తమిళనాడు గవర్నర్‌గా జశ్వంత్‌సింగ్!
జైపూర్: సీనియర్ నేత జశ్వంత్‌సింగ్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో.. ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరనున్నారనే ఊహాగానాలు మరోమారు పతాక శీర్షికలకెక్కా యి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొణిజేటి రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు సింగ్ అందుబాటులో లేనప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం తమ నేత బీజేపీలోకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు బర్మేర్ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. దీంతో అక్క డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పార్టీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.