పూరి Idea-1 | Puri Idea-1 | Sakshi
Sakshi News home page

పూరి Idea-1

Published Thu, Jan 1 2015 10:44 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

పూరి  Idea-1 - Sakshi

పూరి Idea-1

వాళ్లిద్దరికీ కొత్తగా పెళ్ళయ్యింది. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అమ్మాయి హౌస్‌వైఫ్. కొత్త ఇల్లు... కొత్త కాపురం...  ఆ రోజు అబ్బాయి ఆఫీసుకు వెళ్ళగానే ఫోన్ మోగింది. ఎవరిదో అపరిచిత గొంతు. ‘‘మీ ఆయన ఇంట్లో లేడు కదా. నన్ను రమ్మంటావా?’’ అంటూ చాలా వల్గర్‌గా మాట్లాడాడు. ఈ అమ్మాయికి భయం వేసింది. కోపం వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా చేస్తూనే ఉన్నాడు. భర్త ఇంటికొచ్చే వరకూ ఏడుస్తూనే ఉందా అమ్మాయి.  అబ్బాయి కంగారుపడి ఏంటని అడిగితే, ఫోన్ సంగతి చెప్పింది.  ఏదో రాంగ్ కాల్ అయ్యింటుందిలే అని సర్ది చెప్పాడు.  నెక్ట్స్ డే కూడా అలానే జరగడంతో, ఆ అబ్బాయి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.
 
ఆ తర్వాత రోజు-  అబ్బాయి ఆఫీసుకి బయలుదేరాడు. ఓ అపరిచితుడు ఆ ఇంటిముందే తచ్చట్లాడుతున్నాడు. రోజూ ఫోన్ చేసేది అతనే. ఈసారి ఫోన్ చేయకుండా డెరైక్ట్‌గా ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయి కిచెన్‌లో వంట చేస్తోంది. అతను వెనుకగా వెళ్లి ఆమెపై ఎటాక్ చేశాడు. ఆ అమ్మాయి భయంతో కేకలు పెడుతూ అతన్నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.
 సరిగ్గా అదే సమయంలో ఏదో మరచిపోయి ఇంటికి తిరిగి వస్తున్నాడు అబ్బాయి. ఇక్కడేమో అతని భార్య మీద మానభంగం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అబ్బాయి ఇంటి దగ్గరకొచ్చేసరికి ఓ స్నేహితుడు కనిపిస్తాడు. అతనితో కాసేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్లేసరికి చిరిగిన బట్టలతో వాడిపోయిన మల్లెపువ్వులా కనిపిస్తుందా అమ్మాయి. ఇతనికి విషయం అర్థమైంది. రక్తం మరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామనుకుని, మళ్లీ మానుకుంటాడు. కంప్లయింట్ చేస్తే ఇంటి పరువు బజారున పడుతుందనుకుంటాడు. ఇతను ఎంత ఓదార్చినా, ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది. అబ్బాయి ఏం మాట్లాడలేదు. అమ్మాయి ఏం మాట్లాడదు. ఇలా కొన్నాళ్లపాటు ఇద్దరి మధ్యలో మౌనం.

కొన్నాళ్ల తర్వాత- ఇద్దరూ మార్కెట్‌కి వెళ్లారు. అక్కడ బ్లాక్‌కలర్ లెదర్ జాకెట్‌లో ఉన్న ఓ వ్యక్తిని చూడగానే ఆ అమ్మాయి కోపంతో ఊగిపోయింది. ‘‘వాడే...’’ అంటూ భర్తకు ఏదో చెప్పబోయింది. అతనికి విషయం అర్థమైంది. తన భార్యను రేప్ చేసిన వాణ్ణి అక్కడికక్కడే చంపేయాలనుకున్నాడు. కానీ ఇతనేమీ హీరో కాదు కదా. అందుకే ఆ బ్లాక్ జాకెట్‌ని వెంబడించాడు. అతనో నిర్మానుష్యమైన సెల్లార్‌లోకి వెళ్ళగానే, అబ్బాయి ఎటాక్ చేశాడు. పిచ్చి కోపంతో అతని పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత అబ్బాయికి భయం మొదలైంది. అటూ ఇటూ పిచ్చి చూపులూ చూస్తూ ఒక్క పరుగు మీద భార్య దగ్గరకు వచ్చేశాడు.

భార్యతో ఏదో చెప్పబోతుంటే, ఆ అమ్మాయి దూరంగా ఇంకో బ్లాక్ జాకెట్ పర్సన్‌ని చూపించి ‘‘వాడే...’’ అని చెప్పింది. ఈ అబ్బాయి పిచ్చాడిలా అటే చూస్తున్నాడు. అంటే తన భార్య షాక్‌కి గురై పిచ్చిదైపోయిందని, తాను కంగారులో ఓ నిరపరాధిని చంపేశానని అర్థమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement