ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర శనివారం ఘనంగా ప్రారంభమైంది.
పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనికి లక్షలాదిమంది భక్తులు హాజరయ్యారు. సాదారణంగా ప్రతి ఏడాది ఈ రథయాత్ర ఆషాడశుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా జూన్, జూలై నెలల్లో జరుగుతుంది.