ఎంవీపీ కాలనీ: ఉల్లి అగ్గి రాజేస్తోంది. కేజీ ఉల్లిపాయల కోసం ఘర్షణకు దిగే పరిస్థితి వచ్చింది. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో మంగళవారం వినియోగదారులు ఉల్లిపాయల కోసం రైతు బజార్ ఎస్టేట్ అధికారి జగదీశ్వరరావును కొట్టినంత పని చేశారు. మంగళవారం నుంచి ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను సరఫరా చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో సుమారు వెయ్యి మంది వినియోగదారులు రైతు బజార్‌కు తరలివచ్చారు.
అదే సమయంలో 20 బస్తాల ఉల్లిపాయల సరుకు మాత్రమే రైత్ బజార్‌కు వచ్చింది. ఉదయం కౌంటర్ తెరచిన కొద్దిసేపటికే స్టాక్ అయిపోయింది. దీంతో వినియోగదారుల్లో ఉల్లి చిచ్చు రాజుకుంది. తగినంత సరుకు లేకుండా ఏం చేస్తున్నారంటూ కొందరు ఎస్టేట్ అధికారి జగదీశ్వరరావుపై మండిపడ్డారు. కొందరు కొట్టేందుకు ముందుకు రాగా, ఆయన అక్కడ నుంచి జారుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు.