వైరా నియోజకవర్గాన్ని..మోడల్‌గా తీర్చిదిద్దుతా
కొణిజర్ల, న్యూస్‌లైన్: నవ తెలంగాణ రాష్ట్రంలో వైరా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, మోడల్‌గా తీర్చిదిద్దుతానని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొం దిన తరువాత మొదటిసారిగా శనివారం కొణిజర్ల వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజర్ల సెంటర్‌లోని వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, విలేకరులతో ఆయన మా ట్లాడుతూ... అధిక మెజార్టీతో తనను గెలిపించిన వైరా నియోజకవర్గ ప్రజలకు, వైఎస్‌ఆర్‌సీపీ-సీపీఎం శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను వెనుక ఉండి నడిపించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైరా నియోజకవర్గ ప్రజలందరి తరఫున రుణపడి ఉంటానన్నారు. పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో, ఆయన సహాయ సహకారాలతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన వైరాలో అగ్నిమాపక కేంద్రం, సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పా టు చేయిస్తానని; వైరా రిజర్వాయర్ ద్వారా అన్ని మండలాల్లోకు తాగునీరందేలా కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలోగల గిరిజన తండాలు వైరా నియోజకవర్గం లో అనేకం ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని, తం డాల్లోని సమస్యలు తనకు తెలుసునని అన్నారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వ్యవసాయ సమస్యలపై దృష్టి పెడతానని; ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని అన్నారు. జూలూరుపాడు మండలంలోని పోలారం చెరువును పునర్నిర్మిస్తే సుమారు 14వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
ప్రజలందరికీ రుణపడి ఉంటా...
కారేపల్లి: తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే మదన్‌లాల్ అన్నారు. ఆయన శనివారం కారేపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కారేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని అన్నారు. తొలుత, మదన్‌లాల్‌కు ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల సెక్రటరీ కె.ఉపేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ రావూరి శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మా రోషయ్య, ఇమ్మడి తిరుపతిరావు పాల్గొన్నారు.
ఘన స్వాగతం
గొల్లెనపాడు (వైరా): ఎమ్మెల్యేగా ఎన్నికైనం అనంతరం శనివారం గొల్లెనపాడుకు తొలిసారిగా వచ్చిన బాణోత్ మదన్‌లాల్‌కు వైఎస్‌ఆర్ సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ఇంటింటికీ మదన్‌లాల్ వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్‌సీఎం చర్చిలో ప్రార్థన చేశారు. గ్రామంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ గ్రామస్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
తొలి వినతిపత్రం స్వీకరణ
ఎమ్మెల్యేగా తొలి వినతిపత్రాన్ని మదన్‌లాల్ స్వీకరించారు. స్థానిక ఇబ్బందులను, అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చా రు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు.
సీపీఎం నాయకులతో సమావేశం
వైరాలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో మదన్‌లాల్ సమావేశమయ్యారు. తన విజయానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు గుమ్మా రోషయ్య, తన్నీరు నాగేశ్వరరావు, తేలప్రోలు నర్సింహా రావు, తాతా నిర్మల, వెంపటి చంద్రశేఖర్, వెంకటయ్య, ఏసు, సీపీఎం నాయకులు ఆళ్ళ వెంకట్రావ్, చిత్తారి రాంబాబు, మేకల వెంకటేశ్వర్లు, ఈరుపార్శపు భాస్కర్‌రావు, ఖాసీం, ఖానాపురం మారుబొయిన ఏడుకొండలు, వేమిరెడ్డి వెంకటకోటరెడ్డి, విజయలక్ష్మి, వేల్పుల రామారావు, ప్రగడవరపు పాపయ్య, యాదయ్య, వెంకటనారాయణ, గొల్లపూడి సర్పంచ్ ముత్తారపు కళావతి తదితరులు పాల్గొన్నారు.