పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ | Puri Jagannath director Hunt | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

Published Sat, Jan 3 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్

స్టోరీ: పూరి   డైరెక్టర్ : మీరే!!

10 డేస్...
10 స్టోరీ ఐడియాస్
10 మినిట్స్...

 
ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు
ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే!

నిన్న రెండో కథ చెప్పా. ఇవాళ మూడో కథ. ఇలా మొత్తం పది కథలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
 
నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.com కి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్‌ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్‌లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
 
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే ... నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో!
 
అయితే కొన్ని కండిషన్స్...  చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు  ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా..  లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి.

 


 
గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్

పూరి Idea-3
 
ఈ ప్రపంచంలో మనిషి ఏం లేకపోయినా బతుకుతాడేమో కానీ, సెల్‌ఫోన్ లేకపోతే క్షణం కూడా ఉండలేడు. అంతలా మన దేహంలో, మనలో ఒక భాగమైపోయింది సెల్‌ఫోన్. ఇప్పుడు మీరు సెల్‌ఫోన్ నేపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలి. ఓ నిరుద్యోగ యువకుడు చాలా నిరాశగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు... రోడ్డు మీద ఇలా ఏవేవో వెహికిల్స్ పరుగులు తీస్తున్నాయి. అవేవీ పట్టించుకోవడం లేదు అతను. గట్టిగా హారన్ మోగితే ఉలిక్కిపడి వెనక్కు చూశాడు. బైక్ మీద ఓ అందమైన అమ్మాయి.  స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక దిగొచ్చారా... లేక బాలీవుడ్ నుంచి ప్రియాంకా చోప్రా, అలియాభట్, దీపికా పదుకొనే వచ్చారా... అన్నంత ఫీలింగ్.

ఇతను తన్మయంగా చూస్తూ ఉండగానే, ఆ అమ్మాయి మెరుపు వేగంతో వెళ్లిపోయింది. ఏదో చిన్న అలికిడి. గబగబా ముందుకెళ్లాడు అతను. తీరా చూస్తే - మొబైల్ ఫోన్ పడిపోయి కనిపించింది. అది ఆ అమ్మాయి బ్యాగ్‌లోంచి జారిపోవడం ఇతనికి స్పష్టంగా కనబడింది.
 ఫోన్‌కేమైనా దెబ్బలు తగిలాయా అన్నట్టుగా చూశాడు. ఫోన్ తళతళలాడుతూ చెక్కు చెదరకుండా ఉంది. అది చాలా కాస్ట్లీ ఫోన్. జస్ట్... వన్ వీక్ బ్యాక్ మార్కెట్‌లోకి లాంచ్ అయిన స్మార్ట్ట్ ఫోన్.

అబ్బా... అనుకుంటూ కాసేపు ఆ ఫోన్‌ను మురిపెంగా చూశాడు. ఇక నుంచీ ఆ ఫోన్ తనదే! తన జేబులోంచి తన ఫోన్ తీసి చూసుకున్నాడు. పాత డొక్కు ఫోన్. ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్‌కి తప్ప ఇంక దేనికీ పనికి రాదు. ఇలాంటి ఖరీదైన ఫోన్ కొనుక్కోవాలన్నది అతని డ్రీమ్. జాబ్ రావడం లేదు... వస్తే ఫస్ట్ శాలరీతో కొనుక్కోవాలనుకున్నాడు. ఇప్పుడేమో లక్కీగా ఇలా ఫోన్ దొరికింది. దాన్ని భద్రంగా జేబులో పెట్టుకుంటుంటే ఇంకో ఆలోచన వచ్చింది. ఈ ఫోన్ దొరికిందని ఆ అమ్మాయికిస్తే, ఇంప్రెస్ అయ్యి తనతో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చుకదా! సూపర్ ఐడియా అని తనను తానే మెచ్చుకున్నాడా కుర్రాడు. ఈ సెల్‌ఫోన్‌ని ఆ అమ్మాయికిచ్చే ప్రాసెస్‌లో కథ మలుపు తిరిగింది. ఆ మలుపు లవ్‌కి దారి తీసిందా? కామెడీకి పనికొచ్చిందా? లేక క్రైమ్‌కి కారకమైందా? ఆ మలుపు మీ ఇష్టం. మొత్తం మీద సెల్‌ఫోన్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీయండి. అది పది నిమిషాల్లోపే ఉండాలి. ఆ షార్ట్ ఫిల్మ్ 2 నిమిషాలు, 5 నిమిషాలు ఉన్నా ఫర్వాలేదు. ఏదైనా మీ ఇష్టం.
 -ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ

 

బహుమతులు అందించేవారు..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement