Representation of women
-
రాజ్యసభ వైస్ చైర్పర్సన్లలో సగం మంది మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్పర్సన్ల ప్యానెల్లో సగం మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన గురువారం ప్రకటించారు. కొత్తగా ఉపాధ్యక్షులైన రాజ్యసభ సభ్యుల్లో పీటీ ఉష, ఎస్.ఫంగ్నొన్ కొన్యాక్, ఫౌజియా ఖాన్, సులాటా దియో, వి.విజయసాయిరెడ్డి, ఘన్‌శ్యామ్ తివారీ, ఎల్.హనుమంతయ్య, సుఖేందు శేఖర్ రే ఉన్నారు. నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళ కొన్యాక్ సహా ప్యానెల్లోకి తీసుకున్న మహిళా సభ్యులందరూ మొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన వారే. ఎగువసభ చరిత్రలో వైస్ చైర్పర్సన్ల ప్యానెల్లోకి సగం మందికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే ప్రథమం అని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. -
శాస్త్ర అస్త్రాలతో...
శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం, వారి విజయాల గురించి తలచుకునే అవకాశం ఇస్తుంది.. ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ డే ఫర్ వుమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ దినోత్సవం. డా. ఏ.సీమ కేరళ త్రిసూర్‌లోని ‘సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి–మెట్) విభాగంలో సైంటిస్ట్. ఒకసారి ఆమె ‘మలబార్ క్యాన్సర్ సెంటర్’కు వెళ్లినప్పుడు ఆ సంస్థ డైరెక్టర్ ‘బ్రెస్ట్ క్యాన్సర్’ గురించి తనతో కొంతసేపు మాట్లాడారు. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పరీక్షలు చేయించుకోవడానికి మహిళలు చొరవ చూపకపోవడం వెనుక ఉన్న పరిమితులు తెలిశాయి. ఈ నేపథ్యంలో సీమ తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించగలిగే, ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాన్ని తయారు చేశారు. ఇలాంటి పరికరం దేశచరిత్రలోనే ప్రథమం. రేపటి విజయాల కోసం నిన్నటి విషయాలను గుర్తు చేసుకోవాలంటారు. అలా ఒకసారి వెనక్కి వెళితే... పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనంది బాయి, 1883లో ‘ఫస్ట్ ఫిమేల్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడికల్ హిస్టరీ’ (ఇండియా)గా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. సౌమ్య స్వామినాథన్.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిప్యూటి డైరెక్టర్‌గా ప్రపంచాన్ని మెప్పించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్‌దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తి ఇచ్చారు. విజ్ఞాన్ ప్రసార్ ‘విజ్ఞాన్ విదూషి’ (ఇండియన్ వుమెన్ సైంటిస్ట్స్) పుస్తకం స్పేస్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, సైన్స్ అడ్మినిస్ట్రేషన్.. మొదలైన శాస్త్రీయరంగాల రోల్‌మోడల్స్‌గా చెప్పుకునే మహిళల గురించి చెప్పడమే కాదు, వారు ఎలాంటి పరిమితులు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించడానికి చేసిన కృషి గురించి చెప్పడం ఈ తరానికి స్ఫూర్తి ఇస్తుంది. -
వారి ప్రాతినిధ్యం పెరగాలి
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఇతర ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ న్యాయ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోవింద్ ప్రసంగించారు. ‘ఉన్నత న్యాయ వ్యవస్థలో బలహీన వర్గాలైన మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అంత తక్కువగా ప్రాతినిధ్యం ఉండటం ఆమోదయోగ్యం కాదు. ఇతర సంస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలోని వైవిధ్యం ప్రతిబింబించేలా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించాలి’ అని కోవింద్ అన్నారు. ప్రతి నలుగురు జడ్జీల్లో ఒక్కరే మహిళ ఉన్నారన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులకు దూరంగానే పేదలు.. జిల్లా, సెషన్స్ కోర్టుల జడ్జీల నైపుణ్యాలు పెంచే గురుతర బాధ్యత ఉన్నత న్యాయ వ్యవస్థపైనే ఉందని కోవింద్ నొక్కిచెప్పారు. అలా అయితేనే చాలా మంది జిల్లా కోర్టుల జడ్జీలు హైకోర్టులు, సుప్రీంకోర్టులకు పదోన్నతులు పొందుతారని పేర్కొన్నారు. దీని వల్ల దిగువ కోర్టులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, ఫలితంగా హైకోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నా, ఖర్చు, విచారణల ఆలస్యానికి భయపడి పేదలు కోర్టుల్లో న్యాయ పోరాటం చేయడానికి వెనుకాడుతున్నారని కోవింద్ పేర్కొన్నారు. ధనికులు లొసుగులను అడ్డుపెట్టుకుని కేసులను సాగదీస్తున్నారని, కాలం చెల్లిన, పనికిరాని చట్టాలను రద్దుచేసి పాలనను సులభతరం చేయాలని చెప్పారు. సీజేఐ వర్సెస్ కేంద్ర మంత్రి న్యాయ వ్యవస్థ క్రియాశీలతపై కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడం న్యాయవ్యవస్థ పవిత్ర కర్తవ్యమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొనగా, ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు దూరంగా ఉన్నంత వరకూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గౌరవం ఉంటుందని చౌదరి అన్నారు. అలా కాకుండా న్యాయ క్రియాశీలత, సమీక్షల పేరుతో జోక్యం చేసుకుంటే మాత్రం పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయ స్వతంత్రత మూల స్తంభం వంటిదని, న్యాయ వ్యవస్థలోని జవాబుదారీతనం ఆ స్తంభానికి పునాది అని చెప్పారు. జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వ విభాగాలు ఉల్లంఘించకూడదని, హక్కులకు భంగం కలిగిన మరుక్షణం, వాటిని అతిక్రమించే ప్రమాదకర సంకేతాలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ పౌరుల పక్షాన నిలుస్తుందని అన్నారు. విధానపర నిర్ణయాలు చేయాలనే కోరిక న్యాయవ్యవస్థకు లేద ఆయన సమాధానమిచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విస్తరణకు కోర్టులు చూపుతున్న చొరవను సీజేఐ సమర్థించారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. -
61 మంది మహిళా ఎంపీలు
గత లోక్‌సభ కన్నా 16వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగింది. 2009 ఎన్నికల్లో 59 మంది మహిళలు ఎంపీలవగా.. ప్రస్తుతం 61 మంది మహిళలు(11%) లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. మహిళలు కోరుతున్న 33% ప్రాతినిధ్యానికి ఇది చాలా తక్కువ. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది, లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది. అయితే, ఇప్పటివరకు అధిక సంఖ్యలో మహిళా సభ్యులను కలిగి ఉన్న లోక్‌సభ ఇదే కావడం విశేషం. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, మేనకాగాంధీ, ఉమాభారతి, డింపుల్‌యాదవ్, హేమమాలిని, మున్‌మున్‌సేన్.. తదితరులు ఈ ఎన్నికల్లో గెలిచినవారిలో ఉన్నారు. ్ఞ నూతన లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యుల్లో 55 ఏళ్ల వయసు దాటినవారు 47% ఉండగా, 40 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న ఎంపీలు 71 మంది ఉన్నారు.