3 బ్యారేజీలపై సంతకాలు | Telangana and Maharashtra signed on 3 barrages | Sakshi
Sakshi News home page

3 బ్యారేజీలపై సంతకాలు

Published Tue, Aug 23 2016 8:03 PM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Telangana and Maharashtra  signed on 3 barrages

-గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే ప్రాజెక్టులపై ఒప్పందం
-ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్న సీఎం కేసీఆర్, ఫడ్నవీస్
-హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు
-100మీటర్ల ఎత్తులో మేడిగడ్డ, 148మీటర్లతో తమ్మిడిహెట్టి

సాక్షి, హైదరాబాద్

గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిధి గృహంలో మంగళవారం జరిగిన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సమావేఊశంలో ఈ చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో గోదావరి, ప్రాణహిత, పెనుగంగలపై మూడు బ్యారేజీల నిర్మాణానికి ముఖ్యమంత్రులు పరస్పర అంగీకారం తెలిపారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, గిరీష్ మహజన్, ఇంటర్ స్టే వాటర్ బోర్డు సభ్యులుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్, సుధీర్ మంగత్రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ గంగారాం, రెవెన్యూ శాఖా మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖా మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేల పుట్టా మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ శరమ్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఇతర బోర్డు సభ్యులు, సాగునీటి మంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఒప్పందం 1: గోదావరి నదిపై 100మీటర్ల ఎత్తులో 16 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజీ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల మీద మరో 18లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది.

ఒప్పందం 2: ప్రాణహిత తమ్మిడిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో 1.8టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్-కాగజ్నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.

ఒప్పందం 3: పెనుగంగపై 213మీటర్ల ఎత్తులో 0.85టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో చనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement