barrages
-
బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన అత్యవసర మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. వర్షాకాలం రాకముందే అత్యవసర మరమ్మతులు చేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి ఈ నెల 14న ఎల్అండ్టీ–పీఈసీ జాయింట్ వెంచర్(మేడిగడ్డ బ్యారేజీ), అఫ్కాన్స్–విజేత–పీఈఎస్(అన్నారం బ్యారేజీ), నవయుగ(సుందిళ్ల బ్యారేజీ) సంస్థలకు వేర్వేరుగా లేఖలు రాశారు. అయ్యర్ కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికను నిర్మాణ సంస్థలకు పంపించి ఆ మేరకు పనులు నిర్వహించాలని కోరారు. ఒప్పందం మేరకే ‘మేడిగడ్డ’ చెల్లింపులు.. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా చేపట్టే పనులకు చెల్లింపులు చేయాల్సిందేనని కోరుతూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జేవీ’విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించి ఒప్పందంలోని నియమాలు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని, ఆ మేరకు చెల్లింపులు జరుపుతామని నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన మేరకు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాకులు, షట్టర్ల తొలగింపు, పగుళుæ్ల వచ్చిన పియర్లకు అదనపు భద్రతకు బ్రేసింగ్ చేయడం, బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను పూడ్చివేయడానికి గ్రౌటింగ్ చేయడం, ప్లింత్ స్లాబుకు మరమ్మతులు చేయడం, గేట్లన్నీ ఎత్తడం వంటి అన్ని పనులు చేయాలని నిర్మాణ సంస్థను కోరింది. బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. -
వరదలతో బ్యారేజీలకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్‌లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది. బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు. ఈ వారం చివరిలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్వాల్స్కి లేదా కటాఫ్‌వాల్స్–ర్యాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్(జీపీఆర్) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. -
పెరగనున్న కాళేశ్వరం అంచనా వ్యయాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల్లోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల అంచనా వ్యయాలు పెరగనున్నాయి. అంచనాలు వేసిన సమయానికి, ప్రస్తుతానికి స్టీలు, సిమెంట్ ధరల్లో పెరుగుదల జరగడం, అదనంగా అనేక నిర్మాణాలు చేయాల్సి రావడంతో వ్యయాలు పెరిగాయి. మేడిగడ్డ అంచనా వ్యయం మొదటగా రూ.2,591 కోట్లు ఉండగా, ప్రస్తుతం అక్కడ ఫ్లడ్‌బ్యాంకులు, ఇతర నిర్మాణాలు పెరిగి, మట్టి, కాంక్రీట్ పనులు పెరగడంతో వ్యయం రూ.4,583 కోట్లకు చేరింది. అన్నారం బ్యారేజీ వ్యయం మొదట రూ.1,785కోట్లు ఉండగా, దాన్ని రూ.2,795 కోట్లకు సవరిస్తూ ప్రతిపాదనలు అందాయి. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–7 అంచనా వ్యయం రూ.1,502 కోట్లు ఉండగా, రూ.2,030 కోట్ల మేర పెరగనుంది. ప్యాకేజీ–8 అంచనా వ్యయం రూ.5,166 కోట్లు ఉండగా, పలు నిర్మాణాల కారణంగా వ్యయం రూ.6,897 కోట్లకు చేరనుంది. పెరిగిన వ్యయాలకు నీటిపారుదలSశాఖ రాష్ట్రస్థాయి స్థాయీ సంఘంలో చర్చించి ఆమోదించిన తర్వాత ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. -
వైకుంఠపురంలో అవినీతి వరద
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతి పరంపరలో తాజాగా వైకుంఠపురం బ్యారేజీ పనులు చేరాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందే ఆ బ్యారేజీ పనుల్లో రూ. 550 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి వ్యూహం రచించారు. చంద్రబాబుకు కోట్లాది రూపాయలు కురిపించిన పట్టిసీమ ప్రాజెక్టు టెండర్ల వ్యూహాన్ని కృష్ణానదిపై నిర్మించే వైకుంఠపురం బ్యారేజీలోనూ అవలంబించి మళ్లీ వందల కోట్లు వెనకేసుకోనున్నారు. నిజానికి జీవో 94 ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ (ఎక్సెస్)కు కోట్ చేస్తే టెండర్లు రద్దు చేయాలి. కానీ, ఆ నిబంధనను సడలించి ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూళ్లు కోట్ చేసేలా వైకుంఠపురం బ్యారేజీ పనులకు ఈనెల 21న సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 4లోగా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. 5న టెక్నికల్ బిడ్, 7న ఫైనాన్షియల్ బిడ్ తెరిచి టెండర్ ఖరారు చేయనున్నారు. 24.99 శాతం ఎక్సెస్‌కు నవయుగ షెడ్యూళ్లు దాఖలు చేసేందుకు చంద్రబాబుకు ఆ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. 4.99 శాతం ఎక్సెస్.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తే 20 శాతం ‘బోనస్’ (ఆర్నెల్లకు ఐదు శాతం చొప్పున) ఇచ్చేలా షరతులు పెట్టి కేబినెట్లో ఆమోదముద్ర వేసేలా స్కెచ్ వేశారు. ఆ వెంటనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పట్టిసీమ తరహాలోనే కమీషన్లు వసూలు చేసుకోనున్నారు. ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన ‘సాక్షి’ ఈనెల 4న ‘వైకుంఠపురంలో పట్టిసీమ వ్యూహం’ శీర్షికన కథనం ప్రచురించింది. మూడుసార్లు టెండర్లు రద్దు రాజధాని నగర నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పనులకు రూ. 801.8 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది జూలై 9న ఎల్ఎస్ (లంప్సమ్)–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను నవయుగ సంస్థకు అప్పగించాలని చంద్రబాబు ముందే నిర్ణయించడంతో.. ఇతరులెవరూ షెడ్యూళ్లు దాఖలు చేయడానికి సాహసించలేదు. అయితే ఆ ధరలు తమకు గిట్టుబాటు కావంటూ నవయుగ కూడా షెడ్యూళ్లు దాఖలు చేయలేదు. కాంట్రాక్టర్ సూచనల మేరకు.. అంచనా వ్యయాన్ని పెంచాలని జలవనరుల శాఖపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.1025.98 కోట్లకు అంతర్గత అంచనా వ్యయం (ఐబీఎం–ఇంటర్నల్ బెంచ్ మార్క్)ను పెంచేసి ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో గతేడాది ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉన్నందున ఆ అంచనా వ్యయం కూడా గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ తేల్చిచెప్పడంతో ఆ టెండర్లను కూడా రద్దు చేశారు. దాంతో ఐబీఎంను రూ.1075.15 కోట్లకు పెంచి గతేడాది అక్టోబర్ 25న మూడోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. దీనికి కూడా కాంట్రాక్టర్ సంతృప్తి చెందకపోవడంతో మరోసారి టెండర్లను రద్దు చేశారు. నాలుగో సారి.. పట్టిసీమ వ్యూహం వైకుంఠపురంలో కమీషన్లు భారీగా దండుకోవడానికి చంద్రబాబు ‘పట్టిసీమ’ వ్యూహాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఐబీఎంను రూ. 1,459 కోట్లకు పెంచేలా చేశారు. ఈనెల 21న నాలుగో సారి ఈపీసీ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 24.99 శాతం ఎక్సెస్‌కు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కాంట్రాక్టర్‌కు సూచించారు. ‘ఐదు శాతం కంటే ఎక్సెస్’ నిబంధనలను సడలించారు. పట్టిసీమ ఎత్తిపోతల్లో 21.99 శాతం ఎక్సెస్‌కు షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. 5 శాతం ఎక్సెస్.. ఏడాదిలోగా పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్ ఇచ్చేలా షరతు విధించి ఆ టెండర్‌ను కేబినెట్లో ఆమోదించారు. అదే వ్యూహాన్ని వైకుంఠపురం బ్యారేజీ టెండర్లలోనూ అనుసరించారు. నవయుగ మాత్రమే టెండర్ దాఖలు చేస్తే.. నిబంధనల ప్రకారం వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. అందువల్ల నవయుగతో పాటు మరో కోటరీ సంస్థతో టెండర్ దాఖలు చేయించేందుకు అనుగుణంగా నిబంధనలు మార్చారు. రెండు సంస్థల మధ్య సీఎం చంద్రబాబు కుదిర్చిన ఒప్పందం మేరకు నవయుగ 24.99 శాతం ఎక్సెస్.. కోటరీ సంస్థ 26 శాతం ఎక్సెస్‌కు షెడ్యూళ్లు దాఖలు చేయాలి. దీంతో ఎల్–1గా నిలిచే నవయుగకే పనులు కట్టబెట్టనున్నారు. వ్యయం 8 వందల కోట్ల నుంచి 18 వందల కోట్లకు అంచనా వ్యయాన్ని రూ. 801.88 కోట్ల నుంచి రూ. 1,459 కోట్లకు పెంచేశారు. దీనికి తోడు 24.99 శాతం ఎక్సెస్ అంటే.. మరో రూ. 364.60 కోట్లు పెరుగుతుంది. దీంతో మొత్తం పనుల ఒప్పందం విలువ రూ.1,823.6 కోట్లకు చేరుతుంది. పనుల అంచనా వ్యయం రూ. 1,021 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇందులో రూ. 550 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో ముఖ్యమంత్రి వసూలు చేసుకోనున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
బ్యారేజీలు లేకున్నా పూడిక తీస్తున్నారు
తెలంగాణలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషనర్లు సాక్షి, న్యూఢిల్లీ: బ్యారేజీలు లేకున్నా పూడికతీత పేరుతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని తెలంగాణలో ఇసుక తవ్వకాలపై దాఖలైన కేసులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రిబ్యునల్ మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కంతనపల్లి డ్యాం లేకున్నా పూడికతీత పేరుతో ప్రభుత్వం ఇసుకను అక్రమంగా తరలిస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్‌ను ట్రిబ్యునల్ వివరణ కోరగా.. ప్రభుత్వం పూడికతీతను స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుపుతోందని, ఇసుకను నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తోందని పేర్కొన్నారు. ఒక శాతం ఇసుకను ప్రభుత్వ అవసరాలకు వినియోగించి, 99 శాతం అమ్ముకుంటూ ఉండవచ్చు కదా అని ట్రిబ్యునల్ ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, ఇసుక వినియోగానికి సంబంధించిన పూర్తి లెక్కలున్నాయని సంజీవ్ సమాధానమిచ్చారు. -
3 బ్యారేజీలపై సంతకాలు
-గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే ప్రాజెక్టులపై ఒప్పందం -ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్న సీఎం కేసీఆర్, ఫడ్నవీస్ -హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు -100మీటర్ల ఎత్తులో మేడిగడ్డ, 148మీటర్లతో తమ్మిడిహెట్టి సాక్షి, హైదరాబాద్ గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర అంగీకారం కుదర్చుకుంటూ చేసిన ఒప్పందాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ముంబయిలోని సహ్యాద్రి అతిధి గృహంలో మంగళవారం జరిగిన ఇంటర్ స్టేట్ వాటర్ బోర్డు సమావేఊశంలో ఈ చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో గోదావరి, ప్రాణహిత, పెనుగంగలపై మూడు బ్యారేజీల నిర్మాణానికి ముఖ్యమంత్రులు పరస్పర అంగీకారం తెలిపారు. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, గిరీష్ మహజన్, ఇంటర్ స్టే వాటర్ బోర్డు సభ్యులుగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్, సుధీర్ మంగత్రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ గంగారాం, రెవెన్యూ శాఖా మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖా మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేల పుట్టా మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ శరమ్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఇతర బోర్డు సభ్యులు, సాగునీటి మంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఒప్పందం 1: గోదావరి నదిపై 100మీటర్ల ఎత్తులో 16 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఈ బ్యారేజీ ద్వారానే గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.19లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల మీద మరో 18లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చెందుతుంది. ఒప్పందం 2: ప్రాణహిత తమ్మిడిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో 1.8టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఒప్పందం 3: పెనుగంగపై 213మీటర్ల ఎత్తులో 0.85టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో చనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. మహారాష్ట్రలోని పొలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, జైనథ్, బేలా మండలాలకు సాగునీరు అందుతుంది.