61 మంది మహిళా ఎంపీలు | 61 women elected to Lok Sabha | Sakshi
Sakshi News home page

61 మంది మహిళా ఎంపీలు

Published Sun, May 18 2014 3:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

61 women elected to Lok Sabha

గత లోక్‌సభ కన్నా 16వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగింది. 2009 ఎన్నికల్లో 59 మంది మహిళలు ఎంపీలవగా.. ప్రస్తుతం 61 మంది మహిళలు(11%) లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. మహిళలు కోరుతున్న 33% ప్రాతినిధ్యానికి ఇది చాలా తక్కువ. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది, లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. అయితే, ఇప్పటివరకు అధిక సంఖ్యలో మహిళా సభ్యులను కలిగి ఉన్న లోక్‌సభ ఇదే కావడం విశేషం. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, ఉమాభారతి, డింపుల్‌యాదవ్, హేమమాలిని, మున్‌మున్‌సేన్.. తదితరులు ఈ ఎన్నికల్లో గెలిచినవారిలో ఉన్నారు.
 ్ఞ    నూతన లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యుల్లో 55 ఏళ్ల వయసు దాటినవారు 47% ఉండగా, 40 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న ఎంపీలు 71 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement