Jagannath rath yatra
-
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర (ఫోటోలు)
-
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
బంజారాహిల్స్‌లో జగన్నాథ రథయాత్ర దృశ్యాలు
-
పూరీ రథయాత్ర ప్రారంభం.. భారీగా భక్తుల రాక
భువనేశ్వర్: దేశంలో ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఇక, రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. రథయాత్రలో పాల్గొనేందుకు ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం మార్మోగుతోంది. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక, పూరీ రథయాత్రకు పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. #WATCH | A large number of devotees gather in Odisha's Puri for the #JagannathRathYatra_2023 pic.twitter.com/CzRrc3hZHI — ANI (@ANI) June 20, 2023 Puri Ratha Yatra,Odisha 🌅🌺🌺🌺🌺👏👏👏🐚🐚🐚🐚🐚🐚 pic.twitter.com/2K6tOzGmCp — SATYAJIT PRADHAN (@Satyaji56683529) June 20, 2023 ఇది కూడా చదవండి: వీడియో: కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో అపచారం.. మహిళ ఓవరాక్షన్.. శివలింగంపై కరెన్సీ నోట్లు.. -
జగమంతా జగన్నాథుడు
-
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
పూరి : జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రాతఃకాల ధూపదీపాదులు, మంగళ హారతి ముగించి మూల విరాట్ల తరలింపు (పొహొండి) కార్యక్రమం చేపట్టారు. శ్రీ మందిరం నుంచి స్వామి యాత్ర కోసం ఉవ్విళ్లూరుతున్న రథాలు ఉరకలేసుకుని ముందస్తుగా శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు చేరాయి. రథ నిర్మాణ ప్రాంగణంలో తయారీ ముగించుకుని వస్త్రాలంకరణ, కలశ స్థాపన, చిత్ర లేఖనం వగైరా ఆర్భాటాలతో మూడు రథాలు ఒక దాని వెంబడి మరొకటిగా క్రమంలో స్వామికి స్వాగతం పలికేందుకు ముందస్తుగా సింహదార్వం దగ్గర నిరీక్షించాయి. సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లు వరుస క్రమంలో రథాలపైకి చేరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగుతుంది. మరోవైపు జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రధాన దేవస్థానం శ్రీ మందిరం పుష్పాలంకరణతో శోభిల్లుతోంది. ఆలయ చరిత్రలో రథయాత్రను పురస్కరించుకుని దేవస్థానం పుష్పాలంకరణతో శోభిల్లడం ఇదే తొలిసారి. యాత్ర నేపథ్యంలో శ్రీ మందిరం, గుండిచా మందిరాలు, ఉప ఆలయాల్ని పూలతో అలంకరిస్తారు. సీసీ టీవీ నిఘా స్వామి రథయాత్రను పురస్కరించుకుని అశేష జన వాహిని తరలి వస్తుంది. రోడ్డు, రైలు రవాణా సంస్థలు యాత్రికుల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యాత్రికుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. పూరీ పట్టణం అంతటా పకడ్బందీగా సీసీటీవీ కెమెరా నిఘా కార్యాచరణలో ఉంటుందని రాష్ట్ర డైరెక్టరు జనరల్ ఆఫ్ పోలీసు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. రైలు, బస్సులు ఇతరేతర వాహనాలు, సముద్ర మార్గం గుండా చొరబాటుదారుల నివారణకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై జాగిలాల స్క్వాడ్‌తో బాంబు నిర్వీర్య దళాల్ని రంగంలోకి దింపారు. నలు వైపుల నుంచి తరలి వచ్చే వాహనాలతో అవాంఛనీయ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాటుచేశారు. సాగర తీరం గుండా సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా మెరైన్ పోలీసు దళాల సమన్వయంతో సాగర తీరంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. -
గజేంద్రుడి రైలు యాత్ర!
కష్టం మనది కాకపోతే ముంబైదాకా దేక్కుంటూ వెళ్లమని సలహా ఇచ్చాడట వెనుకటికి ఎవరో! అహ్మదాబాద్‌లోని ఓ గుడి నిర్వాహకుల నిర్వాకం ఇదే తీరును తలపిస్తోంది. గుడిలో ఊరేగింపు కోసం వీళ్లు 4 ఏనుగులను తెప్పిస్తున్నారు! ఏనుగు అంబారీపై దేవుడి ఊరేగింపు! బాగానే ఉంది కదా అంటున్నారా? ఎక్కడి నుంచో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు! దేశానికి తూర్పు కొసన ఉండే అస్సాం నుంచి!! జూలై 4న అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర జరగనుంది. కానీ.. ఈ గుడికి చెందిన 3 ఏనుగులు వయసు మీదపడటంతో గత ఏడాదే మరణించాయి. ఈ ఏడాదికి అంబారీల్లేకుండానే యాత్ర నిర్వహించినా బాగుండేదది.. కానీ.. గుడి ధర్మకర్తలకు ఏం బుద్ధి పుట్టిందో ఏమో 4 ఏనుగులను అరువుకు తెచ్చుకుందామని నిర్ణయించారు. ఇంకేముంది అసోంలోని తీన్‌సుఖియా నుంచి గజరాజులను తెప్పించండని ఆర్డర్ వేసేశారు. అసోం ప్రభుత్వమూ అందుకు ఓకే చెప్పింది. ఇంకేముంది.. అంతా హ్యాపీ అనుకుంటున్నారా? అక్కడే ఉంది తిరకాసు. రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 3100 కిలోమీటర్లు! ఇంతదూరం ఏనుగులను రవాణా చేయడం ఎలా? ఆ.. ఏముంది. రైల్వే కోచ్‌లపై పంపేస్తే సరి అని అసోం ప్రభుత్వం చెప్పడంతో జంతు ప్రేమికులు మండిపోతున్నారు. కనీసం మూడు నాలుగు రోజుల సమయం పట్టే ఈ ప్రయాణాన్ని గజరాజులు తట్టుకోలేవని.. ఉత్తర భారతమంతా 40 డిగ్రీలకు పైబడ్డ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే.. నోరు లేని జీవాలను ఇంత కష్టపెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వేడికి, వడగాడ్పులకు తట్టుకోలేక మనుషులే చచ్చిపోతూంటే ఏనుగులు ఎలా తట్టుకోగలవు? అని జంతు సంరక్షణ ఉద్యమకారుడు కౌషిక్ బారువా నిలదీస్తున్నారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైల్వే కోచ్‌పై రవాణా చేస్తే.. ఏనుగులు ఎంత ఆందోళన, ఒత్తిడికి గురవుతాయో అధికారులు కొంచెం కూడా ఆలోచించకపోవడం అమానవీయమని దుమ్మెత్తి పోస్తున్నారు కౌషిక్! ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏనుగులకు వడదెబ్బ తగలొచ్చునని.. షాక్‌తో మరణించవచ్చు కూడా అని ఆయన హెచ్చరించారు. మన చట్టాల ప్రకారం సంరక్షిత జంతువుగా గుర్తింపబడ్డ ఏనుగులను ఎక్కడికైనా తరలించాలంటే ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆరుగంటల కంటే ఎక్కువ కాలం వాహనాలపై రవాణా చేయకూడదు. ఏకబిగిన ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిపించ కూడదు కూడా. ఈ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ వాటిని తరలించడం ఏమాత్రం సబబు కాదని జంతుశాస్త్రవేత్త బిభూతీ ప్రసాద్ లహకార్ స్పష్టం చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీ తరుణ్ గొగోయ్... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఏనుగుల కష్టాన్ని నివారించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు ఓ లేఖ రాశారు. ‘‘అయినా... గణపతిని పూజించే మనవాళ్లు.. ఆ దేవుడికి ప్రతిరూపంగా భావించే ఏనుగును ఒక్క ఊరేగింపు కోసం ఇంత హింసపెట్టాలా?’’ అని కౌషిక్ ప్రశ్నిస్తున్నారు. -
వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని రథ యాత్ర శనివారం పూరీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తజన సందోహం నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలతో కూడిన రథాలు శ్రీ మందిరం నుంచి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరాయి. పూరీ గజపతి మహారాజా దివ్య సింఘ్ దేవ్ రథాల్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి దేవతలకు మంగళ హారతి సమర్పించడంతో యాత్ర ప్రారంభమయింది. జగన్నాథుని నందిఘోష్ రథం సకాలంలో శనివారం సాయంత్రానికి గమ్యం చేరలేక పోయింది. గుండిచా మందిరానికి సమీపంలో ఆగిపోయింది. దీంతో ఇక్కడే రథంపై ఉన్న జగన్నాథునికి సేవాదులు నిర్వహిస్తారు. కాగా, రథయాత్ర సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో భారీగా సీసీ టీవీలను అమర్చారు. సుమారు 5,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. -
పూరీ: కదిలిన జగన్నాథ రథ చక్రాలు
-
పూరీ జగన్నాథ రథయాత్రకు ఉగ్రముప్పు!
పూరీ(ఒడిశా): విశ్వవిఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారా? పూరీలో దాడులు చేయాలని ప్లాన్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పూరీ జగన్నాథ రథయాత్రకు భారీ భద్రత కల్పిస్తున్నారు. జల మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగానే‘సౌనక్’ పహరా నౌకను పారాదీప్ ఓడరేవులో నిలిపారు. ‘సౌనక్’కు తోడుగా మరో 2 వేగవంతమైన పెట్రోలింగ్ ఓడలు కూడా చేరాయి. పారాదీప్ నుంచి పూరీ వరకు సువిశాల సముద్ర మార్గంలో ఈ ఓడలు భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తాయి. ఇవీ సౌనక్ ప్రత్యేకతలు.. సౌనక్ పూర్తిగా స్వదేశీ తయారీ ఓడ కావడం విశేషం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన కోస్ట్‌గార్డ్ వాహినిలో సౌనక్ను చేర్చారు. దీని పొడవు 105 మీటర్లు. 9,100 కిలో వాట్ల శక్తివంతమైన 2 డీజీలు ఇంజిన్లతో సౌనక్ గంటకు 26 నాట్ల వేగంతో దూసుకుపోతుంది. 2 తేలికపాటి హెలికాప్టర్లు, 30 ఎం.ఎం. క్లోజ్ రేంజ్ నావికా తుపాకులు, 5 అత్యాధునిక హై–స్పీడ్ పడవలు అనుక్షణం అందుబాటులో ఉంటాయి. సముద్రంలో తైల కాలుష్యం లేకుండా సౌనక్ పని చేయడం మరో విశేషం. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందజేసేందుకు దీనిలో 14 మంది కోస్టు గార్డు అధికారులు, 98 మంది జవాన్లను నియమించారు. సముద్ర ఠాణా పోలీసుల సమన్వయంతో సౌనక్ ఓడ రేవు అనుక్షణం అప్రమత్తంగా సముద్ర మార్గం గుండా ఉగ్రవాదుల చొరబాటుపై నిఘా వేస్తుంది. -
కన్నుల పండువగా జగన్నాథ రథోత్సవం
సంప్రదాయ దుస్తులు ధరించిన యువత మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తుండగా జగన్నాథ రథయాత్ర వైభవంగా ముందుకు సాగింది. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని జగన్నాథ మందిరం వద్ద రథయాత్ర కోలాహలం ఆకట్టుకుంది. గవర్నర్ దంపతులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు నిర్వహించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ఉత్సవమూర్తుల విగ్రహాలను రథాలపైకి చేర్చే ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రథయాత్ర పూజలు మధ్యాహ్నం 1 గంటకు రథాలను లాగే ఘట్టంతో కన్నుల పండువగా జరిగాయి. సరిగ్గా 3.30 గంటలకు ముగ్గురూ దేవతామూర్తుల విగ్రహాలను సమీపంలోని కనకదుర్గా దేవాలయానికి చేర్చారు. దారి పొడవునా భక్తులు రథయాత్రను తిలకించారు. -
జగన్నాథుడు అందరివాడు
జూలై 6 జగన్నాథ రథయాత్ర పూరీ శ్రీక్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథుడు అందరివాడు. ఎక్కడో అల్లంత దూరాన కొండలపై కాకుండా, భక్తులకు చేరువగా సముద్ర తీరానికి కూతవేటు దూరంలో వెలసిన దేవదేవుడు జగన్నాథుడు. ఆలయానికి రాలేని భక్తులకు కన్నుల పండుగ చేసేందుకు ఏడాదికి ఒకసారి సోదరీ సోదర సమేతంగా రథమెక్కి పూరీ పురవీధుల్లో ఊరేగుతాడు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలు పూరీ బొడొదండొలో (పెద్దవీధి) ముందుకు సాగుతూ ఉంటే, ఆలయాలే కదలి వస్తున్నాయా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఈ రథాల పైభాగం ఆలయ గోపురాల్లానే గోచరిస్తాయి. స్నానపూర్ణిమతో ప్రారంభం పూరీ శ్రీక్షేత్రంలో నిత్యం వేడుకలు, తరచు పండుగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ ‘బారొ మాసొ తేరొ పొర్బొ’ (పన్నెండు నెలలు... పదమూడు పండుగలు) అనే నానుడి స్థిరపడింది. జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథుడికి స్నానం చేయిస్తారు. దీనినే స్నానపూర్ణిమ అంటారు. స్నానపూర్ణిమ రోజు నుంచే రథయాత్ర వేడుకలకు సన్నాహాలు మొదలవుతాయి. స్నానపూర్ణిమ రోజున గర్భగుడిలోని మూలవిరాట్టులైన దారువిగ్రహాలను బయటకు తెచ్చి, ఆలయం తూర్పువైపు ప్రహారీగోడ వద్ద స్నానం చేయిస్తారు. ఈ స్నానానికి ఆలయంలోని ‘సునా కువా’ (బంగారుబావి) నుంచి తోడితెచ్చిన 108 కుండల నీటిని వినియోగిస్తారు. ఈ స్నానం తర్వాత జగన్నాథుడు జలుబు, జ్వరంతో బాధపడతాడంటారు. అందుకే రెండు వారాల పాటు చీకటి గదిలో ఉంచేసి, దైతాపతులు పసర్లు, మూలికలతో చికిత్స చేస్తారు. ఈ తతంగం జరిగే రెండు వారాల్లో ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టుల దర్శనం లభించదు. మూలవిరాట్టుల పీఠంపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల పటచిత్రాన్ని ఉంచి పూజలు చేస్తారు. రెండు వారాల చికిత్స తర్వాత తేరుకున్న జగన్నాథుడు రథారూఢుడై గుండిచా మందిరానికి బయలుదేరుతాడు. నయనానందకరం రథయాత్ర వేడుక పూరీలో అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర వేడుక నయనానందకరంగా సాగుతుంది. ఆషాఢ శుద్ధి విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై తమ పిన్నిగారి ఇల్లయిన గుండిచా మందిరానికి బయలుదేరుతారు. జగన్నాథుడి రథం పేరు ‘నందిఘోష్’ కాగా, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. నందిఘోష్ అన్నిటి కంటే ఎత్తుగా ఉంటుంది. దీని ఎత్తు 44.2 అడుగులు. ‘తాళధ్వజ’ ఎత్తు 43.3 అడుగులు, ‘దర్పదళన్’ ఎత్తు 42.3 అడుగులు. రథయాత్ర రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. ముందే సిద్ధం చేసిన రథాలను పూరీ రాజు స్వయంగా చీపురుపట్టి శుభ్రపరుస్తారు. రథాలను శుభ్రపరచడం పూర్తయ్యాక భారీ దారువిగ్రహాలను మోసుకుంటూ రథాలపైకి తరలిస్తారు. విగ్రహాలను రథాలపైకి తరలించే కార్యక్రమాన్ని ‘పొహాండి’ (పాండోజనం) అంటారు. రథాలపైకి చేరిన విగ్రహాలకు పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. రథాలకు కట్టిన పొడవాటి మోకులను భక్తులు లాగుతారు. భక్తులు రథాలు లాగుతుండగా రథాలపై పూజారులతో పాటే ఉండే ‘డకువా’లు జేగంటలు మోగిస్తూ జగన్నాథుడిపై నిందాస్తుతులతో కీర్తనలు అందుకుంటారు. రథయాత్ర సాగుతున్నంత సేపు పూరీ బొడొదండొ (పెద్దవీధి) లక్షలాది మంది భక్తజనసందోహంతో కిటకిటలాడుతుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర మరునాటికి మూడు రథాలూ గుండిచా మందిరానికి చేరుకుంటాయి. గుండిచా మందిరంలో సుభద్రా బలభద్రుల సమేతంగా జగన్నాథుడు ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువు దీరుతాడు. గుండిచా మందిరంలో ఉన్నన్నాళ్లూ జగన్నాథుడు దశావతారాల వేషాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాఢ శుద్ధ దశమి రోజున జగన్నాథుడు శ్రీక్షేత్రం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ తిరుగు ప్రయాణాన్ని ‘బాహుడా’ (మారు రథయాత్ర) అంటారు. ఆషాఢ పూర్ణిమ నాటికి శ్రీక్షేత్రానికి చేరుకుంటాడు. ఆ రోజున జగన్నాథుడు స్వర్ణాలంకార వేషంతో (సునా బెసొ) భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనంతో రథయాత్ర వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఊరూవాడా రథాల వేడుక పూరీలోనే కాదు, ఒడిశా రాష్ట్రంలో ఊరూరా రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయాల పరిధిలో జరిగే రథయాత్ర వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. అయితే, ఊళ్లల్లో చిన్నారులు సైతం చిన్న చిన్న రథాలపై జగన్నాథుడిని వీధుల్లో ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటారు. జేగంటలు, తప్పెట్లు మోగిస్తూ తమకు తోచిన రీతిలో పూజలు చేసేస్తూ ఉంటారు. నచ్చిన చిరుతిళ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇతర దేవతలను ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పూజించడానికి పిల్లలకు అనుమతి ఉండదు. అయితే, అందరివాడైన జగన్నాథుడి విషయంలో ఎలాంటి ఆంక్షలు, నియమ నిబంధనలు ఉండవు. జగన్నాథుడిని ఎవరైనా పూజించవచ్చు, ఎలాగైనా పూజించవచ్చు. అందుకే ‘సర్వం శ్రీజగన్నాథం’ అనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. ఛప్పన్న భోగాల నైవేద్యం జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. అనుదినం స్వామికి ఛప్పన్న (యాభయ్యారు) భోగాలను నివేదిస్తారు. ఈ నైవేద్యాల కోసం పూరీ శ్రీమందిరంలో అనునిత్యం వంటలు సాగుతూనే ఉంటాయి. కట్టెల పొయ్యలపై కుండలలో వంటకాలు వండుతారు. దివ్యధామమైన పూరీలో నివేదించే ప్రసాదాన్ని ‘ఒభొడా’ అంటారు. వడ్డించడాన్ని ఒరియాలో ‘భొడా’ అంటారు. మహాప్రసాదాన్ని వడ్డించరు. అందుకే దీనికి ‘ఒభొడా’ అనే పేరు వచ్చింది. పూరీ ఆలయంలో ఈ నైవేద్యాల తయారీ కోసం 752 కట్టెపొయ్యలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. నాలుగు వందల మంది పాకప్రవీణలు అలుపెరగకుండా గరిటెలు తిప్పుతూనే ఉంటారు. పూరీ ఆలయ ప్రాంగణంలోని ఆనంద్‌బజార్‌లో ఈ ప్రసాదాలను కుండల్లో పెట్టి భక్తులకు విక్రయిస్తారు. ఛప్పన్న భోగాలను ఎందుకు నివేదిస్తారనే దానిపై ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు రోజుకు ఎనిమిదిసార్లు తినేవాడట. ఇంద్రుడు రాళ్లవాన కురిపించినప్పుడు గోవులు, యాదవుల రక్షణ కోసం గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు ఏడురోజులు భోజనం చేయకుండా ఉండిపోయాడట. ఇంద్రుడికి బుద్ధి చెప్పి గోవర్ధనగిరిని కిందకు దించిన కృష్ణుడికి యాదవులందరూ 56 పదార్థాలను సమర్పించారట. అందుకే కృష్ణుడి రూపమే అయిన జగన్నాథుడికి పూరీలో 56 పదార్థాలను నివేదించడం ఆచారంగా వస్తోందని చెబుతారు. -
బంజారాహిల్స్ లో జగన్నాథుడి రథయాత్ర
బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నెం.12లో జగన్నాథుడి రథయాత్ర శనివారం వైభవోపేతంగా సాగింది. ఉదయం ఉత్సవమూర్తులకు మంగళహారతి, రథాల ప్రతిష్ట, విగ్రహాలను రథాలపైకి తరలించే పొహండి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి మేళతాళాల మధ్య రథాలపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు రథాలపై చెరా పొహరా(బంగారు చీపురుతో ఊడవడం) నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య మూడు రథాలు బంజారాహిల్స్‌రోడ్ నెం.12లో ఊరేగింపుగా బయల్దేరాయి. ఎనిమిది రోజుల అనంతరం ఈ నెల 26వ తేదీన తిరుగు రథయాత్ర(బహుద) ఉంటుంది. యాత్ర సందర్భంగా బంజారాహిల్స్ రహదారులు జనసంద్రంగా మారాయి. నగర నలుమూలల నుంచి భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించేందుకు రోడ్లకిరువైపులా బారులు తీరారు. నగరంలో నివసించే ఒడిస్సా వాసులంతా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. సుమారు 50 వేల మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. సుమారు నాలుగు గంటల పాటు రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను సమీపంలోని కనకదుర్గ దేవాలయంలో ప్రతిష్టించారు. -
అవతార పురుషుడు జగన్నాథుడు
రేపు తొలి రథయాత్ర నేడు స్వామి కల్యాణం 8న తిరుగు రథయాత్ర అనకాపల్లి : జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు అనకాపల్లి పట్టణం ముస్తాబయింది. గవరపాలెంలోని అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న శ్రీ సుభద్ర బలభద్రా సమేత జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలకు వేదిక కానుంది. ఈ నెల 29 నుంచి జూలై 8వ తేదీ వరకూ నిర్వహించనున్న మహోత్సవాలలో భాగంగా స్వావి దశావతారాలలో దర్శనం ఇవ్వ నున్నారు. గూడ్స్‌షెడ్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్నహాల్‌లో స్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమి స్తారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి జగన్నాథస్వామి దేవాలయంలో శ్రీ రుక్మీణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. 29న తొలి రథయాత్ర... ఈ నెల 29న తొలి రథయాత్రను నిర్వహించనున్నారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు తొలి రథాయాత్రాను లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పి. వెంకటరావు తెలిపారు. ఈ యాత్ర పట్టణంలోని జగన్నాథస్వామి ఆలయం నుంచి గంగిరేవిచెట్టు,సతకంపట్టు, చినరామస్వామి కోవెల, పెదరామస్వామి కోవెల, సంతబయలు, సంతోషిమాత ఆలయం, పార్కు సెంటర్ మీదుగా రైల్యే స్టేషన్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్నహల్ వద్దకు చేరుకుంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. ఇంద్రద్యుమ్నహాల్‌లో రోజూ సాయంత్రం ధార్మిక ప్రవచనాలు, భక్తి సంగీతం వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తిరుగు రథయాత్ర... రథయాత్ర ఉత్సవాల ముగింపులో భాగంగా జూలై 8న ఉదయం 09-15 గంటలకు రథారోహణ, 09-45 గంటలకు తిరుగు రథాయాత్ర నిర్వహించనున్నారు.ఈమేరకు ఆరోజు మధ్యాహ్నం ఇంద్రద్యుమ్నహాల్ వద్ద అన్నసమారాధన ఏర్పాటు చేశారు. -
28న జగన్నాథ రథయాత్ర
యాత్రకు భారీ ఏర్పాట్లు విదేశీ బృందాల ప్రదర్శనలు లక్షమందికి ప్రసాదం వితరణ సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 28న జగన్నాథ రథయాత్రను నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ యాత్రకు నగరంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలిరానున్నారు. అత్యంత శోభాయమానంగా నిర్వహించే యాత్ర కోసం ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ఎస్పీరోడ్, ఆర్పీరోడ్, మోండా మార్కెట్, క్లాక్‌టవర్, ఎస్డీరోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా సుమారు లక్షమంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 500 మంది వలంటీర్లను నియమించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రదర్శన: శోభాయాత్రలో చైనా, రష్యా, ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన ఇస్కాన్ భక్తులు హాజరై ఆధ్యాత్మిక,సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచశాంతి, ఐక్యతకోసం ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. యాత్ర ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి భజనలతోపాటు, కృష్ణకథ, శృంగార దర్శనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం పదివేల మంది భక్తులచే జగన్నాథుడికి మహాహారతి ఇచ్చి కార్యక్రమాన్ని ముగించనున్నారు. -
‘జగన్నాథుడికి’ కలప కొరత!
పూరి: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు అవసరమైన కలపకు కొరత ఏర్పడినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మూడు రథాలతో కూడిన యాత్రకు దేశం సహా విదేశాల నుంచి యాత్రికులు హాజరవుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 29న ఈ రథాల తయారీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో రథాలను రూపొందించేందుకు ఆలయ వర్గాలు సమాయత్తమయ్యాయి. అయితే, వీటి కోసం వాడే ప్రధాన దుంగలకు కొరత ఏర్పడింది. ఈ అంశంపై చర్చించేందుకు రెవెన్యూ డివిజనల్ కమిషనర్ ఎస్.కె. వశిస్ట్ అధ్యక్షతన అధికారులు గురువారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. రథ చక్రాలను రూపొందించేందుకు కనీసం 42 భారీస్థాయి దుంగలు అవసరం కాగా, ఒడిశా ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 28 దుంగలనే సరఫరా చేసిందన్నారు. ఏటా రూపొందించే రథాల కోసం వెయ్యి పైగా భారీ వృక్షాలను నరికివేయడంపై పర్యావరణ ప్రేమికులు సహా ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.