కిచెన్ టిప్స్: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఉల్లి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది.
► ఇతర కూరగాయలు ఉన్న బుట్టలో ఉల్లిపాయలను ఉంచకూడదు. దుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి ఉల్లిపాయలు ఉంచడం వల్ల త్వరగా మొలకలు వస్తాయి. కూరగాయల్లో ఇథలిన్ ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి దోహదపడుతుంది.
►ఉల్లిపాయలను నిల్వచేసేందుకు పేపర్ బ్యాగ్‌లనే వాడాలి. పేపర్ బ్యాగ్స్‌లో ఉల్లిపాయలు ఉంచడం వల్ల ఉల్లిపాయల్లో ఉత్పన్నమయ్యే తేమను పేపర్ పీల్చుకుంటుంది. తేమ లేకపోతే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు.
►రిఫ్రిజిరేటర్‌లో ఉల్లిపాయలను నిల్వచేయకూడదు. రిఫ్రిజిరేటర్‌లోని ఇతర కూరగాయల వల్ల, లోపలి తేమ వాతావరణం ఉల్లి త్వరగా మొలకెత్తేలా చేస్తాయి.
►ప్లాస్టిక్ సంచుల్లో ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిలో నుంచి ఉల్లిపాయలు తీయడం మర్చిపోతుంటాము. ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేడికి ఉల్లిపాయలు పాడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment