సాక్షి, బెంగళూరు : భారతీయ జనతాపార్టీ అధినాయత్వంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అవినీతి అరోపణలు, నల్లధనంపై పోరాటం అంటూ కర్నాటక ఎక్సైజ్ మంత్రి డీకే శివకుమార్ ఇంటిపై గతంలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు చేసిన దాడిని ఆయన కుట్రగా ఆరోపించారు. ఐటీ దాడులు చేస్తున్న సమయంలోనే శివకుమార్‌ను.. బీజేపీలో చేరాలంటూ అధికారులు ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. డిమానిటైజేషన్‌కు వ్యతిరేకంగా నవంబర్ 8న కర్నాటకలో చేపట్టిన బ్లాక్ డే కార్యక్రమంలో పాల్గొన్న సిద్దరామయ్య బీజేపీపై పలు ఆరోపణలు చేశారు.
శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు చేస్తూ.. బీజేపీలో చేరితో ఇటువంటి సమస్యలు, ఇబ్బందులుఏ ఉండవని ఆయనకు ఐటీ అధికారులు చెప్పినట్లు సిద్దరామయ్య ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను తన ఆధీనంలో పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
గత ఆగస్టులో శివకుమార్ ఇంటిపై జరిగిన ఐటీ దాడిలో లెక్కల్లోకి రాని రూ. 300 కోట్ల రూపాయలు, రూ. 15 కోట్ల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment