మళ్లీ ట్వీటేసిన సిద్ద రామయ్య | Siddaramaiah Asks Spineless Karnataka BJP to Stop Dishing Out | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్వీటేసిన సిద్ద రామయ్య

Published Thu, Mar 22 2018 12:01 PM | Last Updated on Thu, Mar 22 2018 12:01 PM

Siddaramaiah Asks Spineless Karnataka BJP to Stop Dishing Out - Sakshi

సిద్ద రామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, బెంగళూరు : బీజేపీపై విమర్శల దాడిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య దూసుకెళుతున్నారు. ట్విటర్‌ వేదికగా ఆయన బీజేపీని నిలదీస్తున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమల బకాయిలను రద్దు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులెందుకు కనిపించడం లేదని, వారికి ఎందుకు రుణ విముక్తి కలిగించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ వెన్నెముక లేని పార్టీగా వ్యవహరిస్తోందని, కార్పోరేట్‌ లోన్ల రద్దు విషయం లెక్కల పాఠాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతోందంటూ వ్యాఖ్యానించారు.

'రైతుల రుణాలు మాఫీ చేయాలని అడగాల్సింది పోయి కర్ణాటక బీజేపీ వెన్నెముక లేనిదిగా ప్రవర్తిస్తోంది.. పైగా లోన్లపై లెక్కల పాఠాలు చెప్పుకొస్తోంది. ప్రజలేం మూర్ఖులు కారు. కేంద్రం బడా పారిశ్రామిక వేత్తల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తుందిగానీ, రైతులకు మాత్రం కోట్లలో ఉన్న రుణాలు రద్దు చేయలేదా?' అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ విమర్శల దాడితో యుద్ధం చేస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement