సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్ | Siddaramaiah old friend, won’t comment on his rule: HD Deve Gowda | Sakshi
Sakshi News home page

సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్

Published Thu, Mar 9 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్

సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు పాత మిత్రుడని, ఆయన పాలనపై వ్యాఖ్యలు చేయబోనని జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌.డీ. దేవెగౌడ అన్నారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సిద్ధరామయ్య నాలుగేళ్ల పాలన ఎలావుందని అడగ్గా... ‘దీనిపై నేను ఎలా మాట్లాడగలను. సిద్ధరామయ్య నాకు పాత మిత్రుడు. ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేద’ని సమాధానం ఇచ్చారు. బంగారప్ప, అంబరీష్‌ బీజేపీ చేరనున్నారని వార్తలపై స్పందించేందుకు దేవెగౌడ నిరాకరించారు. బీజేపీలో చేరే విషయంపై జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. గతంలో కూడా కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన రాజశేఖర్‌ మూర్తి, బంగారప్ప వంటి నాయకులను వాడుకుని వదిలేశారన్నారని గుర్తు చేశారు.

యూపీలో బీజేపీ గెలిస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లేనని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మారుస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement