మా రాష్ట్రానికో ప్రత్యేక జెండా! | Karnataka Govt Wants State Flag, BJP Calls Move Anti-national | Sakshi
Sakshi News home page

మా రాష్ట్రానికో ప్రత్యేక జెండా!

Published Wed, Jul 19 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

మా రాష్ట్రానికో ప్రత్యేక జెండా!

మా రాష్ట్రానికో ప్రత్యేక జెండా!

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం
► రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
► రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్న సీఎం


బెంగళూరు: ప్రత్యేకంగా తమ రాష్ట్రానికి ఓ జెండా కావాలని కర్ణాటక బలంగా కోరుకుం టోంది. జెండా రూపకల్పన కోసం 9 మంది సభ్యులతో ఓ కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చర్యపై విపక్షాలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు.

అయితే, దేశానికంత టికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏరాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తాజాగా ఇదే అంశంపై సిద్ధరామయ్య నేతృ త్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక జెండా అంశాన్ని తెరపైకి తేవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న వాదనలు విన్పిస్తున్నాయి.

గతనెలలోనే కమిటీ ఏర్పాటు
కర్ణాటకలో ప్రముఖ రచయిత, జర్నలిస్టు పాటిల్‌ పుట్టప్ప, సామాజిక కార్యకర్త భీమప్ప గుండప్ప గడదలు ప్రభుత్వానికి గత నెలలో ఇచ్చిన ఓ నివేదికలో కన్నడ నాడుకు ఓ ప్రత్యేక జెండా ఉండాలని ప్రతిపాదిం చారు. అనంతరం జెండా రూపకల్పనకు సీఎం సిద్ధరామయ్య కన్నడ సాంస్కృతిక విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో 9మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సేవల విభాగం, హోం శాఖ, లా, పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శులు, కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు, కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్, కన్నడ విశ్వవిద్యాలయం హంపి వీసీ సభ్యులుగా ఉంటారు. ఈ జెండా ఎరుపు, పసుపు రంగు ల కలయికతో ఉండనున్నట్లు తెలుస్తోంది.  కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్‌ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement