నిర్మాణ సంస్థలను కోరిన రాష్ట్ర నీటిపారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన అత్యవసర మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. వర్షాకాలం రాకముందే అత్యవసర మరమ్మతులు చేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్‌రెడ్డి ఈ నెల 14న ఎల్‌అండ్‌టీ–పీఈసీ జాయింట్ వెంచర్(మేడిగడ్డ బ్యారేజీ), అఫ్కాన్స్–విజేత–పీఈఎస్(అన్నారం బ్యారేజీ), నవయుగ(సుందిళ్ల బ్యారేజీ) సంస్థలకు వేర్వేరుగా లేఖలు రాశారు. అయ్యర్ కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికను నిర్మాణ సంస్థలకు పంపించి ఆ మేరకు పనులు నిర్వహించాలని కోరారు.
ఒప్పందం మేరకే ‘మేడిగడ్డ’ చెల్లింపులు..
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా చేపట్టే పనులకు చెల్లింపులు చేయాల్సిందేనని కోరుతూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జేవీ’విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించి ఒప్పందంలోని నియమాలు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని, ఆ మేరకు చెల్లింపులు జరుపుతామని నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సూచించిన మేరకు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాకులు, షట్టర్ల తొలగింపు, పగుళుæ్ల వచ్చిన పియర్లకు అదనపు భద్రతకు బ్రేసింగ్ చేయడం, బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను పూడ్చివేయడానికి గ్రౌటింగ్ చేయడం, ప్లింత్ స్లాబుకు మరమ్మతులు చేయడం, గేట్లన్నీ ఎత్తడం వంటి అన్ని పనులు చేయాలని నిర్మాణ సంస్థను కోరింది. బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment