న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దీనిపై బీజేపీ వైఖరిపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాకే స్పష్టత వస్తుందన్నారు. ‘కొన్ని రాష్ట్రాల్లో నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీని ప్రకారం నవంబర్, డిసెంబర్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిపేందుకు బీజేపీ యోచన చేస్తుండవచ్చు. పూర్తికాలం పని చేసిన మహారాష్ట్ర వంటి అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు జరిపితే వచ్చే లాభ, నష్టాలపైనా బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి, ఆ పార్టీ ముందుగానే ఎన్నికలకు మొగ్గు చూపకపోవచ్చు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అయితే, ఆ పార్టీ తమ శ్రేణులకు ఇస్తున్న సంకేతాలను బట్టి ఈ వర్షాకాల సమావేశాలే పార్లమెంట్ ఆఖరి సమావేశాలు అనిపిస్తోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment