ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు | ganapathi navaratri utchavs are ended | Sakshi
Sakshi News home page

ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు

Published Wed, Sep 14 2016 11:09 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు - Sakshi

ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు

శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5న ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ముగింపు పూజల్లో భాగంగా స్వామివార్ల రుద్రయాగశాలలో జయాదిహోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబధోత్సవం, కలశోద్వాసన నిర్వహించారు.

శ్రీశైలం:  శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5న ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి.  ముగింపు  పూజల్లో భాగంగా స్వామివార్ల రుద్రయాగశాలలో జయాదిహోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబధోత్సవం, కలశోద్వాసన నిర్వహించారు. నారికేళాలు, సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతనవస్త్రాలు తదితర ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్‌ గుప్త,జెఈఓ హరినాథ్‌రెడ్డి, అర్చకులు, వేదపంyì తులు హోమగుండానికి సమర్పించారు. అనంతరం యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకుడికి వ్రతకల్పపూర్వక ప్రత్యేకపూజలు చేశారు.ఆలయప్రాంగణంలోని మల్లికాగుండంలోఅభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిదిరోజులపాటు ఆగమ శాస్త్రానుసారం గణపతికి వేదపండితులు, అర్చకులు మండపారాధనలు, ఉపనిషత్తు పారాయణలు, జపానుష్టానాలు, హోమం, సాయంకాల పూజలు నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement