ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి | judicial inquiry should probe on police suicides | Sakshi
Sakshi News home page

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి

Published Fri, Sep 2 2016 3:12 AM | Last Updated on Tue, Aug 21 2018 8:14 PM

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి - Sakshi

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి

ఎస్‌ఐల ఆత్మహత్యలపై చాడ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో వరుసగా జరుగుతున్న ఎస్‌ఐల ఆత్మహత్యలపై శాఖాపరంగా ఉన్నతస్థాయి విచారణతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆ శాఖలో పెరుగుతున్న ఒత్తిళ్లు, అధికార, రాజకీయ జోక్యం, మామూళ్ల విష సంస్కృతి వంటి సమస్యలను పరిష్కరించి ప్రక్షాళన చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహజంగానే పోలీసుశాఖలో పని ఒత్తిడి ఉంటుందని, అయితే యువ ఎస్‌లు బలికావడం ఆ శాఖకు కళంకమన్నారు. శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించింది. కార్మిక రంగ సమస్యలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై చేపట్టిన సమ్మెకు అన్ని రంగాల ప్రజలు సహకరించాలని చాడ  కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement