గణపతిని పట్టిస్తే 2.5 కోట్ల నజరానా
న్యూఢిల్లీ: సీపీఐ మావోయిస్టు పార్టీ సారథి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి(65)... ఇతడిని పట్టుకునేందుకు వీలుగా పోలీసులకు తగిన సమాచారం అందిస్తే రూ.2.52 కోట్ల రూపాయల నజరానా దక్కుతుంది. ఈ ముఖ్యనేతను ఎలాగైనా పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కలసి భారీ బహుమానాన్ని ప్రకటించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కోటిరూపాయల చొప్పున, ఆంధ్రప్రదేశ్ రూ.25 లక్షలు, ఎన్‌ఐఏ రూ.15 లక్షలు, జార్ఖండ్ రూ.12 లక్షల చొప్పున ప్రకటించాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీలోని ఏదేనీ సభ్యుడి సమాచారం అందించినా, కోటి రూపాయల నగదు బహుమానాన్ని అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నక్సలిజాన్ని ఎదుర్కోవడంపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.