
కృష్ణాఇష్టమి
శ్రీకృష్ణుడు వాడవాడలా తనకు పెట్టిన కొత్తకొత్త నైవేద్యాలను చూశాడు...
అబ్బో! భక్తులు ఎంత మారిపోయారో అని మురిసిపోయాడు...
అంతలోనే తన పుట్టినరోజునాడే గురు పూజోత్సవం రావడం గమనించాడు...
తన గురువైన సాందీపుల వారిని పూజించాలనుకున్నాడు...
ఆయనను సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణుడే అర్చించి,
ఆయనకు నేటి వంటలను రుచి చూపాడు...
నిత్యవిద్యార్థి అయిన గురువులు సాందీపులవారు శ్రీకృష్ణునితో...
కృష్ణా! వెన్నలు, మీగడలు, పాలు, పెరుగు తిని విసిగిపోయావా అన్నాడు...
లేదు గురువర్యా! మీకు వెరైటీ రుచులను గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాను...
అందుకే ఈ కొత్త వంటలు మీకు రుచి చూపుదామని వచ్చాను... అన్నాడు.
గురువులు ఆస్వాదించారు... శిష్యుడు సంబరపడ్డాడు...
మరి మీరూ ఆస్వాదించండి...
జగద్గురువు తన గురువును ఆదరించినట్లే మీరూ మీ గురువును ఆరాధించండి...
కృష్ణం వందే జగద్గురుమ్ అనండి...
చుర్మా లడ్డు
కావలసినవి: తయారుచేసిన చపాతీలు - 3 (గట్టిగా, ఎండిపోయినవి);
బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టేబుల్ స్పూను; జీడిపప్పులు - 10;
కిస్‌మిస్ - 10; నువ్వులు - టీ స్పూను
తయారీ: చపాతీలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీళ్లు జత చేసి బెల్లం కరిగించాలి నెయ్యి జత చేసి మరోమారు కలిపి దించేయాలి బెల్లం పాకానికి చపాతీ పొడి జత చేసి బాగా కలపాలి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పైన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, నువ్వులు అద్ది అలంకరించి అందించాలి.
సాథ్ పడీ పూరీ
కావలసినవి: మైదా పిండి - రెండున్నర కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు - తగినంత ; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; పేస్ట్ కోసం... బియ్యప్పిండి - అర కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ పరాఠాల పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన ఉంచాలి మరొక పాత్రలో అర కప్పు బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండిని ముద్దలా చేసుకోవాలి (నీళ్లు పోయకూడదు) మైదాపిండిని పద్నాలుగు సమాన భాగాలుగా చేసి ఒక్కో ఉండను చపాతీలా ఒత్తాలి ముందుగా ఒక చపాతీ మీద బియ్యప్పిండి, నెయ్యి కలిపిన ముద్దను కొద్దిగా పూసి ఆ పైన మరో చపాతీ ఉంచాలి ఈవిధంగా మొత్తం ఏడు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక ఏడవ చపాతీ మీద కూడా బియ్యప్పిండి ముద్ద పూసి నెమ్మదిగా ఆ ఏడు చపాతీలను రోల్ చేయాలి చాకుతో గుండ్రంగా ముక్కలు కట్ చేయాలి ఒక్కో ముక్కను జాగ్రత్తగా అప్పడాల కర్రతో ఒత్తాలి బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి.
చాకొలేట్ శాండ్‌విచ్
కావలసినవి: ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి); నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - 2 టేబుల్ స్పూన్లు; పాలు - పావు కప్పు; కరిగించిన డార్క్ చాకొలేట్ - 2 టేబుల్ స్పూన్లు.
తయారీ: బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆలుగడ్డల ముద్ద వేసి సుమారు పది నిమిషాలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి పంచదార, పాలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలిమిశ్రమాన్ని మనకు కావలసిన ఆకారంలో తయారుచేసుకోవాలి ఒక దాని మీద రెండు టీ స్పూన్ల డార్క్ చాకొలేట్ మిశ్రమం వేసి పై మరో ముక్క ఉంచాలి చివరగా చాకొలేట్‌తో అలంకరించి వేడివేడిగా అందించాలి
కస్టర్డ్ పౌడర్ హల్వా
కావలసినవి: కస్టర్డ్ పౌడర్ - కప్పు (వెనిలా ఫ్లేవర్); పంచదార - 3 కప్పులు; నీళ్లు - 4 కప్పులు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు - 15.
తయారీ: ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి పక్కన ఉంచాలి బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కాగాక జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో కస్టర్డ్ పౌడర్, పంచదార, నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి, ఆ పాత్రను స్టౌ మీద ఉంచి మిశ్రమం చిక్కబడేవరకు ఆపకుండా కలుపుతుండాలి నెయ్యి జత చేసి, మిశ్ర మం జెల్లీలా అయ్యే వరకు కలపాలి జీడిపప్పులు జత చేసి ఒకసారి కలిపి దింపేయాలి నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్‌లోకి ఈ మిశ్రమం పోసి సమానంగా పరిచి, ముక్కలుగా కట్ చేయాలి.