'ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు' | Molestation cases being viewed seriously: CM Siddaramaiah | Sakshi
Sakshi News home page

'ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు'

Published Sun, Jan 8 2017 4:23 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

'ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు' - Sakshi

'ఆ నీచులను వదిలిపెట్టే సమస్యే లేదు'

బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరు నగరం ప్రముఖ ఎంజీ రోడ్డులో నూతన సంవత్సరం ప్రారంభసమయంలో మహిళలు, యువతులపై జరిగిన లైంగిక వేధింపులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పందించారు. ఈ కేసును తాము చాలా తీవ్రంగా భావిస్తున్నామని, నిందితులను కచ్చితంగా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. ఐటీ రాజధానిలో మహిళల సంరక్షణకే తాము పెద్ద పీట వేస్తున్నామని, న్యూఇయర్‌ రోజు జరిగిన అసహ్యకరమైన ఘటనకు తాము చింతిస్తున్నామని చెప్పారు.

ఇలాంటి నీచమైన నేరాలు చేసేవారిని తాము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో మహిళలపై పెద్ద మొత్తంలో లైంగిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించింది. దీనిపై యావత్తు మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు సోషల్‌ మీడియాలో సైతం కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్ద రామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement