంచి ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి పర్యాయం పోటీచేసిన కపిలవాయి దిలీప్‌కుమార్ ఓటమి చవిచూశారు. భూపాలపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావును జనం ఆదరించలేదు. నర్సంపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి, కత్తి వెంకటస్వామిలకు ఓటమి తప్పలేదు. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బానోతు మోహన్‌లాల్, మహబూబూబాద్, డోర్నకల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తొలిసారి పోటీచేసిన బాలుచౌహాన్, రామచంద్రునాయక్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన రావు పద్మకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఓటమి నుంచి తొలి గెలుపు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ గతంలో పోటీచేసి ఓడిపోయినవారే. జనగామ నుంచి గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గతంలో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. పరకాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గతంలో పరకాల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నర్సంపేట నుంచి విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి గతంలో ఇక్కడే ఓడిపోయారు. మహబూబాబాద్ నుంచి గెలిచిన బానోత్ శంకర్‌నాయక్ గతంలో ఇక్కడే పోటీచేసి ఓటమి చవిచూశారు. వర్ధన్నపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్ గత ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీచేసి ఓడారు. పాతవారికే పట్టం జిల్లా ప్రజలు ఈ సారి సిట్టింగ్‌లకు కోలుకోలేని షాకిచ్చారు. ఇద్దరు టీఆర్ఎస్, ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప, కాంగ్రెస్‌కు చెం దిన సిట్టింగ్‌లందరూ ఓటమిబాటపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో డాక్టర్ రాజయ్య, వినయ్, ఎర్రబెల్లి మాత్రమే విజయం సాధించా రు. అరుుతే జిల్లా ఓటర్లు సిట్టింగ్‌ల మార్పు కోరుకున్నప్పటికీ... పా తవారికే పట్టం కట్టారు. భూపాలపల్లి, ములుగు, డోర్నకల్, వరంగల్ తూర్పులో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మధుసూదనాచారి, చందూలాల్, రెడ్యానాయక్, కొండా సురేఖకు అవకాశం కల్పించా రు. వరంగల్ ఎంపీగా మాజీ మంత్రి శ్రీహరిని గెలిపించారు. -
మా స్వయంకృతాపరాధమే
దేవరకొండ, న్యూస్‌లైన్: ‘నిజాలను చెప్పలేకపోయాం.. అబద్దాలను ఆడలేకపోయాం.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వలేకపోయాం.. ప్రజలను మోసగించలేకపోయాం.. అందుకే ఓటమి పాలయ్యాం.. ఇది మా స్వయంకృతాపరాధమే..’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం తెలంగాణ సాధన కోసం కష్టించి పని చేసిన సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులను ప్రజలు న్యాయంగా గెలిపించాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవించాలని, తన గెలుపు సంతోషకరమే అయినా మిత్రుల ఓటమి బాధ కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, నిర్బంధ విద్యా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు మేకల శ్రీను, చం దంపేట మండల అధ్యక్షుడు గోవిందు, పార్టీ నాయకులు గిరిశేఖర్, జావీద్, ఇద్రిస్, ఆప్కో సత్తయ్య, సైదులు, దేవేందర్, మంజ్యనాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక మోడి సర్కారు పాలసీ చర్యలపై దృష్టి!
కొత్త ప్రభుత్వం మంత్రివర్గ కూర్పుపై కూడా.. * స్టాక్ మార్కెట్ కదలికలపై నిపుణుల అంచనా.. * ఈ వారం సూచీలు స్వల్పశ్రేణిలోనే.. * ప్రస్తుతానికి మార్కెట్లో కొంత కన్సాలిడేషన్‌కు చాన్స్ * కొద్ది వారాలపాటు బులిష్ ధోరణి కొనసాగుతుంది.. న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుస్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో మార్కెట్లలో ఎనలేని జోష్ నెలకొంది. ఇప్పటికే సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు ఎగబాకాయి. ఎన్నికల ఫలితాలు తేటతెల్లం కావడంతో ఇకపై మోడీ సర్కారు ప్రకటించే విధానపరమైన నిర్ణయాలు, కొత్త ప్రభుత్వంలో కేబినెట్ మంత్రుల కూర్పు వంటి అంశాలపైనే మార్కెట్లు దృష్టిసారించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభలో బీజీపీ సొంతంగా 282 సీట్ల పూర్తిస్థాయి మెజారిటీతో చరిత్ర సృష్టించడం, ఎన్డీఏ కూటమికి 336 సీట్ల పటిష్టమైన బలం లభించడం తెలిసిందే. అంతేకాకుండా 30 ఏళ్ల తర్వాత(1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 414 సీట్ల బంపర్ మెజారిటీ లభించింది) ఒక పార్టీ సొంతంగా 272 సీట్ల మేజిక్ ఫిగర్‌ను అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని సంపాదించడం ఇదే తొలిసారి. కొన్నాళ్లు బులిష్‌గానే... ప్రస్తుతానికైతే మార్కెట్లు కొంత స్థిరీకరణ(కన్సాలిడేషన్) దిశగా అడుగులు వేయొచ్చని... అయితే, రానున్న కొద్దివారాలపాటు బులిష్ ధోరణిలోనే ఉండొచ్చని ఆర్కేఎస్వీ బ్రోకరేజి సంస్థ సహ వ్యవస్థాపకుడు రఘు కుమార్ అభిప్రాయపడ్డారు. మోడీ-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిర ప్రభుత్వం కొలువుదీరనున్న అంశాన్ని మార్కెట్లు ఇంకా పూర్తిగా ఫ్యాక్టర్ చేసుకోలేదని... కాబట్టి మరికొంత పుంజుకోవడానికి అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం. ‘ఇప్పుడు సుస్థిర ప్రభుత్వానికి ఢోకాలేదన్న విషయం స్పష్టమైంది. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో సందిగ్ధతకు అవకాశాలు లేనట్టే. ఈ వారంలో పెద్దగా చెప్పుకోదగ్గ పరిణామాలేవీ లేనందున.. స్టాక్ సూచీలు ఇప్పుడున్న స్థాయిలోనే కొంత కన్సాలిడేట్ కావచ్చు’ అని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. మరోపక్క, కేంద్రంలో కీలక మంత్రివర్గ శాఖలు ఎవరికి కేటాయించనున్నారు... కొత్త సర్కారు జూలైలో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై అంచనాలు వంటి అంశాలపైనే ఇప్పుడిక మార్కెట్లు నిశితంగా దృష్టిపెడతాయన్నారు. సంస్కరణలను పరుగులు పెట్టించాలి... ఎన్డీఏ కూటమి దక్కించుకున్న బంపర్ విజయంతో మేనిఫెస్టోలో పేర్కొన్న పాలసీ చర్యలను అమలు చేయడానికి తగినంత అవకాశం లభించినట్లే. దీంతో ప్రభుత్వ ఏర్పాటు, పాలసీపరమైన ప్రకటనలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించనున్నారు. పాలసీ చర్యలను పటిష్టంగా అమలు చేయాలంటే... కేబినెట్ మంత్రులుగా సమర్థులకు పట్టం కట్టాలని, ఇప్పుడు మోడీ సర్కారుకు ఇదే అత్యంత కీలక అంశం కానుందని సిస్టెమాటిక్స్ షేర్స్ సీఈఓ సునిల్ సర్దా వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో సంస్కరణలను మరింత పరుగులు పెట్టించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేలా చేయొచ్చని.. దీనివల్ల దేశ సార్వభౌమ రేటింగ్ కూడా మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు సాకారమైతే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నిధుల ప్రవాహం మరింత పుంజుకుంటుందన్నారు. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ బలపడేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. స్వల్పకాలానికి స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను ఎఫ్ఐఐల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి కదలికలే నిర్ధేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఐటీసీ వంటి దిగ్గజాల ఆర్థిక ఫలితాలు కూడా ఈ వారంలోనే రానున్నాయి. ఎన్డీఐ అఖండ విజయంతో గడచిన శుక్రవారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,470 పాయింట్లు దూసుకెళ్లి 25,000 మార్కును అధిగమించడం తెలిసిందే. అయితే, ఆతర్వాత లాభాల స్వీకరణ జరగడంతో 216 పాయింట్ల లాభంతో 24,122 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం మొత్తంమీద చూస్తే.. సెన్సెక్స్ 1,128 పాయింట్లు ఎగబాకవడం విశేషం. -
కాంగ్రెస్‌లో మళ్లీ రగులుతున్న అసమ్మతి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని తప్పించాలని డీసీసీ నేతల ఒత్తిడి? సాక్షి, బళ్లారి : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ నేతల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. మోడీ ప్రభావంతో బళ్లారి లోక్‌సభ అభ్యర్థి శ్రీరాములు బలమైన నేత కావడంతోనే బీజేపీకి ఘన విజయం లభించిందని పలువురు భావిస్తున్నారు. అయితే బళ్లారి జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్మలాటలు కూడా కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బకు కారణమని ఆ పార్టీలోని నేతలు పేర్కొంటున్నారు. ముందు నుంచి బళ్లారి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంటూనే ఉంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అసమ్మతిని చల్లార్చడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన జిల్లాలో ఒకరిద్దరి మాటలు నమ్ముతూ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పని చేసేది ఒకరైతే, అధికారం చెలాయించేది మరొకరా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, కేసీ కొండయ్యల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బళ్లారి జిల్లాకు ఇద్దరు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. భౌగోళికంగా దావణగెరె జిల్లాలో ఉన్న హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ రవీంద్ర బళ్లారి జిల్లా గ్రామీణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. బళ్లారి జిల్లా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జే.ఎస్. ఆంజనేయులు ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారనే పుకార్లు వస్తున్నాయి. అలాగే బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ కూడా అదే బాటలో నడస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయని నేతలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని లోలోన మదనపడుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పరమేశ్వర్ నాయక్‌ను తప్పించకపోతే తాము ఖచ్చితంగా రాజీనామాలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారు ప్రచారం చేశారే కాని కలిసికట్టుగా చేయలేదని కార్యకర్తలు చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే ఆ పార్టీ నేతలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన విమర్శలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 15 వేల పై చిలుకు మెజార్టీ లభిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి 24 వేల మెజార్టీ లభించదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క బళ్లారి సిటీ నియోజకవర్గమే కాకుండా సండూరు నియోజకర్గం మినహా మిగిలిన 8 అసెంబ్లీ నియోజవర్గాల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ రావడం గమనార్హం. -
టైమ్ పడద్ది
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఎప్పుడెప్పుడు కుర్చీ ఎక్కుదామా అని ఆతృతతో ఎదు రు చూస్తున్న వారికి మరి కొంత కాలం నిరీక్షించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ అలసత్వం కారణంగా మున్సిపల్ ప్రజలకు ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది హఠాత్తుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపట్టి ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ ప్రజలకు ప్రయోజనం లేకపోతోంది. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నిక పూర్తయినప్పటికీ పాలకవర్గాలు కొలువుదీరేందుకు మరికొంత సమయం పట్టనుంది. మున్సిపాలిటీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో అధికారులు చెబుతున్న దాని ప్రకారం జూన్ 2 తరువాతే కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన వారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతనే కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు సమాచారం. మూడున్నరేళ్లుగా... జిల్లాలోని విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల పాలకవర్గాలు 2010 సెప్టెంబర్‌తో ముగిశాయి. అనంతరం ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలించకపోవడంతో నిర్వహించలేదు. దీంతో అప్పటి నుంచి నాలుగు మున్సిపాలిటీల్లో ప్రజలు కనీస మౌలిక వసతులకు నోచుకోని పరిస్థితి ఉంది. పేరుకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించినప్పటికీ ఏ రోజు కూడా అధికారులు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా తమ బాధలను చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లినా కనీసం పట్టించుకున్న సందర్భాలు లేవని ఆయా పట్టణాల ప్రజలు వాపోతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న మున్సిపల్ పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించి... ఈ నెల 12న అధికారులు కౌంటిం గ్ జరిపి విజేతలను ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులు కొత్తపాలకవర్గం ద్వారా సేవలందిస్తారని భావించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు వరకు అది కాస్తా బ్రేక్‌పడింది. అయితే ఆ ఎన్నికల కౌంటిం గ్ కూడా పూర్తయినప్పటికీ ప్రజలకు ఇంకొన్ని రోజులు సమస్యలతో సహవాసం తప్పని పరిస్థితి ఏర్పడింది. ‘ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి’ విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పట్టణంలోని వీటీ అగ్రహారానికి చెందిన డి.చిరంజీవి అన్నా రు. ఆపదలో ఉన్న మహిళ కు రక్తదానం చేసి ఆయన పలువురికి ఆదర్శంగా నిలి చాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కాళీఘాట్ కాలనీకి చెందిన కృష్ణవేణి కొంత కాలంగా గర్భాశయ వ్యాధితో స్థానిక పీవీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమెకు శస్త్రచికిత్స కోసం ఎ పాజిటివ్ గ్రూపు రక్తం అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో వీరి బంధువులు గాంధీ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌ను ఆశ్రయించారు. రవూఫ్ అభ్యర్థన మేరకు చిరంజీవి స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో రక్తదానం చేశారు. ఆపదలో ఆదుకున్న చిరంజీవిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. -
ఆశల పందిరి
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో చాలా ఏళ్ల తరువాత టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టనుండటంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటానికి ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. ఆ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహుల జాబితా కూడా పెద్దగా ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జోరందుకున్నాయి. అయితే సీనియర్లకే మంత్రి పదవులు దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాల భోగట్టా. దీంతోపాటు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇద్దరిని తప్పకుండా మంత్రి పదువులు వరిస్తాయనే ఆశాభావంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండో సారి విజయం సాధించిన ఉండి ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజు(శివ), నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాతకు అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. సామాజిక వర్గాల పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శివకు మంత్రి పదవి ఇవ్వటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉండి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శివ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేశారని, పా ర్టీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు కొట్టేశారని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెంది న బూరుగుపల్లి శేషారావుకు కూడా అవకాశం ఉందనే పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. మంత్రి వర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుందని వినిపిస్తోంది. ఎస్సీ సా మాజిక వర్గానికి చెందిన పీతల సుజాత గతంలో ఆచంట నుంచి విజయం సాధించారు. తాజాగా చింతలపూడి నుంచి అనూహ్యంగా గెలుపొందారు. ఈ సామాజిక వర్గం కోటా కింద ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు తర్వాత మంత్రి పదవుల విషయమై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. -
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!
నంద్యాల, న్యూస్‌లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది. ఫలితం తారుమారైంది నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్‌ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్‌రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు. -
ఆమెకు ఎదురులేదు!
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈ పనులు పురుషులు మాత్రమే చేయగలరనే భావనను చెరిపేస్తూ.. అవకాశమిస్తే తాము దూసుకుపోతామని నిరూపిస్తున్నారు. అవనిలోనే కాదు.. అంతరిక్షంలోనూ ‘ఆమె’ ఎదురులేదని నిరూపిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాజకీయాల్లోనూ వీరి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీరి సంఖ్య అమాంతం పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. 2006కు ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండటంతో జిల్లాలోని 53 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలను మహిళలు కైవసం చేసుకున్నారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు.. బీసీలు ఏడుగురు.. అన్ రిజర్వు కింద ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రిజర్వేషన్ 50 శాతానికి చేరుకున్న నేపథ్యంలో 27 మంది మహిళలు జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలు 1, ఎస్సీలు 5, బీసీలు 11, అన్ రిజర్వు కింద 10 స్థానాలను మహిళలకే కేటాయించారు. గత నెల 6, 11 తేదీల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ స్థానాల్లో మహిళలు విజయఢంకా మోగించారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 14 మంది మహిళలు.. టీడీపీ తరఫున 11, కాంగ్రెస్ తరఫున 1, ఆర్పీసీ తరఫున ఒకరు జెడ్పీ పాలనలో భాగస్వాములు కానుండటం విశేషం. టీడీపీ మహిళా జెడ్పీటీసీలు వి.సరస్వతి(కల్లూరు), ఎం.లక్ష్మిదేవి(క్రిష్ణగిరి), పి.జగదీశ్వరమ్మ(గోస్పాడు), నారాయణమ్మ(పాణ్యం), వెంకటలక్ష్మమ్మ(రుద్రవరం), పి.సుశీలమ్మ(ఆస్పరి), సరస్వతి(దేవనకొండ), లక్ష్మి(కౌతాళం), పుష్పావతి(నందవరం), ఈ.సుకన్య (పత్తికొండ), కె.వరలక్ష్మి(తుగ్గలి). కాంగ్రెస్, ఆర్పీఎస్ మహిళా జెడ్పీటీసీలు జి.శారదమ్మ(కోడుమూరు), రాధమ్మ(పగిడ్యాల). వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీలు ఎం.పద్మావతమ్మ(బేతంచెర్ల), బి.కె.నాగజ్యోతి(గూడూరు), ఎం.కె.మాధవి(కర్నూలు), చింతకుంట లక్ష్మి(నందికొట్కూరు), బి.అశ్వర్థమ్మ(బండిఆత్మకూరు), టి.నాగమ్మ(చాగలమర్రి), వై.సరస్వతి(కొలిమిగుండ్ల), ఎం.లక్ష్మిదేవి(నంద్యాల), గోపిరెడ్డి సుభద్రమ్మ(ఉయ్యాలవాడ), రాములమ్మ(గోనెగండ్ల), కె.గంగమ్మ (హొళగుంద), దళవాయి మంగమ్మ(కోసిగి), రేణుకాదేవి(పెద్దకడుబూరు), జయమ్మ(ఎమ్మిగనూరు). -
టీజీ నిర్వేదం
కర్నూలు, న్యూస్‌లైన్: ఓటమితో టీడీపీ నేతల్లో నిర్వేదం నెలకొంటోంది. ఓటర్లకు పంపిణీ చేయమని అందించిన డబ్బు సక్రమంగా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమంటూ కర్నూలు నియోజకవర్గ ‘దేశం’ అభ్యర్థి టి.జి.వెంకటేష్ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. నగరంలోని మౌర్యఇన్ హోటల్లో ఎమ్మెల్యే కార్యాలయం పేరిట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని ఎత్తేసి అందులోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. ఇకపై సేవలకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వెలువడే చివరి నిముషం వరకు గెలుపు ఆశతో ఉన్న టీజీ.. ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో నగర ప్రజలు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.వి.మోహన్‌రెడ్డికి ప్రజలు పట్టంకట్టారు. ఓటమిని జీర్ణించుకోలేని టీజీ తీవ్ర నిర్వేదానికి లోనై తన పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దాదాపు 25 మంది మాజీ కార్పొరేటర్లు టీజీకి అనుచరులుగా ఉన్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వారికి భారీ మొత్తమే అందజేసినట్లు వినికిడి. అయితే అందులో సగం కూడా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి టీజీ వచ్చినట్లు ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని నలుగురు మాజీ కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా 9 రౌండ్లలో ఎస్వీకి ఆధిక్యం లభించగా.. 7 రౌండ్లలో టీజీ ముందున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరులపై విచారణ జరిపించగా.. అక్కడ డబ్బు పంపిణీ జరగలేదనే విషయం బయటపడటంతో ఆయా ప్రాంతాల ద్వితీయ శ్రేణి నాయకులపై టీజీ మండిపడినట్లు సమాచారం. ప్రకాష్‌నగర్, ఎన్.ఆర్.పేట, బుధవారపేట, జొహరాపురం, గరీబ్‌నగర్, జమ్మిచెట్టు ప్రాంతం, గాంధీ నగర్, కప్పల్‌నగర్, డాక్టర్ గఫార్ వీధి ప్రాంతాల్లో ఎస్వీ కంటే టీజీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2, 3, 5, 8, 12, 13, 14 రౌండ్లలో మాత్రమే టీజీకి మెజార్టీ లభించింది. 1, 4, 6, 7, 9, 10, 11, 15, 16 రౌండ్లలో ఎస్వీ హవా నడిచింది. ఆయా ప్రాంతాల్లో డబ్బు ఎవరికి పంపిణీ చేశారు.. వారి జాబితాతో ఫోన్ నెంబర్లు ఇవ్వండి.. స్వయంగా నేనే మాట్లాడతానంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ కార్పొరేటర్లను టీజీ నిలదీస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొందరు కేబుల్ ఆపరేటర్లు కూడా డబ్బు సక్రమంగా పంపిణీ చేయలేదని అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం. -
వీరవరం గరంగరం
కిర్లంపూడి, న్యూస్‌లైన్ : తనకు ఓట్లు తక్కువ పడ్డాయనే అక్కసుతో స్వగ్రామంలో దాడులకు బరి తెగించిన మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరశన దీక్షలు చేపట్టారు. తోట స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో టీడీపీ కన్నా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో విచక్షణ కోల్పోయిన నరసింహం, ఆయన వర్గీయులు శుక్రవారం రాత్రి విజ యోత్సవ ర్యాలీలో, శనివారం వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు దిగి, గాయపరిచారు. అది జరిగి 24 గంటలైనా పోలీసులు నరసింహంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులైన తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు, గరగా భీమరాజు, గంగారావు ఆదివారం గ్రామకూడలిలో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి నిరశన దీక్ష చేపట్టారు. పలువురు గ్రామస్తులు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. జగ్గంపేట సీఐ సుంకర మురళీమోహన్, కిర్లంపూడి ఎస్సై సి.హెచ్.విద్యాసాగర్ ఆందోళన విరమించాలని నచ్చచెప్పబోయారు. అయితే తమ ఇళ్లపైకి వచ్చి దాడి చేసిన ఎంపీ తోటపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తేల్చిచెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా వీరవరం చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపారు. చివరికి రెండురోజులు వ్యవధి ఇస్తే ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. దాంతో జ్యోతుల ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ ఆందోళనలో తోట ఈశ్వరరావు, తోట సర్వారాయుడు, వీర వెంకట సత్యనారాయణమూర్తి, తోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు. హామీ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు : జ్యోతుల ఆందోళన విరమణ అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై గౌరవం, నమ్మకం ఉన్న తాము సీఐ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించామన్నారు. రెండు రోజుల్లో నరసింహంపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మెట్ట ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నేతలు సీమ సంస్కృతిని తెస్తున్నారన్న ఎంపీ నరసింహం ఆరోపణను ఖండించారు. ఓట్లు వేయలేదనే కక్షతో ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించినది ఆయనేనని అందరికీ తెలుసన్నారు. భారీగా పోలీసు బలగాల మోహరింపు ఎలాంటి ఉద్రిక్తతలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరవరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు. జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. కొంత మంది ముఖ్య నేతలతో పాటు కింది స్థాయి కార్యకర్తలు కూడా కెప్టెన్ మారితే మంచి రోజులు వస్తాయని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమి దారుణంగా చతికిలబడిపోవడంపై లోలోన మధన పడుతున్నారు. బీహర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పార్టీ చెత్త ప్రదర్శన కనబరచడంతో ఆ పార్టీకి చెందిన సీఎం నితీశ్ పదవికి రాజీనామా చేసినట్టుగానే ఇక్కడ కూడా పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీ నామా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటు సొంతపార్టీలోని నేతలతో పాటు ప్రతిపక్ష నాయకు లు సీఎం రాజీనామా చేయాలనే పట్టుబడుతున్నా రు. అయితే చవాన్ మాత్రం సీఎం పదవిని వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తొందర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను మార్చకపోవచ్చనే ధీమా లో పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. ఎన్నాడూ లేని ఓటమి... గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఓడిపోలేదు. ఆగస్టు ఆఖరు, లేకుంటే సెప్టెంబరులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజా పరి ణామాలను పరిగణనలోకి తీసుకోని ముఖ్య నేతను మార్చాలనే పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నా రు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయా న్ని తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఓటమిపై సమీక్షించనున్న అగ్రనేతలు పనిలోపనిగా రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించే అవకాశం కనబడుతోంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో అంత తొందరగా చవాన్‌ను మారుస్తారా? అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మార్పులకు పట్టు... లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి కాంగ్రెస్‌లో పెను మార్పులు చేయాల్సిన అసరముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కొంకణ్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పరిశ్రమల శాఖ మంత్రి పదవీకి రాజీనామా చేసిన నారాయణ్ రాణే శనివారం సాయంత్రం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ అయి దాదాపు అర గంటసేపు చర్చించారు. తమకు లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించని అధిష్టానం ఈసారైనా అసెంబ్లీకి ఆ అవకాశమివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. నాందేడ్ లోక్‌సభ నుంచి గెలిచి న మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా అసెంబ్లీ ప్రచా ర బాధ్యతలు తీసుకోవాలని ఉవ్విళూరుతున్నారు. సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెళితే మొదటికే మోసం వస్తుం దనే వాదనను వినిపిస్తున్నారు. ఇలా పార్టీలోని నేతలంతా ఒకేబాటన ఉండకపోవడం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరింత దెబ్బతీసే అవకాశముం టుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనూహ్య మార్పులు చేసినా, అది ప్రజల్లోకి ఎలాం టి సంకేతాలు తీసుకెళుతుందన్న అంతర్మథనంలో అధిష్టానం ఉంది. దీంతో సీఎం చవాన్‌ను మార్చే అవకాశం ఉం డకపోవచ్చని వాదన వినవస్తున్నా... ఏ సమయం లో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఏమై నా జరగవచ్చన్న ఆశలో సీఎం ప్రత్యర్థులు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో మిగతా 6వ పేజీలో ఠసీఎంకుసెగ కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజీనామా కోరే హక్కు లేదు: పీసీసీ లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలన్న నైతిక హక్కు బీజేపీకి లేదని పీసీసీ అధికార ప్రతినిధి బస్వరాజ్ పాటిల్ నగ్రల్కర్ అన్నారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవసరం ఆ పార్టీకి లేదని తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు తమల్ని ఎన్నుకున్నారని, అలాం టప్పుడు వాళ్లను అవమానించేలా మేం ఎందుకు వ్యవహరిస్తామని బీజేపీని నిలదీశారు. -
ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులే!
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ), అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో వెల్లడైంది. మొత్తం 543 ఎంపీలకు 541 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను న్యూ, ఏడీఆర్ పరిశీలించాయి. వారిలో 186 మందిపై (మొత్తం ఎంపీల్లో 34 శాతం మంది) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ 186 మంది ఎంపీల్లో 112 మంది (21 శాతం మంది)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. పార్టీలవారీగా చూస్తే బీజేపీ నుంచి ఎన్నికైన 281 మంది ఎంపీల్లో 98 మంది (35 శాతం మంది) ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. అలాగే శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 15 మంది, 44 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 8 మంది, 34 మంది తృణమూల్ ఎంపీల్లో ఏడుగురు, 37 మంది అన్నాడీఎంకే ఎంపీల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 30 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 34 శాతానికి పెరిగింది. -
నామమాత్రంగా మిగిలిన వామపక్షాలు
బెంగాల్లో కోలుకోలేని రీతిలో కుదేలు దారుణంగా పడిపోయిన ఓట్ల శాతం న్యూఢిల్లీ: వామపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగా మిగిలాయి. ఇదివరకు ఎన్నడూ లేనంత దారుణంగా చతికిలపడ్డాయి. వామపక్షాలకు 15వ లోక్‌సభలో 24 స్థానాలు ఉండగా, 16వ లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పది స్థానాలకే పరిమితమయ్యాయి. వామపక్ష కూటమిలోని అన్ని పార్టీలకూ గత ఎన్నికలతో పోలిస్తే, ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా క్షీణించింది. గత 2009 ఎన్నికల్లో సీపీఎంకు 5.33 శాతం ఓట్లు లభించగా, ఈసారి 3.2 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. సీపీఐ ఓట్ల శాతం 1.43 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోగా, ఆరెస్పీ 0.3 శాతం ఓట్లకు, ఫార్వర్డ్ బ్లాక్ 0.2 శాతం ఓట్లకు పరిమితయ్యాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం తొమ్మిది స్థానాలను దక్కించుకోగా, సీపీఐకి ఒక్కటే దక్కింది. కేరళ నుంచి ఆరు, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ల నుంచి రెండేసి స్థానాలు ఈసారి వామపక్షాలకు లభించాయి. వామపక్షాలకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్లో ఈసారి అవి అధికార తృణమూల్ కాంగ్రెస్ తాకిడికి కోలుకోలేని రీతిలో కుదేలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ను 34 ఏళ్లు పరిపాలించిన వామపక్ష కూటమికి ఇది దారుణ పరాభవం. బెంగాల్‌లోని ఓట్లనే లెక్కలోకి తీసుకుంటే, సీపీఎంకు 22.7 శాతం, సీపీఐకి 2.3 శాతం, ఆరెస్పీకి 2.4 శాతం, ఫార్వర్డ్ బ్లాక్‌కు 2.1 శాతం ఓట్లు లభించాయి. మొత్తంగా వామపక్ష కూటమికి రాష్ట్రంలో 29.5 శాతం ఓట్లు లభించాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచే 15 స్థానాలను గెలుచుకున్న వామపక్షాలకు ఈసారి రెండు మాత్రమే దక్కాయి. త్రిపుర మాత్రమే పదిలం మరోవైపు కేరళలో ఎల్డీఎఫ్ నుంచి వెలుపలకు వచ్చిన ఆరెస్పీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో చేరి ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆరెస్పీ అభ్యర్థి చేతిలో సీపీఎం మాజీ ఎంపీ ఎంఏ బేబీ మట్టికరిచారు. త్రిపురలో వచ్చిన ఫలితాలు మాత్రమే సీపీఎంకు కొంత ఊరట. రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలనూ సీపీఎం 5 లక్షలు, 4.8 లక్షల పైచిలుకు ఆధిక్యతతో ఆ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. -
ముస్లిం ఎంపీలు 23 మందే!
కొలువు తీరనున్న కొత్త లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం మరింత తగ్గింది. గత లోక్‌సభలో 30 మంది ముస్లిం సభ్యులుండగా, ఈ ఎన్నికల్లో 23 మంది ముస్లింలే గెలుపొందారు. వీరిలో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా మూడో సారి గెలుపొందిన అసదుద్దీన్ ఒవైసీ ఒకరు. అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రానున్న బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. 80 ఎంపీ సీట్లు, గణనీయ స్థాయిలో ముస్లింలు(19%) ఉన్న యూపీ నుంచి కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీలో నిలపలేదు. రాష్ట్రాలవారీగా పశ్చిమబెంగాల్ నుంచి 8 మంది, బీహార్ నుంచి నలుగురు, కేరళ నుంచి ముగ్గురు, జమ్మూకాశ్మీర్ నుంచి ముగ్గురు, అస్సాం నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, లక్షద్వీప్‌ల నుంచి ఒక్కొక్కరు లోక్‌సభలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
61 మంది మహిళా ఎంపీలు
గత లోక్‌సభ కన్నా 16వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగింది. 2009 ఎన్నికల్లో 59 మంది మహిళలు ఎంపీలవగా.. ప్రస్తుతం 61 మంది మహిళలు(11%) లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. మహిళలు కోరుతున్న 33% ప్రాతినిధ్యానికి ఇది చాలా తక్కువ. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది, లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. అయితే, ఇప్పటివరకు అధిక సంఖ్యలో మహిళా సభ్యులను కలిగి ఉన్న లోక్‌సభ ఇదే కావడం విశేషం. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, ఉమాభారతి, డింపుల్‌యాదవ్, హేమమాలిని, మున్‌మున్‌సేన్.. తదితరులు ఈ ఎన్నికల్లో గెలిచినవారిలో ఉన్నారు. ్ఞ నూతన లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యుల్లో 55 ఏళ్ల వయసు దాటినవారు 47% ఉండగా, 40 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న ఎంపీలు 71 మంది ఉన్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణపై అభినందనలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు సమర్థవంతంగా నిర్వర్తించిన కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రమోద్కుమార్లను ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ వారి చాంబర్లలో కలిసి అభినందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటింగ్ విషయంలో జిల్లాను ముందు వరుసలో ఉంచారన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వర్తించారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గంటన్నరలోపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించి జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక చొరవను ప్రశంసించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని అభినందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బండి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకులు ఏ స్వాములు, పీ మదన్మోహన్, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎస్ఎన్ఎం వలి, ఐసీహెచ్ మాలకొండయ్య, కే శివకుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే పద్మకుమారి,కార్యదర్శి ఎన్వీ విజయలక్ష్మి తదితరులున్నారు. -
హస్తం అదృశ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో గత ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జిల్లాలో 12 శాసనసభా నియోజకవర్గాలుండగా..నాడు 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన ఆ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి వంటి వాళ్లు అనేక మంది వచ్చి ప్రచారం చేశారు. అంత చేసినా..కనిగిరి తప్ప ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వేల ఓట్లు కూడా సంపాదించలేకపోయారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కనిగిరిలో 2603 ఓట్లు పోలవ్వగా.. కనిష్టంగా కందుకూరులో 641 ఓట్లు వచ్చాయి. ఒంగోలులో 1424, అద్దంకిలో 1387, గిద్దలూరులో 1933, దర్శిలో 1177, మార్కాపురంలో 1550, యర్రగొండపాలెంలో 1322, కొండపిలో 1081, పర్చూరులో 1275 ఓట్లు, సంతనూతలపాడులో 1263, చీరాలలో 974 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇటువంటి ఓటింగ్ పొందిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. పోటీ చేసిన వారికి ప్రచారం కోసం నిధులిస్తారని భావించి కొంత మంది ముందుకొచ్చారు. అయితే అదికూడా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ప్రచారం సైతం చేయకుండా ఇంట్లో కూర్చున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చిరంజీవి గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆయన సభలకు వచ్చారు. ఈ ఎన్నికలకు జనం లేక కొన్ని సభలను రద్దు చేసుకుని చిరంజీవి వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ పుంజుకుంటుందని, ఈ ఎన్నికల్లో సమస్యలేర్పడినా..వచ్చే ఎన్నికల సమయానికి ఊపందుకుంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. టీడీపీ పాలనకు ప్రజలు భయపడే రోజులు దగ్గరలోనే ఉందని, దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకుంటుందని అంటున్నారు. -
సైకిల్ స్పీడుకు పడమటి గాలి బ్రేక్
మార్కాపురం, న్యూస్‌లైన్ : ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థులు ఎవరైనా.. గెలుపు మాత్రం వైఎస్సార్ సీపీదే. పశ్చిమ ప్రకాశం ప్రజల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు ఓట్ల రూపంలో కనబరిచారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గతేడాది మేలో జరిగిన సొసైటీ ఎన్నికలు, జూన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులు ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ఒంగోలు ఎంపీగా వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డికి ప్రజలు మంచి మెజారిటీ అందించారు. మార్కాపురం నియోజకవర్గంలో వైవీ సుబ్బారెడ్డికి 81,347 ఓట్లు రాగా, టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 73,038 ఓట్లు వచ్చాయి. దీంతో వైవీ మార్కాపురం నియోజకవర్గంలో 8,309 ఓట్ల మెజారిటీ సాధించారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 91,881 ఓట్లు రాగా టీడీపీకి 79,985 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 11,896 ఓట్ల మెజారిటీ వైవీ సుబ్బారెడ్డికి లభించింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 85,123ఓట్లురాగా టీడీపీ అభ్యర్థికి 65,467 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైవీకి 19,656 ఓట్ల మెజారిటీ వచ్చింది. పశ్చిమ ప్రాంతంలో ఫ్యాన్ స్పీడుకు సైకిల్ బ్రేకులు వేయలేకపోయింది. ఎన్నికలు ఏవైనా ప్రజలు మాత్రం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సగర్వంగా గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
అది ప్రజా తీర్పుకాదు...
చీరాల, న్యూస్‌లైన్: చీరాల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో నవోదయం పార్టీ తరుఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపు ప్రజాతీర్పు కాదని టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావు ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ నాటి నుంచి చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్డీఏ పీడీ పద్మజ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి రౌండు ఫలితం వెల్లడించాల్సి ఉండగా ఎనిమిది రౌండ్ల వరకు మాత్రమే ప్రకటించారన్నారు. ముందు ఒక మెజార్టీని ప్రకటించి కొంత సమయం తరువాత 11వేల మెజార్టీ ఆటో గుర్తు అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌కు వచ్చినట్లుగా చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అలానే పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు తాళాలు లేకుండా తెచ్చారని ఆరోపించారు. అందులో 200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆటో గుర్తుకే వచ్చాయని, ఇది ఎలా సాధ్యపడిందన్నారు. ఇదే విషయాన్ని ఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 60 ఈవీఎంలు తారుమారు అయ్యాయని, ఇవి టీడీపీకి పట్టున్న పాపాయిపాలెం, దేవాంగపురి, ఈపూరుపాలెం గ్రామాలవని అన్నారు. అందులో టీడీపీకి అతి తక్కువ ఓట్లు రావడం అనుమానాలకు తావిస్తుందన్నా రు. ఈవీఎంలకు ఉండాల్సిన నంబర్లు, చీటీల నంబర్లు, ఎన్నిక జరిగిన రోజు ఉన్న నంబర్లుకు తేడా ఉందన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ ఆర్వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టి రీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు చీరాల అర్బన్, న్యూస్‌లైన్: చీరాలలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు గడియారం స్తంభం సెంటర్‌కు చేరుకున్నారు. చీరాల అసెంబ్లీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ కార్యకర్తలు బాహాటంగా విమర్శలకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో వెంటనే ఒన్ టౌన్, టూ టౌన్ సీఐలు రంగప్రవేశం చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకూడదంటూ పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం టీడీపీ వర్గీయులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
మోదం..ఖేదం
సాక్షి,ఒంగోలు:సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములకు దారితీసిన అంశాలను రాజకీయ పార్టీలు అంతర్గతంగా విశ్లేషించుకుంటున్నాయి. ఓడిపోవడానికి కారణమైన అంశాలను ఆరాతీస్తూ.. ప్రధాన రాజకీయ పార్టీలు కుమిలిపోతున్నాయి. నేతల మధ్య సమన్వయ లోపం..గెలుపుధీమాపై మితిమీరిన ఆత్మవిశ్వాసం వంటి అంశాలే అభ్యర్థుల ఓటమికి కారణమని సీనియర్లు తేల్చిచెబుతుండగా... సామాజికవర్గ ఓట్ల ప్రభావంతో అందివచ్చే గెలుపు అవకాశాలను కూడా చేజార్చుకున్నామని బాధిత అభ్యర్థులు పశ్చాత్తాప పడుతున్నారు. ఇదేక్రమంలో నియోజకవర్గాల్లో తమ విజయానికి కలిసొచ్చే అంశాల్ని సైతం తెలిసిమరీ విస్మరించారనే వాస్తవాల్ని ప్రధాన రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, వాటిల్లో ఒక లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కగా.. మరొకటి టీడీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీల్లో ఆరు నియోజకవర్గాలను వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా, టీడీపీ మాత్రం ఐదు స్థానాలకు పరిమితమైంది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పాగావేశాడు. ఆయా రాజకీయ పార్టీలు గెలుపోటములు సహజమని భావిస్తున్నప్పటికీ, నియోజకవర్గాల ఓటర్లు ఇచ్చిన తీర్పును ఎవరికి వారు విశ్లేషించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే శనివారం నేతలంతా కలిసి ప్రయివేటు సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్‌బూత్‌ల వారీగా.. పోలయిన ఓట్లతో పాటు రౌండ్లవారీ ఫలితాలను సమీక్షించుకుంటున్నారు. ఈ ప్రకారంగా ఏఏ ప్రాంతాల పోలింగ్‌బూత్‌ల్లో తమకు పడిన అనుకూల, ప్రతికూల ఓటింగ్‌ను బట్టి ఓటమికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నారు. అయితే, జిల్లా ఓటర్లు మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ‘నువ్వా..నేనా..?’ అని పోటీపడిన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు పెద్ద రాజకీయ అనుభవం నేర్పాయని..అంశాలవారీగా గుణపాఠం చెప్పినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సత్తా చాటిన వైఎస్సార్ సీపీ.. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సాధారణ ఎన్నికల బరిలో నిల్చొన్న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలో తన సత్తా చాటుకుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సగం స్థానాలు (సంతనూతలపాడు, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు) కైవసం చేసుకుంది. దర్శి, పర్చూరు, చీరాల, కొండపి, ఒంగోలు, కనిగిరి స్థానాల్లో ఓటమి పాలైంది. ఇప్పటికే జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన వైఎస్సార్ కాంగ్రెస్ తాజాగా, ఆరు స్థానాల్లో పార్టీ జెండాను రెపరెపలాడించడంతో జిల్లాలో ఆ పార్టీ అధికార బలం పెరిగింది. ఇదిలాఉంటే, ఓటమికి దారి తీసిన అంశాల్లోకొస్తే.. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లినప్పటికీ, ఓటర్లను ప్రలోభపెట్టడంలో టీడీపీతో పోటీ పడలేకపోయామని అంగీకరిస్తున్నారు. ఆర్థిక బలం చాలకపోవడం.. ప్రత్యర్థులు కొన్నిప్రాంతాల ఓటర్లను ఎంచుకుని మరీ భారీగా మద్యం పంపిణీ చేయించినట్లు తెలుసుకుని బాధపడుతున్నారు. దీంతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు ఎవరికి వారు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల ప్రచారానికే పరిమితమవడం... ఇతరుల గెలుపునకు సహకరించకపోవడం పెద్దసమస్యగా పరిణమించిందని పరిశీలకులు వివరిస్తున్నారు. పశ్చిమాన్ని వదిలేసి చేతులెత్తేసిన టీడీపీ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టీడీపీ సత్తా చాటకపోవడం స్వయంకృతాపరాధమేనంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఆ ప్రాంత నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం..ఎవరికి వారు తమకేం పట్టిందని నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అక్కడ నాయకత్వ లోపమే ఓటమికి పనిచేసింది. ఫలితంగా మార్కాపురం సహా పశ్చిమప్రాంతమంతా టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందనేది పార్టీవర్గాల వాదన. పరిషత్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది కూడా పార్టీ నేతల వైఖరేనని ఘంటాపథంగా చెబుతుండటం గమనార్హం. సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిగా బీఎన్ విజయ్‌కుమార్ కాంగ్రెస్‌ను కాదని వచ్చినా ఫలితం దక్కలేదు. అతనికి సీటిచ్చినట్లు ప్రకటించిన మరుసటిరోజే.. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి పొత్తుల్లో భాగంగా కట్టబెట్టామనడం.. మరలా అతను పోటీలో ఉంటారనడం ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. అతనికి పార్టీసహకారం అందించలేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు తెలిసిందే. కందుకూరులోనూ ఓటర్లను ఆకర్షించలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీచేసిన కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ప్రతికూల ఓటింగ్‌ను గుర్తించకపోవడం ఓటమికి దారి తీసిందని అంచనావేస్తున్నారు. చీరాలను చేజేతులా స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టడంలో పోతుల సునీతకు స్థానిక పార్టీ నాయకత్వం వెన్నుపోటు పొడిచిందని చెబుతున్నారు. -
మాజీ స్పీకర్‌కు కలిసి రాని ఆర్మూర్
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ‘బాల్కొండలో పోటీ చేసినప్పుడు గెల్సిన సురేశ్‌రెడ్డి.. ఆర్మూర్‌కు వచ్చేసరికి ఓడిపోతున్నడు.. ఆయనకిక్కడ కలిసొస్తలేదు..’ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి బా ల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి గురించి ఇవే మాట లు వినిపిస్తున్నాయి. నాలుగు పర్యాయాలు బా ల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలి చిన చరిత్ర.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఎదిగిన అనుభవం.. కానీ 2009 నియోజకవర్గ పునర్విభజన అనంతరం కీలక సమయాల్లో ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణుల్లో, ఆయన అనుచరుల్లోనే ఆయనపై అపనమ్మకాన్ని పెంచాయి. ఇలాంటి తరుణంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసిన సురేశ్‌రెడ్డికి ఇక్కడి ఓటర్లు చేదు అనుభవాన్నే మిగిల్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి చిన్ననాటి మిత్రుడే అయినా ఆర్మూర్ అభివృద్ధికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యా రనే అపవాదు ఉంది.బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1989 నుంచి 2004 శాసన సభ ఎన్నికల వరకు వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, శాసన సభ స్పీకర్ కూడా అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజన అనంతరం 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. ఆయన నిర్ణయం తీసుకున్నంత వేగంగా పార్టీలో పరిస్థితులు మారకపోవడంతో ఓటమి తప్పలేదు. ప్రజారాజ్యం విలీనంతో 2009లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈరవత్రి అనిల్, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో సురేశ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు ఆర్మూర్ సరైంది కాదని, తిరిగి బాల్కొండకు వెల్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి, అప్పటి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి శనిగరం శ్రీనివాస్‌రెడ్డితో సురేశ్‌రెడ్డి చర్చలు జరిపారు. బాల్కొండ మండలం పోచంపాడ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాము నియోజకవర్గాల మార్పు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను మళ్లీ బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని సురేశ్‌రెడ్డి ప్రకటించారు. ఇంతలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ మార్పులతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో బాల్కొండ నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. ప్రభుత్వ విప్ పదవి సైతం దక్కింది. చేసేది లేక సురేశ్‌రెడ్డి మళ్లీ ఆర్మూర్బాట పట్టారు. మళ్లీ ఓడారు. చేసిందేమి లేదు వివాదరహితుడిగా పేరున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి సురేశ్‌రెడ్డి చేసింది పెద్దగా ఏంలేదనే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే చేస్తుంటారు. మొన్న ఆర్మూర్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అవి స్థానికంగా పోటీలో నిలిచిన వ్యక్తులకు ఉన్న పలుకుబడితో పడ్డ ఓట్లేనని చెబుతున్నారు. -
విజయం అమరులకు అంకితం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో పూర్తి మెజార్టీ ఇచ్చి తమపై విశ్వాసం ఉంచిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామన్నారు. ఈ అఖండ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటిం చారు. శనివారం నిజామాబాద్‌లోని టీఆర్ఎస్ జిల్లా కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కవిత మాట్లాడారు. 1984 తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చారన్నారు.ప్రజల దీవెనలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉండటంతోనే ఇది సాధ్యమైందని, జిల్లా సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ బాధితులు, బీడీకార్మికులు, తాగునీరు, సాగునీరు, ఇలా జిల్లాలో చాలా సమస్యలున్నాయని, ప్రజలు ఇచ్చిన స్వీప్ మెజార్టీని వివరించి అవసరమైతే కేసీఆర్‌ను 10 శాతం అదనపు నిధులు జిల్లాకు కేటాయించాలని కోరుతామన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఐదేళ్లలో అమలు చేసి తీరు తామని స్పష్టం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చుతారన్నారు. తెలంగాణ జిల్లాలలోనే ఇందూరును ఆదర్శంగా ఉండేలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో హైదరాబాద్‌కు పార్టీ కార్యాలయానికి తీసిపోకుండా ‘తెలంగాణ భవన్’ను నిర్మిస్తామని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకుడు డీఎస్ నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధిని అడ్డుకున్న డీఎస్‌కు ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెప్పారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అ భివృద్ది నిరోధకుడైన ధర్మపురి శ్రీనివాస్‌ను ఓడించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేదని, అయితే టీఆర్ఎస్, కేసీఆర్ ద్వారా ఆ కోరిక నెరవేరిందన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సమస్యలపై అవగాహన ఉన్న నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, జిల్లా అభివృద్ధికి ఇక ఢోకా ఉండదని అన్నారు. పట్టం కట్టిన ప్రజలను మరవలేం ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా, చివరకు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఉద్యమంపైనే ప్రజలు విశ్వాసం ఉంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. గాంధేయవాద ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన కేసీఆర్‌తోనే ‘తెలంగాణ’ సాధ్యమైందని భావించిన ప్రజలు ఇతర పార్టీలను పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో అసలు టీఆర్ఎస్కు పట్టు లేదని, గెలుపు కష్టమని కొందరు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు తనను గెలిపించి దీటైన జవాబు చెప్పారన్నారు. ఇక్కడి ప్రజలకు సర్వత్రా రుణపడి ఉంటానని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా పరిశీలకులు బాపూరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి పాల్గొన్నారు. -
సచివులు ఎవరో?
గులాబీ దళపతి కేసీఆర్ కొలువులో అమాత్యులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం తొలి కేబినెట్లో జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ చర్చ సర్వత్రా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వెలువడిందే తడువుగా శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం, ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరే కేసీఆర్ మంత్రివర్గంలో జిల్లా నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం దక్కుతుందనే అంశం చర్చనీయాంశగా మారింది. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొందరు సీనియర్ల పేర్లను ప్రకటించారు. మోతె గ్రామంలో మట్టిముడు పు విప్పిన ఆయన రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డిలాంటి సీనియర్లకు మంత్రిగా అవకాశం ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నా రు. డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో బాజిరెడ్డి గోవర్ధన్‌ను డైనమిక్ లీడర్‌గా పేర్కొ న్న కేసీఆర్ ఆయనను గెలిపిస్తే తెలంగాణ స్థాయిలో పెద్ద పదవి కట్టబెట్టబెడతానని హామీ ఇచ్చారు. గోవర్ధన్‌కు కూడ సీనియర్ నేతగా రాజకీయ అనుభవం, జిల్లా మీద మంచి పట్టు కూడా ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి నాలుగోసారి ఎల్లారెడ్డి నుంచి గెలుపొందారు. ఆయన పేరు కూడ మం త్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉంది. రేసులో గంప గోవర్ధన్, హన్మంత్ సింధే జిల్లాలో మొత్తం స్థానాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందడటం, పలువురు మంత్రి పదవిని ఆశిస్తుండడం పార్టీలో తర్జనభర్జనలకు కారణమవుతోంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్, రవీందర్‌రెడ్డితో పాటు రెండుసార్లు కామారెడ్డి, జుక్కల్ నుంచి గెలుపొందిన గంప గోవర్ధన్, హన్మంత్ సింధే కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన ఈ ఇద్దరు నేతలు కూడ భారీ ఆధిక్యత నే సాధించారు. తొమ్మిదింటికి తొమ్మిది స్థానాలు గెలి చిన నేపథ్యంలో జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవి ఇ వ్వాలని అధినేత భావిస్తే, అగ్రవర్ణాల నుంచి ఒకరికి, ఇతర సామాజికవర్గాల నుంచి మరొకరికి అవకాశం ఉంటుందంటున్నారు. ఇదే జరిగితే నాలుగు పర్యా యాలు టీఆర్ఎస్ నుంచి గెలిచిన రవీందర్‌రెడ్డి, లేదా పోచారం శ్రీనివాస్‌రెడ్డిలో ఒకరికి దక్కితే, ఎస్సీ రిజ ర్వుడు నియోజకవర్గం జుక్కల్ నుంచి గెలుపొందిన హన్మంత్ సింధే పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. మైనార్టీ నుంచి అవకాశం దక్కితే బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు, వైశ్య సామాజికి వర్గానికి ఇవ్వాలను కుంటే అర్బన్ ఎమ్మెల్యే బిగాల కు అవకాశం రావచ్చు. ఇవేమీ ప్రాతిపదిక కా దు, భవిష్యత్‌లో తెలంగాణ పునర్నిర్మాణం, పార్టీ ప టిష్టం నేపథ్యంలో చురుకైన పాత్రను పోషించే యువకులకు కూడ కేసీఆర్ అవకాశం కల్పించవచ్చన్న చర్చ కూడ ఉంది. ఏదేమైనా శనివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం చోటు చేసుకున్న పరిణామా ల నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయ న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. -
కూడికలు... తీసివేతలు
ఖమ్మం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలోని ప్రధాన రాజకీయ పక్షాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జిల్లా ప్రజలు ఎక్కువ పార్టీలకు విజయం కట్టబెట్టడంతో పాటు ఎన్నికలో వైవిధ్యాన్ని చూపడంతో ఓటింగ్ సరళిపై వివిధ పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. ఎక్కడ, ఎన్ని ఓట్లు వచ్చాయి... పార్టీకి పట్టున్న చోట్ల ఎంత మెజార్టీ వచ్చింది... పట్టు లేని చోట పుంజుకున్నామా.... గణనీయ ఓట్లొచ్చింది ఎక్కడ... వెనుకబడింది ఎక్కడ అని కూడికలు, తీసివేతలు వేస్తూ విశ్లేషణలో మునిగిపోయారు. పొత్తు పొడిచిందా? సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్..., బీజేపీతో టీడీపీ పొత్తులు పెట్టుకున్నాయి. వైఎస్సార్సీపీ, సీపీఎం అవగాహన కుదుర్చుకుని పోటీ చేశాయి. పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంతోపాటు వైరా, పినపాక, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించింది. అదేవిధంగా పినపాక స్థానం బీజేపీకి కేటాయించి మిగిలిన తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టింది. వైఎస్సార్సీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.., ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలో పోటీలో నిలిచి మధిర, భద్రాచలం, పాలేరు నియోజకవర్గాలను సీపీఎంకు కేటాయించింది. ఫలితాలు చూస్తే... జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాలేరు, మధిర, ఇల్లెందు, ఖమ్మం అసెంబ్లీలు గెల్చుకుంది. అదేవిధంగా వైఎస్సార్స్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు అసెంబ్లీ స్థానాలు, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎంలు ఒక్కొక్క స్థానంలో గెల్చుకున్నాయి. ఈ సందర్భంలో అసలు పొత్తుల మూలంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి లాభం జరిగింది... ఎక్కడ కొంప ముంచింది.. అనే విషయంపై అభ్యర్థులు, వారి మద్దతు దారులు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పలు చోట్ల ఎంపీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపలేదని సీపీఐ శ్రేణులు అంటుంటే.. సీపీఐ నాయకులు కూడా తమ అభ్యర్థులకు సహకరించలేదని కాంగ్రెస్ నాయకులు ప్రత్యారోపణ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ పినపాకలో అక్కడి అభ్యర్థికి అనుకూలంగా పనిచేయలేదని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ‘హ్యాండి’చ్చారా? ఎన్నికలకు ముందుగా కుదుర్చుకున్న పొత్తులకు అనుగుణంగా పనిచేసిందెవరనేది జిల్లాలో చర్చగా మారింది. పొత్తులు కుదుర్చుకున్నా కొన్ని పార్టీలు పొత్తు ధర్మానికి భిన్నంగా పనిచేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య సయోధ్య లేదనే అంచనాకు వస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అత్యధిక ఓట్లు రావాల్సిన సీపీఐ అభ్యర్థి నారాయణకు తక్కువ ఓట్లు రావడం, కష్టంగా సత్తుపల్లి నియోజకవర్గం గెల్చుకున్న టీడీపీకి ఎక్కువ ఓట్లు రావడంపై చర్చ జరుగుతోంది. మొత్తం ఓట్లలో సీపీఐ అభ్యర్థి నారాయణకు 1,87,702 ఓట్లు రాగా అదే నామా నాగేశ్వరరావుకు 4,10,230 ఓట్లు రావడంతో మిత్ర ధర్మంలో ఏదో మోసం జరిగిందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా సీపీఐతో పొత్తు పెట్టుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, సునాయసంగా గెల్చుకునే స్థానాలు వారికి వదిలేయాల్సి వచ్చిందని, వారు పోటీచేసిన చోట్ల కనీస ఓటు బ్యాంకును పొందలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తుండడం గమనార్హం. -
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందిన పొంగులేటి శనివారం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానని, జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ విజయం ప్రజలదేనని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తనతో పాటు ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, ఒక సీపీఎం ఎమ్మెల్యేను జిల్లా ప్రజలు గెలిపించారని, జగనన్న బలపరిచిన తమను జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ఆదరించారని పేర్కొన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఏ ఆలోచనతో తమను గెలిపించారో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు పాటుపడతామని చెప్పారు. కలెక్టర్ అభినందనలు... ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన పొంగులేటిని ముందుగా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిక్లరేషన్‌ను పొంగులేటికి అందించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు పలుమార్లు పరిశీలించడం వల్ల లెక్కింపులో కొంత ఆలస్యం జరిగిందని కలెక్టర్ వివరించారు. మీ హయాం లో సూర్యాపేట, దేవరపల్లి రహదారిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ పొంగులేటికి సూచిం చారు. కొత్తగూడెం నుంచి జగదల్పూర్ వరకు ఫోర్‌లైన్ నిర్మాణానికి జీవో వచ్చిందని, ఎన్నికల కోడ్ వల్ల పనులు ప్రారంభించలేదన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్లో స్వీట్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాదు రమేష్‌రెడ్డి, పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, వైఎస్సార్సీపీ టీచర్స్ విభాగం కన్వీనర్ గురుప్రసాద్, నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ఖమ్మం నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి,జిల్లేపల్లి సైదులు,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ గెలుపునకు సహకరించిన..అందరికీ కృతజ్ఞతలు
మణుగూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్ఆర్ సీపీని గెలిపించిన అందరికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన శనివారం మణుగూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన సహాయ సహకారాలతో నవ తెలంగాణ నిర్మాణంలో వైఎస్ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వైఎస్ఆర్ సీపీని అమితంగా ఆదరించారని అన్నారు. జిల్లాలో సీపీఎం, వైఎస్ఆర్ సీపీ పొత్తు మంచి ఫలితాన్నిచ్చిందని అన్నారు. ఈ రెండు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేశారని, ఫలితంగానే పినపాక నియోజకవర్గంలో ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీ తనకు వచ్చిందనిఅన్నారు. తనను గెలిపించిన ప్రజలకు, సహకరించిన వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిలమ్మ పర్యటనతో పార్టీకి మరింతగా కలిసొచ్చిందని అన్నారు. ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో తన గెలుపునకు షర్మిలమ్మ పర్యటన నాంది పలికిందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల మధ్యన ఉంటున్న తనకు నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వీటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని అన్నారు. ఖమ్మాన్ని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో వైఎస్ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తన విజయానికి అన్నివిధాల సహాయ సహకారాలందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యు లు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు భూపల్లి నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరా వు, మాదినేని రాంబాబు, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైరా నియోజకవర్గాన్ని..మోడల్‌గా తీర్చిదిద్దుతా
కొణిజర్ల, న్యూస్‌లైన్: నవ తెలంగాణ రాష్ట్రంలో వైరా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, మోడల్‌గా తీర్చిదిద్దుతానని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొం దిన తరువాత మొదటిసారిగా శనివారం కొణిజర్ల వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజర్ల సెంటర్లోని వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, విలేకరులతో ఆయన మా ట్లాడుతూ... అధిక మెజార్టీతో తనను గెలిపించిన వైరా నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ-సీపీఎం శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను వెనుక ఉండి నడిపించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైరా నియోజకవర్గ ప్రజలందరి తరఫున రుణపడి ఉంటానన్నారు. పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో, ఆయన సహాయ సహకారాలతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వైరాలో అగ్నిమాపక కేంద్రం, సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పా టు చేయిస్తానని; వైరా రిజర్వాయర్ ద్వారా అన్ని మండలాల్లోకు తాగునీరందేలా కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలోగల గిరిజన తండాలు వైరా నియోజకవర్గం లో అనేకం ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని, తం డాల్లోని సమస్యలు తనకు తెలుసునని అన్నారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వ్యవసాయ సమస్యలపై దృష్టి పెడతానని; ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని అన్నారు. జూలూరుపాడు మండలంలోని పోలారం చెరువును పునర్నిర్మిస్తే సుమారు 14వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ప్రజలందరికీ రుణపడి ఉంటా... కారేపల్లి: తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే మదన్‌లాల్ అన్నారు. ఆయన శనివారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కారేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని అన్నారు. తొలుత, మదన్‌లాల్‌కు ఎస్ఆర్ఆర్ కళాశాల సెక్రటరీ కె.ఉపేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ రావూరి శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మా రోషయ్య, ఇమ్మడి తిరుపతిరావు పాల్గొన్నారు. ఘన స్వాగతం గొల్లెనపాడు (వైరా): ఎమ్మెల్యేగా ఎన్నికైనం అనంతరం శనివారం గొల్లెనపాడుకు తొలిసారిగా వచ్చిన బాణోత్ మదన్‌లాల్‌కు వైఎస్ఆర్ సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ఇంటింటికీ మదన్‌లాల్ వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్సీఎం చర్చిలో ప్రార్థన చేశారు. గ్రామంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ గ్రామస్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తొలి వినతిపత్రం స్వీకరణ ఎమ్మెల్యేగా తొలి వినతిపత్రాన్ని మదన్‌లాల్ స్వీకరించారు. స్థానిక ఇబ్బందులను, అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చా రు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. సీపీఎం నాయకులతో సమావేశం వైరాలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో మదన్‌లాల్ సమావేశమయ్యారు. తన విజయానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు గుమ్మా రోషయ్య, తన్నీరు నాగేశ్వరరావు, తేలప్రోలు నర్సింహా రావు, తాతా నిర్మల, వెంపటి చంద్రశేఖర్, వెంకటయ్య, ఏసు, సీపీఎం నాయకులు ఆళ్ళ వెంకట్రావ్, చిత్తారి రాంబాబు, మేకల వెంకటేశ్వర్లు, ఈరుపార్శపు భాస్కర్‌రావు, ఖాసీం, ఖానాపురం మారుబొయిన ఏడుకొండలు, వేమిరెడ్డి వెంకటకోటరెడ్డి, విజయలక్ష్మి, వేల్పుల రామారావు, ప్రగడవరపు పాపయ్య, యాదయ్య, వెంకటనారాయణ, గొల్లపూడి సర్పంచ్ ముత్తారపు కళావతి తదితరులు పాల్గొన్నారు. -
నల్లసూరీళ్ల తెలం‘గానం’..
వారు నిత్యం చీకటి గుహల్లో పనిచేసే కార్మికులు.. ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పోరాడి సాధించుకునే పోరాట పటిమ వారిది.. ఇచ్చి న మాటకు కట్టుబడే తత్వం వారి సొంతం.. అలాంటి సింగరేణి కార్మికులు కట్టుబడినట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని అక్కున చేర్చుకున్నారు. నాలుగు జిల్లాల కోల్‌బెల్ట్ పరిధిలో అనూహ్య ఫలితాలు అందించి తమ ఐకమత్యాన్ని చాటారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించారు. కోల్‌బెల్ట్ పరిధిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 5 పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్కు నాలుగు పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ సీటు అప్పగించారు. కాంగ్రెస్, టీడీపీ ఒక్కో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నాయి. మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా జరి గిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నా లుగు జిల్లాలోని సింగరేణి బొగ్గు గని కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే పట్టం కట్టారు. కోల్‌బెల్ట్ లోని అత్యధిక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని ప్రధాన పార్టీల కంటే ముందంజలో ఉంది. మొదటిసారి కార్మికులు ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ చేతిలో పెట్టి ఆదరించారు. ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణ పోరులో రెండు స్థానాలు గెలుపొందడం విశేషం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానానికే పరిమిత మయ్యాయి. కమ్యూనిస్టులు మూడు ప్రాంతాల్లో పొత్తుతో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా వారిని కార్మికులు ఆదరించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు కూడా బెల్ట్‌లోనే ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీకి ఆదరణ.. కోల్బె ల్ట్ ప్రాంతాల్లో మొదటి సారిగా కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కకు తోసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు స్థానంలో పి.శ్రీనివాస్‌రెడ్డిని, పినపాక అసెంబ్లీ స్థానానికి పి.వెంకటేశ్వర్లును గెలిపించారు. ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్తుపల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో సైతం కౌన్సిలర్లను కార్మికులు ఆదరించారు. ఒంటరిగా బరిలోకి దిగి జాతీయ పార్టీల కంటే తామే గొప్ప అని ఈ పార్టీ నిరూపించింది. భవిష్యత్తులో సింగరేణిలో కీలక బాధ్యతలు వీరికి అప్పగించే అవకాశాలూ లేకపోలేదు. టీఆర్ఎస్ హవా.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటమంటూ కార్మికుల కాలనీలతోపాటు గనులపై టీఆర్ఎస్ మొదటి నుంచీ విసృ్తత ప్రచారం చేపట్టింది. సకల జనుల సమ్మెలో కార్మికులను నెల రోజులపాటు భాగస్వాములను చేసింది. ఎన్నికల హామీలో కార్మికులను ఆకట్టుకుంది. దీంతో కోల్‌బెల్ట్‌లోని ఐదు పార్లమెంటు, పదకొండు అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది. అందులో.. నాలుగు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కార్మికులు ఆ పార్టీని ఆదరించారు. మహబూబాబాద్‌లో సీతారాంనాయక్, వరంగల్‌లో కడియం శ్రీహరి, పెదపల్లిలో బాల్క సుమన్, ఆదిలాబాద్‌లో జి.నగేష్ పార్లమెంటు అభ్యర్థులుగా గెలుపొందారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సత్యనారాయణ, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, మంచిర్యాలలో దివాకర్‌రావు, బెల్లంపల్లిలో చిన్నయ్య, చెన్నూర్‌లో ఓదెలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తెలుగుదేశం+బీజేపీకి నామమాత్రం.. తెలుగుదేశం, భారతీయ జన తా పార్టీలు పొత్తు పెట్టుకొని కోల్బె ల్ట్లోని అన్ని స్థానాలకు పోటీ పడ్డాయి. బీజేపీ ఒక ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా ఒక్కటి కూడా దక్కించుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆరు ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీచేయగా సత్తుపల్లి అసెంబ్లీని కాపాడుకోగలిగింది. కాంగ్రెస్+సీపీఐ.. ఒకటికే పరిమితం.. కాంగ్రెస్, సీపీఐలు జాతీయ పార్టీలు. వీటికి సింగరేణిలో కార్మిక అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని బలోపేతం చేయడంలో రెండు పార్టీలూ విఫలం కావడం నేటి ఫలితాలకు తార్కాణం. నిత్యం కార్మిక సమస్యలపై పోరాటం చేసే అనుబంధ సంఘాలు ఉన్నా కార్మికులను సార్వత్రిక ఎన్నికల్లో ఆకట్టుకోలేకపోయారు. రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితాలు దక్కలేదు. పొత్తులో సీపీఐ మూడు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా ఏ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఎనిమిది ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ పడగా ఇల్లందు అసెంబ్లీ స్థానం నుంచి కనకయ్య గెలుపొందారు. -
ఒంటరి పోరు.. కారుదే జోరు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒంటరి పోరు తో 2014లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో పాటు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంలో సఫలమైంది. తాజా ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ఏడు స్థానాల్లో అతి సులభంగా గెలుపొందింది. అదే విధంగా ఆది లాబాద్ పార్లమెంటు స్థానాన్ని సైతం భారీ మెజార్టీ తో దక్కించుకొని తిరుగులేని పార్టీగా జిల్లాలో నిల బడింది. 2004లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పె ట్టుకొని జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ముథోల్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తూ ర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి) అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఏడుగురిలో నలుగురు కొత్తవారు కావడం విశేషం. మరో ముగ్గురు సీనియర్లు ఉన్నారు. బోథ్ నుంచి గెలిచిన రాథోడ్ బాపురావు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి తన కం టే రాజకీయాల్లో సీనియర్, అదే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన సోయం బాపురావును ఓడించారు. బెల్లంపల్లి నుంచి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని దుర్గం చిన్నయ్య తనకంటే సీనియర్, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లేశ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవ లక్ష్మి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సి ట్టింగ్ ఎమ్మెల్యే, పెద్ద నాయకుని అండ ఉన్న సక్కు ను ఓడించి సత్తా చాటుకున్నారు. ఖానాపూర్ నుంచి గెలిచిన రేఖానాయక్ కూడా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రాథోడ్ రమేశ్ కుమారుడు రితీశ్ రాథోడ్‌ను ఎదుర్కొని విజయాన్ని అందుకొంది. పాతవారిలో ఆదిలాబాద్ నుంచి గతంలో రెండుసార్లు గెలుపొందిన జోగు రామన్న ఈసారి సులువుగానే బయట పడ్డారు. చెన్నూర్ నుంచి మూడో సారి గెలుపొందిన నల్లాల ఓదెలు కూడా స్థానిక అంశం, కార్మికుల అండ కలిసిరావడం కలిసి వచ్చింది. మంచిర్యాల నుంచి మూడో సారి గెలుపొందిన దివాకర్‌రావు చివరి సమయంలో టీఆర్ఎస్లో చేరి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. -
ప్రచారం సరే.. ఫలితం ఏది?
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల అగ్రనేతలతోపాటు పలువురు ప్రముఖుల ప్రచారంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఆయా ప్రచార ఏర్పాట్లు చూసుకునే సమయాన్ని ఓటర్ల దగ్గరికి చేరువయ్యేందుకు ఉపయోగించినా మరిం త బాగుండేదని సణుగుతున్నారు. స్థూలంగా నాయకుల ప్రచారంతో తమకు లాభం లేకుండాపోయిందని వాపోతున్నారు. ఈ ఆవేదన ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో బలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల ప్రముఖ నాయకులంతా జిల్లాను చుట్టివచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు ధపాలుగా జిల్లాలో పర్యటించారు. గులాబీ బాస్ పర్యటనకు తప్ప మిగతా నాయకులెవ్వరి ప్రచారానికి పెద్దగా ఫలితం దక్కలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కరోజులోనే జిల్లాలో పర్యటించారు. బీజేపీతో పొత్తు ఉన్నా కేవలం టీడీపీ అభ్యర్థులు పోటీచేసిన స్థానాల్లోనే బాబు ప్రచారం నిర్వహించారు. కాని ఏ ఒక్కస్థానంలోనూ పార్టీ అభ్యర్థులు గెలువలేదు. సాక్షాత్తు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలవడం ప్రచారం ఫలితానికి నిదర్శన మని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తూతుమంత్రపు ప్రచారం చేస్తే ఫలితాలు ఇలా కాకుండా ఇంకెలా ఉంటాయని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ శ్రేణుల ఆవేదన ఇందుకు మరింత భిన్నంగా ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితోపాటు సినీ నటుడు రాజశేఖర్‌తో సైతం ఆ పార్టీ ప్రచారం చేయించింది. అయినా చేదు ఫలితమే దక్కింది. కిషన్‌రెడ్డి పర్యటించిన సమయంలోనూ కేవలం బీజేపీ నేతలు బరిలో ఉన్న స్థానాల్లోనే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సైతం ఇందుకు భిన్నమైన రీతిలో ఏమీలేదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను అన్నీ తానై చూసిన కేంద్రమంత్రి జైరాం రమేశ్ జిల్లాలో పలు దఫాలుగా పర ్యటించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించి, కొన్నిచోట్ల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అయినా ఒక్క ముథోల్‌లో తప్ప ఏ ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. ఆసిఫాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. కాని ఆ నియోజకవర్గ అభ్యర్థి విజయానికి సదరు నేతల ప్రచారం అండగా నిలవలేకపోయింది. ఇదిలా ఉండగా..నిర్మల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వరరెడ్డి సీరియల్ నటుడు టార్జాన్‌తో ప్రచారం చేయించినా ఫలితం లేకపోయింది. కేసీఆర్ జోష్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన బహిరంగ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. జిల్లాలో మొదటి విడత ప్రచారం చేసినపుడు తొమ్మిది బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రెండో దఫా వచ్చినపుడు మందమర్రి సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రచార పర్వంతో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన జనాల్లో కలిగించేందుకు బలమైన కారణాలను ప్రస్తావించిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు. ఆయన ప్రచారమే ఆ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీ సాధించేందుకు తోడ్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థులే భేష్!! బడానేతల ప్రచార సహకారం లేకుండా ఒంటిచేత్తో విజయదుందుభి మోగించిన బీఎస్పీ అభ్యర్థులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలే భేష్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ సొంత చరిష్మా ఆధారంగానే వారు విజయతీరాలు చేరుకున్నారని పేర్కొంటున్నారు. -
వ్యూహం ఫలించింది.. విజయం వరించింది
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఇరువురు నేతలు.. అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి... జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వారి గెలుపు వెనుక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతేడాది చివర్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అంతకు ఏడాది ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. అంతేకాకుండా చేవెళ్ల తన సొంతగడ్డ అంటూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక నేతలతో మమేకం కావడంతో పాటు ప్రత్యేకించి కొందరు యువకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయించారు. ఇలా ఎన్నికలకు ముందే పార్లమెంటు సెగ్మెంటులోని ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న విశ్వేశ్వర్.. చేవెళ్లలో గులాభి దళపతి సమక్షంలో పార్టీలో చేరారు. అదే సమయంలో కేసీఆర్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో సతీమణితో పాటు బంధువర్గాన్ని ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించడంతో సఫలీకృతులయ్యారు. పెద్దగా ప్రభావం లేని టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరుస్తూ తన గెలుపునకు బాటలు వేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటు కలిసి రావడంతో పాటు సోషల్ మీడియా తదితర టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకున్నారు. చివరకు అనుకున్నట్లుగా భారీ మెజార్టీతో బలమైన పార్టీలకు చెందిన ప్రత్యర్థులను మట్టికరిపించారు. సమన్వయం మల్లారెడ్డి విజయ రహస్యం... మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు సుపరిచితులైనప్పటికీ రాజకీయాల్లోకి రావడం కొత్తే. అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. పూర్తిగా పట్టణ నియోజకవర్గం కావడం.. టీడీపీకి పట్టున్న ప్రాంతం.. మరోవైపు మోడీ గాలి.. వెరసి మల్లారెడ్డి విజయానికి మార్గం సుగమమైంది. అయితే ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులంతా బడా నేతలే. స్థానికంగా బలమైన నేత మైనంపల్లి హన్మంతరావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ప్రముఖుల ఎదుర్కొని చివరకు మల్లారెడ్డి విజయం సాధించారు. పార్టీకి కొత్త అయినప్పటికీ.. నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అధినేతతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు కలిసివచ్చిన అంశం. మరో వైపు పార్టీ శ్రేణులను, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. మొత్తంమీద 30వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. -
స్వయంకృతం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అతివిశ్వాసం కాంగ్రెస్ పుట్టిముంచింది. మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని బీరాలు పలికిన ఆ పార్టీని చావుదెబ్బతీసింది. కేవలం రెండు సీట్లకే పరిమితం కావడం... అవి కూడా అత్తెసరు ఓట్లతో గట్టెక్కడం చూస్తే ఆ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఈ సారి ఆ స్థాయిలో సీట్లు దక్కకపోగా.. చాలాచోట్ల మూడో స్థానానికి దిగజారింది. మల్కాజిగిరి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల చేతిలో కాంగ్రెస్ మట్టికరిచింది. ఈ స్థానాల్లో ఓటమి పాలవడమే కాకుండా టీఆర్ఎస్ / స్వతంత్ర అభ్యర్థుల కంటే వెనుకబడింది. పార్టీ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం సమన్వయలేమి, నేతల అంతర్గత కలహాలే. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాల్సిన అధిష్టానం... పట్టించుకోకపోవడంతో పార్టీ నడ్డివిరిగింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయడమేగాకుండా ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. దీంతో చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే చిల్లు పడింది. మరోవైపు అసంతుష్టులను దారిలో తెచ్చేందుకు కూడా పార్టీ నాయకత్వం చొరవచూపలేదు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా మూటగట్టుకోవడం, టీఆర్ఎస్, మోడీ హవా ఉందని పసిగట్టినా దాన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడంతో ఘోర పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇబ్రహీంపట్నంలో పార్టీ ఓడిపోవడానికిప్రధాన కారణం తిరుగుబాటు అభ్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మల్రెడ్డి రాంరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం, ఆయనకు మరికొందరు పార్టీ నేతలు సహకరించడంతో పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ పరాజయానికి దారితీసింది. కాంగ్రెస్ ఓట్లే స్వతంత్ర అభ్యర్థి ఖాతాలోకి వెళ్లడంతో టీడీపీ ఇక్కడ సలువుగా విజయం సాధించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఎల్బీ నగర్లో ఎం.రామ్మోహన్‌గౌడ్, కుత్బుల్లాపూర్‌లో హన్మంతరెడ్డి టికెట్టు రాకపోవడంతో చివరి నిమిషంలో కారెక్కారు. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడం కాంగ్రెస్ ఓట్లలో చీలిక తెచ్చింది. ఇది ప్రత్యర్థి పార్టీని విజయతీరాలకు చేర్చింది. వికారాబాద్లోను ఒకవర్గం వ్యతిరేకంగా పనిచేయడం కూడా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఓటమి కారణంగా విశ్లేషించుకోవచ్చు. ఇదే పరిస్థితి పార్లమెంటు స్థానాల్లోను స్పష్టమైంది. అటు మల్కాజిగిరి, ఇటు చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. స్థానికంగా ఎంపీ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత వారికి పోలైన ఓట్లలో స్పష్టమైంది. వైరం... గెలుపునకు దూరం! తెలుగుదేశం జిల్లాలో ప్రభంజనం సృష్టించినా.. కొన్ని నియోజకవర్గాలు చేజారేందుకు సీనియర్ల వ్యవహారశైలే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మల్కాజిగిరిలో బీజేపీ, మేడ్చల్‌లో పార్టీ పరాజయం చవిచూసేందుకు దారితీసింది. తనకు టికెట్ దక్కకుండా రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ పావు లు కదపడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాత్రికి రాత్రే పార్టీకి గుడ్‌బై చెప్పడమేగాక.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. మైనంపల్లికి అనుచరుడిగా పేరున్న నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు కూడా టికెట్ ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో రెబల్‌గా బరిలో దిగిన న క్కా.. చివరి నిమిషంలో తన బాస్ మైనంపల్లిని అనుసరిం చారు. దీంతో అటు మల్కాజిగిరి, ఇటు మేడ్చల్‌లోని వీరి ప్రధాన అనుచరగణం పూర్తిగా గులాబీ పంచన చేరింది. ఈ పరిణామంతో నామమాత్రపు పోటీ ఇస్తుందనుకున్న టీఆర్ఎస్.. వీరి చేరికతో అనూహ్యంగా పుంజకుంది. ఈ రెండు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్‌లలో పార్టీ కేడర్ పక్కచూపులు చూస్తోందని తెలుస్తున్నా జిల్లా నాయకత్వం నష్టనివారణ చర్యలకు దిగకపోవడంతో చేవెళ్ల ఎంపీ స్థానం చేజారింది. కమలం శల్య సారథ్యం! పొత్తులో భాగంగా జిల్లాలో నాలుగు సీట్లు దక్కించుకున్న బీజేపీ.. వీటిలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. వికారాబాద్, పరిగిలలో మాజీ మంత్రులకు టికెట్లు ఇచ్చినా, వారి తరఫున జిల్లా నాయకత్వం కనీసం ప్రచారంచేసిన దాఖలాలు కూడా లేవు. సీనియర్లను కాదని, వలసనేతలకు సీట్లు కట్టబెట్టడంపై అసంతృప్తితోనే ప్రచారానికి దూరంగా వ్యవహరించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. వికారాబాద్‌లో ఐతే నాలుగో స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిగిలో మూడో స్థానానికే పరిమితమైనా, ఉప్పల్‌లో గెలుపొందడం, మల్కాజిగిరిలో దాదాపు గెలుపు దాకా వెళ్లడం పార్టీకి ఊరట కలిగించింది. ఏది ఏమైనా నాయకత్వ వైఫల్యం అభ్యర్థుల ఓటమిలో ప్రధానభూమిక పోషించిందనడం నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా నమో జపం న డుస్తున్నా దాన్ని సొమ్ము చేసుకోవడంలో స్థానిక నాయకత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. -
టీఆర్ఎస్ కొంపముంచిన ‘రెబల్’
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్లలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. సునాయాసంగా గెలవాల్సిన చోట కేఎస్ రత్నం రెబల్ అభ్యర్థి దేశమోళ్ల ఆంజనేయులు మూలంగా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. రెబల్ అభ్యర్థి రంగంలో లేకపోతే రత్నం సుమారు 5వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించేవారని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు. దేశమోళ్ల ఆంజనేయులు దశాబ్ధకాలంగా నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో గులాబీ జెండాను చేతపట్టుకొని గ్రామగ్రామాన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆంజనేయులు ఆశలు అడియాసలయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్, రాష్ట్ర నాయకులు హరీష్‌రావు, కేటీఆర్‌ల వద్దకు వెళ్లి టికెట్ కోసం చివరి నిమిషం దాకా విశ్వప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ ఇప్పిస్తామని కేసీఆర్‌తో హామీ ఇప్పించారు. అయితే, ఉద్యమం కోసం దశాబ్ధకాలంగా నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేసిన తనను కాదని ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినవారికి ఎలా టికెట్ ఇస్తారని ఆంజనేయులు వాదించినా పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక రెబల్‌గా బరిలోకి దిగారు. ఓట్ల చీలికతో గట్టెక్కిన ‘కాలె’.. ఫలితాల్లో రౌండ్లవారీగా కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే ఆంజనేయులు గెలుపునకు ఆమడదూరంలో ఉన్నా టీఆర్ఎస్ ఓట్లను చీల్చడంలో సఫలీకృతులయ్యారు. ఆంజనేయులుకు 6,799 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చిన ఓట్లు రత్నంను ఓడించడానికి దోహదపడ్డాయి. ఉద్యమ ద్రోహులు, అవకాశవాదం, స్వార్థంతో పార్టీలు మారేవారికి టికెట్లు ఇచ్చి చిరకాలంగా పార్టీని నమ్ముకున్న వారి తీరని అన్యాయం చేశారని గ్రామాల్లో ఆంజనేయులు చేసిన ప్రచారం కాస్తోకూస్తో పనిచేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో రత్నం కేవలం 781 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్‌లో చివరికి రెబల్ అభ్యర్థి చీల్చిన ఓట్ల పుణ్యమా అని కాలె యాదయ్య స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. -
15 ఏళ్లుగా ప్రతిపక్షమే..!
కుల్కచర్ల, న్యూస్‌లైన్: మరోసారి పరిగి ఓటర్లు రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నమైన తీర్పునిచ్చారు. గత 15 సంవత్సరాలుగా పరిగి శాసన సభ్యుడు ప్రతిపక్షానికే పరిమితమవుతున్నాడు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డిని గెలిపించి ఓటర్లు అదే తీర్పును పునరావృతం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీచినా పరిగి నియెజకవర్గం ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఈసారి సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. నియెజవర్గంలో ఐదు మండలాలు దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ఓటు వేసి ఉంటారని, హరీశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చి అందరికీ షాకినిచ్చాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉంది. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. అయితే సార్వత్రికానికి వచ్చే సరికి తీర్పు మారడంతో టీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. అయితే వరుసగా ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డికే అవకాశం ఇవ్వడంతో ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఆర్ గెలవగా హరీశ్వర్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని, కనీసం ఈసారైనా నియోజకవర్గానికి న్యాయం జరిగి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్‌ఆర్‌ను ఆ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆయన్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ
నర్సాపూర్, న్యూస్‌లైన్: నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీచగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సాపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందిన మాజీ మంత్రి సునీతారెడ్డికి స్వగ్రామంలో సైతం వ్యతిరేక పవనాలు వీచాయి. గతంలో ఆమె చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసి మూడో సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిలుముల మదన్‌రెడ్డి కారు జోరుతో విజయం సాధించారు. అయితే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఒకే పోలింగ్ స్టేషన్లో ఆమెకు ఆధిక్యత వచ్చింది. 239 పోలింగ్ స్టేషన్లో ఆమెకు 469 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డికి 336ఓట్లు వచ్చాయి. 240 పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్‌కు 135 ఓట్లు మాత్రమే రాగా టీఆర్స్కు 366 ఓట్లు,240(ఎ) పీఎస్‌లో కాంగ్రెస్‌కు 284 ఓట్లు, టీఆర్ఎస్కు 311ఓట్లు రావడంతో అక్కడ సైతం టీఆర్ఎస్ హవా కొనసాగిందని స్పష్టమవుతుంది. అలాగు గోమారం పక్క గ్రామాలైన బిజిలీపూర్‌లో స్వల్ప ఆధిక్యత రాగా నవాబుపేట గ్రామంలో సుమారు నాల్గు వందల ఓట్ల ఆధిక్యత లభించింది. కాగా మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులైన నారాగౌడ్, ఉమాదేవి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. మదన్‌రెడ్డి స్వగ్రామమైన కౌడిపల్లిలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మూడింటిలో టీఆర్ఎస్కు 1328ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 560 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీడీసీ చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి కౌడిపల్లికి చెందిన వారే అయినప్పటికీ అక్కడ టీఆర్ఎస్కు భారీగానే ఓట్లు వచ్చాయి. కాగా నర్సాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమీటీ చైర్మన్ నారాయణరెడ్డి స్వగ్రామమైన చిట్కుల్లో, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మాణిక్యరెడ్డి స్వగ్రామమైన గౌతాపూర్‌లో, మరో సీనియర్ నాయకుడు విశ్వంబరస్వామి స్వగ్రామమైన సోమక్కపేటలలో సైతం టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 3558 ఓట్లు రాగా టీఆర్ఎస్కు 4320ఓట్లు లభించాయి. కొన్ని నెలల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా రమణారావును గెలిపించుకుని పంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ స్వగ్రామమైన రెడ్డిపల్లిలో టీఆర్ఎస్కు సుమారు రెండు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌గుప్తా స్వగ్రామంలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కన్నా 94 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదిలాఉండగా కొల్చారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి గ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత రాగా ఇతర నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, నరేందర్‌రెడ్డి తదితరులు తమ గ్రామాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యత సంపాదించిపెట్టారు. అలాగే వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి స్వగ్రామమైన బండపోసాన్‌పల్లిలో కాంగ్రెస్‌కు 69ఓట్ల ఆధిక్యత లభించింది. రామాయంపేట ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి స్వగ్రామమైన రామాంతపూర్‌లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కన్నా 188ఓట్లు అధికంగా వచ్చాయి. మండల కేంద్రమైన వెల్దుర్తిలో కాంగ్రెస్ నాయకుడు శంకర్‌గౌడ్ ఊరిలో ఆరు పీఎస్‌లు ఏర్పాటు చేయగా సుమారు 350ఓట్ల ఆధిక్యత టీఆర్ఎస్కు లభించింది. హత్నూర మండల కేంద్రంలో కాంగ్రెస్‌కన్నా టీఆర్ఎస్కు ఐదు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంలో హత్నూర జెడ్పీటీసీ,ఎంపీపీ అధ్యక్ష పదవులు కాంగ్రెస్ అధీనంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత రావడం గమనార్హం. హత్నూర మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు స్వగ్రామమైన బోర్పట్లలో 323 ఓట్లు, మరో నాయకుడు అళ్వారయ్య స్వగ్రామంలో కాసాలలో టీఆర్ఎస్కు 288ఓట్లు అధికంగా వచ్చాయి. అదే మండలంలోని డాక్టర్ గోవర్దన్‌రావు, నర్సింహారెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించింది. -
ప్రత్యేక రాష్ట్రంలోనూ పోరాటమే
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో జరిగి ఎన్నికల్లో ప్రజలు పోరాట స్ఫూర్తిని కొనసాగించి అర్థవంతమైన తీర్పునిచ్చారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అద్భుతమనీ, అయితే ఇంకా సంక్షోభాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేరుతాయన్నారు. తెలంగాణ జేఏసీ ఇక ముందు ప్రజలతో కలిసి నడుస్తుందన్నారు. విభజన నేపథ్యంలో జరిగే పంపకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వలసీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమాలు అనివార్యమన్నారు. ప్రస్తుతం సర్కార్‌ను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగుల విభజన అంశంలో ఆప్షన్స్ చట్టంలో లేవన్నారు. 610జీవో, గిర్గ్లానీ కమిషన్ ప్రతిపాదన ఆధారంగా, విభజన మార్గదర్శకాలు, స్థానిక రిజర్వేషన్లు, ఆర్టికల్ 371డీ లోబడి ఉద్యోగుల విభజన జరిగినప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ జేఏసీ అభివృద్ధికి, పౌర సమాజానికి అండగా ఉంటుందన్నారు. కోదండరాం వెంట టీజేఏసీ తూర్పుజిల్లా అధ్యక్షులు డా. పాపయ్య, వెంకట్రాంరెడ్డి ఉన్నారు. -
ఆల్ రికార్డ్స్ హరీష్ సొంతం
పార్టీలో గానీ ఇతరత్రా ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తూ ట్రబుల్ షూటర్‌గా పేరొందాడు సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని పరిస్థితులను దశాబ్ద కాలంగా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తున్నారు. అదీగాక మెజార్టీని పెంచుకుంటూ రికార్డులు బద్దలు కొడుతున్నారు. గత ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీని సాధించిన హరీష్‌రావు ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్పల్ప తేడాతో తెలంగాణ ప్రాంతంలో ఆధిక్యం సాధించడంలో ఈయన ద్వితీయ స్థానంలో నిలిచారు. - న్యూస్‌లైన్, సిద్దిపేట జోన్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాజకీయపరంగా ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా వాటికి చక్కదిద్దడానికి పార్టీ అధినేత కేసీఆర్ ట్రబుల్ షూటర్‌గా హరీష్‌రావునే పురమాయిస్తారు. గతంలో సిరిసిల్ల, స్టేషన్ఘనపూర్, పరకాల, సిర్పూర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అధిష్టానం హరీష్‌రావుపైనే మోపింది. మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలతోపాటు ప్రతికూల పరిస్థితులు నెలకొన్న దుబ్బాక, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన స్థానిక అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్‌రావుకు ఐదుసార్లు సిద్దిపేట ఓటర్లు సానుకూల తీర్పునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల్లోని నాయకత్వ లోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూనే ప్రతి ఎన్నికల్లో మెజార్టీని పెంచుకుంటున్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లను కొల్లగొట్టే విధంగా రాజకీయ చతురత తో ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. 2004లో జరిగిన ఉప ఎన్నికలో సమీప ప్రత్యర్థిపై 24.827 ఓట్ల మెజార్టీని సాధించారు. 2008 ఉప ఎన్నికలో 58,935 మెజార్టీ తెచ్చుకొని బరిలో ఉన్న వారందరి డిపాజిట్లు జప్తు చేశారు. 2009 జమిలీ ఎన్నికల్లో 64,014 మెజార్టీతోపాటు పోటీలో ఉన్న 13 మంది డిపాజిట్లు గల్లంతయ్యేలా దూసుకుపోయారు. ఈ క్రమంలో 2010లో జరిగిన ఉప ఎన్నికలో 95,858 భారీ మెజార్టీని సాధించి రాష్ట్ర స్థాయిలోనే రికార్డ్ నమోదు చేయడంతోపాటు ఇక్కడ పోటీ చేసిన పదిమంది డిపాజిట్లను జప్తు చేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజార్టీని సాధించి తెలంగాణలోనే రెండో స్థానంలో నిలిచి పదిమంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశారు. -
ఇక లాంఛనమే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మెతుకు సీమ బిడ్డ, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. శనివారం సమావేశమైన టీఆర్ఎస్ శాసనసభాపక్షం తమ పార్టీ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం ఆ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. దీంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ 2న ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఆవిర్భావం వెంటనే కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేలా టీఆర్ఎస్ నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గం కూర్పుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని అన్నీ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రివర్గం రేసులో జిల్లా నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్లు ఉన్నారు. గరిష్టంగా 18 మందితోనే కేబినెట్ ఏర్పాటుకు అవకాశముండడం.. కాబోయే సీఎం కేసీఆర్ సైతం ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మంత్రివర్గంలో జిల్లా నుంచి ఒకరిద్దరికి మించి అవకాశం రాకపోవచ్చు. అయినా సామాజిక సమీకరణాలు కలిసివస్తే మంత్రివర్గంలో చోటు లభించవచ్చని జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం..మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను మట్టికరిపించడం ద్వారా మాజీ మంత్రి బాబూమోహన్ మంత్రివర్గ రేసులో ముందుంజలో ఉన్నారు. మహిళా కోటా కింద పద్మా దేవేందర్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్‌కు అండదండగా ఉండే హరీష్ రావుకు మంత్రివర్గంలో తీసుకుంటే పాలన వ్యవహారాల్లో సహకారం లభించే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురిలో ఎంత మందికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
ఓడిన అధినేతలు
సాక్షి, చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది. కొన్నేళ్ల క్రితం సాధించిన రికార్డును తిరగ రాసే రీతిలో ఏక పక్షంగా వచ్చిన ఫలితాలు అనేక పార్టీలను డైలమాలో పడేశాయి. ఆయా పార్టీల అధ్యక్షులను కంగుతినిపించాయి. మోడీ హవా, అన్నాడీఎంకే మీదున్న వ్యతిరేకత తమకు అనుకూలం అవుతుందన్న ఆశతో ఎన్నికల బరిలో నిలబడిన అనేక పార్టీల అధ్యక్షులకు చివరకు మిగిలింది భంగపాటే. ప్రభంజనం: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాంగా బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటుతో, మోడీ ప్రభంజనం తమను గెలిపిస్తాయన్న ధీమా అనేక పార్టీల్లో నెలకొంది. అయితే, రాష్ట్రంలో మోడీ పాచికలు పారలేదు. మోడీ పవనాల ఆశ, డీఎంకే బహిష్కృత నేత అళగిరి అండ, తన వ్యక్తిగత బలం కలసి వస్తాయన్న ఆశతో విరుదునగర్ రేసులో నిలబడ్డ ఎండీఎంకే అధినేత వైగోకు మిగిలింది ఓటమే. లక్షన్నర ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వైగోకు ఏర్పడింది. ఇక, పీఎంకే అధ్యక్షుడు జీకే మణి ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని లోక్ సభ రేసులో నిలబడ్డారు. కృష్ణగిరి జిల్లాలో ఉన్న వన్నియర్ ఓట్లు, మోడీ గాలి, మిత్రుల ఓటు బ్యాంక్ కలిసి వస్తే తాను ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కడ ఖాయం అన్న ధీమాతో ప్రచారం చేశారు. అయితే ఆయనకు దక్కింది రెండున్నర లక్షల ఓట్లే. అన్నాడీఎంకే హవా ముందు చతికిల బడాల్సి వచ్చింది. వీసీకే నేత తిరుమావళవన్ చిదంబరం నుంచి మళ్లీ బరిలో దిగారు. వెనుకబడిన వర్గాల ఓట్లు, డీఎంకే బలం, తాను చేసిన అభివృద్ధి మళ్లీ విజయం వైపు నడిపిస్తుందన్న తిరుమావళవన్ ఆశలు అడియాశలయ్యాయి. పారని ధన బలం : ఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత పచ్చ ముత్తు పారివేందన్ ఇండియ జననాయగ కట్చికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని ధనిక అభ్యర్థుల జాబితాలో ఉన్న పచ్చ ముత్తు బీజేపీతో కలసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. ధన బలం, మోడీ బలం గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్న ఆయన్ను పెరంబలూరు ఓటర్లు తిరస్కరించారు. ఆర్థిక బలం కలిగిన, మరో విద్యా సంస్థల అధినేత ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చికి అధ్యక్షుడు. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ అధిష్టానం అండతో వేలూరు సీటును దక్కించుకున్నారు. ఆర్థిక బలం, వ్యక్తిగత సత్తా, మోడీ అండ తనకు వరంగా భావించిన ఈ కోటీశ్వరుడికీ ఓటమి తప్పలేదు. ఇదే స్థానం నుంచి మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ పడ్డ డీఎంకే కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్‌కు కూడా మిగిలింది నిరాశే. తన అక్క ప్రేమలత, బావ విజయకాంత్ ఆశీస్సులు, మోడీ ప్రచారం తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని భావించిన డీఎండీకే యువజన విభాగం అధినేత ఎల్కే సుదీష్‌కు పరాభవం తప్పలేదు. తెన్‌కాశిలో ఒంటరిగా బరిలో దిగినప్పుడే తన సత్తాను చాటుకున్న పుదియ తమిళగం కట్చి అధినేత కృష్ణ స్వామికి ఈ సారి మిగిలింది కన్నీళ్లే. కొంగు సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌తో నిండిన లోక్ సభ స్థానం పొల్లాచ్చిని బీజేపీ కూటమిలో పెద్ద సమరమే చేసి కొంగు మక్కల్ దేశీయ కట్చి దక్కించుకుంది. ఆ పార్టీ అధినేత ఈశ్వరన్‌కు ఈసారి ఆ సామాజిక వర్గం చుక్కలు చూపారు. పార్టీల అధినేతలే ఓడినప్పుడు, ఇక తామెంత అన్నట్టుగా మిగిలిన స్థానాల బరిలో నిలబడ్డ పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకేల అభ్యర్థులు పేర్కొనడం గమనార్హం. ఓటర్లు రాజకీయ పక్షాలకు మాత్రం భలే రుచి చూపించారన్న చర్చ హోరెత్తిస్తుండటం కొసమెరుపు. -
నవ శకానికి నాంది
మెతుకు సీమలో దశాబ్దాలుగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో గండిపడింది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సాటిలేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. జిల్లా రాజకీయ చరిత్రను తిరగేసి చూస్తే అంతా కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. 2009 సార్వత్రిక ఎన్నికల వరకు చెక్కు చెదరని ఈ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది. రెండు లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాలల్లో విజయం సాధించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ మునుపటి ప్రభావాన్ని కోల్పోగా, టీఆర్ఎస్ శకం ఆరంభమైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సాక్షి, సంగారెడ్డి: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరగరాసింది. రచ్చ గెలిచి ఇంట గెలవచ్చని రుజువు చేసి చూపింది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాపై ఆ పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ‘పురిటిగడ్డపై టీఆర్ఎస్ బలహీనం’ అనే విమర్శలకు చెక్ పెట్టింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మెదక్ లోక్‌సభ, సిద్దిపేట అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్న ఉద్యమ పార్టీ.. ఈ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాలను కైవసం చేసుకుని జిల్లా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. నడిపించే నాయకుడు లేకే.. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి వీచడంతో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ లోక్‌సభతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలిగింది. వైఎస్ మరణం తర్వాత ఆ లోటును పూడ్చే నేతలెవరూ లేక కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా జిల్లాలో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ఏళ్లతరబడి తమ నిర్ణయాన్ని నాన్చుతూ వచ్చింది. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపినా, అప్పటికే పరిస్థితులు ‘చెయ్యి’ దాటిపోయాయి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేననే నినాదంతో ఆ పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నా ఓటర్లు మాత్రం నమ్మలేదనే తెలుస్తోంది. టీ-కాంగ్రెస్ ‘ముఖ్య’నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డిలతో సహా జిల్లాలో ఆ పార్టీకి చెందిన 6 మంది సిట్టింగ్ శాసన సభ్యులు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో మట్టి కరవడం దీనికి అద్దం పడుతోంది. బొటాబొటి ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను నిలుపుకున్నా..ఆ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి హోరాహోరీ పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కే మాణిక్ రావుపై 842 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గి బతుకు జీవుడా అంటూ గట్టెక్కారు. ఓట్లు రాల్చిన ‘ప్రత్యేక’ పోరాటం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని టీఆర్ఎస్ అభ్యర్థులు చేసుకున్న ప్రచారం ఓట్ల వర్షాన్ని కురిపించింది. మెతుకు సీమ ఓటర్లు సైతం తెలంగాణవాదానికే ఓటేయడంతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులందరూ రికార్డు మెజారిటీని సాధించారు. తుడిచిపెట్టుకుపోయిన పచ్చపార్టీ ఇక 2009 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ-బీజేపీ కూటమిని సైతం జిల్లా ఓటర్లు తిరస్కరించడంతో ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొత్తానికి 2014 ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని చెప్పవచ్చు. -
తలైవర్‌ను మించిన తలైవి
చెన్నై, సాక్షి ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల్లో రికార్డుల పరంపరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కొత్త భాష్యం చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ను మించిపోయే ఫలితాలను రాబట్టుకుని కొత్త రికార్డు నెలకొల్పారు. తమిళ ప్రజలు ఎంజీ రామచంద్రన్‌ను పురట్చీతలైవర్ (విప్లవనాయకుడు) అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన రాజకీయ వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలితకు పురట్చితలైవి (విప్లవనాయకి) అనే పేరుపెట్టేశారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన భార్య జానకి రామచంద్రన్ కొద్దికాలంలోనే పార్టీని జయ చేతుల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1982 ఎంజీఆర్ హయాంలోనే అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న జయ క్రియాశీలకంగా దూసుకెళ్లారు. ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనేక ఎన్నికలు వచ్చినప్పటికీ ఏ ఒక్కదాన్ని ఒంటరిగా ఎదుర్కోలేదు. పలు పార్టీల కూటమితో నెట్టుకొచ్చారు. అయితే తాజా ఎన్నికల్లో జయలలిత ఒంటరిపోరుకు సిద్ధమై 39 స్థానాల్లో 37 గెలుచుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యచకితులను చేసింది. పైగా రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 44శాతం ఓట్లు అన్నాడీఎంకేకు ప డటం మరో రికార్డుగా మారింది.అన్నాడీఎంకేకు 1,74,87,733 ఓట్లు పోలయ్యూయి. డీఎంకే 92,56,923 ఓట్లతో 26.7 శాతం దక్కించుకుంది. అంటే డీఎంకే కంటే అన్నాడీఎంకే 17 శాతం అధికంగా సాధించింది. 1962లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుతో 31 స్థానాల్లో గెలుపొంది 45.26 శాతం ఓట్లు సాధించగా, ఆ తరువాత తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే మాత్రమే ఒంటరిగా 44 శాతం ఓట్లను పొంది 50 ఏళ్ల రికార్డుకు చేరువైంది. 20 ఏళ్ల తరువాత వేలూరులో పాగా వేయగలిగింది.