
సాక్షి, బెంగళూరు: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలోనే ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. వివరాలు... వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మంగళూరు బజ్పె విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక జిల్లా నాయకులైన మాజీ మంత్రి అభయ్‌చంద్ర జైన్, చీఫ్ విప్ ఐవాన్ డిసౌజా సీఎంకు స్వాగతం పలకడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలో అభయ్‌చంద్ర జైన్ తన పలుకు పడిని అంతా ఉపయోగించి ఐవాన్ అనుచరులను విమానాశ్రయం బయటే ఉంచడానికి యత్నించారు. అయితే ఐవాన్, ఆయన అనుచరులు ఎలాగో విమానాశ్రయం లోపలికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాలతో పాటు నాయకులు ఒకరి పై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకున్నారు. సిద్ధరామయ్య పక్కనే ఉన్నా ఎవరూ విచక్షణ పాటించలేదు. చివరికి సీఎం కలుగజేసుకుని పరిస్థితి శాంతింపజేశారు. అయినా సిద్ధు కార్యక్రమంలో ఇరు వర్గాలు తలోదారి అన్న రీతిలో ప్రవర్తించాయి.
ఇదేం కొత్త కాదు
ఇలాంటి వివాదాలు కొత్త కాదు. ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో చిత్రదుర్గలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వేణుగోపాల్ ముందే నాయకులు గొడవసడి ఒకరినొకరు కొ ట్టుకోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాల్కర్ తీరుతో బెళగావితో పాటు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో గ్రూపు రాజ కీయాలు మొదలయ్యాయి. ఇదే పరిస్థితి ప్రతి జిల్లాలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇటువం టి ‘ఒక ఇల్లు– మూడు వాకిల్లు’ పరిస్థితి తలెత్తుతోంది.
టిప్పు జయంతిని నిర్వహిస్తాం: సిద్ధరామయ్య
విమానాశ్రయం బయట మీడియాతో సిద్ధరామయ్య కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. ‘టిప్పు జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రులతో పాటు స్థానిక పార్లమెంట సభ్యులను కూడా కార్యక్రమానికి పిలుస్తాం. వారు రావడం రాకపోవడం వారి వ్యక్తిగతం. ఒకవేళ కార్యక్రమానికి హాజరయ్యి శాంతిభద్రతలకు సమస్యలు తీసుకురావాలని ప్రయత్నిస్తే వారి పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. టిప్పు జయంతి విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment