కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మత మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాకట కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది.