Coastal Cleanup Day
-
ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ శుభ్రతా కార్యక్రమం
పూరి: సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వేలాది మంది ఏకమయ్యారు. ‘మో బీచ్ శుభ్రతా కార్యక్రమం’ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద తీరప్రాంత శుభ్రతా కార్యక్రమాన్ని ఒడిశాలోని పూరిలో చేపట్టారు. అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రతా కార్యక్రమ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తీరప్రాంతాలను శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమైనదో అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట దాదాపు 10 వేల మందికి పైగా కార్యకర్తలు బీచ్‌లను శుభ్రం చేశారు. -
ప్లాస్టిక్‌తో సముద్రానికి ముప్పు
ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల సముద్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ కమాండెంట్ వేణు మాధవ్ తెలిపారు. శనివారం కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా కృష్ణపట్నం రేవులోని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు.