
పూరి: సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వేలాది మంది ఏకమయ్యారు. ‘మో బీచ్ శుభ్రతా కార్యక్రమం’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత శుభ్రతా కార్యక్రమాన్ని ఒడిశాలోని పూరిలో చేపట్టారు. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా కార్యక్రమ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తీరప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమైనదో అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట దాదాపు 10 వేల మందికి పైగా కార్యకర్తలు బీచ్‌లను శుభ్రం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment