గంగానదీ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ కసరత్తులు చేస్తోంది.
న్యూఢిల్లీ: గంగానదీ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ కసరత్తులు చేస్తోంది. మంగళవారం ఆ శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ.. నదీజలాల కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, సెక్షన్ 5 కింద కూడా చర్యలు తీసుకునేలా పీసీబీకి సూచించామన్నారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న అథారిటీ స్వయం ప్రతిపత్తితోపాటు పరిశ్రమలపై చర్యలు తీసుకునే అధికారాల్ని కలిగివుంటుందన్నారు. కొత్త అథారిటీ చర్యలు తీసుకోవడంలో విఫలమైన పక్షంలో జరిమానా విధించేందుకు కోర్టును కూడా ఆశ్రయించవచ్చని తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న అథారిటీకి ఇంకా ఏ పేరు పెట్టలేదని.‘జాతీయ గంగాజల శుద్ధీకరణ కార్యక్రమం’ పేరు అయితే బాగుంటుందన్నారు.