'నితీష్ పీఎం అయితే దేశంలో జంగిల్ రాజ్' | If Nitish Kumar becomes PM, jungle raj will prevail across country: Uma Bharti | Sakshi
Sakshi News home page

'నితీష్ పీఎం అయితే దేశంలో జంగిల్ రాజ్'

Published Mon, May 9 2016 3:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

If Nitish Kumar becomes PM, jungle raj will prevail across country: Uma Bharti

న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. నితీష్ ప్రధాని అయితే బిహార్ లో మాదిరిగా దేశంలో జంగిల్ రాజ్(ఆటవిక రాజ్యం) వస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమంగా జేడీయూతో పొత్తు పెట్టుకొని నితీష్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
బిహార్ లో  జేడీయూ ఎమ్మెల్సీ కుమారుడు తన కారును ఓవర్ టేక్  చేశాడని 19 ఏళ్ల యువకున్ని కాల్చి చంపడంపై ఆమె స్పందిస్తూ... నితీష్ మద్యపానం సేవించేవారిపై చర్యలు తీసుకుంటున్నారని అలాగే అధికార మదంతో ప్రవర్తిస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె సవాల్ విసిరారు. ఈరోజు సాహెబ్ గంజ్ లో ఆమె గంగానది ప్రక్షాళన చేసేందుకు తొమ్మిది పథకాలను ఆమె ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement