ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు.
67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు.
ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్‌బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.