- డిజైన్‌తో ప్రాణం తీస్తోంది కేసీఆర్
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
తొగుట: బంగారు తెలంగాణ పేరిట ప్రభుత్వం పేదల బతుకులను ఆగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న సీపీఎం పాదయాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. మెదక్ జిల్లా తొగుట మండలం తుర్క బంజేరుపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కాలువల ద్వారా చెరువులు నింపేందుకు ప్రయత్నిస్తే.. ప్రస్తుత టీఆర్‌ఎస్ సర్కార్ రీ డిజైన్ పేరిట అడ్డుకుందన్నారు. రూ.18 వేల కోట్లతో చేపట్టాల్సిన ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరుతో రూ.83 వేల కోట్లకు పెంచిందని విమర్శించారు. ప్రాణహితకు జాతీయ హోదా రాకుండా చేసిందని మండిపడ్డారు.
ప్రాణహితకు ప్రాణం పోసింది వైఎస్సార్
Published Sun, Jul 3 2016 8:31 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement
Advertisement