నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో! | Puri Jagannath directors Hunt | Sakshi
Sakshi News home page

నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో!

Published Sat, Jan 10 2015 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో!

నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో!

పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్
 స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!
10 డేస్...
10 స్టోరీ ఐడియాస్
10 మినిట్స్...

 
నిన్నటికి తొమ్మిది స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది పదో ఐడియా, చివరి ఐడియా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
 
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే  నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో!
 
నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే.  మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.comకి పంపించండి.  ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్‌ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్‌లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
 
 అయితే కొన్ని కండిషన్స్...  చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు  ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ ఏమవుతారు? రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా..  లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి.
 
గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్
 
 ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ
 
 పూరి Idea-10
 
 
 
ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఎవర్‌గ్రీన్. ఎన్ని ఛేంజెస్ వచ్చినా... ఎన్ని ట్రెండ్‌లు మారినా... లవ్ లవ్వే. దిసీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్. కొంచెం తమాషాగా తీయాలి. కాన్సెప్ట్ ఏంటంటే - ఓ అందమైన అమ్మాయి. పార్క్‌లో కూర్చుందో, బస్సులో వెళ్తోందో, లేక షాపింగ్ చేస్తోందో మీ ఇష్టం. సడన్‌గా ఆమె ముందు ఓ అబ్బాయి ప్రత్యక్షమయ్యాడు. ఓ గులాబీ పువ్వు ఆమె చేతికిచ్చి ఆమె ముందు మోకరిల్లి ‘‘తొలి చూపులోనే మీరు నా హార్ట్‌ని రాబరీ చేసేశారు. మీరు ఊ.. అంటే మిమ్మల్ని నా లైఫ్ పార్టనర్‌ని చేసుకుంటా’’ అంటూ ఏవేవో చెప్పాడు. ఆమె మొదట విసుక్కుంది. తర్వాత కసురుకుంది. కానీ అతను ఆమెను వదల్లేదు. తన మనసులోని ప్రేమను కవితల రూపంలో ఆవిష్కరించాడు. ఎట్టకేలకు ఆమె ఓకే అంది. ఇద్దరి మధ్యనా ప్రేమ పరవళ్లు తొక్కింది. దీన్ని షార్ట్ ఫిల్మ్‌గా తీయండి. అరె... సింపుల్ కాన్సెప్ట్ అనుకుంటున్నారు కదూ! ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. ఒకమ్మాయికి ఒకబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడాన్ని మూడు రకాలుగా చూపించాలి. అంటే...

 బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఈ లవ్ ప్రపోజల్ ఎలా ఉండేది? ఇప్పుడైతే ఎలా ఉంది? భవిష్యత్తులో ఇంకెలా ప్రపోజ్ చేస్తారు?
 ఈ మూడు డైమన్షన్స్‌లో ‘లవ్ ప్రపోజల్’ పై షార్ట్ ఫిల్మ్ తీయండి.

 (గమనిక: ఏదైనా సినిమా చూసినప్పుడు ఈ మాత్రం సినిమా మనం తీయలేమా అని మీకు అనిపించి ఉండొచ్చు. అలాగే  ఎవరిదైనా యాక్టింగ్ చూసి ఈ మాత్రం తొక్కలో యాక్టింగ్ మేం చేయలేమా అన్న భావన మీలో వచ్చి ఉండొచ్చు. అలాగే ఈ కథలు, ఐడియాలు చూసి మీకు అలాంటి ఫీలింగ్సే వస్తాయి. సో... కామెంట్ చేయడం కాదు. మీరు ఏదైనా చూపిస్తే నాకు చూడాలని ఉంది. - మీ పూరి జగన్నాథ్)
 
 స్పందించి ముందుకొచ్చినవారు...
 

 
 కెమెరాలిస్తా...
 ‘‘నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను వేరే వ్యాపార రంగంలో ఉన్నా కూడా, సినిమాలంటే ఆసక్తి అలాగే ఉంది. నా దగ్గర అత్యాధునిక డిజిటల్ కెమెరాలున్నాయి. లైటింగ్ ఎక్విప్‌మెంట్ కూడా ఉంది. ఆర్థిక స్తోమతలేని ప్రతిభావంతులు ఈ ఎక్విప్‌మెంట్‌ని ఉచితంగా ఉపయోగించుకుని షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు. 8106161821 నెంబర్‌లో నన్ను కాంటాక్ట్ చేయండి.’’
 - వెన్నా ఉమాశంకర్
 
 నిర్మించడానికి నేను రెడీ
 ‘‘ఇంతకుముందు నేను ‘3జి లవ్’ అనే సినిమా నిర్మించాను. త్వరలో మరో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. నాకు మొదట్నుంచీ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఆసక్తి. అందుకే షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్లను ప్రోత్సహించాలనుకుంటున్నా. అందుకోసం నా తరపున కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా. పూరి జగన్నాథ్‌గారి ఐడియాలకు షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్న ‘సాక్షి’ కాంటెస్ట్ చాలా బాగుంది. నిర్మించడానికి నేను రెడీ. కథలతో నన్ను మెప్పిస్తే, ఎంతమందినైనా ఎంకరేజ్ చేస్తాను. నా ఫోన్ నంబర్ 8500234567. సంప్రదించండి.’’
 - ప్రతాప్ కొలగట్ల
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement