
జ్యుడీషియల్ విచారణ జరపాలి
ఇసుక మాఫియాపై కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలపై, అక్రమాలపై జ్యుడీషియల్ విచా రణ జరపాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. జేఏసీ నేతలు ఇటిక్యాల పురుషోత్తం, గోపాలశర్మ, భైరి రమేశ్ తదితరులతో కలసి జేఏసీ రాష్ట్ర కార్యాల యంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణంపై ప్రభావం, తవ్వకాలకు మార్గనిర్దేశకాలు, వాటికి ప్రామాణికత, నిబంధనల అమలులో లోపాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సిరి సిల్లలోని మూడు గ్రామాల దళితులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారని విమర్శిం చారు. దీని వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన సామాజిక ఉద్యమ సంఘాలపై, న్యాయవాదులపై పోలీసులు అసహనాన్ని ప్రదర్శించారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం ఎస్సీ కమిషన్ చేసిన సూచనలు, సిఫార్సులను అమలు చేయాలన్నా రు. బాధ్యులైన అధికారులపై కఠినంగా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరుల స్ఫూర్తి మూడో విడత గజ్వేల్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.