భువనేశ్వర్: దేశంలో ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఇక, రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. రథయాత్రలో పాల్గొనేందుకు ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం మార్మోగుతోంది.
ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక, పూరీ రథయాత్రకు పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
#WATCH | A large number of devotees gather in Odisha's Puri for the #JagannathRathYatra_2023 pic.twitter.com/CzRrc3hZHI
— ANI (@ANI) June 20, 2023
Puri Ratha Yatra,Odisha 🌅🌺🌺🌺🌺👏👏👏🐚🐚🐚🐚🐚🐚 pic.twitter.com/2K6tOzGmCp
— SATYAJIT PRADHAN (@Satyaji56683529) June 20, 2023
ఇది కూడా చదవండి: వీడియో: కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో అపచారం.. మహిళ ఓవరాక్షన్.. శివలింగంపై కరెన్సీ నోట్లు..
Comments
Please login to add a commentAdd a comment