Judicial inquiry
-
తిరుపతి తొక్కిసలాటపై విచారణకు కమిషన్
సాక్షి, విజయవాడ: తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జ్‌తో విచారణ సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలల పాటు విచారణ కమిషన్‌కు గడువు ఇచ్చింది. కాలయాపనకే 6 నెలలు సమయం ఇచ్చారని భక్తుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం అమాయక భక్తుల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చెలగాటమాడింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే శ్వేతపత్రాలు, జ్యుడీషియ ల్ ఎంక్వైరీ, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి విమర్శించారు. కాలయాపనతో ఎన్నికల హామీ లను ప్రజలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతి అవాస్తవమని తేలింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహు ల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని శుక్రవారం మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి నట్లు మంత్రులు తమ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనే అంగీకరించారని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని తేలినందునే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ ద్వారా రీ డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించామన్నారు. డిసెంబర్ 2008లో తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎనిమిదేళ్ల పాటు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఈపీసీ విధానం తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు తదితరాల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని అన్నారు. కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ క్రూజ ర్ల కొనుగోలు కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వ చ్చారా? బడ్జెట్ గణాంకాలు అధ్యయనం చేయ కుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరింగ్లోపాలు, అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని పలువురు మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు డిమాండ్ చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బహిర్గతం చేసి, అందులో లేవనెత్తిన లోపాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు పాల్గొని మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో సర్వేలు లేకుండా గిన్నిస్ రికార్డుల కోసమే కాళేశ్వరం నిర్మించారని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. ఇంజనీర్లు, వైస్ చాన్స్లర్లు, ఇతర నిపుణుల పనులు సైతం తానే చేయాలని సీఎం కేసీఆర్ కోరుకోవడంతో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేకుండా పోయిందన్నారు. ఇంజనీర్లు డిజైన్ చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులు చెక్కుచెదరలేదని, సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేయడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో సరైన సర్వే లేకుండానే ప్రాజెక్టును నిర్మించారని రిటైర్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి అన్నారు. డ్యామ్‌సేఫ్టీ యాక్ట్ 2021 కింద బాధ్యులపై కేసులు నమోదు చేయాలని జర్నలిస్టు జయసారథి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలో నిర్మించడంతోనే లోపాలు జరిగాయని రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణానికి చాలా తేడాలున్నాయన్నారు. ప్రాణహితను ఎందుకు పక్కనపెట్టారు? ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కనపెట్టి కాళేశ్వరాన్ని కట్టారని రిటైర్డ్ ఇంజనీర్ రఘుమారెడ్డి ప్రశ్నించారు. రూ.లక్షాయాభై వేల కోట్లను నాశనం చేసిన పనికి బాధ్యులు ఎవరు? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సీజ్ చేయాలని, బాధ్యులైన ఇంజనీర్లు, అధికారులను జైలులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ చేపట్టాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు అయినా సరైన తనిఖీలు చేయకపోవడంతో సమస్యలొస్తున్నాయని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అంటే కేసీఆర్ ఖజానా ఖాళీశ్వరమని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్, కోశాధికారి సురేశ్ పాల్గొన్నారు. -
‘40% కమీషన్’పై న్యాయ విచారణ
బెంగళూరు: గత బీజేపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల క్రితం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు..హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ నాగమోహన్ దాస్ సారథ్యంలోని కమిటీకి విచారణ బాధ్యతలను అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 40 శాతం కమీషన్ కుంభకోణంపై విచారణ జరిపించడం కూడా ఉంది. భారీగా పనులు చేపట్టిన శాఖలపై ఈ కమిషన్ విచారణ చేపట్టనుంది. అన్ని ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్ తమ నుంచి వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అప్పట్లో ప్రధానికి, సీఎంకు లేఖలు రాయడం గమనార్హం. పనులు ప్రారంభించకమునుపే 25 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను ప్రజాప్రతినిధులకు చెల్లించినట్లు కాంట్రాక్టర్లు అందులో ఆరోపించారు. -
న్యాయ విచారణలో రాజకీయ వ్యాఖ్యలు అవాంఛనీయం
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, తమకు అపార గౌరవం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నొక్కి వక్కాణించారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌరవంగా అమలు చేస్తామని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయానికి ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల మాదిరిగా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకున్న వాళ్లమవుతామని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైకోర్టులో ఒక న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలకు ఎల్లో మీడియా తనదైన వక్రభాష్యం చెబుతూ కథనాలు అచ్చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించి, తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యాఖ్యలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. ఇటీవల ఒక న్యాయమూర్తి కోర్టులో లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికలు తొందరగా వస్తాయని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. అందులో ఆయన ఉద్దేశం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై వెంటనే అడ్వొకేట్ జనరల్ స్పందించి.. ఎన్నికలు నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని తేల్చిచెప్పారన్నారు. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోర్టులో వాదనలు జరిగేటప్పుడు న్యాయమూర్తులు వ్యక్తిగతంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని హైకోర్టుకు ఆయన విన్నవించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, విద్రోహశక్తులకు ఉపయోగపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్న రాజధాని అంశంపై వ్యాఖ్యలా? రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని న్యాయమూర్తులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారని మాణిక్యవరప్రసాద్ గుర్తుచేశారు. ఇటీవల చెన్నై కోర్టు ఒక కేసులో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించడంపై సుప్రీంకోర్టు.. అలా పరిధి దాటి మాట్లాడకూడదని చెన్నై కోర్టుకు దిశానిర్దేశం చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఎక్కడో తెలియదని తన కుమార్తె అన్నారని ఇటీవల ఓ న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. రాజధాని అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సాగుతోందని, ఈ సమయంలో దానిపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి.. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియాకు ఉపయోగపడేలా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు వాంఛనీయం? సబబు? అని మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. వాటి సాధనలో ఆ పార్టీలే మార్గాలు చూసుకుంటాయని తెలిపారు. వాటికి మీ సహకారం అవసరమా... అనేది ఆలోచించుకోవాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై న్యాయమూర్తి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
మిశ్రాను పదవి నుంచి తప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రియాంకా గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులతో కూడిన కాంగ్రెస్ బృందం బుధవారం రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖీమ్‌పూర్ ఘటనపై పూర్తి వివరాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాన నిందితుడి తండ్రి కేంద్రంలో మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని భావిస్తున్నామని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీలతో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. అజయ్ రాజీనామాతో బాధితులకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. ‘సెప్టెంబరు 27న నిరసన తెలుపుతున్న రైతులను అజయ్ మిశ్రా బహిరంగంగా బెదిరించారు. మంత్రే ఇలా రెచ్చగొడితే న్యాయం ఎలా లభిస్తుంది? ఘటనలో అజయ్ కొడుకు ఆశిష్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి’ అని వినతి పత్రంలో నేతలు పేర్కొన్నారు. ఆశిష్‌కు బెయిల్ నిరాకరణ లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ కేసులో అంకిత్ దాస్, లతీఫ్ అలియాస్ కాలే అనే ఇద్దరు వ్యక్తులను సిట్ బుధవారం అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని 14 రోజులపాటు జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆశిష్ మిశ్రాతోపాటు అతడి సహచరుడు ఆశిష్ పాండేకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చింతా రామ్ తిరస్కరించారని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ ఎస్.పి.యాదవ్ చెప్పారు. -
అగ్రిగోల్డ్: న్యాయ విచారణపై వెనకడుగు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ భూములను కారుచౌకగా కొట్టేశారనే ఆరోపణలపై జ్యుడీషియల్ కమిటీతో న్యాయ విచారణ జరిపిస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోకుండా బాధితులను గాలికి వదిలేసింది. విచారణ కమిటీ ఏర్పాటైతే ప్రభుత్వంలో కొనసాగుతున్న వారి భూ దందాలు వెలుగులోకి వస్తాయనే భయంతో దీనిపై వెనక్కి తగ్గిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్ష్యాధారాలతో సభ దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేత అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో బుధవారం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైన బాధితులు.. హాయ్‌ల్యాండ్‌ను కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల తరపున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2016, 2017 బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం తెలిసిందే. ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు అగ్రిగోల్డ్ భూములను కాజేసి డిపాజిటర్ల పొట్టకొట్టేందుకు ప్రయత్నించటాన్ని ఆయన సాక్ష్యాధారాలతో సభకు వివరించారు. మంత్రులు, సీఎం, స్పీకర్ కూడా అడుగడుగునా ప్రతిపక్షనేత ప్రసంగానికి అడ్డుపడినప్పటికీ బాధితుల తరపున చట్టసభలో పోరాడారు. అటాచ్‌మెంట్‌కు నెల ముందు భూములు కొన్న మంత్రి భార్య... అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని 2016 మార్చి 28వ తేదీన వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం చేపట్టాలని, సీఐడీ విచారణతో బాధితులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. విలువైన హాయ్‌ల్యాండ్, విశాఖ యారాడలోని భూములను అటాచ్మెంట్ నుంచి మినహాయించి కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను అసెంబ్లీలో ఎండగట్టారు. అటాచ్‌మెంట్‌కు కేవలం నెల ముందు అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్య వెంకాయమ్మ కొనుగోలు చేశారని వెల్లడించారు. 20 నిమిషాలు టైమిస్తే ఆధారాలతో నిరూపిస్తానన్న ప్రతిపక్ష నేత.. 2017 మార్చి 23న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత జగన్ గట్టిగా ఒత్తిడి తెచ్చారు. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థ హాయ్‌ల్యాండ్ సీఈగా, డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఉదయ దినకర్ నుంచి 14 ఎకరాల భూమిని మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ తక్కువ ధరకు కొనుగోలు చేశారని, అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా సీఐడీ నిర్లక్ష్యం వహిస్తోందని సభ దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలంటూ వాయిదా తీర్మానం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీ నియమించాలని కోరారు. బాధితులకు రూ. 1,182 కోట్లు ఇస్తే 13,83,574 మంది డిపాజిటర్లకు ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి భార్య అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయటానికి సంబంధించి 20 నిముషాలు సమయం ఇస్తే ఆధారాలన్నీ బయట పెడతానని ప్రతిపక్షనేత సభలో పేర్కొన్నా స్పీకర్ అందుకు అనుమతి ఇవ్వలేదు. జ్యుడీషియల్ కమిటీపై వెనక్కి ఈ సమయంలో సీఎం చంద్రబాబు శాసన సభలో మాట్లాడుతూ విపక్ష నేత మంత్రిపై చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ కోసం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిపై వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో ఎలా స్పందిస్తుందో చూశాక విచారణ కమిటీపై నిర్ణయం తీసుకుంటామని, షరతులకు వారు (విపక్షం) అంగీకరించినా అంగీకరించకున్నా జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుపై ముందుకు వెళ్తామని చెప్పారు. అయితే గత ఏడాది మార్చి 23వ తేదీన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన ప్రకటనను అనంతరం సీఎం విస్మరించారు. ఏడాదిన్నర దాటినా జ్యుడీషియల్ కమిటీ ఊసే మరిచారు. ఈ కమిటీ ఏర్పాటైతే మంత్రి ప్రత్తిపాటి భార్య కొనుగోలు చేసిన భూముల వ్యవహారమే కాకుండా హాయ్‌ల్యాండ్, యారాడలోని విలువైన భూములను కొట్టేసేందుకు చేసిన ప్రయత్నాలు వెలుగు చూస్తాయనే భయంతో వెనక్కి తగ్గారు. ‘అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తే దానికి కట్టుబడి ఉండాలి. అసెంబ్లీలో చెప్పిన మాటకే విలువ లేకపోతే ఇక అసెంబ్లీకి విలువేమిటి?’ అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హాయ్‌ల్యాండ్‌ను కాజేసే ఎత్తుగడ.. రాజధానికి అత్యంత సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ భూములు అత్యంత విలువైనవి. వీటిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహితుడైన పోలీస్ ఉన్నతాధికారి ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీఐడీ విచారణకు మోకాలడ్డుతూ వచ్చారు. చివరకు హైకోర్టు ఆగ్రహించడంతో అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్లను అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో హాయ్‌ల్యాండ్ ఎండీ ఆలూరు వెంకటేశ్వరరావుతో ప్రభుత్వ పెద్దలే హైకోర్టులో వ్యూహాత్మకంగా అఫిడవిట్ దాఖలు చేయించినట్లు ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదని అఫిడవిట్లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ పెద్దల వ్యూహం బెడిసికొట్టింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌దేనని ప్రకటనలు ఇప్పించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. భూముల కొనుగోలు నిజమేనని ఒప్పుకున్న ప్రత్తిపాటి ప్రతిపక్ష నేత ప్రకటించినట్లుగా అగ్రిగోల్డ్ డైరెక్టర్ ఉదయ్ దినకల్ నుంచి తన భార్య భూములు కొనుగోలు చేయడం నిజమేనని మంత్రి పుల్లారావు కూడా అంగీకరించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో ఇవ్వడానికి నెల ముందు ఈ భూములను కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను కీలక వ్యక్తులు కొనుగోలు చేసిన తరువాత అటాచ్మెంట్ ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. సీఐడీ విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్‌కు 16,857 ఎకరాలతో పాటు 82,707 ఇళ్ల స్థలాలు ఉన్నాయని గుర్తించినట్లు 2016 మార్చిలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఆస్తులు వేలం వేస్తామన్నారు. ఇప్పుడు విలువైన భూములు మాయం కావడం వెనుక రహస్యం ఏమిటో ఊహించవచ్చు. -
దళితుల మృతిపై న్యాయ విచారణ జరపాలి
కాకినాడ రూరల్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న జరిగిన బంద్‌లో దళిత యువకులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై న్యాయ విచారణ జరిపించాలని జిల్లా దళిత ఐక్యవేదిక డిమాండ్ చేసింది. శనివారం కాకినాడ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దళిత ఐక్యవేదిక నాయకులు టి.నూకరాజు, న్యాయవాది కె.ఉదయ్‌కుమార్, బచ్చల కామేశ్వరరావు, తాడి బాబ్జీ, సిద్దాంతుల కొండబాబు, బయ్యా రాజేంద్రకుమార్, ఎన్.కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. మానవీయ దళిత హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్సీ యువకులపై తూటాల వర్షం కురిపించి ప్రాణాలు బలిగొన్న పోలీసు హంతకులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు వర్తించదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులందు ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులను వెంటనే నియమించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ప్రతి ఉద్యోగి ఆ చట్టం పూర్వస్థితిని కొనసాగించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు నివేదికలు సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రపతి రీకాల్ చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయాలన్నారు. ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలకు పరిహారం చెల్లించి కుటుంబం ఒక్కంటికి 10 ఎకరాల భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 10న అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భావి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. -
ఎత్తుగడేనా ?
► జయ మరణ విచారణ కమిషన్ ఏర్పాటుపై సర్వత్రా సందేహాలు ► శశికళ అండ్ కో అణచివేత కోసమేనని వ్యాఖ్యలు ► పోయెస్ గార్డెన్ ఇల్లు ఇక ప్రభుత్వపరం ► సీఎం ఎడపాడి సంచలన ప్రకటన ► విపక్షాల్లో మిశ్రమ స్పందన ఇటీవలి కాలంలో రాజకీయ కలకలాలు సృష్టించడంలో దేశానికే రాజధానిగా మారిన తమిళనాడులో తాజాగా మరో సంచలనం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. మద్రాసు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. జయ నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయలలిత స్మారక మందిరంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గపోరును తట్టుకునేందుకు సీఎం పళని స్వామి కొత్త ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జయ మరణం ఇక మిస్టరీగానే మిగిలిపోనుందని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా సీఎం ఎడపాడి తెరపైకి తెచ్చారు. గురువారం ఉదయం తన మంత్రివర్గ సహచరులతో సీఎం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీఎం సీరియస్‌గా నిర్వహిస్తున్న సమావేశంలోని అంతరార్థం ఏమిటనే ఉత్కంఠ మొదలైనా ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదు. సాయంత్రం సీఎం ఎడపాడే స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అమ్మ మరణంలో అందరికీ అనేక సందేహాలున్నాయి, వాటిని నివృత్తి చేయడం కోసం విచారణ కమిషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటుచేసి విచారణ జరపనున్నట్లు తెలిపారు. అలాగే పోయెస్ గార్డెన్‌లోని జయలలిత ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చి ప్రజల సందర్శనకు ఉంచుతామని తెలియజేయడం చర్చకు దారితీసింది. ఇంత కాలం తర్వాత.. అంతా నేనేగా వ్యవహరించిన జయలలిత అకస్మాత్తుగా కన్ను మూయడం ఆ పార్టీని కకావికలం చేసింది. అమ్మ లేని అనాథగా మారిన అన్నాడీఎంకేని చిన్నమ్మ (శశికళ) చేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణించి నెల తిరక్క ముందే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారారు. మరో నెల గడిచేలోగా సీఎం సీటుపై కన్నేసి అడ్డుగా ఉన్న పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించారు. అప్పటివరకు చిన్నమ్మ చాటు చిన్నబిడ్డలా ప్రశాతంగా ఉండిన పన్నీర్ సెల్వం హఠాత్తుగా ఆమెపై తిరుగుబాటు చేశారు. జయలలిత మరణం అనుమానాస్పదం, ఇన్చార్జ్ సీఎంగా ఉండిన తనను సైతం జయను చూసేందుకు శశికళ అనుమతించలేదని విమర్శించారు. అమ్మ మరణం వెనుక చిన్నమ్మ హస్తం ఉందని ఆరోపించారు. దీంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జయ చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం, చికిత్స చేసిన లండన్ డాక్టర్ సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మెరీనా బీచ్‌లోని సమాధి నుంచి జయ మృతదేహాన్ని వెలికితీసి ఎందుకు రీపోస్టుమార్టం నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ మద్రాసు హైకోర్టులో కొందరు పిటిషన్ వేశారు. పార్టీలో విలీనం కావాలంటే జయ మరణంపై విచారణకు ఆదేశించాలని సుమారు మూడునెలల క్రితం మాజీ సీఎం పన్నీర్‌సెల్వం రాష్ట్ర ప్రభుత్వానికి షరతు కూడా విధించారు. జయ మరణంపై ఇంత రాద్దాంతం జరుగుతున్నా శశికళ ఆశీస్సులతో సీఎంగా మారిన ఎడపాడి ఇంతకాలం నోరుమెదపలేదు. నేతల మిశ్రమ స్పందన జయలలిత మరణంపై విచారణ కమిషన్ నియామకంపై నేతల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రిటైర్డు జడ్జితో విచారణ కేవలం కంటి తుడుపు చర్య అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ వ్యాఖ్యానించారు. సీఎం ఎడపాడి, మంత్రులు తమ పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ కమిషన్, స్మారక మందిరం నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తెలిపారు. ఇంతకాలం మౌనం వహించి ఈరోజు విచారణకు ఆదేశించడం శశికళ కుటుంబాన్ని తొక్కిపెట్టేందుకేనని డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, అన్నాడీఎంకే నేత, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ తంబిదురై స్వాగతించారు. మాజీ సీఎం పన్నీరువర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి విమర్శించారు. విలీనంపై తాము పెట్టిన షరతుల్లో నేరవేరినట్లుగా తాము అంగీకరించబోమని, సీబీఐ విచారణ డిమాండ్‌కే తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. జయకు 74 రోజులపాటూ చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎడపాడి ఎత్తుగడ అన్నాడీఎంకేలోని ప్రధాన వైరివర్గాలైన ఎడపాడి, పన్నీర్‌సెల్వం విలీనం కావాలని బీజేపీ అధిష్టానం, ప్రధాని మోదీ నుంచి ఒత్తిడి పెరిగింది. అంతేగాక శశికళ కుటుంబంలేని అన్నాడీఎంకేని ఆశిస్తున్నట్లు కూడా బీజేపీ షరతు విధించింది. జయ అనుమానాస్పద మృతిపై అందరి అనుమానాలు శశికళపైనే ఉన్నాయి. విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా శశికళను, ఆమె నియమించిన టీటీవీ దినకరన్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చనే ఆలోచనతోనే సీఎం ఎడపాడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భావిస్తున్నారు. అంతేగాక విలీనంపై పన్నీర్‌సెల్వం విధించిన ప్రధాన రెండు షరతులు నెరవేర్చినట్లు అవుతుంది. తద్వారా విలీనానికి మార్గం సుగమం అవుతుందని సీఎం ఎడపాడి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చివేస్తానంటూ దినకరన్ చేస్తున్న ప్రకటనలతో కేంద్రం నుంచి ఆదరణ పొందడం కూడా విచారణ కమిషన్‌లోని ఎత్తుగడగా వ్యాఖ్యానిస్తున్నారు. దీప నిరాకరణ జయలలిత ఇంటిపై తమకు వారసత్వపు హక్కులు ఉన్నాయని ఆమె మేనకోడలు దీప అన్నారు. గురువారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోయెస్ గార్డెన్ ఇల్లు, అమ్మకం, కొనుగోలు హక్కు ఎవరికీ లేదని, ఆ ఇంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని ఆమె అన్నారు. విచారణ కమిషన్ వేయడం వెనుక శశికళ కుటుంబ కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. జయ కన్నుమూసిన నాటి నుంచి తాను విచారణకు డిమాండ్ చేస్తున్నా, ఇన్నాళ్లూ మిన్నకుండి నేడు ప్రకటన చేయడం తమ పదవులను కాపాడుకునే కపట నాటకమని ఆమె విమర్శించారు. -
జ్యుడీషియల్ విచారణ జరపాలి
ఇసుక మాఫియాపై కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలపై, అక్రమాలపై జ్యుడీషియల్ విచా రణ జరపాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. జేఏసీ నేతలు ఇటిక్యాల పురుషోత్తం, గోపాలశర్మ, భైరి రమేశ్ తదితరులతో కలసి జేఏసీ రాష్ట్ర కార్యాల యంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణంపై ప్రభావం, తవ్వకాలకు మార్గనిర్దేశకాలు, వాటికి ప్రామాణికత, నిబంధనల అమలులో లోపాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిరి సిల్లలోని మూడు గ్రామాల దళితులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారని విమర్శిం చారు. దీని వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన సామాజిక ఉద్యమ సంఘాలపై, న్యాయవాదులపై పోలీసులు అసహనాన్ని ప్రదర్శించారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం ఎస్సీ కమిషన్ చేసిన సూచనలు, సిఫార్సులను అమలు చేయాలన్నా రు. బాధ్యులైన అధికారులపై కఠినంగా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరుల స్ఫూర్తి మూడో విడత గజ్వేల్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. -
న్యాయవిచారణకు వామపక్షాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, తక్షణమే దానిపై న్యాయవిచారణకు ఆదేశించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మావోయిస్టుల సమస్యను ప్రభుత్వం శాం తిభద్రతల సమస్యగా మాత్రమే పరిగణించడం సరికాదని తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), జానకిరాములు(ఆర్ఎస్పీ), మురహరి(ఎస్‌యూసీఐ-సీ), కె.గోవర్దన్(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), భూతం వీరన్న(సీపీఐ-ఎంఎల్), ఎన్.మూర్తి(లిబరేషన్), బం డా సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్)లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధం గా చూసినంత కాలం సమస్య పరిష్కారం కాదని సూచించారు. -
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి
ఎస్ఐల ఆత్మహత్యలపై చాడ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో వరుసగా జరుగుతున్న ఎస్ఐల ఆత్మహత్యలపై శాఖాపరంగా ఉన్నతస్థాయి విచారణతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆ శాఖలో పెరుగుతున్న ఒత్తిళ్లు, అధికార, రాజకీయ జోక్యం, మామూళ్ల విష సంస్కృతి వంటి సమస్యలను పరిష్కరించి ప్రక్షాళన చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహజంగానే పోలీసుశాఖలో పని ఒత్తిడి ఉంటుందని, అయితే యువ ఎస్‌లు బలికావడం ఆ శాఖకు కళంకమన్నారు. శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది. కార్మిక రంగ సమస్యలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై చేపట్టిన సమ్మెకు అన్ని రంగాల ప్రజలు సహకరించాలని చాడ కోరారు. -
డీఎస్పీ మృతిపై జ్యూడీషియల్ విచారణకు సీఎం ఆదేశం
బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఆత్మహత్య కేసుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం సిద్దరామయ్య జ్యూడీషియల్ విచారణకు ఆదేశించారు. తన చావుకు బెంగళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్‌తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమని ఆరోపిస్తూ గణపతి తన సూసైడ్ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కేసుల విషయంలో సీనియర్ అధికారులు తనను వేధించారని, వారి నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోయినట్లు ఆయన అంతకు ముందు ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటకలో ఇద్దరు పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలోనూ బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేసినట్లు విమర్శలు వచ్చాయి. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఆగంతకుల దహనకాండతో భయాందోళనకు గురవుతున్న రాజధాని నిర్మాణ ప్రాంత గ్రామాలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సందర్శించి బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. ఈ ఘటనపై తక్షణం సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేగాక నిందితులను వెంటనే పట్టుకుని దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని కోరింది. ముందుగా బాధిత రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించింది. అరండల్‌పేట (గుంటూరు) : రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన తుళ్లూరు, తాడేపల్లి మండల గ్రామాల్లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు సాగించిన దహనకాండకు రైతుల పొలాల్లోని షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలు మొత్తం 13 చోట్ల దహనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ మంగళవారం పర్యటించింది. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దం డ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో దహనమైన షెడ్లు, అరటితోటలను పరిశీలించి బాధిత రైతులతో నేరుగా మాట్లాడింది. వారికి అండగా నిలుస్తామని తెలిపింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటూ తీర్మానాలు చేసిన గ్రామాల్లోని ఈ సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేసినట్లుగా అభిప్రాయపడింది. జరిగిన సంఘటనలపై వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నిందితులపై చర్యలు చేపట్టాల్సిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బాధ్యత మరిచి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించింది.ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ ఉండగా, వారితో విచారణ జరపకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడింది. పర్యటన సాగిందిలా.... జిల్లా కేంద్రం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరిన రాజధాని రైతుల, కౌలు రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సాయంత్రం వరకు తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దాండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శించింది. తొలుత కమిటీ లింగాయ పాలెం గ్రామానికి చేరుకుంది. బాధిత రైతు గుంటుపల్లి మధుసూదనరావు పొలం వద్దకు వెళ్లి దహనమైన వెదురు బొంగులు, పైపులైనులు, అరటి తోటను పరిశీలించింది. ఈ సందర్భంగా రైతు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘పొలంలో 3,500 వెదురు బొంగులు, 300 అరటి చెట్లు, డ్రిప్ పైపులు, షెడ్డు తగలబెట్టారు. ఎంతలేదన్నా రెండున్నర లక్షల నష్టం జరిగింది. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఎందుకు చేశారో, ఎవరు చేశారో కూడా అర్థం కావడం లేదు. నాకు నష్టపరిహారం అందకపోయినా ఇబ్బంది లేదు, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తే చాలు.’ అదే గ్రామంలో మరో పొలం వద్దకు వెళ్లి కమిటీ పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న కౌలు రైతు చిన్న మీరాసాహెబ్ మాటల్లో ఆవేదన వ్యక్తమైంది. ‘ఎకరం పొలం రూ. 30వేలకు కౌలుకు తీసుకుని పంట వేశా, 150 వెదురు బొంగులు, 100 అరటి చెట్లు, డ్రిప్ పైపులు తగలబడ్డాయి. లక్షన్నర వరకు నష్టపోయినట్టే. ఎవరో రెక్కీ నిర్వహించి మరీ వరుసగా తగలబెట్టినట్టు అర్థమవుతోంది. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’ అక్కడి నుంచి ఉద్దండ్రాయునిపాలెంలో బూడిదగా మారిన పొలాన్ని పరిశీలించిన కమిటీ రైతు జొన్నలగడ్డ వెంకట్రావును పరామర్శించడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరాడు. ‘ నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి వేశా. నెల కిందట 14 వేల వెదురు బొంగులు, 150 ఎరువు బస్తాలు, జనరేటర్ డ్రిప్ పైపులు తగలబెట్టారు.10 లక్షలకు పైగానే నష్టపోయా. నేను రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరించాను. అయితే నాతో గ్రామంలోని వారంతా సోదర భావంతో ఉంటారు. ఎందుకిలా చేశారో తెలియడంలేదు.’ అనంతరం కమిటీ వెంకటపాలెం గ్రామాన్ని సందర్శించింది. పలువురు రైతులను పరామర్శించి మనోధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ, తాము ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో రైతు లంకా రఘునాధబాబు పొలంలో ఓ ఆగంతకుడు నిప్పు అంటిస్తుండగా, వెంబడించడంతో పారిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, రేపటి రోజున ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రతి రైతులో కనిపిస్తుందన్నారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ పూనూరి గౌతమ్‌రెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి హెనీ క్రిస్టినా, వైఎస్సార్ సీపీ మైనార్టీ, ఎస్సీ, సేవాదళ్ విభాగ కన్వీనర్లు సయ్యద్ మాబు, బండారు సాయిబాబు ఇంకా నాయకులు కొత్త చిన్నపరెడ్డి, దర్శనపు శ్రీనివాస్, రాచకొండ ముత్యాలరావు, సుద్దపల్లి నాగరాజు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీఎంసీలో అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలి
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరుగుతున్న అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఎంసీ పరిపాలనా విభాగంలో అవినీతిని అరికట్టగలిగితే నగరంలోని భూముల ధరలు చదరపు అడుగుకు రూ.500 తగ్గే అవకాశముందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ ప్రవీణ్ దీక్షిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, బాధ్యత గల ఉన్నతోద్యోగి వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీఎంసీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే న్యాయవిచారణ జరిపించాలని రెండుపార్టీల నాయకులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, తనకు ఒక కాంట్రాక్టర్ రూ.100 కోట్ల లంచం ఇస్తానని ఆశచూపించాడని రాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఒకవేళ మంత్రి వ్యాఖ్యలు నిజమైతే.. సదరు కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో తెలుసుకుని దానిపై కూడా విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీ విపక్షనేత రాధాకృష్ణవిఖే పాటిల్, ముంబై కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు జనార్ధన్ చందూర్కర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాయ్ జగ్తప్, అమిన్ పాటిల్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు జితేంద్ర అవ్హాడ్,విద్యాచవాన్ తదితరులు ఉన్నారు. -
బాణసంచా కాదు..బాంబులు పేలాయి!
* వాకతిప్ప విస్ఫోటంపై సీబీఐ లేదా జ్యుడీషియల్ విచారణ జరపాలి * ‘వాకతిప్ప’ బాధితుల డిమాండ్ * మేజిస్టీరియల్ విచారణ బహిష్కరణ * అధికారుల నిర్బంధం * దళిత, ప్రజాసంఘాలు,అఖిలపక్షం మద్దతు * అర్ధాంతరంగా ముగించి, వెనుతిరిగిన అధికారులు పిఠాపురం : ‘బాణసంచా పేరుతో అక్కడ బాంబులు తయారు చేస్తున్నారు. అందువల్లే అంత భారీ పేలుడు జరిగి.. మృతదేహాలు ముక్కలుముక్కలై వందల మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. ఈ ఘటన వెనుక నిజాలు బయట పడాలంటే కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వాకతిప్ప బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత నెల 20న జరిగిన పేలుడు ఘటనపై.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కాకినాడ ఆర్డీవో అంబేద్కర్ సోమవారం చేపట్టిన మేజిస్టీరియల్ విచారణను బాధిత కుటుంబాలు బహిష్కరించాయి. సాయంత్రం 3 గంటలకు ఆర్డీవో విచారణ ప్రారంభించారు. దళిత, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో.. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన పదిమంది మృతుల కుటుంబ సభ్యులు ప్రదర్శనగా విచారణకు వచ్చారు. బాధిత కుటుంబీకులు వారి అనుమానాలను, ఆధారాలను తెలియజేయాలని ఆర్డీవో సూచించారు. మృతుల్లో ద్రాక్షారపు చినబుల్లి కుటుంబానికి పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని బాధితులు నిలదీశారు. ఇది కేవలం మేజిస్టీరియల్ విచారణని, ఇందులో వివరాలు సేకరిస్తామే తప్ప సమస్యలు పరిష్కరించడం తన పరిధిలో ఉండదని ఆర్డీవో చెప్పారు. ఆమె మృతిని ఇంకా ధ్రువీకరించలేదని, డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతిని ధ్రువీకరించి పరిహారం అందిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహించిన బాధితులు.. ‘ఆ విషయం మీ పరిధిలోది కాకపోతే విచారణ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. జరిగిన దారుణంపై సక్రమంగా స్పందించ లేదంటూ కలెక్టర్, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఆర్డీవో, ఇతర అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోతే వెంటనే విచారణ జరపాల్సిందిపోయి, ప్రమాదం జరిగిన 22 రోజుల తరువాత విచారణ ప్రారంభించడమేమిటని నిలదీశారు. లెసైన్‌స మంజూరు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ ఆర్డీవో అంబేద్కర్నే విచారణాధికారిగా నియమించడం చూస్తే.. దొంగ చేతికే తాళాలిచ్చినట్టుగా ఉందని ఆరోపించారు. మేజిస్టీరియల్ విచారణను తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిని వెంటనే నిలిపివేసి, ఆపి జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము ఆందోళనకు దిగినా విచారణ కొనసాగిస్తున్న ఆర్డీవోపై మండిపడ్డారు. విచారణ జరుగుతున్న ఎంపీడీవో కార్యాలయం ప్రహరీ గేటు మూసివేశారు. అధికారులను నిర్బంధించి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచారణను ఇక్కడితో ఆపి జ్యుడీషియల్ లేదా సీబీఐ విచారణ ప్రారంభించకపోతే మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొమ్ము చినబాబు, ఉల్లంపర్తి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు వేమగిరి వెంకట్రావు, దళిత నాయకులు రాజేంద్ర, మసకపల్లి రాజకుమార్, చింతపర్తి రాంబాబు, పలివెల సత్యానందం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓలేటి రాయభాస్కరరావు, పిల్లి తిరుపతిరావు, విప్పర్తి రామన్న, మందపల్లి శ్యామ్, పిల్లా వరప్రసాద్, వల్లూరి రాజబాబు, దాసరి సత్యనారాయణ, రవణం సుబ్రహ్మణ్యం తదితరులు బాధిత కుటుంబీకులకు సంఘీభావంగా ఆందోళనకు దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకే విచారణ కలెక్టరు ఆదేశాల మేరకే ఈ విచారణ చేస్తున్నానని, ప్రమాదం ఎలా, ఎందువల్ల జరిగిందన్న విషయాలపై మాత్రమే విచారణ జరుపుతామని, డిమాండ్లను తాము స్వీకరించలేమని విచారణాధికారి ఆర్డీవో అంబేద్కర్ తెలిపారు. బాధితుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దీంతో శాంతించిన బాధితులు అడ్డు తొలగడంతో అధికారులు వెళ్లిపోయారు. 15న మళ్లీ విచారణ ఈ నెల 15న మరో దఫా విచారణ జరుపుతామని, బాధితుల కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు, ఇతర అధికారులను విచారిస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ విచారణ పలుమార్లు జరుగుతుందన్నారు. ఇప్పటికే పలు వివరాలు సేకరించామని, ఈ సంఘటనకు సంబంధించిన అన్ని శాఖల అధికారులనూ విచారిస్తామని చెప్పారు. ఈ విచారణలో జిల్లా అగ్నిమాపక అధికారి ఉదయ్‌కుమార్, సహాయ అగ్నిమాపక అధికారి బీజెడీఎస్పీ కుమార్, ఇన్చార్జ్ తహశీల్దార్ ప్రసాద్, ఎస్సై ఎన్,కొండయ్య తదితరులు పాల్గొన్నారు.