Pranahitha
-
కంతనపల్లి, ప్రాణహిత సంగతేంటో!
⇒ పర్యావరణ, అటవీ సమస్యల నుంచి గట్టేక్కేనా.. ⇒ మార్చిలో ఏఈసీ కమిటీ ముందు ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసిన నేపథ్యంలో.. ఇదే అంశంతో ముడిపడి ఉన్న ఇతర ప్రాజెక్టులపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుం దన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టుల పర్యా వరణ అంశాలపై కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆందోళన నెలకొంది. కాళేశ్వరం మాదిరే వ్యవహరిస్తే ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మాదిరే ప్రాణహిత, కంతనపల్లి లోనూ భారీగా భూసేకరణ, అటవీ భూమి అవసరాలున్నాయి. ప్రాణహిత ప్రాజెక్టు పరిధిలో 3,900 ఎకరాల భూసేకరణ అవస రం కానుండగా, 2,671.32 ఎకరాల అటవీ భూమి అవసరం ఉంది. ఇక కంతనపల్లి పరిధిలోనూ 90 ఎకరాల అటవీ భూమి అవసరంతో పాటు 1500 ఎకరాల భూమి ముంపునకు గురౌతోంది. వీటన్నింటికీ సం బంధించి కేంద్ర పర్యావరణ శాఖ ముందు ప్రజెంటేషన్ చేస్తేనే టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఖరారు చేస్తుంది. ఈ టీఓఆర్‌కు అనుగుణంగా పర్యావరణ మదింపు నివేది కను తిరిగి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తే అక్కడ ఆమోదం దక్కనుంది. ఈ టీఓఆర్ ప్రక్రియను మూడు దఫాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి వర్షా కాలానికి ముందు, వర్షాకాలం, వర్షా కాలం ముగిసిన అనంతరం వేర్వేరు పరిస్థితుల్లో పర్యావరణ మదింపు చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం టీఓఆర్‌కు ఓకే చేస్తే మూడు సీజన్ల అధ్యయన వివరాలతో నీటి పారుదల శాఖ నివేదిస్తుంది. ఒకవేళ కేంద్ర జల సంఘం కొత్తగా తెచ్చిన మార్గదర్శకాలను సాకుగా చూపి టీఓఆర్‌కు అనుమతి ఇవ్వని పక్షంలో మళ్లీ కొత్తగా ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారంటూ కొం దరు వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునళ్లకు వెళుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2న ప్రాణహితపై, మార్చి 3న కంతనపల్లి పర్యావరణ మదింపు ప్రక్రియపై ఈఏసీ భేటీలు నిర్వహిస్తోంది. ప్రాణహిత అటవీ భూమికి వైల్డ్ లైఫ్ బోర్డు ఓకే కాగా ప్రాణహిత ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 622.0126 హెక్టార్ల అటవీ భూమిని నీటి పారుదల శాఖ పరిధిలోని మార్చేందుకు రాష్ట్ర వైల్డ్‌లైఫ్ బోర్డు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ప్రాజెక్టు కోసం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం, మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ప్రాంతం, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రా వతి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కలిపి మొత్తంగా 1081.0478 హెక్టార్ల అటవీ భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం కానుంది. కాగా ఇందులో 622.0126 హెక్టార్ల అటవీ భూమిని బదలా యించేందుకు స్టేట్ బోర్డు ఓకే చేసింది. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండల శివరాంలో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకం, ఇదే జిల్లా చెన్నూరు పరిధిలోని సోమన్ పల్లి ఎత్తిపోతల పథకాలకు అటవీ భూమి బదలాయింపులను తిరస్కరించింది. -
3 బ్యారేజీలపై సంతకాలు
-గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే ప్రాజెక్టులపై ఒప్పందం -ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్న సీఎం కేసీఆర్, ఫడ్నవీస్ -హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు -100మీటర్ల ఎత్తులో మేడిగడ్డ, 148మీటర్లతో తమ్మిడిహెట్టి సాక్షి, హైదరాబాద్ గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిధి గృహంలో మంగళవారం జరిగిన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సమావేఊశంలో ఈ చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో గోదావరి, ప్రాణహిత, పెనుగంగలపై మూడు బ్యారేజీల నిర్మాణానికి ముఖ్యమంత్రులు పరస్పర అంగీకారం తెలిపారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, గిరీష్ మహజన్, ఇంటర్ స్టే వాటర్ బోర్డు సభ్యులుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్, సుధీర్ మంగత్రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ గంగారాం, రెవెన్యూ శాఖా మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖా మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేల పుట్టా మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ శరమ్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఇతర బోర్డు సభ్యులు, సాగునీటి మంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఒప్పందం 1: గోదావరి నదిపై 100మీటర్ల ఎత్తులో 16 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజీ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల మీద మరో 18లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది. ఒప్పందం 2: ప్రాణహిత తమ్మిడిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో 1.8టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఒప్పందం 3: పెనుగంగపై 213మీటర్ల ఎత్తులో 0.85టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో చనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది. -
2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
రామన్నపేట : ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపా«ధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కేంద్రంలో రామన్నపేట, చిట్యాల మండలాలకు చెందిన భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాజెక్ట్‌ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల్లో చీలిక తెచ్చే విధంగా ప్రభుత్వం మధ్య దళారులను రంగంలోకి దించిందని ఆరోపించారు. రీడిజైన్లపేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకులు రైతుల నోట్లో మట్టికొట్టే విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండ శ్రీశైలం, ఎం.డి జహంగీర్, జెల్లెల పెంటయ్య, కత్తుల లింగస్వామి, జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, కూరెళ్ల నర్సింహాచారి, అరూరి శ్రీనివాస్, గన్నెబోయిన విజయభాస్కర్, గాదె నరేందర్, ఎడ్ల మోహన్‌రెడ్డి, అంబటి మల్లారెడ్డి, పోచబోయిన స్వామి, మల్లేశం, ఏబూషి నర్సింహ, సుర్కంటి మోహన్‌రెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, బూరుగు లింగస్వామి పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని పట్టించుకోని సర్కారు... చిట్యాల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని మల్లారెడ్డి విమర్శించారు. చిట్యాలలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను వ్యవసాయ రంగంలోకి ఆహ్వానిస్తూ కరీంనగర్లో లక్ష ఎకరాల భూములను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలోని చిన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బండ శ్రీశైలం, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు అవిశెట్టి శంకరయ్య, కేవీపీఎస్ డివిజన్ అధ్యక్షుడు జిట్ట నగేశ్, నాయకులు రాజయ్య, పెద్దులు, లింగయ్య, భిక్షం పాల్గొన్నారు. -
ప్రాణహితకు ప్రాణం పోసింది వైఎస్సార్
- డిజైన్‌తో ప్రాణం తీస్తోంది కేసీఆర్ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తొగుట: బంగారు తెలంగాణ పేరిట ప్రభుత్వం పేదల బతుకులను ఆగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న సీపీఎం పాదయాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. మెదక్ జిల్లా తొగుట మండలం తుర్క బంజేరుపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కాలువల ద్వారా చెరువులు నింపేందుకు ప్రయత్నిస్తే.. ప్రస్తుత టీఆర్ఎస్ సర్కార్ రీ డిజైన్ పేరిట అడ్డుకుందన్నారు. రూ.18 వేల కోట్లతో చేపట్టాల్సిన ప్రాజెక్టును రీ డిజైనింగ్ పేరుతో రూ.83 వేల కోట్లకు పెంచిందని విమర్శించారు. ప్రాణహితకు జాతీయ హోదా రాకుండా చేసిందని మండిపడ్డారు. -
రంది పడకుండ్రి.. ఆగమాగం కాకుండ్రి
ఇమాంబాద్ వాసులకు మంత్రి హరీశ్‌రావు భరోసా రామాయంపేట: ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఊరు ముంపునకు గురవుతుందని, తమను ఆదుకోవాలని కంటతడి పెట్టిన సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామస్థులకు నేనున్నానని మంత్రి హరీశ్‌రావు భరో సా ఇచ్చి చెప్పి వారిని అక్కున చేర్చుకున్నారు. వివరాల్లోకి వెలితే.. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో తమ ఊరు ముంపునకు గురవుతుందనే భయంతో గ్రామస్థులు శుక్రవారం రామాయంపేటకు తరలివచ్చి మంత్రి హరీశ్‌రావు ఎదుట మొరపెట్టుకొని కంటతడి పెట్టారు. దీనితో చలించిపోయిన హరీశ్ ‘రంది పడకుండ్రి,- ఆగమాగం కాకుండ్రి’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు ఎత్తు 1.5 నుంచి 4 టీఎంసీల మేర పెంచితే సుమారుగా 40 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. చెప్పుడు మాటలు వినకుండ్రి, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సింగూరు నీరంతా మెతుకుసీమకే సింగూర్ ప్రాజెక్ట్ నీటిని పూర్తిగా మెతుకు సీమకే వినియోగిస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. శుక్రవారం పాపన్నపేట మండలం బాచారంలోని గుండు వాగు, దౌలాపూర్‌లో పాపన్నపేట యేటి కాల్వ, ఏడుపాయల్లో ఘణపురం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో మాట్లాడుతూ మెతుకు సీమలో పయనిస్తున్న మంజీరా నీటిని ఇకముందు జిల్లా వాసులకే వినియోగించే సమయం ఆసన్నమైందన్నారు. కృష్ణ -1, కృష్ణ -2, గోదావరి జలాలను హైదరాబాద్‌కు మల్లించడంతో ఇక సింగూర్ నీటిని స్థానికంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనపురం ఆనకట్ట కోసం సుమారు కోటిరూపాయలు మంజూరుచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తును 1.73మీటర్లకు పెంచుతామని తెలిపారు. ఫలితంగా మరో 5వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 30 యేళ్లుగా నానుతున్న గుండు వాగు, పాపన్నపేట యేటి కాల్వలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు నిధులు విడుదల చేసి పాపన్నపేట మండల రైతులకు మరిచిపోలేని ప్రయోజనం చేకూర్చారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ప్రసంగించారు. కొర్విపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి చిన్నశంకరంపేటః ఓకే రోజు వంద శాతం ఇంకుడు గుంత లు నిర్మించిన కొర్విపల్లిని ఆదర్శంగా తీసుకుని మిగత గ్రామాలు ముందుకుసాగాలని మంత్రి హరీష్‌రావు కోరారు. శుక్రవారం చిన్నశంకరంపేట కొర్విపల్లిలో చేపట్టిన ఓకే రోజు వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 200 కోట్లతో గోదాముల నిర్మాణం మెదక్: రాష్ట్రంలో రూ. 1,024 కోట్లతో 200 గోదాములు నిర్మిస్తుండగా, ఒక్క మెదక్ జిల్లాకే రూ. 200 కోట్ల కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని మార్కెట్లలో రైతుల అవసరాల మేరకు విశ్రాంత గృహాలు, కవర్ షెడ్ల నిర్మాణం, టాయిలెట్లు, క్యాంటీన్లను నిర్మించడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 9 గంటల నిరంతర విద్యుత్ పగటిపూట సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం డ్యామ్ నుంచి నీటిని మళ్లించే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకుల పాపం తోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాకు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 119 కోట్లు రాబోతున్నాయని, 2014-15లో రూ. 53 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహితమే
♦ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన ♦ ‘ప్రాణహిత’కు రూ.685.30 కోట్లు ♦ సింగూరుకు రూ.27.50 కోట్లు ♦ వడివడిగా ‘నిమ్జ్’ పనులు! ♦ బాగుందన్న అధికార పార్టీ ♦ మండిపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు సిద్దిపేట: సాగునీటి రంగానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేసిన నేపథ్యంలో జిల్లాకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ప్రాణహితకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు తగ్గినా.. దీనికి ఎగువనున్న కాళేశ్వరానికి వేల కోట్లు కేటాయించడం దానికి అనుసంధానమై ఉండే ప్రాణహితకు మేలు చేసేదేనని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే సింగూరుకు రూ.10.5 కోట్ల మేర కేటాయింపులు పెరగడం విశేషం. ప్రధానంగా కొన్ని రంగాలపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మిగతా సంక్షేమ రంగాలకు కోత పెట్టిందని విపక్ష పార్టీలు అంటున్నాయి. వ్యవసాయం, రుణమాఫీ అంశాలపై స్పష్ట లేదని అవి ఆరోపిస్తున్నాయి. జిల్లా అనంతగిరి సమీపంలో ఒక బ్యారేజీ, చంద్లాపూర్వద్ద మరో బ్యారేజీ, సిద్దిపేట మండలం తడ్కపల్లి శివార్లలో భారీగా 52 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉన్న కొమురవెళ్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పాములపర్తి వద్ద మరో 21 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మించి జిల్లాకు సాగు నీరందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో 10 నుంచి 15, 17-20, 23, 36 ప్యాకేజీల పేరిట పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా బ్యారేజీలకు సొరంగ మార్గాలు (టన్నెళ్లు) , కాలువల పనులు జరుగుతుండగా ఇటీవలే చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో భూసేకరణ పూర్తవటంతో అక్కడ నిర్మించతల పెట్టిన రంగనాయక సాగర్ ఎడమ కాలువ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మిగిలిన బ్యారేజీలకు సంబంధించి భూసేకరణకు ప్రత్యేకంగా 5 రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేసి సర్వే పనులను ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.685.3 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభం కావడానికి మార్గం సుగమమైంది. కాని గత బడ్జెట్లో కంటే తక్కువగా కేటాయింపులు చేయడం పట్ల జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగూరుకురూ.10 కోట్లు అదనపు కేటాయింపు కాగా జిల్లాలోని మరో ప్రాజెక్టు అయిన సింగూరుకు గత బడ్జెట్ కంటే రూ.10.5 కోట్లు అదనం గా కేటాయించారు. గత బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు రూ.17 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.26.5 కోట్లు కేటాయించడం విశేషం. నిమ్జ్‌కు రూ.100 కోట్లు జహీరాబాద్‌లో నెలకొల్పనున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)కు రూ.100 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం విశేషం. ఇది సాకారమైతే స్థానిక యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వడివడిగా సాగుతోంది. అలాగే ఏదైనా ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా ఎస్పీ వద్ద రూ.కోటి ఉంచాలనే సర్కారు నిర్ణయంపై పోలీసుల వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రోత్సాహకాలే ప్రోత్సాహకాలు.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గరిష్టంగా ప్రయోజనం కలగనుందని ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పట్టణాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అలాగే క్రీడలను క్రమం తప్పకుండా నిర్వహించే వివిధ సంఘాలు, అసోసియేషన్లకు ప్రోత్సాహకాలు అందించాలనే నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇది క్రీడలకు ప్రోత్సాహమిస్తుందని అంటున్నారు. అలాగే గ్రామాల్లో వైద్య సిబ్బందికి సైతం ప్రోత్సాహకాలు ప్రకటించడం పేదలకు వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. పండ్లు, కూరగాయల సాగు ప్రోత్సాహానికి వీలుగా హార్టికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం.. జిల్లా రైతాంగానికి ఊరట కలిగించనుంది. ఇప్పటికే మెదక్ జిల్లా వెజిటబుల్ హబ్‌గా ఆవిర్భవించిన నేపథ్యంలో కూరగాయల రైతులకు ఇది మేలు చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాణ‘హిత’మేనా? ప్రాణహిత - చేవెళ్ల (కాళేశ్వరం) పథకానికి కేటాయించిన నిధులపై పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సింగూరుకు సైతం అన్యాయం జరిగిందని వారంటున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) పథకం ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో గతేడాది కంటే తక్కువ నిధులు కేటాయించింది. సోమవారం ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రూ.685.30 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఈ పథకానికి రూ.1515 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో కరీంగనర్ -
'ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలి'
ఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రాజెక్టు డిజైన్ నివేదిక ఇస్తామని అన్నారు. అలాగే పత్తి మద్దతు ధర పెంచాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో గోదాముల నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరినట్టు హరీశ్‌రావు చెప్పారు. -
ఒకే వేదికపైకి టీడీపీ, కాంగ్రెస్
జెండాలకతీతంగా ‘ప్రాణహిత’ కోసం పోరాడాలని నిర్ణయం - రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బహిరంగసభలో నేతల పిలుపు - ‘ప్రాణహిత’ డిజైన్ మార్పుపై ముగిసిన టీడీపీ పాదయాత్ర - మద్దతు తెలిపి సభలో పాల్గొన్న మాజీ మంత్రులు సబిత, ప్రసాద్‌కుమార్ చేవెళ్ల: జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి ఒక్క వేదికపై పోరాడాలని.. ‘ప్రాణహిత-చేవెళ్ల’ నీళ్లు రంగారెడ్డి జిల్లాకు వచ్చేదాకా సమష్టిగా ఉద్యమించాలని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ శనివారం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొని.. తమ మద్దతు ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా చేవెళ్లలో ‘ప్రాణహిత-చేవెళ్ల’ పైలాన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడారు. సీఎం కేసీఆర్ మెడలు వంచైనా ఈ ప్రాజెక్టును సాధించి తీరుతామన్నారు. కాసుల కక్కుర్తితోనే కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరునూరైనా ప్రాణహిత- చేవెళ్ల డిజైన్‌ను మారుస్తామని సీఎం కేసీఆర్ ఓవైపు ప్రకటిస్తుంటే, మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రం డిజైన్‌ను మార్చడం లేదని చెబుతున్నారని... ఇందులో ఏది నిజమో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో పేదరికం, వెనుకబాటుతనాన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని... ఇప్పుడు ఆ ప్రాజెక్టు డిజైన్ మారిస్తే జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేదిగా ఉందని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ పిచ్చి తుగ్లక్: ఎర్రబెల్లి కేసీఆర్ పిచ్చి తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై కేసీఆర్ దిగొచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్‌ను ప్రజలు ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులతోనే టీఆర్ఎస్ నిండిపోయిందని, మంత్రులు చేతగాని దద్దమ్మలని విమర్శించారు. ‘రూ.6వేల కోట్ల పనులు జరిగిన తరువాత బుద్ధున్నోడు ఎవరైనా ప్రాజెక్టు డిజైన్‌ను మారుస్తాడా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో శంకుస్థాపన చేస్తే.. కేసీఆర్ డిజైన్ మార్చి అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. -
'చీప్ లిక్కర్ పాలసీకి మేం వ్యతిరేకం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చీప్ లిక్కర్ పాలసీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని టీపీసీసీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అదే విధంగా జాతీయ హోదా వచ్చే అవకాశమున్న ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చరాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే వాటర్ గ్రిడ్ పథకం అవసరం లేదని తెలిపారు. వాటర్ గ్రిడ్‌కు రూ.36వేల కోట్లు వెచ్చించడం ఆర్థిక భారమేనని పేర్కొన్నారు. కొన్ని పైప్లైన్ల కంపెనీలు, కాంట్రాక్టర్ల కోసమే వాటర్ గ్రిడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అనాలోచిన నిర్ణయాల వల్లనే మెట్రో రైలు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు. -
ప్రాణహితకు ‘మహా’ సీఎం వ్యతిరేకి
మంత్రి పోచారం బాన్సువాడ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించవద్దంటూ ఆందోళనలు చేశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నిం చారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని మరుగున పడేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఏటా సుమారు 1,000 టీఎంసీల నీరు వచ్చి గోదావరిలో కలుస్తోందని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి, సుమారు 470 టీఎంసీల నీటిని మళ్లించేందుకు రూ.35 వేల కోట్లతో పథకం రూపొందించామని తెలిపారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరులోకి, అటు నుంచి మెదక్‌కు, తూఫ్రాన్‌కు, అక్కడి నుంచి హల్దీవాగు మీదుగా నిజాం సాగర్‌లోకి నీరు మళ్లిస్తామని వివరించారు. దీంతో 365 రోజుల పాటు కాలువల్లో నీరు ఉంటుందని, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. తెలంగాణలో ఉన్నది ‘మోతేబర్’ ప్రభుత్వమని, అందుకే ప్రపంచ బ్యాంకుతో పాటు జపాన్, అమెరికన్ తదితర బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పథకాలను చూసి కాంగ్రెస్‌కు మతి పోతోందని, భవిష్యత్తులో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. -
ఉప్పొంగుతున్న ప్రాణహిత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లె మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం నది పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలోని పలు లోతట్టు గ్రామాల్లోకి నీళ్లు చేరాయి. అలాగే రవాణా మార్గాలు జలమయం అయ్యాయి. ఎగువ రాష్ట్రలైన మద్యప్రదేశ్, మహరాష్ర్లలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. (వేమనపల్లె) -
ఇరకాటంలో 'గులాబీ' నేతలు
'ప్రాణహిత' తరలింపుపై ఎటూ తేల్చుకోని వైనం పెదవి విప్పని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఊపందుకున్న ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పోరాటం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తరలింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం జిల్లాలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు నాయకులూ ఈ అంశంపై నోరు మెదపడం లేదు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీని కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి తరలిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గూడెం వద్ద జరిగిన బహిరంగ సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. తరలింపు నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు, పలు ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రాజెక్టు తరలింపుతో జిల్లాలో సుమారు 56 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా.. ఇప్పటివరకు ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.9 వేల కోట్లు నిధులు మట్టిపాలవుతాయని ప్రజా సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఆందోళనలు, నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉధృతం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాకు పరిమితమైన నిరసనలు.. రాష్ట్ర స్థాయిలో చేపట్టారు. అయినప్పటికీ జిల్లాలోని అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం నోరు విప్పడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌లో చేసిన ప్రకటన మినహా.. జిల్లాలో ఒక్క నేత కూడా ఈ అంశంపై కనీసం మీడియాతో కూడా ప్రస్తావించడం లేదు. ఈ ప్రాజెక్టు కింద 56 వేల ఎకరాలున్న జిల్లా ఆయకట్టును 1.50 లక్షల ఎకరాలకు పెంచుతామని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి గానీ, నేత గానీ ప్రకటన చేసిన దాఖలాలు లేవు. ఈ బ్యారేజీ తరలింపుతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే సిర్పూర్-టి, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల పరిధిలోని నేతలు సైతం నోరు విప్పేందుకు సాహసించడం లేదు. ఓసీపీల విషయంలోనూ.. ఓపెన్‌కాస్టు గనుల విషయంలోనూ అధికార పార్టీ నేతలది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ ఓసీపీలను వ్యతిరేకించింది. తెలంగాణ వచ్చాక భూగర్భ గనులనే ప్రారంభిస్తామని అధినేత కేసీఆర్‌తోపాటు, పార్టీ నాయకులు పలుమార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంతో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని గట్టెక్కాలంటే విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్షణ బొగ్గు అవసరాలు తీరాలంటే ఓసీపీలే శరణ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో మందమర్రి, కాసిపేట మండలాల మధ్య కేకే ఓసీపీని ప్రారంభించే దిశగా సింగరేణి అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రగుంటపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ఓసీపీల విషయంలో అధికార పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. -
'ప్రాణహిత' ను తరలించవద్దు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిస్తున్న ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంకు తరలించే ఉద్దేశ్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రాణహిత ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు శుక్రవారం ప్రజాయాత్రను చేపట్టారు. మంచిర్యాల నుంచి తుమ్మిడిహట్టి వరకు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు సాగు, త్రాగునీరు అందించడంతో పాటు జంట నగరాలకు నీరందుతుందన్నారు. కాని మహారాష్ట్ర అభ్యంతరం చెబుతుందన్న కుంటిసాకుతో జిల్లాకు ప్రాజెక్టు రాకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్రపన్నుతుందని ఆరోపించారు. జిల్లాలో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నా, జిల్లా రైతులకు సాగునీరందడం లేదని ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంకు తరలించే కుట్రపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు నైనాల గోవర్దన్, రాజేశం, రాజబాబు, శ్రీనివాస్, రాందాస్, మల్లేశ్ పాల్గొన్నారు. (మంచిర్యాల రూరల్) -
బ్యారేజీలతో జల‘సిరి’
కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి బ్యారేజీలతో ప్రయోజనం రాష్ర్ట ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ నివేదిక దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఆరు బ్యారే జీలకు ప్రతిపాదన కృష్ణా పరిధిలోనూ నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కమిటీ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, కంతానపల్లి రిజర్వాయర్ల పూర్తికి సిఫారసు వాటితో 100 టీఎంసీల నీటి నిల్వకు ఆస్కారముందన్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వాటా మేరకు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ర్టంలో మరిన్ని బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ సూచించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని కూడా పేర్కొంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా నీటిని సాగు ప్రయోజనాలకు మళ్లించుకోవచ్చని తేల్చింది. నదుల్లో వరద ఉండే కనిష్ట రోజుల్లో గరిష్ట నీటిని ఒడిసి పట్టుకునేందుకు బ్యారేజీల నిర్మాణం అత్యావశ్యకమని ఉద్ఘాటించింది. గోదావరి, కృష్ణా నదుల్లో లభ్యత నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల్లో రీ ఇంజనీరింగ్ జరపాలని నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఆ దిశగా అధ్యయనానికి రిటైర్డ్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రెండు రోజుల పాటు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించింది. గోదావరి పరిధిలో మరో ఆరు బ్యారేజీలు, కృష్ణా పరిధిలోనూ పలు బ్యారేజీలను అదనంగా నిర్మించాల్సిన అవసరముందని కమిటీ నొక్కి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కమిటీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇతర సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసి ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో సర్వే సంస్థ ‘వ్యాప్కోస్’ ప్రతినిధులు కూడా పాల్గొని ‘ప్రాణహిత’ ప్రత్యామ్నాయంపై వివరించినట్లు తెలిసింది. కృష్ణా పరిధిలోనూ మరిన్ని.. ఇక కృష్ణా నదిలో రాష్ట్రానికి 267 టీఎంసీల వరకు నీటిని వాడుకునే వెసలుబాటు ఉంది. ఇక్కడ ఇంకా 200 టీఎంసీల వరకు నీటిని వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నా యి. ఇందుకోసం కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా పాల మూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వీటితో సుమారు 160 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల పరిశీలన జరిపిన నిపుణుల కమిటీ.. సర్కారుకు పలు సిఫార్సులు చేసింది. మొదట తుంగభద్ర నుంచి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వద్ద 16 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశమున్న దృష్ట్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని సూచించింది. దీని కోసం అవసరమైతే కర్ణాటకను ఒప్పించాలని సూచించింది. ఇక కల్వకుర్తి ప్రాజెక్టు పరి ధిలో 35 టీఎంసీల నీటి వినియోగం కోసం మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని, జూరాల ప్రాజెక్టు రివర్ బ్యాంకులో గుర్రంగడ్డ వద్ద మరో బ్యారేజీని, నెట్టెంపాడులో మరో 2 బ్యారేజీలను నిర్మించాలని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం త్వరితగతిన జరగాలంటే భూసేకరణ, పునరావాస చర్యలను ముందు పూర్తి చేసి తర్వాతే టెండర్లకు వెళ్లాలని కమిటీ కీలక సూచన చేసింది. గోదావరి పరిధిలో అనువైన ప్రాంతాలు గోదావరిలో నికర, వరద జలాలు కలిపి లభ్యతగా ఉన్న 1,400 టీఎంసీల నీటిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర వినియోగించుకునే అవకాశముంది. అయితే ప్రస్తుతం 400 టీఎంసీల మేరకే రాష్ర్టం వినియోగించుకుంటోంది. మిగతా వాటాను కూడా వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దుమ్ముగూడెం మొదలుకుని ప్రాణహిత వరకు కొత్తగా 6 బ్యారేజీలనైనా నిర్మించాలని ప్రతిపాదించింది. అప్పుడే గోదావరి బేసిన్లో ఎక్కడైనా నీటిని నిల్వ చేసుకుని వాడుకునే వెసలుబాటు ఉంటుందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఒకటి, కంతనపల్లి-దుమ్ముగూడెం మధ్య, కంతానపల్లి, ఇచ్ఛంపల్లి, కాళేశ్వరంతో పాటు ప్రాణహితలో భాగంగా ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన వేమునిపల్లి వద్ద బ్యారీజీల నిర్మాణానికి అనువైన స్థలాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. అయితే వాటి సామర్థ్యం ఎంత ఉండాలన్న దానిపై మాత్రం కమిటీ ఇంకా నిర్ధారణకు రాలేదు. మేమునిపల్లి వద్ద మాత్రం 5 టీఎంసీల బ్యారేజీని నిర్మించవచ్చని పేర్కొంది. మూడు రిజర్వాయర్లతో 100 టీఎంసీల నిల్వ.. గోదావరి బేసిన్లో 350 టీఎంసీల నీటిని వాడుకునే ఉద్దేశంతో 7 భారీ ప్రాజెక్టులను చేపట్టినా అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. ప్రధానంగా దేవాదుల, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, కాళేశ్వరం, ఎస్సారెస్పీ వర ద కాల్వ, మిడ్‌మానేరు ప్రాజెక్టులపై సర్కారు దృష్టి సారిం చింది. అయితే గోదావరి నీటిని నిల్వ చేసుకునేందుకు మిడ్‌మానేరు(25.87 టీఎంసీలు), కంతానపల్లి(50 టీఎంసీలు), ఎల్లంపల్లి(24 టీఎంసీలు) ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. దీనివల్ల 100 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుం ది. ప్రభుత్వం మన సు పెడితే రిజర్వాయర్లను ఏడాదిలో పూర్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కంతానపల్లిని పూర్తి చేస్తే దేవాదుల ఎత్తిపోతలకు, ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2కు నిల్వ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉం టుందని పేర్కొంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో స్టేజ్-2 పనులు పూర్తయినా, స్టేజ్-1 పనులు కొనసాగుతుండటంతో ఆ పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. మిడ్‌మానేరులో పునరావాస సమస్యలను పరిష్కరిస్తే పనులు ముందుకు సాగే అవకాశముందని కమిటీ విశ్లేషించింది. -
ప్రాణహితపై 17న ‘మహా’ సీఎంతో కేసీఆర్ భేటీ
బ్యారేజీ ఎత్తు, పలు సమస్యలపై చర్చించనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా ఉన్న ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగ ప్రాజెక్టుల్లో నెలకొన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు గతంలో ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలు అమలయ్యేలా చూడాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఈ నెల 17న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్తోకేసీఆర్ ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఈ నెల 15న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ రెండు రోజుల అనంతరం అటునుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్లి ఫడ్నవిస్‌తో భేటీ కానున్నారు. ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని తుమ్మిడిహెట్టిలో నిర్మించదలిచిన బ్యారేజీలో ఎత్తిపోసేలా రాష్ట్రం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. దీనికోసం బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా తెలంగాణ నిర్ణయించ గా మహారాష్ట్ర దాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసిన కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) తెలంగాణ చెబుతున్న వాదనను సమర్థిస్తూ 152 మీటర్ల బ్యారేజీ ఎత్తుకు పూర్తి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో నివేదికను ప్రామాణికంగా తీసుకొని బ్యారేజీ ఎత్తుకు సమ్మతం తెలపాలని కేసీఆర్ కోరే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాలకు ఆ రాష్ట్ర చట్టాల మేరకు పరిహారం ఇచ్చేం దుకు సీఎం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. ఇక లెండి పనులను వేగిరం చేసే చర్యల కోసం కేసీఆర్ విన్నవించునున్నారు. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు కింది కాల్వల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియకు మహారాష్ట్ర ముందుకు రావాలని కోరనున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఫడ్నవిస్‌తో భేటీలో చర్చించాల్సిన అంశాలపై కేసీఆర్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రాణహిత హైడ్రాలజీ లెక్కలను పరిశీలించేందుకు త్వరలోనే కేంద్ర జల సంఘం అధికారులు రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది.