'ప్రజల ఓర్పును తక్కువ అంచనా వేయొద్దు'
Published Thu, Sep 15 2016 2:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
మందమర్రి : ప్రజల ఓర్పును తక్కువగా అంచనా వేస్తున్న తెలంగాణ సర్కారు వారి ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనను నిలదీసి ప్రశ్నించేది ఒక్క సీపీఐ మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినం జీపు యాత్ర గురువారం మధ్యాహ్నం మందమర్రికి చేరింది. ఈ సందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు.
నయీం కేసు విచారణను కిందిస్థాయి అధికారులతో చేయిస్తున్న ప్రభుత్వానికి ఉన్నతాధికారులతోనే నయీం సంబంధాలు నెరిపాడనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో నయీం దోస్తీ విషయం కిందిస్థాయి అధికారుల విచారణలో ఎలా బయటకు వస్తుందని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement