Women MPs
-
Lok Sabha Election Results 2024: మహిళా ఎంపీలు @ 74
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభకు మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 543 మంది సభ్యులు గల లోక్‌సభలో మహిళా ఎంపీలు 13.62 శాతం మాత్రమే. ఈ 74 మందిలో 30 మంది గత లోక్‌సభలోనూ సభ్యులు కాగా, ఒకరు రాజ్యసభ సభ్యురాలు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీచేయగా... బీజేపీ అత్యధికంగా 69 మందిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ 41 మంది మహిళలకు టికెట్లిచి్చంది. చట్టసభల్లో 33 శాతం సీట్లను రిజర్వు చేసే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పోందాక జరిగిన తొలి ఎన్నికలివి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు. బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సుప్రియా సూలే, ఎప్సీ నుంచి డింపుల్ యాదవ్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లాలూ కూతురు మీసా భారతి తొలిసారిగా నెగ్గి దేశం దృష్టిని ఆకర్షించారు. సమాజ్‌వాది పార్టీ నుంచి 25 ఏళ్ల ప్రియా సరోజ్ (మచిలీషహర్), 29 ఏళ్ల ఇర్కా చౌదరి (కైరానా)లు లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయసు మహిళా ఎంపీలు. దేశంలో అత్యధిక మంది మహిళా ఎంపీలను లోక్‌సభకు పంపిన రాష్ట్రంగా పశి్చమబెంగాల్ నిలిచింది. బెంగాల్ నుంచి గెలిచిన 11 మంది మహిళా ఎంపీలూ టీఎంసీ వారే కావడం విశేషం. భారత లోక్‌సభ చర్రితలో అత్యధికంగా 17వ లోక్‌సభలో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దక్షిణాఫ్రికాలో 46 శాతం, యునైటెడ్ కింగ్డమ్లో 35 శాతం, అమెరికాలో 29 శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు. -
Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) ఆదర్శంగా నిలిచింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానమిచ్చి గౌరవించింది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుంటే ఏడు చోట్ల మహిళలకు అవకాశం ఇచి్చంది. అంటే వారికి 33 శాతం సీట్లు కేటాయించింది. లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), శర్మిష్ట సేథీ (జజ్పూర్), మంజులా మండల్ (భద్రక్), రాజశ్రీ మల్లిక్ (జగత్సింగ్పూర్), పరిణీతి మిశ్రా (బార్గఢ్), కౌసల్యా హికాక (కోరాపుట్), రంజితా సాహూ (ఆస్క)కు టికెట్లిచ్చింది. అదే సమయంలో టికెట్ల కేటాయింపులో ఫిరాయింపుదారులకు కూడా పెద్ద పీట వేసి విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడుగురు మహిళలకు బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ టికెట్లివ్వడం గమనార్హం. ఈసారి బీజేడీ నుంచి బరిలోకి దిగిన ఏడుగురు మహిళా అభ్యర్థుల్లో బీజేపీ నుంచి వచి్చన లేఖశ్రీ సమంత్ సింగార్ కూడా ఉన్నారు. ఆమె బాలాసోర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఏడుగురు బీజేడీ మహిళా అభ్యర్థుల్లో ఇద్దరు పార్టీ ఫిరాయింపుదారులున్నారు! ఈ విడత ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎంపీలు చంద్రాణి ముర్ము (కియోంజర్), ప్రమీలా బిసోయ్ (ఆస్క)లకు నవీన్ టికెట్లివ్వలేదు. ఫిరాయింపుదారులకూ 33 శాతం ఒకరిద్దరు కాదు.. బీజేడీ ఈ విడత ఏకంగా 38 శాతం మంది ఫిరాయింపుదారులను లోక్‌సభ బరిలో దింపడం ఆశ్చర్యకరం. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇతర పారీ్టల నుంచి వచి్చచేరిన వారే! లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), భృగు బాక్సిపాత్ర (బెర్హాంపూర్), ప్రదీప్ మాంఝి (నబరంగ్‌పూర్), సురేంద్ర సింగ్ భోయ్ (బోలంగీర్), పరిణీత మిశ్రా (బార్గఢ్), ధనర్జయ్ సిధు (కియోంఝర్), అన్షుమన్ మహంతి (కేంద్రపర), మన్మోత్ రూట్రే (భువనేశ్వర్) ఇతర పారీ్టల నుంచి వచ్చి బీజేడీ టికెట్ సంపాదించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
మహిళలను లోక్‌సభకు పంపే విషయంలో ఢిల్లీ పేలవమైన రికార్డు మూటగట్టుకుంది. స్వాతం్రత్యానంతరం ఇప్పటిదాకా నగరం నుంచి ఎంపీలుగా ఎన్నికైన మహిళలు కేవలం తొమ్మిది మంది మాత్రమే! రాజధాని నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపలానీ నిలిచారు. ఆమె 1952లో తొలి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1957లో కూడా గెలిచారు. 1963లో ఆమె యూపీ సీఎం అయ్యారు. మళ్లీ తొమ్మిదేళ్లకు 1971లో సుభద్రా జోషీ, ముకుల్ బెనర్జీ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సుభద్ర లోక్‌సభ ఎంపీ అయిన తొలి పంజాబీ మహిళ కూడా. ఆమె 1962లో యూపీలోని బలరాంపూర్‌లో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ఓడించడం విశేషం. తర్వాత 1980లో సుందర్వతీ నావల్ ప్రభాకర్ చాందినీచౌక్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అనంతరం 1996, 1998 ఎన్నికల్లో మీరాకుమార్, సుష్మా స్వరాజ్ ఎంపీలయ్యారు. లోక్‌సభ తొలి మహిళా స్పీకర్‌గా మీరాకుమార్ నిలవగా, ఢిల్లీ నుంచి తొలి కాంగ్రెసేతర మహిళా ఎంపీగా సుష్మా స్వరాజ్ రికార్డులెక్కారు. 1999లో బీజేపీకి చెందిన అనితా ఆర్య కరోల్ బాగ్ నుంచి గెలుపొందారు. 2004, 2009ల్లో కాంగ్రెస్‌కు చెందిన కృష్ణ తీర్థ్ ఢిల్లీ నుంచి ఎంపీ అయ్యారు. 2014, 2019ల్లో మీనాక్షి లేఖి బీజేపీ నుంచి న్యూఢిల్లీ స్థానంలో నెగ్గారు. బీజేపీ నుంచి బరిలో ఇద్దరు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీ నుంచి లోక్‌సభ బరిలో దిగినా ఓటమి చవిచూశారు. ఈసారి బీజేపీ సుష్మా స్వరాజ్ కూతురు బాసురి (న్యూఢిల్లీ), కమల్జీత్ షెరావత్ (వెస్ట్ ఢిల్లీ) రూపంలో ఇద్దరు మహిళలకు ఢిల్లీలో టికెట్లిచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఒక్క మహిళకు కూడా ఢిల్లీలో అవకాశమివ్వలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మహిళా ఎంపీలపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారంటూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఏం జరిగింది అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ నేత శశి థరూర్ తన ట్విటర్లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. Who says the Lok Sabha isn’t an attractive place to work? With six of my fellow MPs this morning: @supriya_sule @preneet_kaur @ThamizhachiTh @mimichakraborty @nusratchirps @JothimaniMP pic.twitter.com/JNFRC2QIq1 — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ‘‘బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్ కామెంట్ చేయడం ఎంత వరకు సబబు. అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరీ ఇదేంటి సార్’’ అంటూ ఓ రేంజ్లో శశి థరూర్‌ని ట్రోల్ చేశారు నెటిజనులు. (చదవండి: ఐటీఐఆర్.. లేదంటే అదనపు ప్రోత్సాహకం ) సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్ కావడంతో శశి థరూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. (చదవండి: శశిథరూర్ ఇంగ్లీష్‌పై ఫన్నీ వీడియో.. నెక్స్ట్ ఇమ్రాన్ ప్లీజ్!) The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB — Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021 ఈ సెల్ఫీలో శశి థరూర్‌తో పాటు టీఎంసీకి చెందిన నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, కాంగ్రెస్‌కి చెందిన జోతిమణి, తమిజాచి తంగపాండియా ఉన్నారు. చదవండి: మోదీ కన్నీళ్లపై కాంగ్రెస్ ఎంపీ ఫన్నీ కౌంటర్ -
స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారు’’ అని అన్నారు. -
చిన్నారుల సంక్షేమంపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ మహిళా ఎంపీలను కోరారు. బీజేపీకి చెందిన 30 మందికి పైగా మహిళా ఎంపీలతో శుక్రవారం ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రతి వారూ తమ నియోజకవర్గం పరిధిలోని చిన్నారుల ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారలోపం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి మహిళా ఎంపీ ఒక వ్యవస్థ వంటి వారని, ప్రజలతో సులభంగా మమేకం కాగలిగిన అద్భుత నైపుణ్యం మహిళల సొంతమన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానితో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అధికార పార్టీకి చెందిన ఎంపీలతో ప్రధాని మోదీ జరుపుతున్న వరుస భేటీల్లో ఇది ఐదోది. ఇప్పటి వరకు ఆయన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యువ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల ద్వారా ఉభయ సభలకు చెందిన పార్టీలోని అన్ని వర్గాల ఎంపీలు ప్రధానితో పరిచయం చేసుకోవడంతోపాటు నేరుగా వివిధ అంశాలపై చర్చలు జరిపే అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కొత్త ముఖాలు.. కొన్ని విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. 300 మంది మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం 542 మంది సభ్యులు ఎన్నికకాగా వారిలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం ఎంపీల్లో వారి శాతం 14 శాతం. గత లోక్‌సభలో వారి శాతం 12 శాతం ఉండగా, ఈసారి 14 శాతానికి చేరుకోవడం ఓ విశేషమే. మొదటిసారి ఎన్నికైన వారిలో అమిత్ షా భారతీయ రాజకీయాల్లో ఆరితేరిన వారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కరడుగట్టిన హిందూత్వ వాదిగా సుపరిచితురాలు. ఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీలు గౌతమ్ గంభీర్, హన్స్ రాజ్ హన్స్ సెలబ్రిటీలుగా ముందుగానే సుపరిచితులు. మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల గురించి కొన్ని విశేషాలు. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా, ఎన్డీయే చైర్మన్‌గా గత ఐదేళ్లుగా దేశ క్రియాశీలక రాజకీయాలను నిర్వహిస్తోన్న అమిత్ షా మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుజరాత్ వ్యాపారవేత్త కుమారుడైన అమిత్ షా చిన్నతనంలోనే ఆరెస్సెస్ శాఖలో చేరారు. 1986లో బీజేపీలో చేరారు. 1997లో తన 33వ ఏట మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మోదీ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు. 2017లో రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయ్యారు. 1990 నుంచి మోదీకి అత్యంత సన్నిహితంగా ఉన్నాయన అటు గుజరాత్, ఇటు దేశంలో బీజేపీ బలపడేందుకు కృషి చేశారు. సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసుతోపాటు పలు హత్య కేసుల్లో నిందితుడు. వేటిలోను శిక్ష పడలేదు. జ్యోతిమని ఎస్. తమిళనాడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ జ్యోతిమని. అన్నామలైన యూనివర్శిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ చదవిన 43 జ్యోతిమని ప్రముఖ కథా రచయిత్రి. ఆమె రాసిన చిన్న కథలు చాలా పాపులర్. 22వ ఏటనే కాంగ్రెస్ యువజన పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించిన ఆమె, నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబీదురైని ఏకంగా 4, 20,546 ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో తంబిదురై పైనే ఆమె పోటీచేసి ఓడిపోయారు. రమ్య హరిదాస్ 32 ఏళ్ల రమ్య హరిదాస్ దళిత మహిళ. కేరళలోని అలథూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచేవరకు ఆమె పెద్దగా ఎవరికి తెలియదు. లైంగిక వేధింపులు, క్యారెక్టర్ హత్యా ప్రయత్నాలకు ఆమె ఎదురొడ్డి నిలిచారు. ఈసారి కేరళ నుంచి ఎన్నికైన ఏకైక మహిళ కాగా.. ఇంతవరకు కేరళ నుంచి ఎన్నికైన రెండో దళిత మహిళ. మహువా మొహిత్రా బీజేపీకి బాకా ఊదే టెలివిజన్ న్యూస్ యాంకర్ ఆర్నాబ్ గోస్వామికి ‘మధ్య వేలు’ చూపిస్తున్న వీడియో వైరల్ అవడంతో ఆమె గురించి మొదటిసారి ప్రపంచానికి తెలిసింది. కోల్‌కతాలో జన్మించిన మొహిత్రా అమెరికాలో చదువుకుని జేపీ మోర్గాన్ వద్ద పనిచేశారు. బ్యాంకర్‌గా ప్రశంసలు అందుకున్న ఆమె తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి బీజేపీ అభ్యర్థి, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేను 65 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. తేజస్వీ సూర్య బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుడు తేజస్వీ సూర్య (28). వత్తిరీత్యా న్యాయవాది అయిన సూర్య, బీజేపీ నాయకులు బీఎస్ యడ్యూరప్ప, ప్రతాప్ సింహా కేసులను వాదించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీకి కార్యదర్శిగా పనిచేసిన సూర్య, ఆ తర్వాత బీజేపీ యువ మోర్చాలో కూడా పనిచేశారు. కర్ణాటక బీజేపీ ఐటీ సెల్లో కూడా పనిచేశారు. ఇంతియాజ్ జలీల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసీ ఇంతియాజ్ జలీల్ మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ జర్నలిస్ట్ అయిన జలీల్ 2014లో ఔరంగాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన ప్రముఖుడిగా మారిపోయారు. ఏఐఎంఐఎం కూటమి ఒప్పందాల్లో భాగంగా వేరే వ్యక్తిని నిలబెట్టాలనుకున్నారు. అలాగయితే తాను స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తానని హెచ్చరించడంతో జలీల్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయాల్సి వచ్చింది. జలీల్ సీనియర్ శివసేన నాయకుడు చంద్రకాంత్ ఖైరేను ఓడించారు. -
మహిళా ఎంపీలు 78 మంది
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 78గా ఉంది. అంటే మొత్తం లోక్‌సభ ఎంపీల్లో మహిళల సంఖ్య దాదాపు 14 శాతం. 16వ లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 62 మాత్రమే కాగా, ప్రస్తుతం అది 78కి పెరిగింది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఇది అతి స్వల్పం. రువాండా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏకంగా 61 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో చట్టసభల్లో 43 శాతం మంది, యూకేలో పార్లమెంటులోనూ 32 శాతం మంది మహిళలు ఉన్నారు. అమెరికాలో 24 శాతం, బంగ్లాదేశ్‌లో 21 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కొత్త ంపీలపై పీఆర్ఎస్ ఇండియా సంస్థ ఒక విశ్లేషణను విడుదల చేసింది. ఆ వివరాలు.. 300 మంది తొలిసారి ఎన్నికైన వారే తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన వారు కొత్త సభలో 300 మంది ఉన్నారు. 16వ లోక్‌సభలో ఈ సంఖ్య 314. 16వ లోక్‌సభలో సభ్యులుగా ఉండి, మళ్లీ 17వ లోక్‌సభకు కూడా ఎన్నికైన వారి సంఖ్య 197 కాగా, మరో 45 మంది 16వ లోక్‌సభలో కాకుండా, అంతకు ముందు సభల్లో సభ్యులుగా ఉన్నవారే. -
28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..
న్యూఢిల్లీ: 41 మంది సిట్టింగ్ మహిళా ఎంపీల్లో 28 మంది మహిళా ఎంపీలు ముందంజలో ఉన్నారు. సోనియా గాంధీ, హేమ మాలిని, కిరణ్ ఖేర్ వం టి సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని పదిల పరచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే స్మృతీ ఇరానీ, ప్రజ్ఞా ఠాకూర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాయ్ బరేలి నుంచి కాంగ్రె స్ ఎంపీ సోనియా గాంధీ, పిలిభిత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ మేనకా గాంధీ, మధుర బీజేపీ ఎంపీ మాలిని, చంఢీగఢ్ బీజేపీ అభ్యర్థి ఖేర్, కనౌజ్ ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి వంటి ప్రముఖులు ముందంజ లో ఉన్నారు. కాగా, అసన్సోల్ నుంచి బంకుర టీఎమ్సీ ఎంపీ మున్ మున్ సేన్, కాంగ్రెస్ సిల్చర్ ఎంపీ సుస్మితా దేవ్, సుపాల్ కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్, బర్ధమాన్–దుర్గాపూర్ టీఎంసీ అభ్యర్థి మమ్తాజ్ సంఘమిత్ర, హూగ్లీ టీఎంసీ ఎంపీ అభ్యర్థి రత్న డే, లాల్గంజ్ ఎంపీ నీలం సోన్కార్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ నుంచి లీడింగ్‌లో ఉన్న మహిళా సిట్టింగ్ ఎంపీలు 16 మంది కాగా, కాంగ్రెస్ నుంచి కేవలం సోనియా గాంధీ మాత్రమే లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలా భావించే అమేథీలో స్మృతి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ రాహుల్ గాంధీపై చారిత్రక విజయాన్ని నమోదు చేయనున్నారు. కాగా భోపాల్ వివాదాస్పద బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా తన ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ముందంజలో ఉన్నారు. అలాగే తూత్తుకూడి డీఎంకే అభ్యర్థి కనిమొళి కరుణానిధి, ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ గెలుపుబాటలో ఉన్నారు. టీఎంసీ తరపున పోటీ పడుతున్న బెంగాళీ నటి లాకెట్ చటర్జీ హూగ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 54 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 53 మంది మహిళలు పోటీపడ్డారు. యూపీ నుంచి అత్యధికంగా 104 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఇప్పటివరకు 666 మంది అభ్యర్థులే..!
ఎన్నికల్లో గెలుపునకు మహిళామణుల ఓట్ల కోసం ఫీట్లు చేసే పార్టీలు సీట్ల కొచ్చేసరికి ప్లేటు ఫిరాయిస్తున్నాయి. అతివల ఓట్లతో గట్టెక్కిన ఈ నేతలు చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు అనేసరికి అడ్డుపుల్ల వేస్తున్నారు. మూడోవంతు మాటెలా ఉన్నా మన చట్ట సభల్లో మహిళామణుల వాటా కనీసం పదోవంతు కూడా దాటడం లేదు. స్వాతంత్య్రం అనంతరం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతున్నా అది నామమాత్రమే. పార్టీలు మహిళలకు టిక్కెట్లిస్తున్నా ప్రత్యర్థుల అంగబలం, అర్థబలం ముందు వారు నిలబడలేకపోతున్నారు. 1957 నుంచి లోక్‌సభకు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే మహిళలకు జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్ని పెంచాయి. 1957లో లోక్‌సభకు పోటీచేసిన మహిళల సంఖ్య రెండంకెలు ఉంటే.. ఇప్పుడది మూడంకెలకు చేరింది. అయితే గెలుపొందే మహిళల సంఖ్య మాత్రం రెండంకెలు దాటడం లేదు. స్వతంత్రులుగా బరిలో దిగితే వారి విజయం కష్టమే. 1967 లోక్‌సభ ఎన్నికల్లో పది మంది మహిళలు స్వతంత్రులుగా పోటీ చేస్తే ఇద్దరు విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో 78 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగితే ఒకరు మాత్రమే గెలుపొందారు. 1996లో నల్గొండ నుంచి 60 మంది మహిళల పోటీ 2009లో దేశవ్యాప్తంగా 556 మంది మహిళలు లోక్‌సభకు పోటీ చేయగా 59 మంది విజయం సాధించారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎన్నికయ్యారు. 2014లో 668 మంది పోటీ చేస్తే 62 మంది గెలుపొందగా, రాష్ట్రం నుంచి 43 మంది బరిలో ఉంటే ముగ్గురు మాత్రమే విజయం దక్కించుకున్నారు. ఫ్లోరైడ్ సమస్యను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో 1996లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి జలసాధన సమితి తరపున 60 మంది మహిళలు స్వతంత్రులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 90 మంది మహిళలు పోటీ చేస్తే ముగ్గురు విజయం సాధించారు. – పి. మాణిక్యాలరావు, సాక్షి, అమరావతి -
పే మీటూ.. ఆన్లైన్లో కొత్త ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరూ చేసేది ఒకటే పని, ఒకటే శ్రమ.. కానీ వేతనం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఎంతో వ్యత్యాసం.. పంటపొలాల్లో శారీరక శ్రమ చేసే మహిళల దగ్గర్నుంచి కార్పొరేట్ సంస్థల్లో సీఈవోల వరకు రంగం ఏదైనప్పటికీ వేతనాల్లో వివక్ష చాలా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు ఎప్పటికప్పుడు గణాంకాలతో సహా బయటపెడుతూనే ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళలకు సమాన వేతనం ఇవ్వడం లేదంటూ బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్లో పేమీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమమే మొదలైంది. బ్రిటన్‌లో స్త్రీ,పురుష వేతనాల్లో వ్యత్యాసాలను బయటపెట్టడానికి, తమ శ్రమ ఎంత దోపిడికి గురవుతోందో మహిళల్లో చైత్యన్యం తీసుకురావడానికి, మహిళలకు ఎందుకు సమానంగా వేతనాలు ఇవ్వడం లేదంటూ యాజమాన్యాలను నిలదీయడానికి లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెలా క్రీజీ నేతృత్వంలో కొందరు ఎంపీలు పే మీటూ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. పేమీటూ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే కాదు, సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. 250కి పైగా ఉద్యోగులు ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ ఒక గంట పనికి మహిళలకు, పురుషులకు చెల్లించే వేతనాల్లో ఎంత వ్యత్యాసం ఉందో తప్పనిసరిగా బయటపెట్టాలంటూ బ్రిటన్ కొత్తగా చట్టం చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 4వ తారీకున డెడ్‌లైన్ విధించింది.. దీంతో చాలా కంపెనీల్లో మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్ష వెలుగులోకి వచ్చింది. వేతనాల్లో తేడా ఎంత ? బ్రిటన్‌లో పురుషుల, మహిళల వేతనాల్లో వ్యత్యాసం భారీగా ఉంది. మహిళలు అత్యధికంగా పనిచేసే రిటైల్ రంగంలో వేతనాల్లో వ్యత్యాసం ఏకంగా 50శాతం ఉంది. ఇక శ్రామిక రంగంలో 18 శాతం, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో 59శాతం వేతనాల్లో వ్యత్యాసం ఉంది. మొత్తంగా 78 శాతం కంపెనీల్లో మహిళల కంటే పురుషుల వేతనాలే ఎక్కువ.. అటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మహిళల వేతనాల్లో వివక్ష ఉందని తేటతెల్లమైంది. తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థల గణాంకాలను పరిశీలిస్తే ఒకే హోదాలో పనిచేసే పురుషుల కంటే మహిళలకు 14 శాతం వేతనం తక్కువగా వస్తోంది. తన తోటి పురుష ఎంపీకన్నా తనకి 10 వేల పౌండ్ల వేతనం తక్కువ వస్తోందని ఎంపీ ట్యూలిప్ సిద్దిక్ ఆవేదన వ్యక్తం చేయడం అక్కడ పరిస్థితుల్ని తేటతెల్లం చేస్తోంది. ఉద్యమానికి భారీగా మద్దతు వేతనాల్లో వ్యత్యాసాన్ని అంకెల రూపంలో బయటపెట్టేలా ప్రైవేటు కంపెనీలపై ఒత్తిడి పెంచడమే కాకుండా, ఆ తర్వాత సమాన వేతనం కోసం ఎలా పోరాటం చేయాలన్నదానిపై కార్యాచరణ రూపొందించం కోసం పేమీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఈ ఉద్యమానికి పార్టీలకతీతంగా అందరి మద్దతు లభిస్తోంది. ప్రజాప్రతినిధులే స్వయంగా ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టడంతో తక్కువ వేతనం తీసుకుంటూ ఏమీ చేయలేని నిస్సహాయంగా ఉండిపోయే మహిళల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టడానికి అవకాశం లభించినట్టయింది. ఈ ఉద్యమం ద్వారా మహిళలకు రుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా పార్లమెంటులో చర్చకు పెడతామని ఎంపీ స్టెల్లా క్రీజీ చెబుతున్నారు.‘ వేతనాల్లో వ్యత్యాసాలపై బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కితే తమ కెరీర్‌పై ఎక్కడ ప్రభావం చూపిస్తోందని చాలా మంది మహిళలు భయపడే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. వారిలో ఆ భయాందోళనలను తగ్గించి వారికెదురైన అనుభవాలు చెబితే పార్లమెంటు వేదికగా వారి సమస్యల్ని పరిష్కరించగలమని‘ క్రీజీ చెప్పుకొచ్చారు. మహిళా ఉద్యోగులకు సూచనలు వేతనాల్లో వ్యత్యాసం ఎంత ఉందో తెలుసుకోవడమే కాదు, అలా ఎందుకు వివక్ష చూపిస్తున్నారంటూ యాజమాన్యాలను ప్రశ్నిద్దాం అంటున్నారు బ్రిటన్ ఎంపీలు. భవిష్యత్ కార్యాచరణపై మహిళా ఉద్యోగులు ఏం చెయ్యాలో చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని సూచనలు చేశారు. మీ సంస్థలో పనిచేసే తోటి పురుషులకు ఎంత జీతం వస్తోందో కనుక్కోండి వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించడానికి యాజమాన్యాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలుసుకోండి. జెండర్ పే గ్యాప్‌కు సంబంధించిన యూనియన్లలో చేరండి. ఇప్పటికే యూనియన్ సభ్యులైతే వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించేలా యాజమాన్యాలపై ఒత్తిడి పెంచడానికి వాళ్లేం చేస్తున్నారో అడిగి తెలుసుకోండి. ప్రతీ కంపెనీలో మహిళా నెట్‌వర్క్‌లను ప్రారంభించండి. పోరాటాన్ని ఉధృతం చేయండి. వేతనంలో వ్యత్యాసంపై మీ అనుభవాలను పేమీటూ సర్వేలో పంచుకోండి. అప్పుడే సమాన వేతనాలు లభించేలా పార్లమెంటులో పోరాడేందుకు అవకాశం ఉంటుందని ఎంపీలు చెబుతున్నారు. భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది ? అటు భారత్‌లో కూడా వేతనాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది.. ఒకే హోదాలో, ఒకే పనిచేస్తున్న పురుషుల కంటే మహిళల వేతనాలు 20 శాతం తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం నాటితో పోల్చి చూసే పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ సమాన వేతనం అన్నది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. పనిచేసే కార్యాలయాల్లో సీనియారిటీ, అనుభవం పెరిగిన కొద్దీ మహిళలకొచ్చే వేతనం తగ్గిపోతోంది. ఉద్యోగాల్లో రెండేళ్ల అనుభవం ఉన్న పురుషులకి, మహిళల కంటే 8శాతం వేతనం ఎక్కువగా వస్తే, పదకొండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్న పురుషులు మహిళల కంటే ఏకంగా 25శాతం ఎక్కువ వేతనం లభిస్తోంది. సమాన హక్కుల కోసం మహిళలు చేస్తున్న పోరాటంలో ఇప్పుడు ఈ పేమీటూ ఉద్యమం మరో ముందడుగేనన్న ఆశ అందరిలోనూ కలుగుతోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రెండోరోజు మహిళా ఎంపీల తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ : మహిళల వస్త్రధారణపై టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. మురళీ మోహన్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెద్దల సభ ప్రారంభమైన వెంటనే మురళీ మోహన్ వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను 15 నిమిషాలు వాయిదా పడింది. -
61 మంది మహిళా ఎంపీలు
గత లోక్‌సభ కన్నా 16వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగింది. 2009 ఎన్నికల్లో 59 మంది మహిళలు ఎంపీలవగా.. ప్రస్తుతం 61 మంది మహిళలు(11%) లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. మహిళలు కోరుతున్న 33% ప్రాతినిధ్యానికి ఇది చాలా తక్కువ. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది, లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. అయితే, ఇప్పటివరకు అధిక సంఖ్యలో మహిళా సభ్యులను కలిగి ఉన్న లోక్‌సభ ఇదే కావడం విశేషం. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, ఉమాభారతి, డింపుల్‌యాదవ్, హేమమాలిని, మున్‌మున్‌సేన్.. తదితరులు ఈ ఎన్నికల్లో గెలిచినవారిలో ఉన్నారు. ్ఞ నూతన లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యుల్లో 55 ఏళ్ల వయసు దాటినవారు 47% ఉండగా, 40 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న ఎంపీలు 71 మంది ఉన్నారు.