కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా | If the stories I'll Produce | Sakshi
Sakshi News home page

కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా

Published Fri, Jan 9 2015 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా

కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా

స్టోరీ: పూరి
డెరైక్షన్: మీరే!!

 
10 డేస్...
10 స్టోరీ ఐడియాస్
10 మినిట్స్...

 
ఇప్పటికి ఎనిమిది స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది తొమ్మిదో ఐడియా. రేపు చివరి ఐడియా చెప్తా. మొత్తం పది ఐడియాలు. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
 
నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే  మీ ఎంట్రీలకు లాస్ట్ డే.  మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.comకి పంపించండి.

ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్‌ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్‌లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
 
ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ
 
 
పూరి Idea-9

 
ఇప్పటి వరకూ కథలు చెప్పాను. ఐడియాలు చెప్పాను. కానీ, ఈసారి నేను నాకు నచ్చిన వేమన పద్యం గురించి చెబుతాను. ఆ పద్యం సారాంశాన్ని ప్రతిబింబిస్తూ ఓ లఘుచిత్రం తీయండి. ఇది మీకు కొత్తగా అనిపిస్తుంది. అలా అనిపించిందంటే మీరు కచ్చితంగా కొత్తగా తీస్తారు. ఇక ఆ పద్యం ఏంటో చూడండి. ‘‘తప్పులెన్నువారు తండోపతండంబు నుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు  విశ్వదాభిరామ వినుర వేమ’’  (తప్పులను ఎత్తిచూపేవారు చాలామంది ఉన్నారు. అయితే తప్పులు వెదికేవాళ్లు ఎదుటివాళ్ల తప్పులను చూపినంతగా తమ తప్పులను తెలుసుకోలేరు.)  ఇందులో చాలా మంచి మీనింగ్ ఉంది. ఆ భావం తీసుకుని తప్పుల మీద ఓ కథ ఆలోచించి షార్ట్ ఫిల్మ్ తీయండి.
 
కథలు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తా...

 
జగదాంబ  ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారాగణంతో ప్రస్తుతం  ‘ది బెల్స్’ అనే చిత్రం నిర్మిస్తున్నారు ఎర్రోజు వెంకటచారి. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాధ్, సాక్షి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఆయనకు అమితంగా నచ్చేసింది. ఈ కాంటెస్ట్‌లో తాను భాగస్వామినవుతానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటచారి మాట్లాడుతూ
 
‘‘ఈ కాంటెస్ట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పోటీల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు దొరుకుతారు. ఔత్సాహికులు నాకు కథ చెప్పి ఒప్పిస్తే ఆ లఘు చిత్రాన్ని నేనే నిర్మిస్తాను. నాకు నచ్చితే ఎంతమందినైనా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఔత్సాహికులు 94904 42200 అనే ఫోన్ నెంబర్‌లో సంప్రదించగలరు’’ అని తెలిపారు.
 
 ఎర్రోజు వెంకటచారి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement