హరీశ్‌రావుకు కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించారుు యోజన (పీఎంకేఎస్‌వై) పథకం పరిధిలోని ప్రాజెక్టులకు నిధుల అంశాన్ని చర్చించేందుకు ఈ నెల 23న ఢిల్లీకి రావాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావును కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమాభారతి ఆహ్వానించారు. ఈ మేరకు ఉమాభారతి మంత్రికి శుక్రవారం లేఖ రాశారు. దేశం మొత్తంగా 99 ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై పరిధిలోకి తేగా, అందులో రాష్ట్రం నుంచి 11 ప్రాజెక్టులున్నారుు. వీటికోసం కేంద్ర సాయం, రుణాల రూపంలో మొత్తంగా రూ.7,900కోట్లు ఇవ్వాలని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. 23న జరిగే సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది.