లింగాయత్ స్వాములు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మత మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాకట కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది.
లింగాయత్‌లకు మాత్రమే ప్రత్యేక మతమైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరించిన నేపథ్యంలో ఈ అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్‌లో భాగంగా వీరశైవ లింగాయత్‌లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మత మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్దరామయ్య లింగాయత్‌ల డిమాండ్ నెరవేర్చాలని నిర్ణయించడం.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుకు కలిసివస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment