పూరీ: ఒడిశా కాంగ్రెస్‌లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా పూరీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. జై నారాయణ్ పట్నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ పూరీ నుంచి బరిలోకి దిపింది. కాగా, సుచారితా మొహంతీ టికెట్ తిరస్కరణ కారణంగా ఇక్కడ అభ్యర్థి మార్పు జరిగింది.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ పూరీలో మరో అభ్యర్థిని ఖరారు చేసింది. జై నారాయణ్ పట్నాయక్‌ను పూరీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. కాగా, మొహంతీ స్థానంలో పట్నాయక్ అభ్యర్థిత్వానికి ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఓకే చేశారు.
The Congress President, Shri Mallikarjun Kharge, has approved the candidature of Shri Jay Narayan Patnaik (In place of Smt. Sucharita Mohanty) as party candidate for the ensuing general elections to the Lok Sabha from 17 - Puri Parliamentary Constituency of Odisha. pic.twitter.com/1NkkGH73Y1
— INC Sandesh (@INCSandesh) May 5, 2024
ఇక, అంతకుముందు.. మాజీ ఎంపీ బ్రజామోహన్ మహంతీ కుమార్తె, మాజీ జర్నలిస్టు అయిన సుచరితా మొహంతీని కాంగ్రెస్ పార్టీ పూరీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాను పోటీ చేయనని, టికెట్‌ను తిరస్కరించారు. తనవద్ద ఉన్న డబ్బును ఖర్చు చేసేశానని, ఆర్థిక సహకారం అందించేందుకు పార్టీ అధిష్ఠానం నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని ఆమె.. కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. దీంతో పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడుతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే ఆరో తేదీ వరకు సమయం ఉంది. అందుకే సుచరిత ఇప్పటివరకు తన నామినేషన్ దాఖలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment