కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి హైకమాండే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతులే విమర్శించారు. పార్టీ పరిస్థితి ఇలా ఉందంటే దానికి అధిష్టాన పెద్దలే కారకులని ఆయన దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారకులెవరని ప్రశ్నించగా ఆయనీవిధంగా స్పందించారు. 206 ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ 44 స్థానాలకు పడిపోయింది. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలుండగా 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. సొంత రాష్ట్రంలో పార్టీ ఓటమిపై మాట్లాడేందుకు అంతులే నిరాకరించారు.