
దొడ్డబళ్లాపురం : ఫ్రీగా వస్తే ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఈ దృశ్యాలు చూస్తే... అవును...నెలమంగల పరిధిలోని 4వ జాతీయ రహదారి మార్గంలో గుండేనహళ్లి వద్ద ఉల్లిపాయల లోడ్‌తో వెళ్తున్న లారీ నుండి కొన్ని మూటలు జారి రోడ్డుమీద చెల్లాచెదురుగా పడిపోవడంతో జనం తండోపతండాలుగా వచ్చి ఉల్లిపాయలను పోటీపడి మరీ ఏరుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా వస్తున్నా పట్టించుకోకుండా ఉల్లిపాయలు ఏరుకున్నారు. కార్లలో వెళ్లే వారు సైతం నిలిపి మరీ ఉల్లిపాయలు ఏరుకోవడం కనిపించింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment