దేవస్థానం ఆసుపత్రిలో ప్రథమచికిత్స నిర్వహిస్తున్న డాక్టర్లు, పక్కన ఎస్పీ తదితరులు
శ్రీశైలమహాక్షేత్రానికి మూడు కి.మీ. దూరంలో ఉన్న సాక్షిగణపతి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన సురేంద్ర గోపాల్, మరికొందరు గాయపడ్డారు.
– ఆస్పరి గ్రామస్తులపై దూసుకెళ్లిన బస్సు
– ఒకరికి తీవ్రగాయాలు
– కర్నూలుకు తర లింపు
శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రానికి మూడు కి.మీ. దూరంలో ఉన్న సాక్షిగణపతి వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన సురేంద్ర గోపాల్, మరికొందరు గాయపడ్డారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మల్లన్న దర్శనార్థం ఆస్పరికి చెందిన 22 మంది కాలినడకన బుధవారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనం తర్వాత రాత్రి సాక్షిగణపతి దర్శనార్థం నడిచి వెళ్తుండగా కుప్పంకు చెందిన టూరిస్ట్ బస్సు వారి పక్కగా దూసుకెళ్లింది. ప్రమాదంలో సురేంద్ర గోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్వల్పగాయాలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను శ్రీశైలదేవస్థానం ఆసుపత్రికి చేర్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికష్ణ ఆసుపత్రికి వెళ్లి ద్వారా డీఎంహెచ్‌ఓ ద్వారా వివరాలు ఆరా తీశారు. గాయాలు తీవ్రంగా ఉండడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ వెంట ఓఎస్‌డి రవిప్రకాశ్, డీఎస్పీ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.