లోక్‌సభ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు నేతలు పార్టీ మారగా.. మరికొందరు పలు కారణాలతో పోటీ నుంచి వైదోలుగుతున్నారు. తాజాగా ఒడిషా రాష్టంలో పూరీ లోక్‌భ స్థానంలో బరిలో ఉన్న సుచరిత మొహంతి.. పోటి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి తగిన నిధులు అందకపోవటంతో సుచరిత మొహంతి.. తనకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నట్లు తెలియజేశారు. పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టి, ఎంత ఖర్చ తగ్గించినా.. తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
‘నాకు పార్టీ నుంచి రావాల్సిన ఎన్నికల ప్రచార నిధులు నిరాకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీజేడీ చాలినంత నిధులు, ధన బలంతో ఉన్నారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ప్రతిచోట చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. నేను వారిలా పోటీలో ఉండలేను. డబ్బుతో కాకుండా ప్రజలతో ప్రచారం చేయాలనుకున్నా. కానీ, అది కూడా నిధుల కొరతతో సాధ్యపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకోవటం లేదు’ అని సుచరిత తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో సుచరిత.. పార్టీ ప్రచార నిధుల నిరాకరించటంతో తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చాలా ఇబ్బంది అవుతోదని తెలిపారు. ‘‘సాధారణ జర్నలిస్ట్‌గా పనిచేసిన నేను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని రకాలుగా నేను పూరీలో ప్రచారం చేస్తున్నా. నిధుల కోసం పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ కూడా చేట్టాను. చాలా వరకు ప్రచార ఖర్చును కూడా తగ్గించాను. కానీ, ప్రచార నిధుల కొరత కారణంగా విజయావకాశాలు ఉన్న పూరీ నియోజకవర్గంలో వెనకబడి ఉన్నాం. పార్టీ నిధులు లేకుండా ప్రచారం కొనసాగించలేకపోవటంపై చింతిస్తున్నా. అందుకే నాకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నా’’ అని కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment