'రేపిస్టులను నాయకులే రక్షిస్తున్నారు'
ఉత్తరప్రదేశ్లో యాదవ్ల పాలన మీద కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న ఇతర అరాచకాలపై పార్లమెంటులో తప్పకుండా చర్చిస్తామని ఆమె చెప్పారు. కేవలం ఆ ఒక్క రాష్ట్రంలోనే రాజకీయ నాయకులు, ప్రభుత్వం కలిసి రేపిస్టులను కాపాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. మహిళలపై నేరాలకు ఉత్తరప్రదేశ్ రాజధానిగా మారిపోయిందని ఉమాభారతి అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ నుంచే ఎంపికైన మరో మహిళా ఎంపీ డింపుల్ యాదవ్ మాత్రం తమ సొంత పార్టీని వెనకేసుకొచ్చారు. ఒకే రాష్ట్రాన్ని పదే పదే నిందించడం సరికాదని ఆమె అన్నారు. కాగా అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లను వ్యతిరేకించే వారు మాత్రం యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వారిలో కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్ కూడా ఉన్నారు.