
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్ల ప్యానెల్‌లో సగం మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన గురువారం ప్రకటించారు.
కొత్తగా ఉపాధ్యక్షులైన రాజ్యసభ సభ్యుల్లో పీటీ ఉష, ఎస్.ఫంగ్‌నొన్ కొన్యాక్, ఫౌజియా ఖాన్, సులాటా దియో, వి.విజయసాయిరెడ్డి, ఘన్‌శ్యామ్ తివారీ, ఎల్.హనుమంతయ్య, సుఖేందు శేఖర్ రే ఉన్నారు. నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళ కొన్యాక్ సహా ప్యానెల్‌లోకి తీసుకున్న మహిళా సభ్యులందరూ మొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన వారే. ఎగువసభ చరిత్రలో వైస్ చైర్‌పర్సన్ల ప్యానెల్‌లోకి సగం మందికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే ప్రథమం అని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment